నిమజ్జనం (సినిమా)
ఈ సినిమా 1978లో విడుదలయ్యింది. 1979లో ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రంలో నటించిన శారద ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.
నిమజ్జనం (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎస్.నారాయణ |
---|---|
నిర్మాణం | తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, ప్రేమ్‌ప్రకాష్ |
తారాగణం | శారద , చక్రపాణి, బోసుబాబు, యం.వి.రామారావు, దాశరథి, రావి కొండలరావు, రాధాకుమారి |
ఛాయాగ్రహణం | పి.ఎస్.నివాస్ |
భాష | తెలుగు |
కథసవరించు
భారతి సనాతన బ్రాహ్మణస్త్రీ. చనిపోయిన మామగారి అస్థికలను నిమజ్జనం చేసేందుకు భర్త శ్రీకాంత్‌తో పాటు బండిలో కాశీకి వెళుతుంది. భారతిని చూసి మోహపరవశుడైన బండివాడు ఆమెను బలాత్కారం చేయాలని పథకం వేస్తాడు. అతని పథకం వల్ల కనిపించకుండా పోయిన అస్థికల కుండ కోసం శ్రీకాంత్ వెదుకుతూ పోతే ఈ లోగా భారతిని బలాత్కారం చేస్తాడు బండివాడు. తన పవిత్రతను కోల్పోయిన భారతి గంగానదిలో ఆత్మార్పణం చేసుకుంటుంది. శ్రీకాంత్, అతని పురోహితుడు కాశీ నుండి తిరిగి వస్తుండగా బండివాడు మళ్లీ కలుస్తాడు. భారతి ఆత్మహత్య విషయం తెలుసుకుని పశ్చాత్తాప హృదయుడై, భారతి మరణానికి కారణం తానేనని శ్రీకాంత్‌కు చెప్పి ఎక్కడ భారతిని బలాత్కారం చేశాడో అక్కడే తాను కూడా ప్రాణాలు విడుస్తాడు. శ్రీకాంత్ అతనిపై పవిత్ర గంగాజలం చల్లుతాడు[1]. .
పురస్కారాలుసవరించు
సంవత్సరం | అవార్డు | విభాగము | లబ్ధిదారుడు | ఫలితం |
---|---|---|---|---|
1979 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ సినిమా | బి.ఎస్.నారాయణ | Won |
1979 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ నటి | శారద | Won |
1979 | నంది పురస్కారాలు | ఉత్తమ ఛాయాగ్రహణం | పి.ఎస్.నివాస్ | Won |
మూలాలుసవరించు
- ↑ ఆంధ్రపత్రిక ప్రత్యేక ప్రతినిధి (15 January 1980). "తెలంగాణా పోరాటం ఆధారంగా తీసిన సినిమా మా భూమి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 66, సంచిక 270. Retrieved 17 January 2018.[permanent dead link]