చర్చ:కమ్మ

తాజా వ్యాఖ్య: Kamma kulam టాపిక్‌లో 7 నెలల క్రితం. రాసినది: 2409:4070:6E00:AB94:0:0:70CA:BA04

అసభ్య వ్రాతలు, నిరాధార వ్యాఖ్యలు చేయుట అభ్యంతరకరము.Kumarrao 15:56, 20 సెప్టెంబర్ 2009 (UTC)

అపోహ

మార్చు

క్షత్రియులు కారు మధ్య యుగములో కొన్ని క్షత్రియ వంశాలు రాజకీయ కారణాలవల్ల కమ్మవారిలో కలిశాయి.Kumarrao (చర్చ) 12:07, 27 ఆగష్టు 2012 (UTC)

క్షత్రియులు  కాదు కదా ఏ కులము కమ్మవారిలో  కలవలేదు.క్షత్రియులకు ఆ అవసరము లేదు.కమ్మ వాళ్ళు ఆ విధముగా చెప్పుకుంటున్నారు.అలా జరిగినది అని కుమారుగారు భావిస్తే అందుకు ఆదారాలు చూపాలి.S.KRISHNA.
కృష్ణ గారు, క్షత్రియులపై పగపట్టిన రేచెర్ల వారు జల్లిపల్లి యుద్ధములో క్షత్రియులను తీరాంధ్రములో తుడిచివేశారు. ఆ యుద్ధములో కమ్మవారు (ముసునూరి వారు) క్షత్రియులకు తోడ్పడినారు. యుద్ధము పిదప కొంతమంది క్షత్రియ వంశముల వారు స్వరక్షణకై కమ్మవారిలో కలిసి పోయారు. దీనికి సాక్ష్యము రెండు కులములలో కొన్ని ఇంటిపేర్లు, గోత్రములు కలుస్తాయి. Kumarrao (చర్చ) 15:19, 25 డిసెంబరు 2016 (UTC)Reply
  1. కమ్మక్షత్రియ #కాంబోజ మహాజనపద (600BC)
  2. కమ్మరాష్ట్రం (3rd Century)
  3. కమ్మరధం
  4. కమ్మనాడు

సూర్యచంద్ర వంశాలు అంతరించిన ఈ క్షత్రియ జాతులు 16షడోమహాజనపద క్షత్రియజాతులు ఏర్పడ్డాయి వాటిలోనిదే ఖంభోజ అనే క్షత్రియ జాతి ఒకటి ఆ ఖంభోజా (600 BC)నుండే కమ్మ కుంబి కుర్మి కుర్మా కంబళి క్షత్రియులు ఏర్పడ్డారు. కాంబోజ లొని కమ్మ జాతి దక్షిణ భరత దేశమునకు వలస వచ్చారు అదే నేటి త్రిలింగదేశం, త్రిలింగదేశం నందు కమ్మక్షత్రియులు పాలన సాగించారు. ఒకప్పటి త్రిలింగ థేసమ్ అదే ఆంధ్రదేశం (తెలుగు జాతి) నెడు ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది. అప్పుడు మూడవ శతాబ్దం ఈ కాలంలో ఈ ప్రాంతాన్ని కమ్మ ప్రభువుల పాలించటం వలన కమ్మరాష్ట్రం కమ్మరథం గా పిలిచెవారు కమ్మరాష్ట్రంలో ఎన్నో కమ్మ క్షత్రియ రాజ్యల పాలన సాగింది ఆ తరువాత కమ్మ రాష్ట్రాన్ని కమ్మనాడుగా పిలిచెవారు. కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. ఈ కమ్మనాడు తరువాత కమ్మనాడు మరియు వెలనాడుగా విడిపొయింది ఆ తరువాత పల్నాడుగా మారింది. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. భౌద్ధ జైన మత ప్రభావంలో కమ్మవారి దుర్జయ వంశపు రాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ కమ్మదుర్జయ వంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధాతధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మవారి రాజ్యాలు విజనగర రాజులకు సామంతులుగా పాలించారు వారిలో పెమ్మసాని సాయపనేని రావెళ్ల సూర్యదేవర వాసిరెడ్డి కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి . కావున కమ్మవారు సూర్యచంద్రవంశ కాంబోజ మహాజనపద కమ్మక్షత్రియులు అని తెలుసుకొండి.

కమ్మ దుర్జయ వంశము

మార్చు

కాకతీయులు-దుర్జయ వంశస్థులు..........శాసనాధారాలను బట్టి బయ్యారం శాశనం ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు. గూడూరు శాసనంలో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.

చేబ్రోలు శాశనం ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన - బేతరాజు కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.

కాకతీయ గణపతిదేవుడు తన #గవరపాడుశాసనం" లో తమ కాకతీయ కుటుంబీకులకు #దుర్జయుని కారనం గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు....

దుర్జయ వంశస్థులు

మార్చు

దుర్జయ వంశస్థులు:- 1) బయ్యారం శాశనం ప్రకారం ఇతను కాకతీయ దుర్జయ వంశమునకు మూలపురుషుడు. ఇతను కాకతిపురం అను ప్రాంతం నుండి పరిపాలన సాగించినాడు.2) జాయప నాయుడు - కమ్మ దుర్జయ వంశము:-జాయప నాయుడు లేక జాయప సేనాని సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని వద్ద పనిచేసిన సేనాధిపతి. 1241 లో వెలనాటి చోడులపై గణపతి విజయము సాధించిన తర్వాత వెలనాడు, కమ్మనాడు లోని వీరులందరు ఓరుగల్లు కు తరలిపోయారు. అట్టివారిలో జాయప ఒకడు. గణపతి దేవుడు ఆతనిని చక్రవర్తి గజబలగానికి అధిపతిగా చేశాడు. జాయప చెల్లెళ్ళగు నారమ్మ పేరమ్మలను క్షత్రియుడైన గణపతిదేవుడు పెండ్లి చేసుకున్నాడు. హనుమంతరావు గారి అభిప్రాయము ప్రకారము కమ్మ నాయకులకు జాయప ఆద్యుడు. జాయప దుర్జయ వంశము అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను దివిసీమను పాలించాడు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ మరియు బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యములోవున్నారు.కళింగదేశ దండయాత్ర లో పాల్గొని విజయం సాధించిన జాయపకు గణపతిదేవుడు 'వైరిగోధూమ ఘరట్ట' అను బిరుదు ఇచ్చాడు. 1231 లో మహారాజు పై గౌరవపూర్వకముగా గణపేశ్వరునిపేరుపై గుడి కట్టించి గ్రామాలను దానమిచ్చాడు. తన తండ్రి పేరుమీద చేబ్రోలు లో చోడేశ్వరాలయము కట్టించి గుడి ఖర్చులకు మోదుకూరు గ్రామమము రాసి ఇచ్చాడు. 1325 చేబ్రోలు శాసనము ప్రకారము గుడి ముందు రెండు వరుసలలో రెండంతస్థుల ఇళ్ళు కట్టించి దేవదాసీలకు ఇచ్చాడు. జాయప భారతదేశమందలి నాట్యములపై నృత్యరత్నావళి అను సంస్కృత గ్రంథము వ్రాశాడు. దీనినిబట్టి జాయప నాట్యములో, నాట్యశాస్త్రములో నిష్ణాతుడని తెలుస్తుంది.3)మాలిక్ మక్బూల్ లేక దాది గన్నమ నాయుడు / యుగంధర్ - కమ్మ దుర్జయ వంశము, కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత ఢిల్లీ సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ ఓరుగల్లుకే పాలకునిగా వచ్చాడు.గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు గణపతి దేవుని కడ మరియు రుద్రమదేవి కడ సేనాధిపతిగా ఉన్నాడు.సాగి వారిది దుర్జయ వంశము-విప్పర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు కాకతీయ చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. కొత్త భావయ్య చౌదరి పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల.గన్నమ నాయుడు ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేశాడు. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుడు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణమును గన్నయకు అంకితమిచ్చాడు.గన్నమ నాయుడు ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే ఉన్నారు. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదులున్నాయి. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించాడు.

4) ముసునూరి నాయకులు - కమ్మ దుర్జయ వంశము కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం తెలుగునాట నెలకొన్న రాజకీయ అనిశ్చితి కాలంలో స్థానిక సైన్యాన్ని సంఘటితం చేసిన కొందరు నాయకులు కమ్మ దుర్జయ వంశము చెందిన ముసునూరు నాయకులు (Musunuri Nayakas) అని ప్రసిద్ధి చెందారు. కాకతీయుల తరువాత సాగిన 'అంధకార యుగం' అనుకొనే ఈ సమయం గురించి సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ విశేషంగా అధ్యయనం చేశాడు. క్రీ.శ. 1323-1336 కాలంలో 'ముసునూరు కాపయ నాయకుడు' 'ముసునూరు ప్రోలయ నాయకుడు' తురుష్క పాలకులతో స్వాతంత్ర్య పోరాటం సాగించడం, కాపయ నాయకుడు ఓరుగల్లును ఆక్రమించడం గురించి శర్మ తన 'Forgotten Chapter of Andhra History' లో వివరించాడు. ఈ "ముసునూరు యుగం" రాజకీయంగా సువర్ణ ఘట్టమని శర్మ నిరూపించాడు.ప్రతాపరుద్రుని పరాజయము తరువాత ఆంధ్రదేశము అల్లకల్లోలమైనది. తురుష్కుల ఆగడాలు చెప్పనలవి గానివి. ప్రోలయనాయకుని విలస తామ్ర శాసనములో ఆనాటి తెలుగు వారి దయనీయ స్థితి వర్ణించబడింది. అట్టి విషమ పరిస్థితులలో బెండపూడి అన్నయ మంత్రి మరియు కొలను రుద్రదేవుడను ఇద్దరు దేశాభిమానులు చెల్లాచెదరైన తెలుగు నాయకులను ఐక్యపరచి వారికి నాయకునిగా ముసునూరి ప్రోలానీడు అను మహాయోధుని ఎన్నుకొన్నారు. ప్రోలానీడు ఓరుగల్లు విముక్తి గావించుటకు పలు వ్యూహములల్లాడు. పెక్కు యుద్ధముల పిదప క్రీ. శ. 1326 లో తురుష్కులను దక్షిణభారతము నుండి తరిమివేయుటలో నాయకులు సఫలమయ్యారు. హిందూమతము రక్షించబడింది. దేవాలయములు పునరుద్ధరించబడ్డాయి. బ్రాహ్మణులకు అగ్రహారములీయబడెను. అనితల్లి కలువచేరు శాసనములో ప్రోలానీడి వీరత్వము, దేశాభిమానము, ప్రజారంజకమగు పరిపాలన విపులముగా కొనియాడబడ్డాయి.ఓరుగల్లు కోటపై ఆంధ్రదేశ పతాకము ఎగిరెను. కాపానీడు 'ఆంధ్రదేశాధీశ్వర' మరియు 'ఆంధ్రసురత్రాణ' అను బిరుదులు పొందెను. ప్రజారంజకముగా పరిపాలించెను. తన తోటినాయకులగు వేమారెడ్డి, పిఠాపురం కొప్పుల నాయకుడు, రేచెర్ల, భువనగిరి, దేవరకొండ పద్మనాయకుల స్వతంత్రమును గౌరవించెను. కాపానీడు సామ్రాజ్యము శ్రీకాకుళం నుండి బీదరు వరకు సిరిపూరు నుండి కంచి వరకు విస్తరించెను. అది ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరములతో లిఖించదగిన కాలము.1370 వ సంవత్సరము దక్షిణభారత చరిత్రలో పెద్దమలుపు. తెలంగాణను జయించిన బహమనీ సుల్తాను విజయనగరము పై కన్ను వేసెను. ముసునూరి వారి త్యాగములు, దేశాభిమానము విజయనగర రాజులకు మార్గదర్శకమయ్యెను. ఓరుగల్లు పతనము పిమ్మట పెక్కు నాయకులు విజయనగరమునకు తరలి పోయి రాబోవు మూడు శతాబ్దములు దక్షిణభారతమును హిందూమతమును రక్షించుటకు పలుత్యాగములు చేసిరి. ఆంధ్రచరిత్రలో ముసునూరివారి పాలనము 50 వర్షములు మాత్రమేఐనను అది వారి త్యాగనిరతికి, తెలుగువారి ఐక్యతకు కాణాచి. సమకాలీన చరిత్రకు అది ఒక గుణపాఠము కూడ.


కమ్మ ప్రభువులు,దుర్జయ వంశము
మార్చు

కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "దూర్జయులు". వీరు కాకతీయుల పాలనలో వెలుగులోకి వచ్చారు. వెలనాటి చోడులు గణపతిదేవుడి చేతిలో ఓడిపోవడంతో వారి వద్ద సైన్యాధిపతులుగా పనిచేసిన నాయక కులాలవారు కాకతీయ సైన్యంలో చేరిపోయారు. ఆ క్రమంలో గణపతిదేవుడు కమ్మనాడు కు చెందిన జయపసేనాని ని సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నాడు. జయపసేనాని కృష్ణానదీ తీరంలో గవర్నరుగా చేసిన పిన్నచోడ నాయకుని కుమారుడు.......

చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. గుంటూరు జిల్లా ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె రుద్రమదేవిని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు. క్షత్రియ సామ్రాజ్యాలు అంతమైన తర్వాత కమ్మవారు కొద్దికాలం ఆంధ్ర దేశాన్ని పాలించారు....... """""ప్రధాన కమ్మ రాజ వంశాలు - రాజ్యాలపరంపర కమ్మనాయకరాజులు""""" 1) "కమ్మ దుర్జయులు" - పిన్నమ నాయుడు, దుర్జయ వంశము, "వల్లుట్ల" గోత్రము 2) "అయ్య (దివిసీమ) నాయకులు" - తెలుగు చోడ / దుర్జయ వంశము, అయ్య పరివారము, దివిసీమ - (నారప్ప నాయుడు, పిన్న చోడుడు, జాయప నాయుడు) 3) "కాకతీయ - ముసునూరి దుర్జయ నాయకులు" వంశము (కాకతి వెన్నయ, గణపతి దేవుడు,రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు, ముసునూరి ప్రోలానీడు/ప్రోలయ నాయకుడు,ముసునూరు కాపయ నాయకుడు) 4) "సాగి నాయకులు", దుర్జయ వంశము, విప్పర్ల గోత్రము - (సాగి మల్ల నాయకుడు, సాగి నాగయ నాయుడు, సాగి గన్నమ నాయుడు/యుగంధర్/మాలిక్ మక్బూల్, సాగి బైచ నాయుడు మరియు దేవరి నాయుడు) 5) "పెమ్మసాని నాయకులు" - గండికోట కమ్మవారు,దుర్జయ వంశము,ముసునూర్ల గోత్రీకులు ( పెమ్మసాని తిమ్మా నాయుడు, రామలింగ నాయుడు,రెండవ తిమ్మా నాయుడు, బంగారు తిమ్మా నాయుడు, పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు) 6) "రావెళ్ళ నాయకులు" - దుర్జయ వంశము, వల్లుట్ల గోత్రము (రావెళ్ళ మల్ల నాయుడు, అయ్యప్ప నాయుడు,రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు) 7) "శాయపనేని నాయకులు" (శాయప్ప నాయుడు, వేంగళ నాయుడు మరియు మనుమడు వేంకటాద్రి నాయుడు, నరసింహ నాయుడు) 8) "సూర్యదేవర నాయకులు"-తెలుగు చోడ కమ్మ క్షత్రియ వంశములవారు, విప్పర్ల గోత్రీకులు (తిమ్మనాయుడు , యెర్రనాయుడు , ముసలయ్యనాయుడు) 9) "వాసిరెడ్డి నాయకులు"- చాళుక్య కమ్మ రాజవంశము,వల్లుట్ల గోత్రము (మల్లికార్జున నాయుడు, సదాశివ రాయలు, చినపద్మనాభ రామన్న, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు) 10) "యార్లగడ్డ నాయకులు" - వెలనాటి చోడవంశములవారు,రేచెర్ల గోత్రము (చల్లపల్లి రాజులు/జమిందారులు,దేవరకోట రాజ్యము -యార్లగడ్డ గురువారాయడు )..............

కమ్మనాడు / కమ్మరాష్ట్రం

మార్చు

కమ్మనాడు / కమ్మరాష్ట్రం అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు తూర్పు సముద్రము, దక్షిణము నెల్లూరు, పడమర శ్రీశైలం, ఉత్తరం ఖమ్మం హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 తక్కెళ్ళపాడు శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము (సంస్కృతము) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో బౌద్ధమతము క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది.

కర్మరాష్ట్రములోని భట్టిప్రోలు, ధరణికోట, విజయపురి శాతవాహనులకు, ఇక్ష్వాకులకు పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి.

శాసనములు :-

1. కర్మరాష్ట్రము అను పదము మొదట ఇక్ష్వాకు రాజు మాధారిపుత్ర పురుషదత్తుని బేతవోలు (జగ్గయ్యపేట) శానములో గలదు (3వ శతాబ్దము). 2. అటుపిమ్మట పల్లవ రాజు రెండవ కుమార విష్ణుని చెందులూరు గ్రామశాసనములో దొరికినది. 3. మూడవ ఆధారము తూర్పు చాళుక్య రాజు మంగి యువరాజ (627-696) శాసనము: శ్రీసర్వలొకాశ్రయ మహరాజః కమ్మరాష్ట్రె చెందలూరి గ్రామే 4. మూడవ శతాబ్దమునుండి పదకొండవ శతాబ్దము వరకు శాసనములలో కమ్మరాష్ట్రము, కమ్మరట్టము, కమ్మకరాటము, కర్మరాష్ట్రము, కర్మకరాటము, కర్మకరాష్ట్రము మరియు కమ్మకరాష్ట్రము పర్యాయపదములుగా వాడబడినవి. 5. రాజరాజనరేంద్రుని సమకాలీకుడగు పావులూరి మల్లన (1022-1063) ఈ విధముగా వ్రాసెను: ఇల కమ్మనాటి లోపల విలసిల్లిన పావులూరి విభుడన్ 6. తెలుగు చోడుల మరియు కాకతీయుల శాసనములలో కమ్మనాడు (కొణిదెన శాసనము-త్రిభువనమల్ల – 1146). కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని కాలములో బొప్పన కామయ్య కమ్మనాటిని కాట్యదొన (కొణిదెన) రాజధానిగా పాలించుచుండెను.

కాకతీయుల, ముసునూరి వారి పతనముతో కమ్మనాడు అను పదము వాడుకలోనుండి మరుగు పడినది. కాని కమ్మ అను పదము మాత్రము ఒక సామాజిక వర్గము (కులము)నకు పేరుగా మిగిలిపోయినది.

మార్పులు

మార్చు

గోత్రనామముల చిట్టా తొలగించబడినది.అటులనే కొందరి పేర్లు ప్రాముఖ్యతా పరిమాణం బట్టి తొలగించబడినవి.Kumarrao (చర్చ) 09:19, 22 జూలై 2017 (UTC)Reply

శీర్షిక మార్పుకు ప్రతిపాదన

మార్చు

వ్యాసానికి శీర్షిక కమ్మ అని ఉండడం సమంజసం. కమ్మ క్షత్రియ అన్న ప్రయోగం నిజానికి వాడుకలో విరివిగా లేదు. కమ్మ అన్న పదాన్ని గూగుల్ చేస్తే 6,59,000 ఫలితాలు రాగా, "కమ్మ క్షత్రియ" (కొటేషన్లు ఉండడం వల్ల ఈ పదాలు పక్కపక్కనే ఉన్న ఫలితాలు రావడం సాధ్యపడుతుంది, వెతికేవాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోగలరు. లేకుంటే రెండు పదాలూ విడివిడిగా ఉన్న అన్ని ఫైళ్ళనీ తీసి ఇస్తుంది గూగుల్) అన్న జంటపదాన్ని వెతికితే 1,250 ఫలితాలే వస్తున్నాయి. ఈ పదానికి ప్రయోగం తక్కువ, అలానే ప్రామాణికతా తక్కువే. ఆంగ్ల వికీపీడియా పరిశీలించినా పేరు Kamma (caste) అని మాత్రమే ఉన్నందున దీని పేరు మార్పును ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:51, 5 జనవరి 2018 (UTC)Reply

కమ్మ కులం శూద్ర కులం గా పరిగణిస్తారు. ఈ వ్యాసం అవాస్తవం. కమ్మ క్షత్రియ అన్న ప్రయోగం ఎక్కడ లేదు. ఈ క్రింది రెఫరెంసెస్ చూడండి.

To get consensus, presenting here a few academic references which note the Shudra status of the Kamma:

and the Sale or weaver caste show a higher rate of literacy than all the 'upper Shudras' (Kamma, Velama, Reddi, etc[3] In Andhra, the Shudra higher castes Kamma and Reddi turned out to be the dominant landlord castes. In scuttling land reforms benefitting the downtrodden or committing atrocities, these Shudra Castes are nonetheless akin...[4] According to local Hindu caste hierarchy Brahman is regarded as superior caste followed by the Kshatria, Vysya, and Sudra. Kamma, Reddi, Kapu, Yadava, Baligi and Mala in the present study come under Sudra...[5] It was at this stage that a powerful Sudra Dravidian writer, Tripuraneni Ramaswami Choudari, emerged in the coastal districts. Tripuraneni (1887-1943) was born in a rich peasant Kamma family and became a lawyer in Tenali.[6] Chandrabhan's thesis of the conflict between what he calls the Upper Shudras ( read Yadav, Jat, Maratha, Kamma[7] was not accepted by the higher-ranking Sudra castes such as Vellalars, Kamma Naidus, and even Kaljars, who, although Sudra, had occupied positions of authority as nobles, army officers, and land managers in the pre- British kingdom.[8] The tenant-cultivators in the zamindari and ryotwari areas also belonged to the Sudra varna which included peasant castes as well as artisan castes, viz., the Reddy, Kamma, Kapu, Raju, Telaga, Balija, Saale (weaver), Chakali (washerman[9] The second group consisted of the four dominant upper sudra castes of Andhra Pradesh viz., Kamma, Reddy, Kapu and Patnaik[10] The pujari receives the offerings and lives from them and the income from the land. The story of Mundla Mudamma is somewhat striking. In a village near Kandukuru lived a little girl of the Kamma branch of the Sudra caste,[11] The position of each caste vis-a-vis the rest is seen in the light of its day to day relations with them. Statement V CASTE HIERARCHY A Brahmin B Vaisya C Sudra (Kamma) Kapu Balija Golla Goundla Kummari Chakali Mangali Uppari Yanadi[12] Of the three Hindus, two (Rajaji and Munshi) are Brahmins, while Ranga is a 'clean' sudra (a Kamma).[Of the three Hindus, two (Rajaji and Munshi) are Brahmins, while Ranga is a 'clean' sudra (a Kamma).] The agricultural castes of the Telegu country* are the following :— L Telega. 4. Reddi Varu. 2. Vellama Varu. 5. Kapu. 3. Kamma Varu. 6. Nagas. These are all high caste Sudras. They enlist in the army as common soldiers.[13] వికీపీడియా విలువలను కాపాడాలంటే ఇలాంటి తప్పుడు ప్రయోగాలని విరమించండి. —తెలుగు చరిత్ర

మరికొన్ని విషయాలను గమనిస్తే చౌదరి అన్న పదానికి చౌత్-ధరి - చౌత్ (నాలుగవ వంతు పన్ను) స్వీకరించేవాడన్న అర్థం ఉండగా, చక్రధర్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. చౌదరి అనగా ధర్మ రక్షకుడు మరియు పాలకుడు అని అర్థం. అని ఏ మూలాలు లేని విధంగా రాసుకుంటూ పోతున్నారు. వీటన్నిటినీ బట్టి ఈ పేజీలో సమాచారాన్ని తిప్పికొట్టడంతో పాటు పేరుమార్పు సమంజసమని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 18:45, 9 జనవరి 2018 (UTC)Reply
ఇలా తప్పు చరిత్రలు స్రుష్తించుకఉంటే స్తాయి పెరిగిపొతాది అనుకునే వాల్లు చాలా మందే ఉన్నారు. వీళూ ఇంకెవరికి చరిత్ర గురించి తెలియదు అనుకుంటారు కాబోలు.
అయ్యా! చర్చల్లో చక్కని సమాచారాన్ని ఇచ్చి వ్యాసాన్ని సరిదిద్దేందుకు మీ వంతు కృషిచేసింనందుకు ప్రత్యేకంగా అభినందనలు. దయచేసి వ్యక్తిగత విమర్శలు చేయవద్దు. వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి అన్నది మన వికీపీడియా మూలస్తంభాల్లో ఒకటి. మనం చేసే మంచి అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల పోతుంది. రాసినవారు వికీపీడియా పాలసీల గురించి, విజ్ఞాన సర్వస్వ శైలి గురించి తెలియక రాశారనే అనుకోవడం మంచిది. భవిష్యత్తులో వారే పాలసీలు తెలుసుకుని, శైలి అలవరుచుకుని చక్కని వ్యాసాలు రాసినప్పుడు మనం మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోలేం. పాలసీ పరంగా చేయాల్సినవి చేసి నిష్పాక్షికతకు భంగం కలగకుండా చూసుకుంటున్నాం కనుక వాడుకరికి నేర్చుకునే అవకాశం ఇవ్వడం భావ్యం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 07:47, 11 జనవరి 2018 (UTC)Reply


కమ్మ లేక కమ్మ క్షత్రియ అని వ్రాసి ఉంది. అది తప్పు. ఈ కులం కేవలం కమ్మ అనే పిలుస్తారు. అది కమ్మ క్రింద మార్చడం సమంజసం.

మార్పు

మార్చు

కమ్మవారు సనాతన క్షత్రియులు కారు. వారు కాకతీయ సైన్యంలో సైన్యాద్యక్షులుగా, సామంతులుగా పనిచేశారు. వారి పతనం అనంతరం తమ స్వతంత్ర రాజ్యాలు ఏలారు. పైపెచ్చు వారికి రాజపుత్ర క్షత్రియ గోత్రాలు (వశిష్ట, కౌండిన్య, ధనుంజయ, కాస్యప వంటివి) లేవు. మగ వారసుల కోసం గణపతి దేవుడు తన సైన్యాధ్యక్షుడు జయపసేనాని (దూర్జయ తెగకు చెందినవాడు) సోదరీలైన నారమ్మ, పేరమ్మ లను వివాహమాడాడు. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 10:28, 4 ఫిబ్రవరి 2018 (UTC))Reply

మార్పులు

మార్చు

కమ్మవారు క్షత్రియులు కారు. అటులనే వారు రాజ్యములు స్థాపించలేదు. కమ్మవారు తొలుత అయుధోపజీవులు. వివిధ రాజ్యములలో సైనికులుగా, సేనాధిపతులుగా, సామతరాజులు గా వున్నారు. ప్రోలానీడు, కాపానీడు కాకతీయ రాజ్య పునరుద్ధరణ తరువాత "ఆంధ్రదేశాధీశ్వర" అనిపించుకున్నారు గాని చక్రవర్తి అని గాని, మహారాజు అనిగాని చెప్పుకోలేదు. విజయనగర నాయకులు సామం తులుగా చివరివరకు సేవచేశారు గాని ఎప్పుడూ స్వతంత్రించలేదు. మార్పులు చేయు ముందు సంప్రదించి చేయ ప్రార్థన.17:42, 13 ఫిబ్రవరి 2018 (UTC)Kumarrao (చర్చ)

వాడుకరి:Kumarrao గారూ! చాలా ధన్యవాదాలు. నెలరోజుల నుంచి నేను వాడుకరి:Jiksaw1 చేస్తున్న మార్పులు తటస్థ దృక్కోణానికి భంగకరమనీ, ఇలా రాయకూడదనీ సూచిస్తూ ఉన్నాను, అడపాదడపా మార్పులను రద్దుచేయనూ చేశాను. నిర్వాహకుల నోటీసుబోర్డులోనూ ఈ అంశం ప్రస్తావనకు తెచ్చాను. ఈ చర్చలన్నిటిలోనూ ఒక్కమారు సమాధానమిచ్చినా ఆ చర్యలు నిలుపుదల చేయడం జరగలేదు. పలుమార్లు పలుచోట్ల చర్చలు చేసి, అర్థమయ్యేలా పాలసీని వివరించినా స్పందన, మార్పు రాకపోవడంతో హెచ్చరిక చేశాను. ఇక మిగిలింది చర్య తీసుకోవడమే. ఈ సమస్య మీద మీరు స్పందించినందుకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 17:59, 13 ఫిబ్రవరి 2018 (UTC)Reply
పవన్ సంతోష్ గారు, నిర్వాహకులకు తెలియచేయ ప్రార్ధన. చర్య తీసుకొని తీరవలిసిందేKumarrao (చర్చ) 17:09, 15 ఫిబ్రవరి 2018 (UTC)Reply
పరిశోధనాత్మకంగా రాయబడేవి అయితే ముందుగా చర్చాపేజీలో రాయమని చెప్పండి, తధనంతారం వాటిలో సహేతుకంగా ఉన్నవాటిని వ్యాసంలో చేర్చవచ్చాలేదా నిర్ణయించవచ్చు. అప్పటి వరకూ సభ్యులు జిక్సౌ1 మార్పులను ఈ వ్యాసంలో రద్దు చేయవచ్చు..--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 17:23, 15 ఫిబ్రవరి 2018 (UTC)Reply
ఈ వ్యాసం 2009లో వైజాసత్య గారు రిజిస్టర్ చేసిన వాడుకరులు మాత్రమే మార్పులు చేసేలా సంరక్షించారు. ఇప్పుడు నిర్వాహకులు మాత్రమే మార్పులు చేసేలా, మిగతా వాడుకరులు ప్రతిపాదనలు మాత్రమే చేయగలిగేలా మార్చమని అభ్యర్థిస్తున్నారా Kumarrao గారూ --పవన్ సంతోష్ (చర్చ) 11:02, 16 ఫిబ్రవరి 2018 (UTC)Reply

సంరక్షణ

మార్చు

పరిమిత కాలవ్యవధికి ఈ పేజీని నిర్వాహకులే మార్చేలా, మిగతా వాడుకరులు చర్చ పేజీలో తమ మార్పులు చేర్పులు ప్రతిపాదించేలా మార్చాను. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 08:58, 17 ఫిబ్రవరి 2018 (UTC)Reply

కమ్మవారు

మార్చు

కమ్మవారి మొదటి వంశం ఇక్ష్వాక కమ్మవారు సూర్యవంశ క్షత్రియులు కమ్మకరాట (కమ్మరాష్ట్ర) ఇక్ష్వాకు పురషదత్త జగ్గయ్యపేట బేతవోలు శాసన అనువాదము Mr. R. Sewell

"విజయం! వర్షాకాలం 8 వ పక్షం యొక్క 10 వ రోజు, కమ్మకరాట రాజు పురిసాదట (పురుషదత్తా) యొక్క 20 వ సంవత్సరంలో, ఇఖకుస్ (ఇక్ష్వాకు) యొక్క అద్భుతమైన హీరో ('శ్రీవిరా) మరియు మాధారా (తల్లి) కుమారుడు, ద్సేసాని సిదత (సిద్ధార్థ) మహాకమదర గ్రామంలో నివసిస్తున్నారు, కమ్మకరాట ప్రావిన్స్ (రాథే) లోని నాదతుర గ్రామంలో నివసిస్తున్న నాకాచమడ (నాగచంద్ర) కుమారుడు, అతని మోర్హెర్ నాగిలానీతో సంబంధం కలిగి ఉన్నాడు (అతనితో) సముదాని (సుముద్రాని) మరియు అతని కుమారుడు ములాసిరి (ములాశ్రీ) మరియు అతని కుమార్తె నకాభుదానికా (నాగబుద్ధానికా) మరియు అతని బుద్ధానికా, మరియు అదే కనికా (కన్యాక, కృష్ణ, లేదా కర్నిక) మరియు (వారి) ఇద్దరు కుమారులు నాగసిరి (చమదశ్రీ) చద్రశ్రీ) మరియు కుమార్తె సిద్ధతానికా (సిద్దార్థానికా), అతని రక్తం - సంబంధాలు, స్నేహితులు మరియు అనుసంధానాలతో కలిసి, వెలగిరి గ్రామంలో, దైవిక బుద్ధుని గొప్ప చైత యొక్క తూర్పు ద్వారం దగ్గర, ఐదు (5) అయకా - స్తంభాలు, వీటిని అందరూ అంకితం చేశారు (టి అతను వ్యక్తుల కంటే), అన్ని జీవుల యొక్క మంచి మరియు సంక్షేమం కోసం తన సొంత బహుమతిగా. "

ఈ రాజు పురషదత్తా ఎవరో మనకు తెలియదు, కాని మరిన్ని ఆవిష్కరణలు అతని రాజవంశంలో ఇంకా కొంత బహిర్గతం చేస్తాయి. ఇక్ష్వాకు భారతీయ ఇతిహాసాలలో సౌర జాతి యొక్క పౌరాణిక స్థాపకుడిగా ప్రసిద్ది చెందింది, మరియు ప్రారంభ రాజవంశం, ఐక్వాకులు, వాయు మరియు మత్స్య పురాణాల ప్రకారం, ఇరవై వారసుల ద్వారా కొనసాగాయి. బడ్డిస్టులు మరియు జైనులు కూడా అదే హీరో నుండి వారి పవిత్రమైన వ్యక్తుల సంతతిని కనుగొంటారు. ఇక్ష్వాకులు కొన్ని సార్లు తెగ లేదా జాతి వంటి యుద్ధంగా పేర్కొనబడ్డారు. అయితే, ఈ జాతికి చెందిన పురుషాదత్తా యొక్క వాదన చాలావరకు నిష్క్రియమైన ప్రగల్భాలు. అతను కొన్ని స్థానిక రాజవంశానికి చెందినవాడు కావచ్చు, ఇది దిగువ కృష్ణుడిపై ఆంధ్రాల తరువాత వచ్చింది. కానీ ఈ పత్రాలు చెక్కబడిన వర్ణమాల యొక్క పాత్ర బహుశా స్థూపం యొక్క అసలు నిర్మాణం కంటే తరువాతి కాలానికి చెందినది. కొన్ని తరువాత పైలాస్టర్స్ రాజధానులలో కనుగొనబడిన స్థూపం చాలా ఎలీయర్ రూపం: వాస్తవానికి అవి మౌర్య వర్ణమాలను పోలి ఉంటాయి, అసలు నిర్మాణం క్రిస్టియన్ ముందు తేదీకి చెందినదనే సందేహం లేదు. శకం. కమ్మరాష్ట్ర ఇక్ష్వాక శాసనాలు ఆనవాళ్లు యున్నవి.

కమ్మకులస్థులకు సూర్యవంశీలు అనుటకు వీరికి ఆదారాలు యున్నవి. అదే దుర్జయ వంశ శాసనాలలో ఇక్ష్వాకుల ఆదారాలు యున్నవి.

కమ్మకరాట (కమ్మరాష్ట్ర) ప్రాంతము నుండి పాలించిన ఇక్ష్వాక వంశీయుల తరువాత వారి వారసులైన చోడులు దుర్జయుల పరిపాలన సాగినది. అదే కమ్మకరాటం - కమ్మరాష్ట్రంగా - కమ్మనాడుగా ... ఈ కమ్మనాడు తరువాత పలు నాడులుగా పిలువబడినది విడిపోయినది. అవే పలనాడు, వెలనాడు ... etc. ఇక్ష్వాక వారసులైనా దుర్జయ వంశీకులయిన కాకతియ, వెలనాటి చోడ, ముసునూరి, కమ్మనాడులో కమ్మవారు ... etc కమ్మవారు ఎన్నో ప్రాంతాలలో రాజులుగా, సర్వసైన్యాద్యక్షులుగా, యోథులుగా, సంస్థానాదీశులుగా, గడీ దొరలుగా, జమిందార్లుగా ఉన్నారు. వీరంత దుర్జయ వంశీయులు ఇక్ష్వాకు వంశం నుండి ఏర్పడినవారు సూర్యవంశ క్షత్రియులు వీరు. కాకతీయ, వెలనాటి చోడ, కమ్మనాడు, వెలనాడు ... etc శాసనాలు చాలా చక్కగా వివరిస్తాయి ఇక్ష్వాక, దుర్జయ ఆనవాళ్లను. అమరవాతిని పాలించిన చివరి గొప్పరాజు వెంకటాద్రి నాయుడు వల్లుట్ల గోత్రికుడు దుర్జయ వంశీయుడు అంటే అమరావతి చివరి వరకు ఇక్ష్వాక వరసత్వం కొనసాగినది స్పష్టమగుచున్నది.

ఈ వ్యాసానికి మార్పులు అవసరం

మార్చు

ఈ వ్యాసం లో మార్పులని ప్రతిపాదిస్తున్నాను. ఇక్కడ వాడిన 'ఆంధ్ర క్షత్రియులు అగు కమ్మవారి చరిత్ర: సూర్యదేవర రాఘవయ్య చౌదరీ'

కొత్త బాపయ్య చౌదరి అనే పుస్తకం వాడకూడదు

మార్చు

కొత్త బాపయ్య చౌదరి అనే పుస్తకం కమ్మ వారు వ్రాసిన పుస్తకం. దాన్ని సోర్స్ గా వాడగూడదు. వెంటనే దాన్ని తీసివెయ్యాలి. ఆంధ్ర చరిత్ర (చర్చ) 18:34, 23 మార్చి 2018 (UTC)Reply

మరికొన్ని మూలాలు

మార్చు

పరిశోధన

మార్చు

పవన్ నాయని గారు నేను వ్రాసిన 'పరిశోధనా అంశాన్ని తొలగించారు. కారణము తెలుపలేదు. నేను మరలా ఎడిట్ చేశాను.

అవునండీ. ఆ అక్కౌంట్ గలవారెవరో వాండలైజ్ చేస్తున్నారు. తిప్పికొట్టినందుకు ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 13:13, 10 జనవరి 2020 (UTC)Reply

కమ్మ కుల సమాచారం వికీలో చాలా సమాచారం రిఫరెన్స్‌లను కలిగి లేనందున చర్చనీయాంశమైంది

మార్చు

1.కమ్మ కులానికి గంప కమ్మ, గొడచాతు కమ్మ, ఇల్లువెల్లని కమ్మ, బంగారు కమ్మ, పెద్ద కమ్మ, చిన్న కమ్మ మొదలైన అనేక ఉప విభాగాలు ఉన్నాయి REF: https://www.google.co.in/books/edition/Census_of_India_1891/BhBFAQAAMAAJ?hl=en&gbpv=1&dq=KAMMA%20SUB%20DIVISIONS&pg=PA237&printsec=frontcover 2.కమ్మలు వృత్తి రీత్యా సైనికులు,కమ్మలు స్వయం సాగు చేసే రైతులలో మరింత భిన్నమైన సమూహంగా ఉంటారు REF:https://www.google.co.in/books/edition/Power_Choice_and_Vulnerability/WiJpAwAAQBAJ?hl=en&gbpv=1&dq=KAMMA%20CASTE%20OCCUPATIONS&pg=PA82&printsec=frontcover 3.కమ్మలు శూద్ర వర్ణంగా వర్గీకరించబడ్డారు,వారు ఉత్తమ సాగుదారులు ref:https://www.google.co.in/books/edition/Dalit_Women/SEcrDwAAQBAJ?hl=en&gbpv=1&dq=KAMMA%20CASTE%20OCCUPATIONS&pg=RA1-PT30&printsec=frontcover 4.కమ్మలు భూస్వామ్య కులం ref:https://www.google.co.in/books/edition/Dalits_and_Tribes_of_India/ZRkZFEmbjLoC?hl=en&gbpv=1&dq=KAMMA%20CASTE%20OCCUPATIONS&pg=PA38&printsec=frontcover 5.అన్ని కమ్మ ఉపవిభాగాలు ఎప్పుడూ ఒకరినొకరు వివాహం చేసుకోరు,గంప లేదా ఇల్వెల్లని ఇతర గంప లేదా ఇలివెల్లని మాత్రమే వివాహం చేసుకుంటాడు ref:https://www.google.co.in/books/edition/Contemporary_Readings_in_Marxism/5xh9EAAAQBAJ?hl=en&gbpv=1&dq=KAMMA+CASTE+OCCUPATIONS&pg=PT272&printsec=frontcover Naidu999 (చర్చ) 09:25, 16 సెప్టెంబరు 2023 (UTC) కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తులు రాసిన పుస్తకాలు వాడారు కావూన ఆ సూచనలు తీసి వెయ్యాలి...Reply

Avoid derogatory proverbs. Edited suitably.

Kamma kulam

మార్చు

క్రీస్తు కంటే పుర్వేమే కమ్మ కుల ప్రస్తావన ఉంది ఆధారాలు అవి అన్ని కమ్మ కులం నచ్చని బ్రాహ్మణులు కొన్ని కాల్చేశారు కొన్ని యుద్దాలు వాళ్ళు కొన్ని ఆధారాలు పోయాయు 2409:4070:6E00:AB94:0:0:70CA:BA04 14:48, 30 ఏప్రిల్ 2024 (UTC)Reply

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:కమ్మ&oldid=4199487" నుండి వెలికితీశారు
Return to "కమ్మ" page.