వాడుకరి చర్చ:Nrahamthulla/పాత చర్చ 1
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)
నిర్వాహకుల వాండలిజం
మార్చువాడుకరి:వైజాసత్య మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. క్లారా జెట్కిన్ వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట.
- అయ్యా మీ పేరు వెల్లడించరెందుకని?వైజాసత్య అజ్ఞాత సభ్యులు ప్రారంభించిన వ్యాసాలకు అభ్యంతరమేమీ లేదు.సరైన పద్ధతిలో వామపక్ష, నాస్తిక మరియు హేతువాద అంశాలు కూడా పొందుపరచాలి అంటున్నారుకదా?--Nrahamthulla 13:36, 28 డిసెంబర్ 2008 (UTC)
తెలుగులో రాయడం
మార్చురహంతుల్లా గారు, తెలుగులో రాయడం చాలా తేలిక. లేఖిని ఉపయోగించండి --వైఙాసత్య 15:26, 30 అక్టోబర్ 2006 (UTC)
అదనపు సమాచారం
మార్చురహంతుల్లా గారూ, కొన్ని గ్రామ పేజీలలో అదనపు సమాచారాన్ని చేర్చుతున్నారు. బాగానే ఉంది. కానీ ఇది వరకు ఉన్న సమాచారాన్ని తీసెయ్యకుండా జాగ్రత వహించవలెను --వైజాసత్య 15:28, 10 జూన్ 2007 (UTC)
సందేశం
మార్చురహంతుల్లా గారూ, మహమ్మదీయ మతములో నేను పెట్టిన సందేశం చూడండి. దయచేసి వ్యాసానికి తగిన మార్పులు చేయగలరా? ఇది పుస్తక సమీక్షనో లేక వ్యాసమో తెలిస్తే, తరువాత ఏమి చెయ్యవచ్చునో నిర్ణయించవచ్చు. ఏమైనా అనుమానాలుంటే నా చర్చ పేజీ లో అడిగేది --నవీన్ 09:16, 12 జూన్ 2007 (UTC)
ముసేలిమాహ్ గురించి నాకు మొదట పరిచయం చేసింది క్రాంతికార్ గారే. మీరు క్రాంతికార్ గారి పేజిలో కొంత సమాచారం చేర్చారు కానీ అందులో చేర్చాల్సింది ఇంకా చాలా ఉంది. ఇస్లాంని విమర్శిస్తూ క్రాంతికార్ గారు వ్రాసిన పుస్తకం వెనుక కూడా తన చరిత్ర వ్రాసారు కానీ ఆ పుస్తకం ఎక్కడ పెట్టానో నాకు గుర్తు లేదు.
వర్డులో తెలుగు
మార్చురహంతుల్లా గారూ, వికీపీడియా:పనిముట్లు పేజీలో మీరు రాసిన ప్రశ్నను రచ్చబండ పేజీలోకి మార్చాను. దానికి అదే సరైన స్థలం. వికీపీడియా:పనిముట్లు పేజీని తొలగించాను. వికీపీడియాలో తెలుగులో రాయగలగడం, మన సభ్యుడు:వైజాసత్య ఏర్పాటు చేసిన సౌకర్యం. అది వర్డులో లేదు. వర్డులో తెలుగులో రాయాలంటే ఇన్స్క్రిప్టు అనే పద్ధతుంది. ఇలాంటి సందేహాలకు మరింత వివరమైన సమాధానాలు ఈ గూగుల్ గుంపులో దొరుకుతాయి. అక్కడ అడిగి చూడండి. థాంక్స్. __చదువరి (చర్చ • రచనలు) 09:49, 13 జూన్ 2007 (UTC)
- చదువరి గారికి ధన్యవాదాలు.మీ మాటలు - కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష - ఈ మూడిటి కన్న మిన్నయైనది, గౌరవప్రదమైనది, ఆరాధనీయమైనది మరోటి లేదు. తెలుగు జాతిని, తెలుగు భాషను, తెలుగు దేశాన్ని కాపాడుకోవాలనే తలంపుతో మీరు చేస్తున్న తెలుగు సేవ గొప్పది.నా పుస్తకం "తెలుగు అధికార భాష కావాలంటే.."పంపటానికి మీ మైల్ అడ్రస్ దొరకలేదు.
- "ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
- ఎదలోపల మమకారం ఎక్కడికీ పోదు
- ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా
- సొంతఊరు వారు తన అంతరాన వుందురోయ్"
- ఒక ఊరి వాళ్ళను ఒకటిగా కలుపుతున్నారు.సంతోషం.
- రహంతుల్లా గరూ, మీరు రాసిన "తెలుగు అధికార భాష కావాలంటే.." పుస్తకం, అలాగే "ఇంటి భాషంటే" అనే పుస్తకం కూడా చదివాను. త్రివిక్రమ్ గారు నాకవి పంపించారు. మంచి ఆలోచనలు మీవి. __చదువరి (చర్చ • రచనలు) 11:16, 16 జూన్ 2007 (UTC)
- రహంతుల్లాగారు, నేను కూడా మీరు వ్రాసిన రెండు పుస్తకాలు ఇప్పటికే చదివేశాను. మీ అభిప్రాయాలతో పూర్తిగా ఎకీభవిస్తున్నాను. మీరు నాకు, రవి వైజాసత్యకు పంపిన మెయిల్లో మీరు నా ఐ.డి తప్పుగా ఇచ్చారు. రవి దాన్ని నాకు పంపించారు. నేను మీకొక మెయిలు పంపాను, దానిలో నా సరైన ఐ.డి ఉంటుంది. రమణ 13:24, 16 జూన్ 2007 (UTC)
వ్యాసాలలో సంతకం
మార్చురహంతుల్లా గారు, మీరు చేస్తున్న దిద్దుబాట్లు, రాస్తున్న వ్యాసాలు బాగున్నాయి. మీరు రాసిన వ్యాసాలలో సంతకం పెట్టవద్దని విజ్ఞప్తి. సంతకాలు కేవలం చర్చా పేజీల వరకే పరిమితం. ఒక వ్యాసాన్ని అనేకమంది సభ్యులు దిద్దుతూ ఉంటారు. వాళ్లందరూ సంతకాలు చేస్తే వ్యాసంలో సమాచారం తక్కువ సంతకాలు ఎక్కువై చదవడానికి సౌకర్యంగా ఉండదు. మీరు రాసిన సమాచారాన్ని ఏవ్యాసానికా వ్యాసంలో మీరు రాసినట్టు సాఫ్ట్వేరు ఆటోమేటిగ్గా గుర్తుపెట్టుకుంటుంది (కావలంటే ఏదైనా వ్యాసం పైన ఉన్న చరితం నొక్కి చూడండి) --వైజాసత్య 03:41, 16 జూన్ 2007 (UTC)
తెవికీ పాలసీలపై ఒక చర్చ
మార్చువికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 08:37, 29 ఏప్రిల్ 2008 (UTC)
గమనించ గలరు
మార్చురహమతుల్లాగారూ! నమస్కారం. కొంత విరామం తరువాత మళ్ళీ మీరు తెలుగు వికీలో పాల్గొనడం చాలా సంతోషం. మీ కూర్పులలో నేను గమనించిన కొన్ని విషయాలు ఇక్కడ వ్రాస్తున్నాను. మీరు తప్పుగా భావించరని తలుస్తాను.
- మీ వ్యాసాలు అధికంగా మీ భావాలను పంచుకొనే పంథాలోనూ, శైలిలోనూ ఉంటున్నాయి. మీ అభిప్రాయాలు ఉన్నతంగా ఉన్నప్పటికీ అది విజ్ఞాన సర్వస్వం శైలికి అనుగుణంగా ఉండదు. తటస్థ దృక్కోణం పరిశీలక శైలిలో ఉంటే మంచిది. ఉదా: "ఈ కుల వ్యవస్థ ఎందుకు వచ్చిందో దేవుడికే తెలియాలి" - అని వ్రాయడం బదులు "ఈ కుల వ్యవస్థ ఏర్పడడానికి సమర్ధింపదగిన కారణాలు ఏమీ కనపడడం లేదు." అని వ్రాస్తే కొంత మెరుగు. "అని ఫలానావారు ఫలాని చోట అన్నాడు" అని వ్రాస్తే ఇంకా మంచిది.
- మీరు స్వయంగా వ్రాసి ప్రచురించిన వ్యాసాలు 'పిడిఎఫ్' ఫైలులుగా అప్‌లోడ్ చేస్తున్నారు. ముఖ్యంగా "ఇంటిభాషంటే ఎంత చులకనో" వ్యాసం నాకు తెగ నచ్చేసింది. అయితే మీ స్వంత రచనను మీరు అప్‌లోడ్ చేసినపుడు దాని కాపీ హక్కుల సంగతి పేర్కొనవలసి ఉంది. ఈ కృతిని మీరు GFDL లేదా Public Domain క్రింద విడుదల చేస్తున్నారా? లేకపోతే రచయితగా కాపీ హక్కులు మీరే ఉంచుకొంటున్నారా? ఏవైనా నియమాలకు లోబడి ఇతరులు వాడుకోవచ్చునని సమర్పిస్తున్నారా? తెలుపవలసింది.
ఏవైనా సందేహాలుంటే తప్పక నా చర్చాపేజీలో వ్రాయండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:09, 31 మే 2008 (UTC)
కాసుబాబు గారూ నాకు వచ్చిన ఈఆలోచనలు తెలుగుజనం కల్పించినవే కాబట్టి తెలుగు ప్రజలే వాటి హక్కుదారులు.ఈ GFDL లేదా Public Domain నాకేమీ తెలియదు.అందరికోసం విడుదల చేశాను.రచయితగా కాపీ హక్కులు లాంటివేమీ లేవు.ఏ నియమాలకు లోబడకుండా ఇతరులు వాడుకోవచ్చు.తెలుగు రాజ్యం రావాలి.రహంతుల్లా.
విగ్రహారాధన వ్యాసం
మార్చురహమతుల్లా గారూ! విగ్రహారాధన వ్యాసం ఎవరో సృష్టించారు, మీరు తమ అభిప్రాయాలు దాంట్లో వ్రాశారు, నేను ఇవికీ నుండి ఆంగ్లభాగాన్ని కొంచె తీసుకొచ్చి తర్జుమా చేశాను, దానిని కొంచెం తిలకించి, మీ సూచనలనివ్వండి, ఓ విజ్ఞానదాయక వ్యాసంలా తీర్చిదిద్దుదాం. నిసార్ అహ్మద్ 15:41, 31 మే 2008 (UTC)
నిసార్ అహ్మద్ గారూ ఈ వ్యాసం మొదలు పెట్టింది నేనే.ఇస్లాం క్రైస్తవాలు రెంటితో నాకు పరిచయం ఉన్నందున తెలిసిన సవరణలు చేస్తునే ఉన్నాను.తప్పనిసరిగా దీనిని విజ్ఞానదాయక వ్యాసంలా తీర్చిదిద్దుదాం.రహంతుల్లా.
పట్టికల మూలం
మార్చుపట్టికల హెడ్డింగ్ మరియు ఒక ఫాలోయింగ్ లైన్, ను మూలం చేసుకొని "సార్టబుల్ వికీ టేబుల్" తయారు చేయగలమని గ్రహించాను.
# |
అరబ్బీ పేరు | తెలుగు లిప్యాంతరీకరణ |
అంటే అర్ధం |
ఈ పేరున్న ఖురానువాక్యం కనీసం ఒకటి |
---|---|---|---|---|
1 | ar:الرحمن | అర్-రహ్మాన్ | దయాళువు, అమిత దయాశీలుడు | ఫాతిహా:2 |
'{' మరియు '}' (ఫ్లవర్ బ్రాకెట్లు key board లోని 'P' బటన్ కు కుడివైపున గలవు. షిఫ్ట్ బటన్ నొక్కి టైపు చేయవలెను (కేపిటల్ లెటర్ టైపు చేసే లాగా). '{' పట్టిక ను మొదలు పెట్టే స్థానంలోనూ '}' ఆఖరున వుంచవలెనని గ్రహించాను.
! (1 పైన గల exclamatory mark) హెడ్డింగ్ బొద్దు అక్షరాలకొరకు వుపయోగిస్తారని గ్రహించాను. |- వాక్యాల మధ్య లైను కొరకు వుపయోగిస్తారని గ్రహించాను.
సార్టబుల్ పట్టిక కాకుండా, సాదా పట్టిక ఐతే, క్రింది పట్టిక నమూనాను చూడండి
సంఖ్య | సూరా పేరు | తెలుగార్థం | ఆయత్ లు లేదా సూక్తులు | రుకూలు | మక్కీ / మదనీ |
---|---|---|---|---|---|
1 | అల్-ఫాతిహా | పరిచయం/ప్రారంభం | 7 | 1 | మక్కీ |
ధన్యవాదాలు.ఇకమీదట నేనూ ప్రయత్నిస్తాను.
చిన్న వ్యాసాలు
మార్చురహంతుల్లా కేవలం నాలుగైదు పదాలున్న అతిచిన్న వ్యాసాలు పెద్దసంఖ్యలో ఒకేసారి, పెద్ద విషయమేమీ లేకుండా ప్రారంభించవద్దని మనవి. --వైజాసత్య 06:26, 9 జూలై 2008 (UTC)
అవును రహమతుల్లా గారూ! మీరు వ్రాసిన వ్యాసాలను పరిశీలించిన మీదట క్రింది సూచనలను గమనించమని కోరుతున్నాను.
- మీరు ఒక మారు విక్షనరీ చూడ గలరు. నిఘంటువు లాగా పదాలకు అర్ధాలను, వివరణలను ఇవ్వడానికి అది సరైన వేదిక అవుతుంది. మీకు ఉత్సాహం ఉంటే విక్షనరీలో కృషి చేయవచ్చును.
- క్షవరం, వెంట్రుకలు, బోడి వంటి పేర్లతో మీరు మొదలు పెట్టిన పేజీల గురించి - నిస్సందేహంగా ఇవి పూర్తి స్థాయి వ్యాసాలు అవ్వడానికి ఆస్కారం ఉంది. కాదనను. అయితే ఇలా ఒక లైనుతో మొదలు పెట్టిన పేజీలు చాలా చాలా కాలం అలాగే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే తెలుగు వికీలో ఇలాంటివి చాలా పేరుకుపోయాయి. కనుక క్రొత్తగా మొదలు పెట్టిన పేజీలలో కనీసం రెండు పేరాల సమాచారం వ్రాస్తే ఆ వ్యాసానికి కొంత విలువ ఉంటుంది.
- ఇలాంటివి మీరు మాత్రమే వ్రాశారని కాదు. ఈ విమర్శకు మీ రచనలే నాంది కాదు. ఇంతకు ముందే ఇలాంటివి చాలా ఒక లైను వ్యాసాలు ఉన్నాయి. కనుక వాటిని ఇంకా పెంచవద్దని నా మనవి.
- కాసుబాబు గారూ విక్షనరీ ని సూచించినందుకు ధన్యవాదాలు. విక్షనరీ గురించి తెలిసి ఉంటే ఈ పనంతా అక్కడే చేసే వాడిని. అసలు మన తెలుగు పదాల పరిచయమే నా ఉద్దేశం.అయితే బచ్చెన అనే పదంమీద ఓ సామెత తెలుగులో టైపు చెయ్యలేకపోయాను. అది ఇంగ్లీషులోనే టైప్ అవుతోంది కారణం ఏమిటి?--Nrahamthulla 08:18, 9 జూలై 2008 (UTC)
- మీకు చెప్పాను గానీ నేను విక్షనరీలో ఎప్పుడూ పని చేయలేదు. మీ ప్రశ్నకు వేరే ఎవరైనా సమాధానం చెబుతారు. విక్షనరీలో నేరుగా తెలుగు టైపు చేసే సదుపాయం లేదనుకొంటాను. (ఇదివరకు తెలుగు వికీలో కూడా ఉండేది కాదు) మీరు లేఖిని http://lekhini.org వంటి పరికరం వాడి అందులోకి కాపీ చేయవలసి వస్తుంది. "బచ్చెన" అనే పదం నేనూ ఎప్పుడూ వినలేదు. అర్ధం ఏమిటి? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:14, 9 జూలై 2008 (UTC)
- ఒక విలువైన చెక్కనిచ్చేచెట్టుఅయిఉండవచ్చు .కుక్కను కొట్టటానికి బచ్చెన కర్ర కావాలా?అని సామెత. --Nrahamthulla 14:44, 12 జూలై 2008 (UTC)
- బచ్చెనకర్ర అంటే అప్పడాల కర్ర.--Nrahamthulla 11:53, 13 జూలై 2008 (UTC)
మీ గురించిన వ్యాసం
మార్చురహమతుల్లా గారూ!
నూర్ బాషా రహంతుల్లా, Nrahamthulla అనే పేజీలు మీగురించిన పరిచయం అనుకొంటాను. వికీపీడియా నియమాల ప్రకారం సభ్యులు తమగురించిన వ్యాసాలు వ్రాయదగదు. అయితే మీ పరిచయాన్ని మీ సభ్యుని పేజీలో, అనగా సభ్యులు:Nrahamthulla పేజీలో వ్రాయడం స్వాగతించబడుతుంది. కనుక ఇప్పటికి వ్రాసిన కొద్ది సమాచారాన్ని మీ సభ్యుని పేజీలోకి కాపీ చేసి, నూర్ బాషా రహంతుల్లా, Nrahamthulla అనే పేజీలను తొలగిస్తాను. మీరు అన్యధా భావించవలదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:38, 7 సెప్టెంబర్ 2008 (UTC)
- నిజమే.పేజీలు సృష్టించాక తొలగించటం ఎలాగో తెలియలేదు.ఆ విధానం చెప్పండి.--Nrahamthulla 11:06, 8 సెప్టెంబర్ 2008 (UTC)
- వ్యాసం తొలగించడం నిర్వాహకులు మాత్రమే చేయగలరు. తొలగించవలసిన వ్యాసంలో {{తొలగించు|కారణం}} అని మూస వ్రాసి వదిలేయండి. తరువాత నిర్వాహకులెవరైనా దానిని తొలగిస్తారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 06:39, 24 అక్టోబర్ 2008 (UTC)
నార్ల వెంకటేశ్వర రావు వ్యాసం
మార్చుNrahamthulla గారు, చాలా చురుకుగా వికీలో పాలుపంచుకుంటున్నందుకు అభినందనలు. ఒక సూచన - జాబాలి, సీతజోశ్యం.. ఇలా కొద్ది వాక్యాలతో వ్యాసం సృష్టించే బదులు నార్ల వెంకటేశ్వర రావు వ్యాసంలోనే ఆ వాక్యాలను 'నాటకాలు ' అనే విభాగం క్రింద పొందుపరిస్తే పరిపూర్ణంగా ఉంటుంది. --Svrangarao 02:32, 24 అక్టోబర్ 2008 (UTC)
అద్వితీయం
మార్చురహమతుల్లా గారూ, అస్సలాము అలైకుమ్. ఇస్లాం మరియు క్రైస్తవ మతముల పట్ల మీకున్న పరిజ్ఞానం, అవగాహన అద్వితీయమండి. మీ వ్యాసాలను బట్టి మీరు నాస్తికులు గారు, గాని హేతువాది. మీ తర్క విధానము, మీ మధ్యేయ మార్గం నాకు చాలా నచ్చిందండి. మీరు ఇలాగే వ్రాస్తూ వుండాలని కోరుకుంటున్నారు. అందులోనూ మతసంబంధ వ్యాసాలలో వ్రాయండి. రాబోయే తరానికి Matured and comprehensive logic చాలా అవసరం. సోదరుడు. నిసార్ అహ్మద్ 13:37, 9 నవంబర్ 2008 (UTC)
- వలైకుమ్ సలామ్ నిసార్ గారూ,మనిషి ఎక్కువగా రెచ్చిపోయేది మతం విషయాలలోనే.అన్ని మతాలూ శాంతిని బోధిస్తున్నాయి అంటారుగానీ ఆయా మతాల శాంతి ప్రబోధం హింసకు హత్యలకు పాల్పడకుండా ఆపటంలేదు.తుల్జాబాయి చూపిన మానవత్వం ఎందరినో కదిలించినా తెలుగు వికీ నియమాలు ఆమెను వెలుగులోకి రాకుండా అడ్డుకున్నాయి.మరో వేదికను వెతుక్కున్నాను.అయినా రాస్తూనే ఉన్నాగా--Nrahamthulla 18:25, 9 నవంబర్ 2008 (UTC)
- మానవత్వం వెలుగులో రాకుండా అడ్డుకోవటమేమిటీ? ఎవరి మానవత్వాన్ని, వెలుగులో తీసుకురావటానికి, కప్పిపెట్టేయటానికి ఇది వేదిక కాదండి..అలా చేస్తూ పోతే ప్రతి ఒక్కరూ నా గొప్పతనాన్ని చాటండి, నా మానవత్వాన్ని వెలుగులోకి తెండి అంటూ తెవికీనంతా సోత్కర్షలతో నింపివేసేస్తారు. ఈ విషయాన్ని సహృదయంతో అర్ధం చేసుకోగలరు. అయినా అన్ని వార్తాపత్రికల్లో ఆవిడ గురించి వచ్చినట్టుందిగా..తెవికీ అంతకంటే మించి ప్రాచుర్యం ఏమి ఇవ్వగలదు? --వైజాసత్య 07:06, 10 నవంబర్ 2008 (UTC)
- అపార్దం చేసుకోవద్దు.తుల్జాబాయి వెలుగులోకి రాకుండా తెవికీ నియమాలు అడ్డుపడ్డాయి అన్నాను గానీ మానవత్వం వెలుగులో రాకుండా
అనలేదు.నా గురించి నేనే చెప్పుకుంటే అది స్వోత్కర్ష.--Nrahamthulla 15:53, 10 నవంబర్ 2008 (UTC)
- మీ అభిప్రాయాన్ని సదుద్దేశంతో స్వీకరిస్తున్నాను. సోత్కర్ష కాకపోయినా ఈ నోటబిలిటీ నియమాలను సడలిస్తే ప్రతి ఒక్కరూ తమ తాతముత్తాతలు, బంధువుల గురించి వ్రాసుకునే అవకాశముంది. ఉదహారణకి మా తాత గ్రామంలో బాగానే పేరుపొందిన పెద్దమనిషి, దాత మరియు గ్రామానికి మొదటి ప్రెసిడెంటు. అంతమాత్రం ఆయన్ను కీర్తిస్తూ తెవికీలో వ్రాయటం అనవసరం. తెవికీ పరిధి పెద్దదైనా ఒక ప్రమాణమంటూ అంటూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ ప్రమాణాలకు తగని వ్యాసాలు తెవికీలో అస్సలు లేవని కాదు కానీ వాటిని తొలగించే ప్రయత్నం మాత్రం చెయ్యాలి. --వైజాసత్య 16:18, 10 నవంబర్ 2008 (UTC)
- ఫలానా వ్యక్తి బాగా పేరుపొందిన పెద్దమనిషి అనేదానికి,గ్రామానికి మొదటి ప్రెసిడెంటు అనేదానికి తేడా ఉంది.ఒకటి కీర్తించడం రెండోది చరిత్ర. .మా ఊరి చరిత్ర,మా ఊళ్ళోని ప్రముఖుల చరిత్ర అంటూ ఎవరి గ్రామంలోని నోటబుల్ విషయాలు వారే చెప్పుకునే వీలు కలిగేలా నియమాలు సడలించండి. నిసార్ చెప్పినట్లు రాబోయే తరానికి చాలా అవసరం అయిన సంగతులు ఎవరైనా చెబుతారేమో చెప్పనివ్వండి.సోత్కర్ష,తాతముత్తాతల కీర్తి లాంటి అనవసర విషయాలను వడపోయవచ్చు.--Nrahamthulla 16:45, 10 నవంబర్ 2008 (UTC)
తెగలు
మార్చుకొన్ని తెగలు గురించి మీరు వ్యాసాలు తయారుచేస్తున్నారు. చాలా మంచిది. బంజారా వారికి సంబంధించిన బంజారా హిల్స్ గురించి సమాచారం తెలిస్తే రాయండి. అలాగే గోండు ల గురించి ఇంగ్లీషు వికీలో సమగ్రమైన వ్యాసం అలాగే కొన్ని ఇతర తెగల గురించి ఉన్నది. వీలుంటే తెలుగులోకి అనువదించండి.Rajasekhar1961 08:33, 10 నవంబర్ 2008 (UTC)
- సోదరులు Nrahamthulla గారికి కడప ఊరి వెలుపల సిద్దయ్య గారు ఈ పని చేసినట్లు కాలజ్ఞానం గ్రంధంలో ఉంది.నేను దానిలో ఉన్నది ఉన్నట్లు
యధాతదంగా వ్రాస్తున్నాను.ఆగ్రంధం లభ్యమైతే ఆధారాలు దొరకే అవకాశం ఉంది.బహుశా గ్రంధంలో నవాబుల పేర్లు ఉదహరించలేదని అనుకుంతున్నాను. ఇవి వారి సభలలో ఇలాటివి చిన్న సంఘటనలే కాబట్టి చారిత్రక ఆధారాలు లభ్యం కావేమో.గ్రంధం మాత్రమే ప్రమాణికం.--t.sujatha 05:57, 24 నవంబర్ 2008 (UTC)
బురఖా వ్యాసం గురించి
మార్చురహమతుల్లా గారూ, సలామ్, మీరు ప్రారంభించిన బురఖా వ్యాసం, నేను కొంచెం విస్తరించి వికీకరించాను. ఒక సారి వీక్షించి మీ అభిప్రాయాలు తెలుపండి. నిసార్ అహ్మద్ 16:52, 30 నవంబర్ 2008 (UTC) 59.90.160.86 గారూ భారతదేశంలో సెక్యులరిజం పేజీలో మిగతా చర్చ కొనసాగిద్దాం--Nrahamthulla 04:21, 15 డిసెంబర్ 2008 (UTC)
కృతజ్ఞతలు
మార్చురహమతుల్లాగారూ, సలామ్. మీరు నామీద వుంచిన విశ్వాసానికి, చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. నిసార్ అహ్మద్ 05:11, 14 డిసెంబర్ 2008 (UTC)
- చాలా సంతోషం నిసార్.అపవిశ్వాసాల ఖండన అప్రతిహతంగా కొనసాగించండి--Nrahamthulla 05:57, 14 డిసెంబర్ 2008 (UTC)
పింగళి దశరధరామ్
మార్చుపింగళి దశరధరామ్ వ్యాసం ప్రారంభించి ఆయన గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు. చిన్నప్పుడు ఎన్‌కౌంటర్ పత్రికను చూశాను కానీ ఈయన గురించి అసలు తెలియదు. స్వయానా పింగళి వెంకయ్య గారి మనవడు కావటం విశేషం --వైజాసత్య 08:10, 27 డిసెంబర్ 2008 (UTC)
- ఈయన గురించి మీకు అసలు తెలియక పోవటానికి కారణం ఇలా మన వ్యక్తుల గురించి మనమే రాసుకునే వీలు గతంలో లేకపోవటమే.ఆంగ్లేయులు గుర్తించని మన తెలుగు వ్యక్తుల గొప్పతనం మన భాషలో మనమే చెప్పుకుందాము.వీలైతే ఆంగ్లేయులకు మన తెలుగు మేధావులను పరిచయం చేయండి--Nrahamthulla 16:28, 27 డిసెంబర్ 2008 (UTC).
వార్తా పత్రిక వ్యాసాలు
మార్చురహంతుల్లా గారు, మీరు వార్తాపత్రికల నుండి కాపీ చేసిన కొన్ని వ్యాసాలు వార్తాపత్రికల్లో వార్తల్లా కనిపిస్తున్నాయి. అవి తప్పు అని చెప్పడంలేదు కానీ వికీ ప్రమాణాలతో సరితూగడం లేదు అనిపిస్తున్నది. ఉదా: "వడ్డెర్లకు ప్రత్యేకించి ప్రత్యేకంగా వడ్డెర్ల ఫెడరేషన్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. " యథాతథ కాపీ కంటే వీలయినంతవరకు "వికీకరించి" రాస్తే బాగుంటుంది. అలాగే వాక్యాలు, పేరాలు మాత్రమే ఉన్న సంబంధిత అంశాలను ఐక్యం చేసి ఒక వ్యాసంగా తీర్చిదిద్దితే మరింత సరళంగా ఉండగలదు. --Svrangarao 03:22, 28 డిసెంబర్ 2008 (UTC)
- అలాగే.--Nrahamthulla 03:26, 28 డిసెంబర్ 2008 (UTC)
తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు
మార్చుప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:39, 28 డిసెంబర్ 2008 (UTC)
దారి మార్పుకు దారి మార్పు
మార్చుఇన్నయ్య పేజీ సృష్టించి ఎన్.ఇన్నయ్య పేజీకి దారి మార్పు ఇచ్చారు. అలా ఇవ్వరాదు. ఎన్.ఇన్నయ్య అనేది అసలు పేజీ కాదు. దారి మార్పు పేజీకే దారి మార్పు ఇస్తే అసలు వ్యాసం రాదు. కేవలం దారిమార్పు లింకు మాత్రమే వస్తుంది. అలాగే వ్యక్తుల పేర్లకు ముందు డా. చివర గారు లాంటి పదాలు వాడరాదు. అది దారి మార్పు పేజీలైనా సరే. ఇది వరకు నేను తొలిగించినవాటిని మళ్ళీ చేర్చారు. అది తొలిగించబడుతుంది. -- C.Chandra Kanth Rao(చర్చ) 16:32, 28 డిసెంబర్ 2008 (UTC) ఇన్నయ్య ఎన్.ఇన్నయ్య నరిశెట్టి ఇన్నయ్య మూడు పేర్లూ ఒకరివే.దారి మార్పు పేజీకే దారి మార్పు ఇచ్చినా అసలు వ్యాసం వస్తుందనుకున్నాను.సరిచేసినందుకు థాంక్స్.--Nrahamthulla 02:23, 29 డిసెంబర్ 2008 (UTC)
ఒక చిన్న మాట
మార్చుమిమ్మల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలను పట్టించుకోకుండా ముందుకు సాగండి. మీకు మరీ వ్యక్తిగతంగా అనిపిస్తే గనకనే తిరుగు సమాధానమివ్వండి. అనవసరంగా సమయం వృధా చేసుకోకండి. రవిచంద్ర(చర్చ) 09:06, 29 డిసెంబర్ 2008 (UTC)
ఎం.ఎన్.రాయ్
మార్చుఒక తరం తెలుగు వాళ్లను చాలా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఎం.ఎన్.రాయ్ ఒకరు. హేతువాదులు, మానవతావాదుల వ్యాసాలన్నింటికంటే ముందు ఎం.ఎన్.రాయ్ గురించి తెవికీలో వ్రాస్తే బాగుంటుంది --వైజాసత్య 19:27, 29 డిసెంబర్ 2008 (UTC)