పెళ్ళి పీటలు

1998 సినిమా

పెళ్ళి పీటలు 1998లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] ఇందులో జగపతి బాబు, సౌందర్య ముఖ్యపాత్రల్లో నటించారు.

పెళ్ళి పీటలు
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్. వి. కృష్ణారెడ్డి
తారాగణం జగపతి బాబు,
సౌందర్య
ఝాన్సీ (నటి)
సంగీతం ఎస్వీ. కృష్ణారెడ్డి
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

గోపి ఎవరి దగ్గర పనిచేయడానికి ఇష్టపడక తానే స్వంతంగా గడియారాలను మరమ్మత్తు చేసే దుకాణం నడుపుతుంటాడు. అదే ఊర్లో అంజలి సంగీతం బోధించే మాస్టారి మూడో కూతురు. ఆమెకు ఇద్దరు అక్కలు. పెద్దక్క అశ్విని మాట్లాడలేదు. రెండో అక్క అరుణ. బామ్మ తో కలిసి నివాసం ఉంటుంటారు. వీరితో బాటుగా సవతి తమ్ముడు రఘు కూడా ఉంటాడు. రఘు వీళ్ళను ఏదో కారణంతో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అంజలి పక్కనే ఉన్న నగరంలో ఓ దుకాణంలో పనిచేస్తూ ఖాళీగా ఉన్నప్పుడల్లా తన స్వంత ఊరు వస్తూ ఉంటుంది. అంజలి, గోపి ఒకరికొకరు తారసపడి నెమ్మదిగా ప్రేమలో పడతారు.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రానికి దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి నే సంగీతం కూడా అందించాడు.[2]

: గీత రచయిత చంద్రబోస్

  • ఝుం ఝుం ఝుం ఝుమ్మని మోగింది ,గానం: కె. ఎస్. చిత్ర
  • చిటపట చినుకులు , గానం. శ్రీనివాస్, చిత్ర
  • మోహనం మోహనం ప్రేమంటే మోహనం , గానం. కృష్ణంరాజు , పల్లవి
  • పెళ్ళి పీటలు , చిత్ర, మనో, నిత్య సంతోషి
  • రేయిని వెలిగించు , పల్లవి, శ్లోకం
  • యమునా తరంగం, ఉన్నికృషన్, పల్లవి
  • ఈ చక చక, కృష్ణంరాజు , చిత్ర
  • జిల్ జిల్ జిల్, శ్రీనివాస్ , చిత్ర .

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. "పెళ్ళి పీటలు". thetelugufilmnagar.com. Retrieved 12 February 2018.[permanent dead link]
  2. "పెళ్ళి పీటలు పాటలు". naasongs.com. Archived from the original on 27 నవంబరు 2016. Retrieved 12 February 2018.