KingDiggi గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

KingDiggi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Signature icon.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   JVRKPRASAD (చర్చ) 01:58, 9 డిసెంబరు 2015 (UTC)ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఈ వారం వ్యాసాలను మెరుగుపరచడానికి తోడ్పడండి

ఉన్నంతలో మంచి వ్యాసాలను "ఈ వారం వ్యాసం"గా ఎన్నిక చేస్తున్నారు. ఇవి తెలుగు వికీ షోకేస్ (అద్దాలలో ప్రదర్శింప బడే) వ్యాసాలు. వీటిని ఇంకా మెరుగు పరిస్తే బాగుంటుంది. ప్రయత్నించండి.

వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


== [1]

సినిమా వ్యాసాల అభివృద్ధికి మంచి ప్రయత్నంసవరించు

కింగ్ డిగ్గీ గారూ,

ఇటీవల మీరు తెలుగు వికీపీడియాలోనూ, ఆంగ్ల వికీపీడియాలోనూ సినిమా వ్యాసాల అభివృద్ధికి మంచి ఆసక్తితో కృషిచేస్తున్నారని నేను గమనించాను. ఈ కృషిని ఆస్వాదించి చేస్తున్నట్టూ, తెవికీపీడియా మీకు నచ్చినట్టూ కూడా మీ రచనల ద్వారా నాకు అర్థమౌతోంది. మీకు తెలుగు వికీపీడియాలో సినిమాల వ్యాసాలు అభివృద్ధి చేయడంలో మేము అన్ని రకాలుగానూ సహకరిస్తాము. తెలుగు సినిమాల పరంగా ప్రణాళికాయుతంగా జరుగుతున్న కృషిలో భాగంగా 2015 ప్రణాళిక సాగుతోంది. అది కాక తెలుగు సినిమా వేదిక కూడా ఉంది. వీటిలో చేరవచ్చూ, చేరకుండానూ మీరు కృషి సాగించవచ్చు. మీకు అవసరమయ్యే సినిమా పాటలు-కథ పుస్తకాలు, ఫోటోలు, మాసపత్రికలు వంటివాటి డిజిటల్ కంటెంట్ కూడా ఉన్నంతలో పంచుకుని వాడుకోవచ్చు. ఇక మీరు హైదరాబాదీ అయితే తెలుగు వికీపీడియా మరియు హైదరాబాదీ ఆంగ్ల వికీపీడియన్ల సంయుక్త మీటప్ డిసెంబర్ 20, 2015న అబిడ్స్ లోని గోల్డెన్ థ్రెషోల్డ్ లో నిర్వహిస్తున్నాము, హాజరయ్యే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ మీకు అన్ని వికీల్లోనూ ఎదురవుతున్న సమస్యలతో సహా చర్చించుకోవచ్చు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:37, 10 డిసెంబరు 2015 (UTC)

మీ ప్రయత్నాలు బావున్నాయి. వికీలో రచనలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీకు ఎప్పుడూ వికీ సభ్యుల సహాయ్ం ఉంటుంది.- మిత్రుడు..--Viswanadh (చర్చ) 05:34, 6 ఫిబ్రవరి 2016 (UTC)

మాడా వెంకటేశ్వరరావు చిత్రపటంసవరించు

వికీలో మాడా చిత్రపటం   ఆల్రేడీ ఉన్నది. మీరు కొత్తగా మాడా వెంకటేశ్వర రావు.jpg ఎక్కించారు. రెండిటిలో ఒకటి చాలని నా అభిప్రాయం.--బ్రహ్మరాక్షసుడు (చర్చ) 08:10, 10 ఫిబ్రవరి 2016 (UTC)

(చర్చ)గారు, వ్యాస విస్తరణ చేసేటప్పుడు ఇంతక ముందు ఉన్న బొమ్మ పనికొస్తుంది. ఇంతక ముందు ఉన్న బొమ్మ ఒక సినిమా సన్నివేశం. ధన్యవాదాలు.
వాడుకరి:KingDiggi గారూ మీ ప్రయత్నం బాగానే ఉంది కానీ తెలుగు వికీపీడియాలో వీలైనంత వరకూ కాపీహక్కుల పరిధిలో లేని ఫోటోలు చేర్చాలన్న అంశం ఉంది. దీని ప్రకారం కాపీహక్కుల పరిధిలో ఉన్న ఫోటోలు ఎక్కించేప్పుడు వ్యాసంలో మరో ఫోటో లేకపోతేనే, ఆ వ్యాసంలో వాడుకోవడానికే, తక్కువ రిజల్యూషన్ తో ఎక్కించాల్సి వుంటుంది. కాబట్టి ఇప్పటికే మాడా వెంకటేశ్వరరావు ఫోటో ఉండడంతో వ్యాసంలో ఫోటో లేకపోతేనే అన్న దానికి ఇది భంగం అవుతుంది. ఒకవేళ మనమే స్వయంగా తీసినవో, కాపీహక్కుల పరిధిలో లేనివో అయితే మరిన్ని ఎక్కించినా (సాధారణంగా వికీమీడియా కామన్స్ లో) ఫర్వాలేదు. --పవన్ సంతోష్ (చర్చ) 13:08, 9 జూన్ 2016 (UTC)

మూలాలుసవరించు

విండోస్ మీద మీరు రాస్తున్న వ్యాసం చూస్తున్నాను. బాగుంది. ఒకవేళ ఆంగ్ల వికీ నుంచి వ్యాసం అనువదిస్తున్నట్లయితే అక్కడి మూలాలు (రెఫరెన్సులను) కూడా యధాతథంగా కాపీ చేయండి. ఉదాహరణకు వ్యాసంలో ఒకచోట విండోస్ అత్యధికంగా వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం అని ఉంది. అది నిజమే కావచ్చు. అందుకు మనం ఆధారం చూపాలి. మూలాలు ఎలా ఇవ్వాలో అనుమానాలుంటే అడగండి. --రవిచంద్ర (చర్చ) 05:55, 9 జూన్ 2016 (UTC)

ధన్యవాదాలు రవిచంద్ర గారు, ఆంగ్ల వ్యాసం చాల పెద్దది. ముందు కుదిరినంత భాగం అనువదించి ఆ తరువాత మూలాలు కూడా ఎక్కిదామని అనుకుంటున్నాను. ఈ వ్యాసానికి మీరు కూడా సహకరించమని విజ్ఞప్తి. KingDiggi (చర్చ) 05:58, 9 జూన్ 2016 (UTC)
అలాగే సహకరిస్తాను. వ్యాసం రాసేటప్పుడే మూలాలు ఇచ్చేస్తే మళ్ళీ మరిచిపోకుండా ఉంటామని నేనలా చేస్తాను. మీరు చివర్లో ఇచ్చినా పరవాలేదు. --రవిచంద్ర (చర్చ) 06:11, 9 జూన్ 2016 (UTC)

ఆరెంజ్ చర్చ పేజీసవరించు

KingDiggi గారూ, నమస్కారం. మీరు ఆరెంజ్ చర్చ పేజీని పూర్తిగా తుడిచేసారు. బహుశా వ్యాసం పేజీలో బొమ్మ, ఆ పాఠ్యమూ పెట్టాంగదా అని మీరు తీసేసి ఉంటారు. కానీ ఆ అవసరం లేదు.

మీకు తెలిసే ఉండొచ్చు, ఐనా గుర్తు చేస్తున్నాను... సాధారణంగా, చర్చ పేజీల్లో రాసిన దానిలో ఇతరులు దిద్దుబాటు చెయ్యరాదు. భాషాదోషాల సవరణలు కూడా చెయ్యరు. చాలా బలమైన కారణమేదైనా ఉంటే తప్ప పేజీని తుడిచెయ్యడం జరగదు. (అసలు ఏ ఏజీనైనా తుడిచెయ్యడం అనేది పెద్ద సంగతి) ఇటువంటి చర్య తీసుకోవడం తప్పనిసరైనపుడు, ముందుగా చర్చించాలి. అలా ఎందుకు చేస్తున్నారో దిద్దుబాటు సారాంశంలో రాస్తే ఉపయోగంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం ఈ పేజీలో చేసినది అంత తీవ్రమైన విషయమేమీ కాకపోవచ్చు. కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇది రాసాను.__చదువరి (చర్చరచనలు) 12:24, 4 నవంబర్ 2016 (UTC)

చేసిన మార్పు ని వెనక్కి తీసుకుంటున్నాను. ఈ విషయాన్నీ గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. KingDiggi (చర్చ) 12:30, 4 నవంబర్ 2016 (UTC)

Nikolai Noskovసవరించు

Namaste dear KingDiggi! Can you translate from English to Telugu article about singer (en:Nikolai Noskov)? If you make this article, i will be grateful!Thank u! --217.66.152.1 17:36, 10 జూలై 2017 (UTC)

సహాయం కావాలిసవరించు

Hi Brother
I'm Naveen From Karnataka, My mother tongue is Kannada still i can speak little bit Telugu, But i hardly know telugu writing. Recently i had Translated Thotadappa English Wikipedia page to Telugu గుబ్బి తోటదప్ప using Google translate. It would be great if you can correct the Grammatical mistakes & Sentences in this article (గుబ్బి తోటదప్ప).
--NaveenNkadalaveni (చర్చ) 12:29, 22 జూలై 2017 (UTC)