డాడీ 2001లో విడుదలైన తెలుగు సినిమా. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి, సిమ్రాన్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకుడిగా పనిచేశాడు.

డాడీ
(2001 తెలుగు సినిమా)
నిర్మాణం అల్లు అరవింద్
తారాగణం చిరంజీవి,
సిమ్రాన్,
అల్లు అర్జున్ (అతిథి పాత్ర),
ఆషిమా భల్లా,
భాష తెలుగు

రాజ్ కుమార్ ఒక ఆడియో కంపెనీ యజమాని. ఆయన ఒక డ్యాన్సు స్కూలు కూడా నడుపుతుంటాడు. డ్యాంసంటే అతనికి ప్రాణం. అతనికి శాంతితో వివాహం అవుతుంది. అక్షయ అనే కూతురు పుడుతుంది. రాజ్ స్నేహితుల కోసం ఏమైనా చేస్తుంటాడు. కానీ వాళ్ళలో కొద్ది మంది అతని మంచితనాన్ని ఆసరాగా తీసుకుని అతని సొమ్మును స్వాహా చేస్తుంటారు. అయినా సరే రాజ్ కుటుంబం సంతోషంగా జీవిస్తుంటారు. ఒకసారి అక్షయకు తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. రాజ్ శాంతి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు తీసుకువస్తూ తన డ్యాన్స్ స్కూలు విద్యార్థి ప్రమాదానికి గురవడంతో అతన్నికాపాడటం కోసం వాడుకుంటాడు. అతని ఆసుపత్రి చేరేసరికి అక్షయ మరణిస్తుంది. అప్పటికే గర్భంతో ఉన్న శాంతి అక్షయ మరణానికి భర్తే కారణమని భావించి అతన్ని విడిచి వెళ్ళిపోతుంది.

ఆరేళ్ళ తర్వాత పోగొట్టుకున్న సంపదను మళ్ళీ సంపాదించుకున్న రాజ్ కి తన కూతురు అక్షయను పోలిన మరో పాప కనిపిస్తుంది. ఆమె పేరు ఐశ్వర్య. ఆమె అచ్చు అక్షయ పోలికలతోనే ఉంటుంది. రాజ్ అక్షయ పేరు మీదుగా ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేద పిల్లలను, వారి కుటుంబాలను ఆదుకుంటూ ఉంటాడు. శాంతికి తెలియకుండా ఐశ్వర్యతో అనుబంధం పెంచుకుంటాడు రాజ్. శాంతి కూడా పాత విషయాలు మరిచిపోయి మళ్ళీ భర్తకు దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అంతకుముందే రాజ్ ని మోసం చేసిన స్నేహితులతో అతను తిరగడం చూసి మళ్ళీ అతని మీద విశ్వాసం కోల్పోతుంది. చివరికి రాజ్ వారిని వదిలి వెళ్ళడానికి అంగీకరించగా అప్పుడే ఐశ్వర్య తన స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటుంది. వెంటనే రాజ్ తన ప్రాణాలను తెగించి కూతుర్ని కాపడతాడు. రాజ్ చూపిన ప్రేమ పట్ల శాంతి నమ్మకం కలిగి అతనితో జీవించడానికి అంగీకరించడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

మార్చు

నిర్మాణం

మార్చు

ఈ సినిమా కథను రచయిత భూపతిరాజా చిరంజీవికి వినిపించగా ఆయన ఈ కథకు మరో కథానాయకుడు వెంకటేష్ అయితే సరిపోతాడని చెప్పాడు. కానీ భూపతి రాజా ఇది చిరంజీవికి వెరైటీగా ఉంటుందని చెప్పి ఒప్పించాడు. సినిమా విడుదలైన తర్వాత వెంకటేష్ కూడా ఈ సినిమాను చూసి చిరంజీవితో అదే అభిప్రాయం వెలిబుచ్చాడు.[2]

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
పాటల జాబితా[3]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ"చంద్రబోస్ఎస్. ఎ. రాజ్‌కుమార్శంకర్ మహదేవన్ 
2."మందారం బుగ్గల్లోకి మచ్చెట్లొచ్చిందే"శ్రీనివాస్ఎస్. ఎ. రాజ్‌కుమార్ఉదిత్ నారాయణ్,
కవితాసుబ్రహ్మణ్యం
 
3."వానా వానా తేనెల వానా"చంద్రబోస్ఎస్. ఎ. రాజ్‌కుమార్ఉదిత్ నారాయణ్,
చిత్ర,
వైశాలి
 
4."గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. ఎ. రాజ్‌కుమార్హరిహరన్ 
5."నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్. ఎ. రాజ్‌కుమార్ఉదిత్ నారాయణ్,
చిత్ర
 
6."పట్టా పక్కింటి నాటు కోడిపెట్టని"భువనచంద్రఎస్. ఎ. రాజ్‌కుమార్ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
కవితాసుబ్రహ్మణ్యం,
అనురాధ శ్రీరామ్
 

మూలాలు

మార్చు
  1. Sakshi (18 May 2021). "'డాడీ' మూవీలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?". Sakshi. Archived from the original on 14 జూన్ 2021. Retrieved 14 June 2021.
  2. "Chiranjeevi: ఆ సినిమా వెంకటేశ్‌కైతే బాగుండేదన్న చిరంజీవి". EENADU. Retrieved 2022-05-31.
  3. సంపాదకుడు (15 October 2001). "డాడీ పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (2): సెంటర్ స్ప్రెడ్. Retrieved 20 March 2018.

బయటి లింకులు

మార్చు