పులగం చిన్నారాయణ

తెలుగు రచయిత, విలేఖరి

పులగం చిన్నారాయణ తెలుగు సినిమా విలేఖరి, రచయిత, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో). గోరింటాకు, నెంబర్ వన్, చిత్రం, సంతోషం సినిమా పత్రికలతో సినిమా విలేఖరిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత సాక్షి దినపత్రికలో ఎనిమిదేళ్ళ పాటు పనిచేసి, రిపోర్టర్ నుండి ఇన్ ఛార్జ్ స్థాయికి ఎదిగాడు.[1] ఇతడు తెలుగు సినిమాపై జంధ్యామారుతం, ఆనాటి ఆనవాళ్ళు, సినీ పూర్ణోదయం, స్వర్ణయుగ సంగీత దర్శకులు, పసిడి తెర, సినిమా వెనుక స్టోరీలు, మాయాబజార్ మధుర స్మృతులు పుస్తకాలను రచించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 2009లో ఆనాటి ఆనవాళ్ళుకి, 2015లో పసిడి తెరకి తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం విభాగంలో నంది పురస్కారాలు అందుకున్నాడు. 2014లో ఉత్తమ సినిమా విమర్శకుడు విభాగంలో నంది పురస్కారాన్ని అందుకున్నాడు.[2]

పులగం చిన్నారాయణ
జననం
జాతీయతభారతీయుడు
వృత్తి
  • రచయిత
  • విలేఖరి
  • పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం

సాహితీ ప్రస్థానం

మార్చు

దర్శకుడు జంధ్యాల తీసిన 39 సినిమాల విశేషాల గురించి జంధ్యామారుతం పేరిట ఓ సంకలనాన్ని రచించాడు చిన్నారాయణ. ఇదే అతడు రచించిన మొదటి పుస్తకం. దానికి నటుడు చిరంజీవి ముందుమాటను వ్రాశాడు.[1] ఓ పుస్తకానికి ముందుమాట వ్రాయడం చిరంజీవికి కూడా అదే మొదటిసారి.[2] ఈ పుస్తకావిష్కరణ హైదరాబాదులో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో హాసం పత్రిక ఆధ్వర్యంలో జరిగింది. ఆ కార్యక్రమానికి నటులు చిరంజీవి, రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. చిరంజీవి పుస్తకాన్ని ఆవిష్కరించాడు.[3]

రెండవ పుస్తకంగా ఆనాటి ఆనవాళ్ళుని రచించాడు చిన్నారాయణ. దీనికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుమాటను వ్రాశాడు. ఈ పుస్తకం విడుదలైన మొదటి నెలలోనే మొదటి ప్రచురణలోని కాపీలన్నీ అమ్ముడుపోయి రెండో ప్రచురణకు వెళ్ళింది. ఈ పుస్తకానికి 2009లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం విభాగంలో నంది పురస్కారంని అందుకున్నాడు. ఆ తరువాత రచించిన సినీ పూర్ణోదయం పూర్ణోదయా క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు జీవితానికి సంబంధించిన అంశాలను కలిగినది. ఆ పుస్తకం మంచి విజయం సాధించింది.[2]

1932 నుండి 1950 వరకూ సినిమా సంగీత దర్శకుల గురించి స్వర్ణయుగ సంగీత దర్శకులు అనే పుస్తకాన్ని రచించాడు చిన్నారాయణ. గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆ పుస్తకాన్ని అచ్చుచిత్తు దిద్దగా, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ముందుమాటను వ్రాశాడు. ఆ తరువాత ఆనాటి ఆనవాళ్ళకు కొనసాగింపుగా ఓ వంద తెలుగు సినిమాల విశేషాలతో పసిడి తెర, 2000వ సంవత్సరం తరువాత వచ్చిన సినిమాల విశేషాలతో సినిమా వెనుక స్టొరీలు పుస్తకాలను రచించాడు చిన్నారాయణ. వీటిలో పసిడి తెరకు 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం విభాగంలో నంది పురస్కారాన్ని అందుకున్నాడు.[1]

మాయాబజార్ సినిమా గురించి వ్రాసిన మాయాబజార్ మధుర స్మృతులు పుస్తకంతో పాటు డాక్యుమెంటరీని కూడా రూపొందించాడు చిన్నారాయణ. ఈ పుస్తకానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నుండి అధికారిక ప్రశంస లభించింది.[2]

చిన్నారాయణ వడ్డి ఓం ప్రకాష్ నారాయణ అనే మరో రచయితతో కలిసి వెండి చందమామలు అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం 2 అక్టోబర్ 2019న దర్శకుడు వంశీ చేతుల మీదుగా విడుదలయింది. తొలి ప్రతిని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి రవి ప్రసాద్ పాడి అందుకున్నాడు. తెలుగు సినిమాలపై వచ్చిన వెండితెర నవలలకు సంబంధించిన సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు.[4]

రచనల జాబితా

మార్చు

తెలుగు సినిమాకు సంబంధించి చిన్నారాయణ చేసిన రచనలు.[1]

  • జంధ్యామారుతం
  • ఆనాటి ఆనవాళ్ళు
  • సినీ పూర్ణోదయం
  • స్వర్ణయుగ సంగీత దర్శకులు
  • పసిడి తెర
  • సినిమా వెనుక స్టొరీలు
  • మాయాబజార్ మధుర స్మృతులు
  • వెండి చందమామలు[4]

సినీ ప్రస్థానం

మార్చు

తెలుగు సినిమా పరిశ్రమలో చిన్నారాయణ ప్రస్తుతం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో), మాటల రచయిత, పాటల రచయితగా కొనసాగుతున్నాడు. బద్రి సినిమా సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ తో ఏర్పడిన పరిచయం ద్వారా మొదటిసారిగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు పీఆర్వోగా పనిచేశాడు. ఆ తరువాత తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేనుతో కొనసాగించి మూడువందల పైచిలుకు సినిమాలకు పీఆర్వోగా చేశాడు. నటులు రామ్ పోతినేని, కార్తికేయ, సప్తగిరిలకు పీఆర్వోగా పనిచేస్తున్నాడు. మాటల రచయితగా తన ప్రస్థానాన్ని ప్రేమ ఒక మైకం సినిమాతో ప్రారంభించాడు. సందీప్ కిషన్ నటించిన మహేష్ సినిమాతో గీతరచయితగా మారాడు.[1]

గీతరచయితగా పనిచేసిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు సంగీత దర్శకుడు పాట మూలాలు
2013 మహేష్ ఆర్. మదన్ కుమార్ గోపి సుందర్ "మది మోసే" [5] [6]
2014 ప్రేమించాలి సుసీంద్రన్ యువన్ శంకర్ రాజా "కొత్త అల" [7]
2016 గరం మదన్ అగస్త్య "రబ్బా రబ్బా" [8] [9]
మనలో ఒకడు ఆర్. పి. పట్నాయక్ ఆర్. పి. పట్నాయక్ "దమ్ మారో దమ్" [10] [11]
2017 పైసా వసూల్ పూరీ జగన్నాథ్ అనూప్ రూబెన్స్ "పదమరి" [12] [13]
2018 ఆటగదరా శివ చంద్ర సిద్ధార్థ వాసుకి వైభవ్ "రామా రామా రే" [14] [15]
జనతా హోటల్ అన్వర్ రషీద్ గోపి సుందర్ "ఛల్ ఛల్ కాలమే", "ఆగేనా కెరటమే" [16]
శుభలేఖ+లు శరత్ నార్వడే కె. ఎం. రాధాకృష్ణన్ "చెప్పక తప్పదు అంతే" [17] [18]
2019 7 నిజార్ షఫీ చైతన్ భరద్వాజ్ "ఇదివరకెపుడు" [19] [20]

మాటల రచయితగా పనిచేసిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా నిర్మాత దర్శకుడు నటీనటులు మూలాలు
2013 ప్రేమ ఒక మైకం శ్రీకాంత్ సూర్య, వెంకట్ సురేష్ చందు ఛార్మి, రవిబాబు [21]
2017 గల్ఫ్ యక్కలి రవీంద్రబాబు పి.సునీల్ కుమార్ రెడ్డి చేతన్ నేని, డింపుల్ [22]
2017 బ్లఫ్ మాస్టర్ పి.రమేష్ గోపి గణేశ్ సత్యదేవ్ కంచరాన, నందిత శ్వేత [23]

పురస్కారాలు

మార్చు

నంది అవార్డులు

  • 2009 - తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం (ఆనాటి ఆనవాళ్ళు)[1]
  • 2014 - ఉత్తమ సినిమా విమర్శకుడు[1]
  • 2016 - తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం (పసిడి తెర)[1]

మిగతా అవార్డులు

  • 2006 - సంతోషం అవార్డు - ఉత్తమ విలేఖరి, పీఆర్వో (పోకిరి)[1]
  • 2007 - 36వ ఏ.పి. సినీగోయర్స్ అవార్డు - ఉత్తమ సినిమా విలేఖరి[1]

మూలాలు

మార్చు
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 "Pulagam Chinnarayana's interview on national-level recognition for Maya Bazar Madhura Smruthulu". ibtimes.co.in. 19 February 2019. Retrieved 1 September 2019.
  2. 2.0 2.1 2.2 2.3 "So happy for getting such a rare honor : Pulagam Chinnarayana". thehansindia.com. 13 February 2019. Retrieved 1 September 2019.
  3. "Book Release: Jandhya Marutam". idlebrain.com. 2 May 2005. Archived from the original on 14 November 2019. Retrieved 8 September 2019.
  4. 4.0 4.1 "వెండితెర నవలలపై ఇది ఓ పరిశోధన!: వంశీ". cinejosh.com. 3 October 2019. Archived from the original on 12 October 2019. Retrieved 12 October 2019.
  5. "Madi Moose". jiosaavn.com. 13 August 2013. Retrieved 1 October 2019.[permanent dead link]
  6. "Mahesh (Telugu)". in.bookmyshow.com. 20 September 2013. Retrieved 1 October 2019.
  7. "Preminchali". in.bookmyshow.com. 27 February 2014. Retrieved 1 October 2019.
  8. "Garam". in.bookmyshow.com. 12 February 2016. Retrieved 1 October 2019.
  9. "Garam". gaana.com. 29 March 2018. Archived from the original on 1 October 2019. Retrieved 1 October 2019.
  10. "Dum Maro Dum". jiosaavn.com. 27 August 2016. Retrieved 1 October 2019.[permanent dead link]
  11. "Manalo Okadu". in.bookmyshow.com. 4 November 2016. Retrieved 1 October 2019.
  12. "Padhamari". jiosaavn.com. 17 August 2017. Retrieved 1 October 2019.[permanent dead link]
  13. "Paisa Vasool". in.bookmyshow.com. 1 September 2017. Retrieved 1 October 2019.
  14. "Aata Gadha Ra Shiva". gaana.com. 15 June 2018. Archived from the original on 1 October 2019. Retrieved 1 October 2019.
  15. "Aatagadharaa Siva". in.bookmyshow.com. 20 July 2018. Retrieved 1 October 2019.
  16. "Janatha Hotel". in.bookmyshow.com. 14 September 2018. Retrieved 1 October 2019.
  17. "Shubhalekha+lu". gaana.com. 9 August 2018. Archived from the original on 1 October 2019. Retrieved 1 October 2019.
  18. "Subhalekha+lu". in.bookmyshow.com. 7 December 2018. Retrieved 1 October 2019.
  19. "7". gaana.com. 24 April 2019. Archived from the original on 1 October 2019. Retrieved 1 October 2019.
  20. "Seven". in.bookmyshow.com. 5 June 2019. Retrieved 1 October 2019.
  21. "Prema Oka Maikam". BookMyShow. 30 August 2013. Retrieved 8 September 2019.
  22. "Gulf". BookMyShow. 13 October 2016. Retrieved 8 September 2019.
  23. "Bluff Master". BookMyShow. 28 December 2018. Retrieved 8 September 2019.