ధర్మేంద్ర కాకరాల
ధర్మేంద్ర కాకరాల భారతీయ సినిమా ఎడిటర్. ఇతడు తెలుగు, హిందీ సినిమాలలో పనిచేశాడు. కొన్ని వెబ్ సిరీస్‌లకు కూడా ఎడిటర్‌గా పనిచేశాడు.
ధర్మేంద్ర కాకరాల | |
---|---|
జననం | 1981 (age 42–43) ఏలూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వృత్తి | సినిమా ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2010 – ప్రస్తుతం |
జీవిత విశేషాలు
మార్చుధర్మేంద్ర కాకరాల ఏలూరులో 1981లో జన్మించాడు. ఇతని కుటుంబ నేపథ్యం చాలా పెద్దది. ఇతని ముత్తాత కె. బాలకృష్ణారావు పేరుమోసిన న్యాయవాది, భూస్వామి. ఇతని తాత కె.ధర్మారావు ప్రఖ్యాత వైద్యుడు. ఇతని నాన్నమ్మ లలితాదేవి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పేరు గడించింది. ఇతడు మొదట బి.ఎ. డిగ్రీ చదివాడు. తరువాత కోల్‌కాతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి 2004లో ఆ సంస్థ నుండి పట్టభద్రుడయ్యాడు.[1]
సినిమా రంగం
మార్చుఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన వెంటనే ఇతడు ఒక 'వి' చిత్రం, లక్ష్మీ కళ్యాణం, బంగారు బాబు, చందమామ వంటి అనేక సినిమాలకు సహాయ ఎడిటర్‌గా, అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేసి అనుభవాన్ని గడించాడు. దేవ కట్టా దర్శకత్వంలో 2010లో విడుదలైన ప్రస్థానం సినిమాతో ఇతడు ఎడిటర్‌గా తన ప్రస్థానాన్ని ఆరంభించాడు.
ఫిల్మోగ్రఫీ
మార్చుఇతడు ఎడిటర్‌గా పనిచేసిన తెలుగు సినిమాల జాబితా:
విడుదలైన సంవత్సరం | సినిమా పేరు | వివరాలు |
---|---|---|
2010 | ప్రస్థానం | తొలి సినిమా |
2011 | ఎల్‌బిడబ్ల్యు: లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ | |
దడ | ||
2012 | వెన్నెల 1 1/2 | |
రొటీన్ లవ్ స్టోరీ | ||
2013 | బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ | |
మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు | ||
డి ఫర్ దోపిడి | ||
2014 | అమృతం చందమామలో | |
చందమామ కథలు | ||
బంగారు కోడిపెట్ట | ||
2015 | బందిపోటు | |
దాగుడుమూత దండాకోర్ | ||
అసుర | ||
2016 | పడేసావే | |
గుంటూర్ టాకీస్ | ||
ఒక మనసు | ||
2017 | పిఎస్‌వి గరుడ వేగ | |
2019 | సకల కళా వల్లభుడు | |
తిప్పరా మీసం | ||
2021 | సినిమా బండి | |
2022 | అల్లూరి | |
తెలిసినవాళ్లు | ||
ది ఘోస్ట్ | ||
పెళ్ళికూతురు పార్టీ | ||
వాళ్ళిద్దరి మధ్య | ||
2023 | ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ | |
శబరి |
వెబ్ సిరీస్
మార్చుమూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Dharmendra Kakarala Editor". వి సినిమా. Archived from the original on 24 డిసెంబరు 2023. Retrieved 24 December 2023.