వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 8

తాజా వ్యాఖ్య: Unused images without license టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Nrgullapalli

AWB బ్రౌజర్ మార్చు

ప్రసాద్ గారూ మీరు గమనిస్తే AWB వాడుతున్నపుడు మీరు ఒక్క మార్పును మాత్రమే గమనిస్తున్నట్టున్నది. పైన వ్యాసం సరిచూసుకుంటే కనుక - దస్త్రాలకు _ - లను అంటించుకుంటూ వెళుతున్నది. అలా కొన్ని దస్త్రాలు కనిపించకుండా TEXT మాత్రమే కనిపిస్తున్నది. మరికొన్ని ARTICLES మద్య స్పేసులు ఇస్తున్నది. దాని వలన అది నీలి రంగు నుండి ఎరుపుగా మారిపోతున్నది. వాటిని మనం పరిశీలించుకుని క్రింద మూడవ బాక్స్‌లోని EDIT వద్ద మార్పులు చేసి తరువాత సేవ్ చెయ్యాలి. మీ మార్పుల సమయం చూస్తే, పరిశీలించకనే సేవ్ బటన్ నొక్కుతున్నట్టుగా ఉంది. చాలా మార్పుల మద్య సెకన్ కూడా మారలేదు. ఒకసారి పునపరిశీలించుకొని EDITలో మార్పు చేసుకొని సేవ్ బటన్ ప్రెస్ చేయండి. లేదా పైన VIEW లో చూసి SKIP చేయండి..--విశ్వనాధ్ (చర్చ) 04:02, 26 ఫిబ్రవరి 2015 (UTC)Reply

విశ్వనాధ్ గారు, మరల ఒకసారి అన్నీ చూసి సరిచేస్తానండి. మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 04:36, 26 ఫిబ్రవరి 2015 (UTC)Reply
చాలా పేజీలకు ఇంతకు ముందే ఎర్రలింకులు ఉన్నాయి. తప్పు ఎక్కడ, ఏవిధంగా జరుగుతోందో, చేశానో, మీరు చూసిన ఒక పేజీ లింకు దయచేసి పంపగలరు. JVRKPRASAD (చర్చ) 04:51, 26 ఫిబ్రవరి 2015 (UTC)Reply
మీరు గమనించిన వాటి లింకులు ఇవ్వండి. చిన్న మార్పులు (ఒక మార్పు) ఎక్కువ సమయము పట్టదు.
  1. మొదటి సారి వాడినప్పుడు అంతగా చూడలేదు. ఇప్పుడు అన్ని AWB లో చూస్తున్నాను.
  2. నిన్న నా సమయములు చూడగలరు.
  3. దస్త్రాలు కనిపించకుండా TEXT మాత్రమే కనిపిస్తున్నది అన్నారు. అంటే బొమ్మలు లేకుండా పోయాయి అని అర్థమా ?
  4. ARTICLES మద్య స్పేసులు ఇస్తున్నది. దాని వలన అది నీలి రంగు నుండి ఎరుపుగా మారిపోతున్నది.
  5. EDITలో మార్పు చేసుకొని సేవ్ బటన్ ప్రెస్ చేయమని సలహా ఇచ్చారు. తప్పకుండా అనుసరిస్తాను.

నాకు (2) మరియు (3) సమస్యలు ఎక్కడ గమనించారో దయచేసి తెలియజేయండి. అటువంటిది రాకూడదు మరి. నేను ఇప్పటి వరకు చాలా పేజీలు చూశాను. ఆ దోషం నాకు దొరుకుట లేదు. ఎందుకయినా మంచిదని కొన్ని మార్పు చేసిన పేజీలు తిరిగి వెనుకకు మళ్ళించడము జరిగింది. JVRKPRASAD (చర్చ) 05:27, 26 ఫిబ్రవరి 2015 (UTC)Reply

ప్రసాద్ గారు. నా సలహా తప్పుగా తీసుకోవద్దు. మీకు పొరపాట్లు చేసారని కాదు. జనరల్‌గా దీన్లో వచ్చే ఇబ్బందులు ప్రస్తావించాను. వాటిని సరి చూసుకోవడ్ం ద్వారా పొరపాట్లు రాకుండా ఈ ఉపకరణం వాడుకోవచ్చు అని తెల్పాను. మీరు మళ్ళీ మార్పును తిరగరాయోద్దు. నేను పైన ఇచ్చిన వాటిని ఒక్కసారి చూడండి. ఉదా Visakhapatnam port main entrance అని ఉంటే దానికి Visakhapatnam_port_main_entrance అని ఇస్తుంది. అలాంటివి ముందే సరిచూసి EDIT బాక్స్‌లో సరిదిద్దుకొని సేవ్ చేస్తే మనపని మరింత సులభం, మరింత మెరుగ్గా AWB బ్రౌజర్ వాడుకోవచ్చు...--విశ్వనాధ్ (చర్చ) 06:12, 26 ఫిబ్రవరి 2015 (UTC)Reply

విశ్వనాధ్ గారు, మీరు మంచి మనసుతో సదుద్దేశ్యంతోనే చెప్పారనే భావించాను. మనసులో ఏదో పెట్టుకుని నన్ను కెలకాలనుకునే వాళ్ళు ఎవరో తేలికగా అర్థం చేసుకోగలను. మీరు నాకు లింకు ఇస్తే బావుండేది. అయినా చూసి నా స్పందన తెలియజేస్తాను. JVRKPRASAD (చర్చ) 06:39, 26 ఫిబ్రవరి 2015 (UTC)Reply
మీరు నా పేరు పెట్టి వ్రాస్తే ఆ తప్పులు నేను చేస్తున్నానేమో అని చాలా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు సాధారణంగా అందరికీ వర్తించే విధంగా నాతో చర్చించారని గమనించ లేకపోయాను. మీరు చెప్పినట్లు చాలా మార్పులు ఒకేసారి ఒకే పేజీలో అది చేస్తుంది. అనుభవం పొందితే చాలా ఉపయోగం ఉన్నది. నేను చేస్తున్న అనేక మూసల దిగుమతిలో భాగంగా, AWB బ్రౌజర్ యొక్క మూసలు కూడా అన్నీ ఈ వారంలోనే ఇక్కడ దిగుమతి చేశాను.మీరు చెప్పినవి అన్నీ గమనిస్తున్నాను. తదుపరి మీరు సూచించినది Visakhapatnam port main entrance ఎక్కడ ఉన్నదో ఇప్పుడు ఇక్కడ పొంద లేక పోయాను. నాకు తెలిసి తప్పులు లేకుండా ఎక్కువ పని పొందాలనే ఉద్దేశ్యముతో ఎల్లప్పుడూ నా ఉద్దేశ్యం. దయచేసి ఆ పుట లింకు పంపగలరు. JVRKPRASAD (చర్చ) 06:46, 26 ఫిబ్రవరి 2015 (UTC)Reply

Thank you from Italy మార్చు

Dear JVRKPRASAD, I want to thank you for your precious help!!!

Can you tell me where do you live? I live in Caselle Landi. Thanks again, see you soon!

Rei Momo (చర్చ) 00:24, 5 మార్చి 2015 (UTC)Reply

Dear Rei Momo, Welcome. It is bring to king notice that I have been living in India as it is my birth country. With best wishes and regards. JVRKPRASAD (చర్చ) 00:29, 5 మార్చి 2015 (UTC)Reply

And what's the right name of your Language? Rei Momo (చర్చ) 00:48, 5 మార్చి 2015 (UTC)Reply
English: Jalasutram Venkata Rama Krishna Prasad (J.V.R.K. PRASAD) and Telugu : జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ (జె.వి.ఆర్.కె. ప్రసాద్) JVRKPRASAD (చర్చ) 00:51, 5 మార్చి 2015 (UTC)Reply
Wow, thank you very much!!! Rei Momo (చర్చ) 08:44, 5 మార్చి 2015 (UTC)Reply
Rei Momo, Your name in Telugu language: రే మొమో (best), రీ మొమో (better) or రేయ్ మొమో (least). With best wishes JVRKPRASAD (చర్చ) 09:25, 5 మార్చి 2015 (UTC)Reply
Thank you, my dear friend. I changed a little my User page, can you watch if it's good? If you want you can translate the picture, no problem!!! Rei Momo (చర్చ) 12:43, 5 మార్చి 2015 (UTC)Reply
Welcome, dear Rei Momo , it is so nice. With regards, JVRKPRASAD (చర్చ) 12:29, 9 మార్చి 2015 (UTC)Reply
Please, when you'll have 3 minutes, I will be happy if you translate the picture I've put on my page, can you? Thanks a lot for your precious help! Rei Momo (చర్చ) 14:42, 9 మార్చి 2015 (UTC)Reply
Sorryyyyyyyyyyyy, I didn't see the translation, so sorry, forgive me!!! Thnaks a lot again!!! Rei Momo (చర్చ) 14:43, 9 మార్చి 2015 (UTC)Reply
Dear Rei Momo, Welcome. Please continue your valuable and torrential services here i.e., Wikipedia, eternally. Wish you all the best. JVRKPRASAD (చర్చ) 01:28, 10 మార్చి 2015 (UTC)Reply

గ్రామ వ్యాసాలలో విభాగాలు మార్చు

ప్రసాద్ గారు మీరు వ్యాసాలాలో గ్రామ చరిత్ర - రవాణా వంటి భాగాలు ఎందుకు చెరుపుతున్నారో అర్ధం కాలేదు. అవి వదిలేయండి. మనకు ఇబ్బందేం లేదు కదా. అలానే కొన్ని విభాగాలో సమాచారం ఉన్నది అది అలాగే ఉన్నది, విభాగం లేకుండా..--విశ్వనాధ్ (చర్చ) 08:14, 5 మార్చి 2015 (UTC)Reply

విశ్వనాధ్ గారు, మీరు అడుగుతారు, కానీ లింకు ఇవ్వరు. సరే. మీరడిగిన విభాగంలో విషయం ఉందా ? ఖాళీ గ్రామ పేజీలు చూసిన కొత్త దూరపు వారు, ఆ గ్రామమునకు ప్రాముఖ్యము లేదు అనుకుంటారు. ఒక విధముగా దాని విలువ తగ్గించినట్లు అవుతుంది.అయినా మీరు లేదా మీలాంటి వారు గ్రామ చరిత్ర - రవాణా వ్రాయాలనుకుంటే అదే మంత సమస్య ? ఓ ముద్దగా తొలగిస్తున్నప్పుడు ఒకటి అరా అలా జరగవచ్చును. లెక్కతీయమంటారా ? అయినా కృష్ణా, గుంటూరు జిల్లాల గురించి మీకు పని చేయాలనుకుంటే చెప్పండి. నా పని గురించి అనవసరముగా ఎక్కువ శ్రద్ధ తీసుకోకండి. మీరు వదలమంటే వదల వలసిన అవసరము లేదు. మీకు ఇబ్బంది లేదు. చాలా మందికి ఈ ప్రాంతము వారికి ఇబ్బంది. ఈ రెండు జిల్లాల గురించి మీరు చేయాలనుకున్న సేవ ఏమిటో చెప్పండి ? మీకు అర్థమయ్యేలా నేను పని చేయాల్సిన అవసరము లేదనుకుంటాను. మీ ఇబ్బంది ముందు ఏమిటి ? మీరు పాత తరం వాళ్ళు, మీకు లింకు ఇవ్వాలని తెలియదా ? విశాఖపట్నం గురించి ఏదో వ్రాశారు. మీ ప్రశ్న, సమాధానము ఎలా ఉన్నాయో చూసుకున్నారా ? తప్పులన్నీ అన్నీ నేను తిరిగి చూస్తానని చెప్పాను. నన్ను అనవసరముగా ఇలాంటి వాటితో మీరు ఇంక ముందు నా మనసు కెలకకండి. ప్రతి మనిషిలో అరిషడ్వర్గాలు ఉంటాయి. వాటిని అదుపులో ఉంటే అంతా మంచిది, లేకపోతే వ్యక్తిగత జీవితంలో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ముందు మీరు అని భాష, తదుపరి ఏకవచనం, ఆ తదుపరి పనికిరాని భాష పలకరింపులు చివరికి బూతుమాటల పలకరింపులు, ఇల్లా ఉంటుంది భవిష్యత్తు వాడుకరుల పలకరింపులు. మీ బాధ ఏమిటి ? నేనూ అంటాను, మీకు నాలో తప్పును ఎంచే అర్హత ఏ విషయములోనూ లేదని. మీరు గాని, మీ వర్గాలు గాని అంగీకరించవు. ఇంతవరకు చదువుకుంటే కొంత అయినా అర్థమయితే తదుపరి అవసరమయితే వ్రాస్తాను. JVRKPRASAD (చర్చ) 08:39, 5 మార్చి 2015 (UTC)Reply

ప్రసాద్ గారు. మీరు చేస్తున్న పనికి వంకలు పెట్టడానికో మిమ్మల్ని చిన్నబుచ్చడానికో నేను అలా రాయలేదు. దాని వలన కొందరు కొత్త వాడుకరులు వివరాలు చేర్చు వీలున్నది కనుక వదిలేస్తే మేలని నా అభిప్రాయం చెప్పాను. రచ్చబండలో రాయలేదు. మీపేజీలో రాసాను. లింకు కావాలన్నారు ఇక్కడ ఇస్తున్నను బొమ్మతో

 
తెరపట్టు
మీరు నాకు ఈ పని నేర్పకండి. రాసేవాళ్ళకి ఒక వాక్యం వ్రాసుకోలేరా ? కొన్ని వేల పేజీలలో ఎన్ని వందలు పోయాయంటారు ? కనీసం మొత్తం మీద 5% ఉందా ? నాకు ఏదయినా కొత్త పని నేర్పడానికి ప్రయత్నించండి. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఎవరికీ ఉండదు. అయినా నేను సరిచేస్తానన్నా కదా !. నా సమయము మీ సమయము దండగ. ఇదో పెద్ద సమస్య అయినట్లు, ఏమిటి ఈ ఎత్తి చూపుడు వ్యవహారం ? JVRKPRASAD (చర్చ) 14:33, 5 మార్చి 2015 (UTC)Reply
ఇక్కడ ఏం జరుగుతున్నదో తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. క్షమించాలి..వివాదాలకు దూరంగా ఉండాలని నేను బలంగా అనుకుంటాను. మరెప్పుడూ మీ మార్పుల గురించి అడగనని మాటిస్తున్నాను :)--విశ్వనాధ్ (చర్చ) 14:47, 5 మార్చి 2015 (UTC)Reply
మంచిది. JVRKPRASAD (చర్చ) 14:49, 5 మార్చి 2015 (UTC)Reply

సర్పంచి వ్యాసాన్ని పరిరక్షించండి మార్చు

ప్రసాద్ గారూ, నమస్కారం. సర్పంచి వ్యాసంలోని సమాచారాన్ని గత కొద్ది కాలం నుండి అనామక సభ్యులు తీసివేస్తున్నారు. దయచేసి ఈ వ్యాసాన్ని పరిరక్షించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:57, 9 మార్చి 2015 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారు, ఇప్పుడు ఏం చేద్దామంటారు ? JVRKPRASAD (చర్చ) 11:36, 9 మార్చి 2015 (UTC)Reply
ప్రసాద్ గారూ, వ్యాస చరిత్ర ను పరిశీలించి దీనిని ఎవరూ దిద్దుబాటు చేయకుండా తాత్కాలికంగా సంరక్షించడానికి వీలవ్వగలదేమో పరిశీలించగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:01, 9 మార్చి 2015 (UTC)Reply
సుల్తాన్ ఖాదర్ గారు, తప్పకుండా. JVRKPRASAD (చర్చ) 00:58, 10 మార్చి 2015 (UTC)Reply
వ్యాసాన్ని రక్షణతో తిరిగి పునఃప్రతిష్టించాను. మీరు వ్యాసాన్ని క్షుణ్ణంగా చదివి ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే చేయండి. ఎందుకు తొలగిస్తున్నారో కొంత అవగాహన ఏర్పడుతుంది. JVRKPRASAD (చర్చ) 01:12, 10 మార్చి 2015 (UTC)Reply
ధన్యవాదాలు ప్రసాద్ గారూ. గత కొద్ది కాలం నుండి అనామక సభ్యులు ఈ వ్యాసంలో వ్యక్తిగత సమాచారాన్నిచేరవేస్తున్నారు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:47, 10 మార్చి 2015 (UTC)Reply

ఇతర వికీల నుండి మూసల దిగుమతి మార్చు

ప్రసాద్ గారూ, ఇతర వికీల నుండి మూసల దిగుమతి కి ప్రయత్నిస్తున్నపుదు ఈ క్రింది సమాచారం చూపెడుతున్నది.

ఈ క్రింది కారణం వల్ల, మరో వికీ నుండి ఈ పేజీని దిగుమతి చెయ్యి అనుమతి మీకు లేదు:మీరు ప్రస్తుతం చేయతలపెట్టిన పని నిర్వాహకులు, దిగుమతిదార్లు, ట్రాన్స్ వికీ దిగుమతిదారులు గుంపులకు చెందిన వాడుకరులు మాత్రమే చేయగలరు.

దయచేసి మూసలను ఎలా దిగుమతి చేయవలెనో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:53, 9 మార్చి 2015 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారు, మీరు ఏ మూసలు గురించి ప్రయత్నించినారో దయచేసి ఏదైనా లింకు ఇవ్వండి. నాకు మాత్రము తెలియదు. కానీ ప్రయత్నము చేస్తాను. లేదా మీకు కావల్సిన మూసలు నేను దిగుమతి అయినా చేస్తాను. JVRKPRASAD (చర్చ) 11:33, 9 మార్చి 2015 (UTC)Reply
సుల్తాన్ ఖాదర్ గారు, బహుశః మీరు దిగుమతి చేయాలనుకున్న మూసలు, పైన మీరు పొందుపరచిన వారి రక్షణ పొందుతున్నాయని మీరు భావించవలసి ఉన్నది. JVRKPRASAD (చర్చ) 01:19, 10 మార్చి 2015 (UTC)Reply

వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదం ప్రాజెక్టు మార్చు

 

హలో JVRKPRASAD/పాత చర్చ 8! గారు, స్త్రీవాదం కు సంబంధించిన కథనాలు నందు మీ సహకారానికి ధన్యవాదాలు. వికిప్రాజెక్ట్ ఫెమినిజం ఒక వికీప్రాజెక్ట్ నందు మీరు కూడా ఒక భాగంగా కావాలని మీకు ఈ ఆహ్వానము ద్వారా ఆహ్వానించుతున్నాము. ఈ వికీప్రాజెక్ట్ ఇక్కడి స్త్రీవాదం వ్యవహరించే వ్యాసాల నాణ్యత మెరుగుపరచడం ముఖ్య ఉద్దేశ్యం.

మరింత సమాచారం కోసం వికీప్రాజెక్టు/స్త్రీవాదం నందు మీరు పాల్గొనేందుకు కావాలనుకుంటే, దయచేసి సందర్శించండి. "సభ్యులు" కింద మీ పేరు సైన్ అప్ కొరకు సంకోచించకండి. ధన్యవాదాలు!

JVRKPRASAD (చర్చ) 06:45, 12 మార్చి 2015 (UTC)Reply

My user page మార్చు

Please remove User:Geohakkeri. --Geohakkeri (చర్చ) 18:28, 13 మార్చి 2015 (UTC)Reply

Module:Convert మార్చు

Sorry that I have to use English. I'm hoping you would be able to help at User:Johnuniq/translate which concerns the translation of messages and units used by {{convert}}. Getting the basics done should be fairly easy, and difficult cases can be left for later if needed. There are 3300 converts used in articles, so fixing what is displayed would be useful. Johnuniq (చర్చ) 00:20, 14 మార్చి 2015 (UTC)Reply

వికీలో మీ కృషికి అభివందనల ప్రశంసా పతకం మార్చు

 
ఇటీవల వికీలో మీరు చేస్తున్న కృషికి అభినంధనల ప్రశంసా పతకం.......విశ్వనాధ్

దీనిని మీ వాడుకరి పేజీలో వీలుగా అమర్చుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:12, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply

విశ్వనాధ్ గారు, మీకు ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు. JVRKPRASAD (చర్చ) 11:52, 18 ఏప్రిల్ 2015 (UTC)Reply

బెంగుళూరు దండు మార్చు

ఆ స్టేషనును కన్నడం లో బెంగుళూరు దండు అనియు హిందీలో బెంగుళూరు ఛావని అనియు ఆంగ్లమున బెంగుళూరుకంటోన్మెంట్ అనియు అందురు. కంటోన్మెంట్ ను తెలుగులో కూడ దండు అని అందురు. కావున ఆ పేరు పెట్టాను. దయచేసి గమనించగలరు. http://indiarailinfo.com/arrivals/bangalore-cantt-bnc/996 ఈ పుట లో ఒక చిత్రపటం కలదు. దయచేసి అది చూడుడి.

ఈ జవాబు వ్రాశినది ఎవరో కానీ, భారతదేశములోని అన్ని భాషల పదాలతో వ్యాసాములు వ్రాయాలనుకుంటే సరి. అసలు బెంగుళూరు దండు అని ఇచ్చిన లింకులో తెలుగులో ఎక్కడ ఉందో తెలియజేస్తే మంచిది. ఏదో వ్రాస్తే ఎలా ? కానీ ఇది తెలుగు వికీ [1]కావున ఆ పదము చెల్లదు. సినిమాలకు కూడా అనేక పేర్లు ఒక దానికే ఉంటాయి. బెంగుళూరు దండు కన్నడ వ్యాసము, బెంగుళూరు ఛావని కాదు బైంగళూర్ కౌంట్ అని హిందీ వ్యాస జాబితాలోకి రాసుకుంటే మంచిదేమో. hydkarthik మరియు అతని యొక్క సలహాదారులు, భారతీయ రైల్వేలు నందు కాక కన్నడ మరియు హిందీ భాషలలో కొత్తగా వర్గాలను తయారు చేస్తూ ఈ విధము అయిన తెలుగు కాని వ్యాసాలు చేర్చుకోండి. ఈ గందరగోళం ఉండదు. 03:45, 19 ఏప్రిల్ 2015 (UTC) JVRKPRASAD (చర్చ) 04:17, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply


మీ దృష్టికి ఒక విషయము తేవదలచుకుంటున్నాను. బెంగుళూరు సిటి స్టేషను యొక్క తెవికి పుటకు "బెంగుళూరు నగర రైల్వే స్టేషను" అని పేరు పెట్టినప్పుడు ఆ స్టెషను భారతీయ రైల్వేలో ఎక్కడ ఉంది అని మీరు అడగలేదు కదా. ఈ విషయంలో మాత్రం ఈలాగు ఎందుకు చేయుచున్నారు? దండు అనునది కన్నడ పదము మాత్రమే కాదు. తెలుగు పదము కూడాను. గమనించగలరు.భారతదేశములోని అన్ని భాషల పదాలతో వ్యాసాములు వ్రాయవలెనని నాకు ఉద్దేశ్యము లేదు. అది తెలుగు పదమే. సినిమాలకు కూడా అనేక పేర్లు ఒక దానికే ఉంటాయి అని మీరు అన్నది నాకు అర్థము కాలేదు. దయచేసి విశదీకరించండి.

దండు అనే పదము మార్చు

నువ్వు చెప్పిన దండు అనే పదమునకు రైల్వే కోడ్ ఏమిటి ? నీతో నాకు వాదనలు అనవసరము. నా సమయము వృధా. నువు ఏమి వ్రాయదలచుకున్నావో వ్రాయి. ఏమి తరువాత నిర్ణయము చేయాలో అదే జరుగుతుంది. నీకు ఏది అర్థము కాదు. ఉదా:మగధీర పేరుతో అనేక పేర్లు కలిగిన సినిమాలు వచ్చాయి. తెలుగులోకి నీకు నచ్చిన పేరు పెట్టి వ్రాస్తావా ? తప్పు ఉన్నది. అడుగుతారు. ప్రతిదానికి అడగరు. నువ్వు లేదా మరెవరో లేదా నేను చెబితే తోచిన పదము రైల్వేలకు చెల్లవు. అలాగే కొన్నిమిగతా వాటికి మనకు తోచిన పేర్లు పెట్టకూడదు. ఇతర సాధారణ వ్యాసాలకు పేర్లు నీ ఇష్టము వచ్చినవి పెట్టుకుని వ్రాసుకో. నువ్వు నాతో వాదన చేయాలనుకున్నావు. కానీ నీ జీవితం చాలదు. అనవసరముగా ఈ విధముగా సోషల్ సైట్లలో చెడ్డపేరు తెచ్చుకోకు. ఇక్కడ కాదు మీడియా, సోషల్ సైట్లలోకి అక్కడికి వస్తే అక్కడ కూడా ఈ నీ తెలివితేటలు ప్రదర్శించ వచ్చును. నువ్వు ఎందుకు మానాలి అన్న ఒక్క పదము చాలు నిన్ను అంచనా వేయడానికి. ఎవరినీ తేలికగా తీసుకోవడము అంత మంచిది కాదు, ముఖ్యంగా నీకు. నాది అంతా అయిపోయిన జీవితం. నన్ను అనవసరంగా కెలకాలని చూడకు. నీ పని ఏదో నువ్వు చూసుకో. నీకు చెప్పను. చెప్పాను కానీ వినలేదు. మూర్ఖంగా నాకు సమాధానం. నువ్వు ఏం చేయాలనుకున్నావో చెయ్యి. నేను కూడా ఎక్కడ ఏం చేయాలో ఆలోచిస్తాను. JVRKPRASAD (చర్చ) 05:13, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

Link GA మార్చు

Can you please delete మూస:Link GA too so we finish this task? Thanks, Magioladitis (చర్చ) 20:47, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

Magioladitis, Deleted. Welcome. JVRKPRASAD (చర్చ) 23:52, 19 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఈమిటి ఈ వింత పోకడలు మార్చు

పెద్దలు ప్రసాద్ గారికి నమస్సులు. గత వారం నుండి తెవికీలో సాగుతున్న పలు చర్చలు విపరీత పోకడలకు దారితీసి చివరకు సభ్యులు వ్యక్తిగతంగా తీసుకునేంతవరకు వెళ్ళింది. మీరు చేస్తున్న సూచనలు తెవికీ ప్రగతికి దోహదపడినప్పటికీ, ఎంత చెప్పినా అవతలి వారి పెడచెవిన పెడితే లాభం లేదు కదా. ఎంతమంది చెప్పినా వినని సదరు సభ్యుడు ఈ సూచనలను పరిగణలోకి తీసుకుంటాడన్న నమ్మకం కలగడం లేదు. ఈ విషయంలో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోగలరు. ఆ సభ్యుడికి ఎంత చెప్పినా ప్రయోజనం లేనపుడు మన సూచనలకు అర్థం లేదు కదా. మీ మీద కూడా సంయమనం కోల్పోయి వ్యాఖ్యలు చేస్తున్న సదరు సభ్యుడి చర్యలు చూడలేక ఈ సందేశం రాస్తున్నాను. అన్యదా భావించరని .... --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:15, 21 ఏప్రిల్ 2015 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారు, ముందుగా మీకు ధన్యవాదములు. మీరు పంపిన లేఖ ఉపశమన మిచ్చేది, ఇందులో మీ మనసులోని భావన అర్థమయ్యింది. ముందుగా మీరు ప్రస్తావించారు కాబట్టి, కొద్దిగా నా మనసులోని మాటలు చెబుతున్నాను. ఇంతకుముందు కూడా అనేక సందర్భాలలో సదరు వాడుకరి ప్రవర్తన తీరు, ధోరణి ఇదే మూసలో ఉంది. తిరువిడందై [2] వ్యాసము నందు కూడా మాకు చర్చలు వచ్చాయి. ఉదా: frequency: అనే ఆంగ్ల పదానికి పౌనఃపున్యం అని మూర్ఖ వాదన చేయడము జరిగింది. అది నిజానికి బస్సులకు సంబంధించిన విషయ పట్టిక నందు కాలవ్యవధి అని సూచించాలి అంటే వినలేదు. చివరికి ఎందుకో తిరిగి చర్చ చేయలేదు. ఇంతటితో ఇది వదలి వేద్దాంలేండి. తదుపరి, ఇంక రైల్వే వ్యాసములు గురించిన చర్చలు తనతో జరిగినవి వీలయితే క్షుణ్ణంగా చదవండి. తన ధోరణి ఇంట్లో, ఆఫీసులో, మరెక్కడయినా జీవితంలో సర్దుబాటు ధోరణి అసలు ఉందా అని మనసుకు అనిపిస్తుంది. నేను ఇంతవరకు ఇక్కడకు వచ్చినప్పటి నుండి లేదా ఎక్కడయినా లేదా నిజ జీవితంలో అయినా ఏకవచన ప్రయోగం చేయను. నాకు అలవాటు లేదు. ఎవరితోనూ చర్చలే చేయను. సుదీర్ఘ చర్చలు అస్సలు చేయను. ఎందుకో సదరు వాడుకరి మీద అభిమానం, ఆప్యాయత, ఇత్యాది వన్నీ వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కలిగాయి. తనని ఒక మంచి దారిలో ఉంచాలి లేదా తనకి మంచి దారి చూపాలి అనిపించింది. కానీ ఎందుకో తన మాట తీరు అంతగా బావుండలేదు. అందుకని, నేను ఏకవచనంలో జవాబు ఇస్తుంటే కనీసం మార్పు ఏమైనా వస్తుందేమోనని ఆశించాను. అందుక్కారణం, అకారణంగా మనము పరులను దూషించిన, చెడు పనులు చేసినా, ఇత్యాది వల్ల మనము నమ్ముకున్న ఆ దైవం తప్పకుండా శిక్షించేందుకు అవకాశముంది. ఆ పైవాడు వేసే శిక్ష తగ్గించుటకు, ఈ కారణంతోనే సదరు వాడుకరిని ఏకవచన ప్రయోగము చేసి పాపము కొంత నేను తీసుకున్నాను. లేదంటే నన్ను దూషించినందులకు ఆ అల్లా (దేవుడు) వేసే మొత్తం శిక్ష తను అనుభవించటము నాకిష్టము లేదు. ఆ పైవాడు ఒకసారి శిక్ష వేస్తే అది ఎవరూ తప్పించలేరు. ప్రతి మనిషి వ్యక్తిగత కష్ట, బాధలు తప్పక అనుభవించాల్సిందే. నాకు చిన్నతనము నుండే సంపూర్ణ ఆత్మసంతృప్తితో జీవితాన్ని సాగించడము అలవాటు అయ్యింది. జీవితంలో మన కార్యకలాపములందు (ఆఫీసు, ఇల్లు, సంఘం) ఎన్నో విధములయిన వారివలన వచ్చు సంఘటనలు, చర్యలు అంతగా పట్టించుకోవల్సిన అవసరము లేదు అనే మనస్తత్వం కలిగింది. మీరన్నట్ట్లు మంచి చేద్దమనుకుంటే చెడు ఎదురవుతుంది. నాకు ఏ విషయములోనూ ఎటువంటి బాధ లేదు. చాలా సంతోషముగా ఎల్లప్పుడూ ఉంటాను. అంతా ఆ పైవాడు నన్ను చూసుకుంటున్నాడు. నాకుగా నేను ఏదీ ఆలోచించి జీవితము ఏనాడు సాగదీయ లేదు. అంతా ఆ అల్లా ఏర్పాటు చేసినదే. ఎంతో ఆర్ధికంగా, సామాజికంగా సంతృపికరమైన జీవితం. మీ లాంటి ఎంతో మంది మంచివారి మాటల సహచర్యం. మీ పద పలుకుల పలకరింపులకు చాలా చాలా సంతోషము సుల్తాన్ ఖాదర్ గారు. JVRKPRASAD (చర్చ) 10:48, 21 ఏప్రిల్ 2015 (UTC)Reply
ప్రసాద్ గారూ, ఈ విషయమై చింతించకండి. నాపై కురిసిన తిట్లను ఇక్కడ కూర్చితే ఒక తిట్లదండకమే అవుతుంది. వైజాసత్య సన్నాఫ్ ** అని అంతర్జాలంలో ఎక్కడో తిరుగుతుంది కూడాను. మనం అవతలి వాళ్ళను వ్యక్తిగతంగా విమర్శించనంత వరకు ఇలాంటి వాళ్ళ ఆటకట్టించెయ్యవచ్చు. మనమూ వ్యక్తిగత విమర్శకు దిగినప్పుడు వాళ్ళ బురదలో దిగినట్టే --వైజాసత్య (చర్చ) 10:57, 21 ఏప్రిల్ 2015 (UTC)Reply
వైజాసత్య గారు, అభిమానముతో మీరు పంపిన లేఖ అందినది, అందు విషయములు గ్రహించినాను. నా మనసులోని మాటలు పైన పొందుపరచిన వాటిలో కొంత సమాధానము ఉంది. సంఘంలో నిజమైన ఏ తండ్రికి ఉండదండి బిడ్డ పాడైపోకూడదు బాగుపడాలని ? శ్రమ మిగిలింది, ఫలితం శూన్యం అనేది నాకు పెద్దగా లేదు, ఎన్నో మంచి ఫలితాలే అనేకం పొందాను. ఏనాటికైనా ఇలాంటి బిడ్డలు (మనసు వరుసకు మాత్రమే నండి) తెలుసుకుంటారు లెండి. మన చర్చలు ఎక్కడికి పోవుకదండి ! మీకు మరోమారు అభినందనల సుమల్లెల సుమమాల ఆనందంగా అందుకోండి, వైజాసత్య గారు. JVRKPRASAD (చర్చ) 11:20, 21 ఏప్రిల్ 2015 (UTC)Reply

గ్రామాల పేజీల్లో ఖాళీ విభాగాలు మార్చు

ప్రసాద్ గారూ, నేను ఇప్పుడే గ్రామాల పేజీల్లో బాటుతో ఖాళీ వర్గాలు తీసేసేపని మొదలుపెడతాను. మీరాపని చేయటం ఆపెయ్యండి సార్ --వైజాసత్య (చర్చ) 01:53, 22 ఏప్రిల్ 2015 (UTC)Reply

వైజాసత్య గారు, తప్పకుండా ఇప్పుడే ఆపేస్తాను. JVRKPRASAD (చర్చ) 02:04, 22 ఏప్రిల్ 2015 (UTC)Reply
వైజాసత్య గారూ, అలాగే కొన్ని గ్రామాలలో పిన్‌కోడ్ మరియు ఎస్టీడీ సమాచారం సమాచారపెట్టెలో మరియు విడిగా, రెండు సార్లు ఉన్నది. బాటు ద్వారా దీనిని కూడా తొలగించే అవకాశాని పరిశీలించగలరు--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:39, 22 ఏప్రిల్ 2015 (UTC)Reply

phone no మార్చు

sir, please send your phone no. To my mail address or in this page కె.వెంకటరమణ 02:17, 23 ఏప్రిల్ 2015 (UTC)Reply

కె.వెంకటరమణ గారు నమస్కారము. నా ఫోను నం.9246196226 మరియు నా ఈ-మెయిల్: ezee2299@gmail.com. JVRKPRASAD (చర్చ) 02:22, 23 ఏప్రిల్ 2015 (UTC)Reply

ఆటోవికీ బ్రౌజర్ సహాయము - అక్షర దోషాలు సవరణ మార్చు

ప్రసాద్ గారూ, నమస్కారము. ఉభయకుశలోపరి. ఆటోవికీబ్రౌజరు సహాయంటో ఖాట్మాండు, ఖట్మండు అని ఉన్న వ్యాసాలలో కాఠ్మండు అని సరి చేయగలరా? నాకు దీనిపై అవగాహన లేదు. కావున అడగవలసి వచ్చినది. అన్యదా భావించవలదు. అలాగే మరియొక సందేహము. ఒక పదము ను ఏ ఏ వ్యాసాలలో వాడారో తెలుసుకోవలెనంటే మార్గము ఏమిటి? ఉదాహరనకు కాఠ్మండు అనే పదాన్ని ప్రస్తావించిన వ్యాసాల జాబితా ఎలా చూడగలము? వెతుకు పెట్టెలో కాఠ్మండు అని టైపు చేస్తే , అది సరాసరి వ్యాసానికి దారి తీస్తున్నది. ఈ సౌలభ్యము తెవికీలో ఉన్నచో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:47, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

-సుల్తాన్ ఖాదర్ గారు, నమస్కారములు. మీరు సూచించినట్లు పదాన్ని మార్చుటకు తప్పకుండా ప్రయత్నిస్తాను. వ్యాసాల జాబితా మాత్రము నాకు అంతగా తెలియదండి. JVRKPRASAD (చర్చ) 12:58, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply
మార్పు చేశానండి.JVRKPRASAD (చర్చ) 13:10, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

కాఠ్మండు జాబితా మార్చు

కాఠ్మండు అనే పదము ఈ క్రింద సూచించిన వ్యాసముల జాబితాలో ఉన్నది. ఒకసారి గమనించగలరు.

JVRKPRASAD (చర్చ) 13:13, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

ధన్యవాదములు ప్రసాద్ గారూ...--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 14:28, 30 ఏప్రిల్ 2015 (UTC)Reply

GFDL బొమ్మలు మార్చు

ప్రసాద్ గారూ, అన్ని బొమ్మల్లో GFDL బొమ్మలు అనే వర్గాన్ని ఎందుకు అంటిస్తున్నారు? దస్త్రం:Sakuni poster.jpg చూడండి ఇది కాపీహక్కులున్న బొమ్మ. దీనిని GFDL బొమ్మగా వర్గీకరించకూడదు. --వైజాసత్య (చర్చ) 02:58, 1 మే 2015 (UTC)Reply

వైజాసత్య గారు, అన్ని బొమ్మలు GFDL పెద్ద వర్గంలోకి వస్తాయనుకుని ముందుగా అన్నీ ఒక వర్గంలోకి చేర్చుతున్నాను. తదుపరి చిన్నవర్గాలలోకి విడగొట్టుకోవచ్చును అని అనుకున్నాను. అయితే అన్ని బొమ్మలున్న వర్గం అనే వర్గంలోకి మరోమార్గముగా చేర్చవచ్చునంటారా ? ఒకసారి బొమ్మలు గురించి నాకు అంతగా అవగాహన లేదు. ఒకసారి తెలుసుకుని, నేర్చుకునేంత వరకు ప్రస్తుతం ఈ పని ఇంతటితో ఆపి వీలయితే సరిచేస్తాను. JVRKPRASAD (చర్చ) 03:04, 1 మే 2015 (UTC)Reply
GNU Free Documentation License అనేది ఒక రకమైన ఉచిత లైసెన్సు. మీరు అంటించిన చాలామటుకు బొమ్మలు కాపీహక్కులున్నవి. వాటిని ఉచిత బొమ్మలుగా వర్గీకరించకూడదన్నదే నా ఉద్దేశం. మీరు చెప్పినదాని బట్టి అయితే వికీపీడియా బొమ్మలు అన్న వర్గం సరిపోతుందేమో? --వైజాసత్య (చర్చ) 03:08, 1 మే 2015 (UTC)Reply
ఇన్నాళ్ళూ వర్గం:GFDL బొమ్మలు అంటే వర్గం:వికీపీడియా బొమ్మలు (దీనిలో ఉండేవి ఉచితం అని) అనుకుని తెలియక, వాటి గురించి తెలుసుకోక చాలా భ్రమ పడ్డాను. అయినా ఒకసారి బొమ్మలు గురించిన వ్యాసములు చదువుతాను. ఏదో చెయ్యాలనుకుంటే ఏదో అయ్యిందన్నట్లు ఉన్నది నా పని. ఇంక నుండి సరి అయిన వర్గములోనే చేర్చుతాను. JVRKPRASAD (చర్చ) 03:19, 1 మే 2015 (UTC)Reply
JVRKPRASAD గారికి, బొమ్మలలో లైసెన్స్ మూస ఆధారంగా అవసరమైన వర్గాలు చేరుతాయి. ప్రత్యేకించి వర్గాలు చేర్చనవసరము లేదు. AWB తో మార్పులు చేసేటప్పుడు ప్రతిపాదన చేసి చర్చించి చేయడం మంచిది. --అర్జున (చర్చ) 04:07, 1 మే 2015 (UTC)Reply
అర్జున గారికి, నమస్కారము. బొమ్మలు ఆయా వర్గాలు నందు చేరతాయి అన్నారు. మరి వర్గీకరించని బొమ్మలు [3] ఉన్నాయి కదండి. వాటిని ఆయా వర్గాలలో చేర్చాలి కదండి. AWB తో మార్పులు చేసేటప్పుడు ప్రతిపాదన చేసి, ఆ తదుపరి చర్చించి చివరికి పని చేయడం మంచిది అని మీరు సలహా ఇవ్వడం బాగానే ఉంది. ఇక్కడ పని చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు, పై పెత్తనాలు చేసేవాళ్ళు ఎక్కువయి పోయారు. సరే మీరన్నట్లు, ఎవరికి ప్రతిపాదన పెట్టాలి ? ఎవరితో చర్చించాలి ? ఎవరి ద్వారా పని చేసుకోమని పర్మిషన్ వస్తుంది. అది ఎన్నాళ్ళకి వస్తుంది. నేను అడిగినప్పుడు ఎన్నాళ్ళకి వస్తుంది ? అప్పటికి నాకు ఆ పని చేసే అవకాశము ఉండవచ్చు లేదా లేకపోవచ్చును. అసలు అప్పటికి నాకు ఖాళీ లేకపోవచ్చు. ప్రస్తుతము ఇంతవరకు ఎవరూ ఇటువంటి పర్మిషన్లు తీసుకుని పని చేస్తున్న దాఖాలాలు లేవు. AWB వాడే కంటే బాటు వేస్తే సరిపోతుంది అని సూచన కూడా రావచ్చు. ఒక మంచి పని చేయాలనుకునే వారికి ఇన్ని అడ్డంకులా అనే సమస్యతోటి, అసలు పనే తగ్గించుకుంటే మరీ మంచిది, మరోచోట దేశసేవ చేసుకోవచ్చు అని మనసులో నాటుకు పేరుకు పోతుంది. మీరు సిద్ధాంతం చెపుతారు. మరొకరు పనిలో సులువు తెలిసిన వారు మరొకటి చెబుతారు. ఏ పని చేయని వారు పని చేసేవారి బుర్ర చెడగొడతారు. వాళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయనివ్వరు. ఇంకా చేసిన మంచి పనిని చెడగొట్టుతుంటారు. అటువంటివాళ్ళకి మనవాళ్ళు కూడా వత్తాసు పలకడము. చాలా విచిత్ర పరిస్థితులు వస్తున్నాయి. రానురాను విలువలు దిగజారి పోతున్నాయి. సర్లెండి. ప్రస్తుతము మాత్రము, ఇక్కడ స్థితి, పరిస్థితులను బట్టి, మనము కాస్త ఆలోచించి, వెంట వెంటనే పని అయ్యే మార్గముగా, రూల్స్ చెప్పే అందరూ కూడా అందరికి సలహాలు, సూచనలు, పనులు చెబుతూ ఉంటే బావుంటుంది. నిన్న AWB కాఠ్మండు కి వాడాను. (కాస్త నా చర్చా పేజీలోని పైనే నిన్నటి చర్చ చదవండి) అప్పుడు అడిగి మరీ వాడించుకున్నారు. అప్పుడు ఎవరు ఈ రూల్స్ చెప్పలేదండి. నిన్న చెబితే ఈ రోజు AWB వాడను కదా ! మీ (మన) సముదాయము ముందు సరిఅయిన రూల్స్ తయారు చేయండి. మనిషి కొక సలహాలు ఇవ్వడము అంతగా బావుండ లేదు. JVRKPRASAD (చర్చ) 05:21, 1 మే 2015 (UTC)Reply
JVRKPRASADగారికి, నేను చెప్పిన దానికి కొంచెం సవరణ.AWB తో క్లిష్టమైన అంశాలు సవరించేటప్పుడు చర్చించి చేయటం మంచిది.ఎందుకంటే ఇది బాట్ లాగా ఎక్కువ మార్పులు సులభంగా చేయగలిగేది. అలా చేయటంలో తప్పులు జరిగితే మీ సమయం మరియు ఇతరుల సమయం కూడా వృధాఅయ్యే అవకాశం వున్నది. మీరు ఇచ్చిన లింకుని పరిశీలిస్తే వాటన్నిటికి లైసెన్స్ మూస లేదు.నా స్పందనలో అదే చెప్పాను. సరియైన లైసెన్స్ మూస లేకపోతే ట్వింకిల్ తోనో లేక నేరుగా చర్చాపేజీలలో మూస పెట్టమని హెచ్చరికలు చేర్చాలి. అలా కొంతకాలం తర్వాత పెట్టకపోతే వాటిని తొలగించాలి. మీరు ఎక్కించిన బొమ్మలు ముందు సవరించుకుంటే ఇతరుల బొమ్మలు సవరించడానికి సహాయపడగలుగుతారు. తెవికీలో స్వచ్ఛందంగా చేసే పని మీకు తెలియనిది కాదు. నా సూచన మీకు రుచించకపోతే వదిలివేయండి. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 07:19, 1 మే 2015 (UTC)Reply
అర్జునగారికి, AWB వాడకం గురించి నేను అడిగిన వాటికి పూర్తి సమాధానం మీనుండి పూర్తిగా రాలేదు. నేను చేసిన తప్పులు నేనే దిద్దుతాను అని చెప్పాను. మనిషి మనిషికి సమాధానం చెప్పవలసి వస్తున్నది ప్రతి పని గురించి. ఈ విధానం బావుండ లేదు. ఎవరికి నచ్చక పోయినా ఇక్కడ పని చేయకూడదు అనే ధోరణి కొనసాగుతోంది. ఇప్పుడు ఏ మూస పెట్టాలంటారు ? లేదా బాటు వేస్తారా ? చెప్పగలరు. నాకు AWB పర్మిషన్ ఇవ్వమని, దాని మూసలు చేర్చుతున్నప్పుడు, దానికి సంబంధించిన తెలుగు వికీ మూసలో ఆనేడే పెట్టాను. ఎవరూ ఇంత వరకూ చదవలేదు అని అనుకుంటున్నాను. ప్రదేశం తప్పు కావచ్చునేమో, కానీ స్పందనలు లేవు. మీరు నేను అడిగిన వాటికి సంపూర్ణ సమాధానములు దయచేసి ఇవ్వండి. JVRKPRASAD (చర్చ) 07:32, 1 మే 2015 (UTC)Reply
బొమ్మ లైసెన్స్ లోపాన్ని గమనించాలి. దస్త్రం:Jupiter Barnstar.png లో ట్వింకిల్ లో DI వాడి దానిలో "No License .."అన్నది లేక వేరే సరిపోయిన ఎంపిక చేసుకుంటే బొమ్మ పేజీలో మరియు బొమ్మ ఎక్కించిన వారి పేజీ లో హెచ్చరికలు చేరుతాయి. నేను ఉదాహరణగా దీనికి చేశాను. గమనించండి. మీ బొమ్మలు సరిచేసినతరువాత ఇతరులను తనిఖీ చేయమని కోరండి. ఉదా: నా పాత అభ్యర్ధన చూడండి. దానికి పెద్దగా సహకరించినవారు లేరు . మీరు ఇప్పుడైనా సహాయం చేయవచ్చు.ఆ తరువాత ఇతరులు ఎక్కించిన బొమ్మలకు అలా చేసి నాణ్యతను పెంచడానికి సహాయ పడండి. కొత్త బొమ్మలు ఎక్కించేటప్పుడు WP:FUW వాడితే లైసెన్స్ మూసలు బొమ్మతో పాటే చేరుతాయి. ఒక వాడుకరి చేసిన బొమ్మలన్నిటికీ ఒకే సమస్య వుందని నిర్ధారిస్తేనే , బాట్ తో చేయటం వీలవుతుంది.కావున సాధారణంగా మానవీయంగా చేయటమే మంచిది . ఇవి లోతైన అంశాలు కాబట్టి, ఒకే వ్యాఖ్యలో సంపూర్ణంగా తెలపడం అసాధ్యం. కొంత ఆ దిశగా పని చేస్తుంటే అవగాహన మెరుగవతుంది. మీరు ఇప్పటికే అలా చేస్తున్నందుకు సంతోషం. --అర్జున (చర్చ) 02:57, 2 మే 2015 (UTC)Reply

బొమ్మలు గురించి మార్చు

అర్జున గారు, ఇంతకీ నేను పెట్టిన బొమ్మలు గురించి ఏం చేయాలంటారు ? మీ పదాల రుచి నాకు కొత్తది కాదు కదండి ! అలవాటుంది. ఇలా చేశాను ఈ బొమ్మకి [4], సరిపోతుందంటారా ?JVRKPRASAD (చర్చ) 07:35, 1 మే 2015 (UTC)Reply

భేష్ , ఆంగ్లవికీనుండి తెచ్చిన బొమ్మలకు అక్కడి ఫెయిర్ యూజ్ మూస ని నకలు చేయడం మంచి పద్ధతి. దానిలో వ్యాసం పేరుని తెలుగు వికీలో ఆ బొమ్మ వాడిన వ్యాసం పేరుతో మార్చాలి.. నేను చేసిన సవరణ చూడండి. అలాగే దస్త్రం:Oberoi Hotels Logo.svg.png లో కూడా ,ఇంకా అవసరమైన చోట్ల చేయండి. లైసెన్స్ గురించి ఇప్పటికే కొంత తెలుసుకోటానికి ప్రయత్నిస్తున్నట్లుంది. వాటి వివరాల ప్రకారం మీ బొమ్మలకు తగిన లైసెన్స్ చేర్చండి. --అర్జున (చర్చ) 02:40, 2 మే 2015 (UTC)Reply
అర్జున గారికి నమస్కారము. తప్పకుండా మీ సూచన పాటిస్తాను. ఏ పని అయినా మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా, తెలుసుకున్న పిదప తేలికగా ఉంటుంది. అర్థం అయినవి అన్నీ తప్పులు లేకుండా మాత్రము మార్పులు చేస్తాను. తప్పులున్నవి సరి చేస్తానండి. JVRKPRASAD (చర్చ) 02:45, 2 మే 2015 (UTC)Reply
ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 03:02, 2 మే 2015 (UTC)Reply
అర్జున గారు, బొమ్మలు సక్రమముగా ఉన్నవి జాబితా నుండి తొలగింప బడితే మిగతా వాటి పని చూసుకొనే విధానం ఉంటే తెలియజేయ గలరు. ఏకమొత్తంగా అన్నీ కలిపి ఉన్నవి ఉంటే వేటిని సవరించాలో అర్థం కాకుండా ఉన్నది. JVRKPRASAD (చర్చ) 03:11, 2 మే 2015 (UTC)Reply
ఉదాహరణగా నేను ఎక్కించిన బొమ్మలు తో పోల్చి చూసుకుంటే, మీరు ఎక్కించిన బొమ్మలలో కొన్ని నిలువవరుసలు ఖాళీగా కనిపిస్తాయి. అవన్నీ సరిచేయాల్సినవే. కొత్తగా చేస్తున్నారు కాబట్టి వరుస ప్రకారం చేసుకోవటం మంచిది. అవసరమైన వివరాలు లేనపుడు ఆ ఫైళ్లు సంబంధిత వర్గాలలో చేరుతాయి. ఉదా:వర్గం:Files with no machine-readable license, వాటిలో మీరు ఎక్కించినవి కావాలంటే క్వెరీ రాయాలి.కనుక ప్రస్తుతానికి వరుసపెట్టి అన్ని తనిఖీచేసుకొని తగిన విధంగా సవరించండి.--అర్జున (చర్చ) 04:21, 2 మే 2015 (UTC)Reply
ప్రస్తుతానికి అన్నీ వరస పెట్టి చేస్తున్నాను. మీరు చేసినట్ట్లుగా అయితే చివరి వరుసలో వివరములు చేరుట లేదు. ముందు ఇప్పుడు చేస్తున్న పని ఒకటి పూర్తి చేస్తాను. JVRKPRASAD (చర్చ) 06:16, 2 మే 2015 (UTC)Reply
{{Information}} లేక దానికి సమానమైన తెలుగు మూస చేర్చితే, చివరివరుసలో వివరములు వస్తాయి. ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 06:16, 9 మే 2015 (UTC)Reply

పని తప్పు మార్చు

చేస్తున్న పనిలో తప్పు ఉంటే దానిని ఎత్తి చూపటానికి వరస కట్టి ఒకరు తరువాత ఒకరుగా వచ్చి ఆ పనిని ఆపుచేయిస్తారు. ఆనాటి నుంచి ఇదే ధోరణి కొనసాగుతోంది. ఏ ఒక్కళ్ళు కూడా "మీరు చేస్తున్న పనిలో తప్పు ఉంది, ఇదే పని మీరు కొనసాగించాలనుకుంటే ఈ విధముగా చేయండి" అని సలహాలు, సూచనలు ఉండవు, చేయరు. (మనసులో అనుకోవాలి అంతే) JVRKPRASAD (చర్చ) 10:53, 1 మే 2015 (UTC)Reply

ఈ ధోరణి ఈ మధ్య చాలా ఎక్కువైనది ప్రసాద్ గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:53, 8 మే 2015 (UTC)Reply

File copyright problem with దస్త్రం:Jupiter Barnstar.png మార్చు

 

Thank you for uploading దస్త్రం:Jupiter Barnstar.png. However, it currently is missing information on its copyright and licensing status. Wikipedia takes copyright very seriously. It may be deleted soon, unless we can verify that it has an acceptable license status and a verifiable source. Please add this information by editing the image description page. You may refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads.

If you have any questions, please feel free to ask them at the media copyright questions page. Thanks again for your cooperation. అర్జున (చర్చ) 02:46, 2 మే 2015 (UTC)Reply

రొయ్య సంబంధిత వ్యాసాల విలీనము మార్చు

ప్రసాద్ గారూ రొయ్య జీర్ణ వ్యవస్థ, రొయ్య శ్వాసవ్యవస్థ మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ వ్యాసాలను రొయ్య వ్యాసంలో విలీనము చేయాలని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను రొయ్య చర్చా పేజీలో తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 18:52, 8 మే 2015 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారు, తప్పకుండా తెలియజేస్తాను. రొయ్య జీర్ణ వ్యవస్థ : 860 బైట్లు, రొయ్య శ్వాసవ్యవస్థ : 2.3 కెబి, మరియు రొయ్య ప్రసరణ వ్యవస్థ : 482 బైట్లు తోటి వ్యాసములు ప్రస్తుతము ఉన్నాయి. అసలు రొయ్య : 2.9 కె.బి లతో వ్యాసం ప్రస్తుతము ఉంది. ఈ వ్యాసాలను బాగా అనుభవము ఉన్నవారు అభివృద్ధి చేయాలనుకున్నంత వరకు మీరు సూచించినట్లు రొయ్య ప్రధాన వ్యాసంగా మిగతావి విలీనం చేయవచ్చును నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 00:03, 9 మే 2015 (UTC)Reply
స్పందనకు ధన్యవాదములు ప్రసాద్ గారూ.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:00, 10 మే 2015 (UTC)Reply

A little help to open the page Benedicta Boccoli మార్చు

Namàste, dearest JVRKPRASAD, how are you?

Here Spring is arrived and the flowers have nice colours.

Please, I ask you a little help to open this page in Telugu, she is a wonderful Italian theatre actress. All the pictures was chargaed by me and are free license.

The important to write is:

  • Born in Milan on December 11th, 1966 she moved to Rome with her family as a child. Her sister Brigitta is an actress too.
  • She had her debut in television at a very early age, but few years later, she discovered that working in theater was where she truly belonged as an actress.
  • Some references
  • Her theater perfoming
  • Her Official Web page

I'll be pleased to open a new page for you in Italian or Portuguese. Thanks a lot for your nprecious help, and have a nice week end!

Rei Momo (చర్చ) 09:18, 15 మే 2015 (UTC)Reply

Namàste, dearest JVRKPRASAD, and thank you very much for your precious work. Have a nice week. Rei Momo (చర్చ) 07:46, 18 మే 2015 (UTC)Reply
Namàste, dear Rei Momo, Welcome. JVRKPRASAD (చర్చ) 08:17, 18 మే 2015 (UTC)Reply

Greetings from Calabria and kind translation request for Anna Rita Del Piano in Telugu. మార్చు

Namaste Sir,

I'm writing to say hello and know how you are. Apart from this to ask you if you could translate it into Telugu article about a talented and beautiful actress Italian. In return I translate what you want in Sicilian, Italian, French, Spanish. If I can ask you to translate the article on my home village: Campora San Giovanni, where he lives a beautiful Indian community including language Telugu, Punjabi, Maharati and so on, all operating in the agricultural and construction, are very attached to the community camporese and are giving their valuable contribution to grow to a future migliore.In awaiting your response, I thank you in advance from the heart. thanks a lot. Luigi--Luigi Salvatore Vadacchino (చర్చ) 19:05, 18 మే 2015 (UTC)Reply

Luigi Salvatore Vadacchino , namaskaaramu, (నమస్కారము), Welcome. Please visit Anna Rita Del Piano [5] page in Telugu Wikipedia. My thanks to your favorites. (మీ అభిమానానికి నా కృతజ్ఞతలు ) With Best Wishes. JVRKPRASAD (చర్చ) 08:09, 20 మే 2015 (UTC)Reply

Good morning again, thank you very much for having translated the article, I ask you kindly if you can translate in Telugu also my hometown: Campora San Giovanni, where as I said there are many men and women from the Indian continent and someone telugu language, it would be nice if their relatives would read Campora in the languages of Great India. Another courtesy that I ask is whether it can improve the page that I did do some time ago on a local radio station in southern Italy, but heard by the Calabrian diaspora in the world. Radio Studio 54 Network. I've seen that is very attentive to create items with grace and style, if you want to translate something in Italian, Sicilian, French, Spanish, just let me know and I will provide. In the meantime, thank you in advance heartily waiting for your response. thanks a lot.--Luigi Salvatore Vadacchino (చర్చ) 14:26, 21 మే 2015 (UTC)Reply

మండలాల వర్గాల గురించి సలహా మార్చు

మీరు వర్గం:నల్లబెల్లి మండలంలోని గ్రామాలు అనే వర్గాలను గ్రామాలలో చేర్చుట గమనించాను. చేర్చుతున్నందుకు ధన్యవాదాలు. మీరు సదరు వర్గాన్ని సంబంధిత మూస అయిన {{నల్లబెల్లి మండలంలోని గ్రామాలు}} ను ఎడిట్ చేసి ఆ మూసలో <includeonly>[[వర్గం:నల్లబెల్లి మండలంలోని గ్రామాలు]]</includeonly> అనే ట్యాగును చేర్చినట్లయితే ఆ మూసలో ఉన్న అన్ని గ్రామ వ్యాసాలకు సదరు వర్గం చేరుతుంది కదా. -- కె.వెంకటరమణ 06:30, 21 మే 2015 (UTC)Reply

కె.వెంకటరమణ గారు, మీరు చెప్పింది నిజమే ! మీరు చెప్పిన విషయము ఉన్నదని, తెలిసినా కూడా, అదేమిటో (అనే విషయం ) నాకు గుర్తుకు రావడము లేదు ఎంత ప్రయత్నము చేసినా, ........మీరు తెలియజేసే వరకు. గుర్తు చేశారు చాలా సంతోషం. మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 12:23, 21 మే 2015 (UTC)Reply

స్పందించగలరు మార్చు

ప్రసాద్ గారూ నమస్కారం....కుశలమనే భావిస్తున్నాను.... రచ్చబండలో వికీసోర్సు నుండి పుస్తకాల తొలగింపు అంశంపై మీ అమూల్య స్పందన తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:15, 22 జూలై 2015 (UTC)Reply

వర్గం:ఒడిషా మార్చు

వర్గం:ఒడిషా, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you.  కె.వెంకటరమణ 17:35, 22 జూలై 2015 (UTC)Reply

వర్గం:ఒడిషా పర్యాటక ప్రదేశాలు మార్చు

వర్గం:ఒడిషా పర్యాటక ప్రదేశాలు, which you created, has been nominated for possible deletion, merging, or renaming. If you would like to participate in the discussion, you are invited to add your comments at the category's entry on the Categories for discussion page. Thank you.  కె.వెంకటరమణ 17:36, 22 జూలై 2015 (UTC)Reply

జనాబా లెక్కల మూలాలు తొలగించడము గురించి మార్చు

ప్రసాదు గారూ ......

నేను గ్రామ వ్యాసాలలో జనాబా లెక్కల వారి లింకు (ఆయా జిల్లాలకు విడివిడిగా) చేరుస్తున్నాను. నావద్ద అనేక సంవత్సరాల జిల్లాల వారిగా జనాబా లెక్కలున్నాయి (జనాబా లెక్కల వారివి) వాటిని ఆయా గ్రామాల వ్యాసాలలో చేర్చాలనే ఉద్దేశంతో [గ్రామ జనాబా] అనే ఒక విభాగాన్ని కూడ చేరుస్తున్నాను. నేను చేర్చిన జనాబా లెక్కల వారి లింకు, మరియు [గ్రామ జనాబా] అనే ఉప విభాగమును మీరు తొలిగించి మీరు జనాబా లెక్కల వారి లింకు చేరుస్తున్నట్టుగా నాకనిపిస్తున్నది. నా విన్నపమేమంటే... జనాబా లెక్కలు చేర్చ డానికి [గ్రామ జనాబా] అనే ఉప విభాగము అలాగే వుంచండి. నేను దానిని పూరిస్తాను. ఇప్పటికే కొంత సమాచారాన్ని కొన్ని జిల్లాలలో పూరించాను. జనాబా లెక్కల వారి లింకు విషయమై ..... నేను చేర్చిన లింకులో తప్పుంటే చెప్పండి. దానిని చేర్చడము మానేస్తాను. నేను గమనించిన దాని ప్రకారము ఇద్దరి లింకులు ఒకటే... . కనుక నేను చేర్చిన లింకు తొలగించనవసరము లేదనుకుంటా....../ ధన్యవాదములు. భాస్కరనాయుడు (చర్చ) 13:11, 12 ఆగష్టు 2015 (UTC)

భాస్కరనాయుడు గారు, మీరు సూచించినట్లు జనాభా లెక్కలు పూర్తి చేస్తానంటే అలాగే ఉంచుతాను. అలాగే గ్రామజనాభా అనే పేరు చాలా చోట్ల తప్పులు ఉన్నాయి. అనేక విభాగాలలో కూడా తప్పులు ఉన్నాయి. అందుకని ఒక పద్ధతిగా ఉంటుంది అని ఒక మార్పుతోటి అన్నింటికి ఒకేసారి సరిచేసి తొలగించాను. తదుపరి, మీరు ఈ క్రింద విధముగా పూరించండి. ఇద్దరి సమాచారము ఒకే విధముగా ఉంటుంది. ఉదా:-

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

==గ్రామ జనాభా==
==మూలాలు==
{{:మూస::మూలాలజాబితా}}
{{:మూస::పెందుర్తి మండలంలోని గ్రామాలు}}
వర్గం:విశాఖపట్నం జిల్లా గ్రామాలు

ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 13:37, 12 ఆగష్టు 2015 (UTC)

జన్మదిన శుభాకాంక్షలు మార్చు

ఫెద్దలు జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ గారికి.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దైవాన్ని కోరుకుంటూ ... మిత్రుడు.. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:49, 13 ఆగష్టు 2015 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారు, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 13:18, 13 ఆగష్టు 2015 (UTC)

మీ కృషికి దండాలు మార్చు

మీరు ఆంధ్ర ప్రాంతీయుడైనప్పటికీ తెలంగాణ వ్యాసాల అభివృద్దికి చూపుతున్న చొరవ అభినందనీయం. మీ కృషిని ఇతరులూ ఆదర్శంగా తీసుకోవాలని ఆశిస్తూ... నీలిచంద్రుడు.

నీలిచంద్రుడు గారికి నమస్కారము. మీ అభినందనలకు నా ధన్యవాద ప్రణామములు. మనసున్న మనిషి మానవత్వానికి అవధులు అనేవి అంతు అందని అనంతమైనవి. మీ సుమనసు పలకరింపులు, మరికొంత ముందుకు సాగేందుకు మాలాంటి వారికి ఆక్షయ తూణీరము. దైవకృపతో కృషిని కొనసాగించగలనని ఆశిస్తూ --- JVRKPRASAD (చర్చ) 13:32, 24 ఆగష్టు 2015 (UTC)

1,00,000 దిద్దుబాట్లు మార్చు

  తెవికీలో మొట్టమొదటిగా 1,00,000 పైగా దిద్దుబాట్లు చేసినందుకు తెవికీ తరపున కృతజ్ఞతలు
----

రామకృష్ణ ప్రసాద్ గారూ, మీరు తెవికీలో రైల్వే వ్యాసాలతో పాటు అనేక హిందూ మత వ్యాసాలను చేర్చడమే కాకుండా నిర్వాహకునిగా విశిష్ట సేవలందించారు. స్వచ్ఛవికీలో భాగంగా అనేకమైన దోషాలను సరిదిద్ది తెవికీ దేవాలయాన్ని పరిశుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూలాలు లేక అనాథలుగా ఉన్న కొన్ని వేల వ్యాసాలకు మూలాలను చేర్చి వాటికి జీవం పోసారు.అనేక వ్యాసాలకు లింకులను చేర్చే కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా చేస్తున్నారు. అలుపెరుగక నిరంతర కృషితో మీరు చేసే ఈ కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. తెవికీలో మొట్టమొదటి సారిగా 1,00,000 దిద్దుబాట్లను చేసినందుకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు,


 కె.వెంకటరమణచర్చ 02:17, 14 సెప్టెంబరు 2015 (UTC)Reply
కె.వెంకటరమణ గురువు గారికి, ప్రణామములు మరియు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 02:19, 14 సెప్టెంబరు 2015 (UTC)Reply
అభినందనలు JVRKPRASAD గారు...--Pranayraj1985 (చర్చ) 08:54, 14 సెప్టెంబరు 2015 (UTC)Reply
Pranayraj1985 గారు, ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 15:59, 14 సెప్టెంబరు 2015 (UTC)Reply
JVRKPRASADగారు, హృదయపూర్వక శుభాకాంక్షలు. - శశి (చర్చ) 15:57, 14 సెప్టెంబరు 2015 (UTC)Reply
శశి గారు, ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 15:59, 14 సెప్టెంబరు 2015 (UTC)Reply
శుభాభినందనలు ప్రసాద్ గారూ..... మీ ప్రయత్నం మాకందరికీ స్ఫూర్తిదాయకం --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:00, 19 సెప్టెంబరు 2015 (UTC)Reply
సుల్తాన్ ఖాదర్ గారు, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 07:04, 19 సెప్టెంబరు 2015 (UTC)Reply

ఆంధ్రప్రదేశ్ గ్రామాల వర్గం మార్చు

మండలంలోని గ్రామాల మూసలలో ఈ వర్గాన్ని వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే వర్గాన్ని <includeonly>[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]</includeonly> గా చేర్చితే అన్ని గ్రామాలకు ఒకేసారి ఆ వర్గం చేరుతుంది కదా. -- కె.వెంకటరమణచర్చ 05:38, 22 సెప్టెంబరు 2015 (UTC)Reply

కె.వెంకటరమణగారు, మీ సూచన ప్రకారము తప్పకుండా అలా చేస్తేనే పని తేలికగా ఉంటుంది. కానీ;

(1) గ్రామములలోని మూసలు తీరు ఒకేలా లేదు. (2) గ్రామము వేరొక మండలము మరియు మూస మరొక మండలము (3) ఒకే గ్రామానికి రెండు మండలములు ఉన్నాయి. (4) రిపేరు పని కంటే కొత్తగా పని చేయటము తేలిక. (5) కొన్ని గ్రామాలకు మూసలు కూడా లేవు. (5) అందుకని వర్గాన్ని విడిగా కొద్దిగా చేసి ఆపాను. మీరన్నట్లు ప్రస్తుతానికి, మండలములలో కావల్సిన వర్గాన్ని చేర్చుతాను. మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 07:57, 22 సెప్టెంబరు 2015 (UTC)Reply

Unused images without license మార్చు

Hello, I made a list of images without licensing information (probably unfree) which are also unused. They must be deleted per wmf:Resolution:Licensing policy, unless they have a valid free license. Where can I ask deletion? Nemo bis (చర్చ) 14:31, 2 అక్టోబరు 2015 (UTC)Reply

Nemo bis, Hello, received your message and noted the contents therein. In this connection, it is to advise that I have no sufficient knowledge about this subject issue and also I am not in a position to give any suggestion or guidelines for which you may please contact some other person in this regard. Thanking you, JVRKPRASAD (చర్చ) 14:36, 2 అక్టోబరు 2015 (UTC)Reply

అయ్యా నిరోధించడంఅంటే ఎలాగోనాకు తెలియదు. ఇదేదో టెక్నికల్ గా నాకు అవగాహన లేదు. నేను ఇంతవరకు అవరినీ నిదోధించడం జరగలేదు. అదెలాగో నాకు తెలియద --Nrgullapalli (చర్చ) 01:24, 4 అక్టోబరు 2015 (UTC)Reply

Return to the user page of "JVRKPRASAD/పాత చర్చ 8".