1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

1989 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. శాసనసభ లోని 294 సీట్లలో 181 స్థానాలను గెలుచుకుంది. [1] మర్రి చెన్నారెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగాను, ముఖ్యమంత్రిగానూ ఎన్నికయ్యాడు. 1985లో 216 సీట్లు గెలిచిన తెదేపాకు కేవలం 74 సీట్లు మాత్రమే వచ్చాయి. అదే సంవత్సరంలో లోక్‌సభకు సాధారణ ఎన్నికలు కూడా జరిగాయి. రాష్ట్రం లోని మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను కాంగ్రెసు పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా, తెదేపా కేవలం 2 లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది.

1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

← 1985
1994 →
 
Party భారత జాతీయ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ
Percentage 47.09% 36.54%

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

ఎన్.టి.రామారావు
తెలుగుదేశం పార్టీ

Elected ముఖ్యమంత్రి

మర్రి చెన్నారెడ్డి
INC

అప్పటివరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన రామారావు, ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీచేసాడు. హిందూపురంలో గెలవగా, కల్వకుర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థి జక్కుల చిత్తరంజన్‌దాస్‌ చేతిలో ఓడిపోయాడు. [1]

సాధించిన సీట్లు, వోట్ల గణాంకాలు మార్చు

ఎన్నికల్లో వివిధ పార్టీలు సాధించిన సీట్లు, వోట్ల గణాంకాల సారాంశాన్ని కింది పట్టికలో చూడవచ్చు. [2]

 
నం పార్టీ పోటీ చేసిన

సీట్లు

గెలుచుకున్న

సీట్లు

సీట్ల సంఖ్యలో

మార్పు

ఓట్ల శాతం స్వింగ్
1 కాంగ్రెసు పార్టీ 287 181 +131 47.09% +9.84%
2 తెలుగుదేశం పార్టీ 241 74 -128 36.54% -9.67%
3 సి.పి.ఐ 19 8 -3 2.31% -0.05%
4 సి.పి.ఎం 15 6 -5 2.46% +0.15%
5 భాజపా 12 5 -3 1.78% +0.46%
6 జనతాదళ్ 4 1 +1 0.37% +0.37%
7 మజ్లిస్ పార్టీ 35 4 +4 1.99 +1.99%
8 స్వతంత్రులు 15 +6 6.58% -2.52%

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "ఓడిన ఎన్టీఆర్‌.. ఆసక్తి రేపిన 1989 ఎన్నికలు". Sakshi. 2018-11-01. Archived from the original on 2022-12-16. Retrieved 2022-12-16.
  2. "స్టాటిస్టికల్ రిపోర్ట్" (PDF). ceotelangana.nic.in. Archived from the original (PDF) on 2022-12-16. Retrieved 2022-12-16.

వెలుపలి లంకెలు మార్చు