వాడుకరి చర్చ:T.sujatha/పాతచర్చలు 2

తాజా వ్యాఖ్య: ధన్యవాదములు టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Palagiri

{{వాడుకరి:T.sujatha|/పాత చర్చల పెట్టె|/పాతతచర్చలు 2}}


/పాతచర్చలు 2]]}}



నిర్వాహకుల వాండలిజం మార్చు

వాడుకరి:వైజాసత్య మాటి మాటికి మూలాలున్న పేజిలతో సహా అనేక వ్యాసాలు తొలిగిస్తోంది. క్లారా జెట్కిన్ వ్యాసం కూడా పొంతన లేని కారణాలు చెప్పి తొలిగించింది. మోడరేటర్లకి నీతి నియమాలు అవసరం లేదన్న మాట.


  • సుజాత గారూ,బ్రహ్మంగారు మహమ్మదీయ భక్తులకు జ్ఞానబోధచేస్తూ వారి వేషధారణ మార్చి కాషాయ దుస్తులు రుద్రాక్షలు తిలకధారణ చేయిస్తూ వచ్చాడు లాంటి విషయాలకు చారిత్రక అధారాలేమిటి?ఆయా నవాబుల పేర్లు పేర్కొనండి.--Nrahamthulla 04:22, 24 నవంబర్ 2008 (UTC)
ఇది నిజంగా అద్భుతమైన వ్యాసం. ఇలాంటి వ్యాసాలను ఎన్నుకొంటున్న మీకు నా అభినందనలు. మీకు తెలిసినదంతా రాయండి. ఏవైనా తేడాలుంటే తరువాత వికీకి అనుగుణంగా సరిదిద్దుకోవచ్చు.--విశ్వనాధ్. 12:33, 24 నవంబర్ 2008 (UTC)

తెలుగు వికీపీడియాకు మారుపేరు వైజాసత్య గారు మార్చు

ప్రారంభం నుంచి తెలుగు వికీపీడియాకు అహర్నిషలు కృషిచేసిన వైజాసత్య గారి పైన కొందరు పిచ్చిపట్టిన అనామక వ్యక్తులు విమర్శలు చేయడం భాధ కలుగుతుంది. ఇది లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేనేలేదు. తెలుగు వికీపీడియన్ల సంపూర్ణ మద్దతు అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వైజాసత్య గారికి ఉంటుంది. వైజాసత్య గారు ఏది చేసిననూ అది తెవికీ అభివృద్ధికేనన్న మాట సంపూర్ణ తెలుగు సమాజానికి తెలుసు. తెలుగు వీపీడియాపై విమర్శలు చేసిన పిచ్చి వ్యక్తికి ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ఇక ఈ విజ్ఞానసర్వస్వం లోకి రానేకూడదు. అతను చేసిన అన్ని రచనలకు ఇక తొలిగించడమే తరువాయి. దీనికి చర్చ కూడా అనవసరం. తెలుగు వికీపీడియాకు వ్యతిరేకంగా నీచవ్యాఖ్యలు చేసిన అతడి రచనలను మనం మాత్రం ఎందుకుంచాలి. సభ్యులందరూ దీన్ని గమనించగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 09:18, 28 డిసెంబర్ 2008 (UTC)


సుజాతగారూ, పై వ్యాసములో మీరు చేసిన కృషి బాగుంది. పుష్కరాలకు, కుంభ మేళాకు అట్టే తేడా లేదేమోనని నా అనుమానము. en:Kumbh Mela చూడండి ఉదాహరణగా. మీకు తేడా తెలిస్తే గనక పై వ్యాసములో పేర్కొనగలరు. --Gurubrahma 17:03, 31 డిసెంబర్ 2008 (UTC)


ముబారక్ హో మార్చు

సుజాతగారూ నమస్తే, కాసుబాబు గారు రెండవ తెలుగు పతకం బహూకరణ శుభసందర్భంలో శుభాకాంక్షలు. మొదటి తెలుగు పతకమూ మీ సభ్యుని పేజీలో అలంకరించవలసినదిగా కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 11:08, 8 జూలై 2009 (UTC)Reply

సుజాత గారు ఎంతో ఓపికగా వ్యాసాలలో సమగ్ర సమాచారం సమకూరుస్తున్నారు(ముఖ్యంగా పురాణాల వ్యాసాలలో) . నేను చిన్న వ్యాసాల విస్తరణ విస్తృతంగా చేపట్టడం, ఆమెను ఆదర్శంగా తీసుకుని చేస్తున్న పనే. అందరూ ఇలా చేస్తే తెవికీలో నాణ్యమైన వ్యాసాలు అధిక సంఖ్యలో తయారవుతాయి. --రవిచంద్ర 11:25, 8 జూలై 2009 (UTC)Reply
  • రవిచంద్ర గారికి, నిస్సార్ గారికి ముఖ్యంగా పతకం అందించిన కాసుబాబు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.అలాగే నాకు ప్రోత్సాహమిచ్చి సహకరిస్తున్న మిగిలిన సభ్యులందరికి ధన్యవాదాలు. మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.--t.sujatha 13:40, 8 జూలై 2009 (UTC)Reply




ఓసారి పరికించండి మార్చు

సుజాతగారూ నమస్తే, హిందువులపై అకృత్యాలు వ్యాసంలో, వర్గీకరణలు చేస్తూ, అందులోని వర్గాలు హిందూ మతము, ఇస్లాం మతము మరియు క్రైస్తవ మతము తీసివేసి, చరిత్ర వర్గం చేర్చాను. అందుకు సదరు సభ్యులు, ఆవ్యాసపు చర్చాపేజీలో చేసిన వ్యాఖ్యలు గమనించండి. ఇందులో గుట్టు చప్పుడు ఏమిటి? అతని వ్యాఖ్యలు ఎంతవరకు సబబో చెప్పాలని కోరుచున్నాను. అహ్మద్ నిసార్ 17:02, 9 జూలై 2009 (UTC)Reply

అర్జున ధన్యవాదాలు మార్చు

నా నిర్వాహక అభ్యర్ధిత్వానికి మద్ధతు ప్రకటించినందుకు ధన్యవాదాలు. అర్జున 03:41, 7 మే 2010 (UTC)Reply


ఒమోగావికీ మార్చు

ఫౌండేషన్ లిస్టులో ఒమోగావికీ బహుళ భాషల పదకోశం,ప్రస్తుత విక్షనరీలపై ప్రభావం పై చర్చ జరుగుతున్నది.మీరు చందాదారుడవ్వండి, లేక నాకు ఇ-మెయిల్ తెలియచేస్తే, వివరాలు పంపుతాను.--అర్జున 06:02, 21 జూలై 2010 (UTC)Reply

మీ యొక్క కృతజ్ఞతకి నాయెక్క ధన్యవాదాలు,....--జయంత్ కుమార్ 05:16, 5 ఆగష్టు 2010 (UTC)

తెవికీ వార్త వ్యాసము తుది మెరుగులు మార్చు

మీ తెలుగు విక్షనరీ అభివృద్ధి ని మెరుగు పరచి (వ్యాస చర్చా పేజీ చూడండి) నాకు తెలియచేయండి.ధన్యవాదాలు--అర్జున 04:04, 19 సెప్టెంబర్ 2010 (UTC)

మీ వ్యాసము ముద్రణకి తయారుగా వుంది. వ్యాసము మెరుగుకి, నాకున్న జ్ఞానాన్ని వాడి దిద్దాను. చివరిసారి మార్పులు ఏవైనా వుంటే చేయండి. సాయంత్రము దీనిని విడుదల చేద్దామనుకుంటున్నాను.--అర్జున 04:56, 23 సెప్టెంబర్ 2010 (UTC)
మీ వ్యాసం విడుదలైంది. అభివందనలు. --అర్జున 06:10, 24 సెప్టెంబర్ 2010 (UTC)


గమనించ గలరు మార్చు

  • సుజాత గారూ! ఒక వ్యాసంలో ఒకే పేరు అనేకమార్లు లింకులతో ఇవ్వవద్దు. ఉదాహరణకు "అర్జునుడు" అనే పేరు మొదటిసారి వచ్చినపుడు నీలి లింకుగా "అర్జునుడు" అని వ్రాయండి. తరువాత ఎన్నిమార్లు వచ్చినాగాని "అర్జునుడు" అని (లింకు లేకుండా) వ్రాయండి. --కాసుబాబు 11:37, 21 సెప్టెంబర్ 2010 (UTC)
  • మీ సూచన గమనించాను కాసు బాబుగారూ. --t.sujatha 13:21, 21 సెప్టెంబర్ 2010 (UTC)

మహాభారత వ్యాసాలు మార్చు

వికీపీడియా_చర్చ:WikiProject/హిందూమతం వ్యాఖ్యనిగమనించండి. -- అర్జున 06:12, 24 సెప్టెంబర్ 2010 (UTC)


సంస్కృత పదాలు మార్చు

ఇది వ్యాసము కాదు. ఇలాటివి వీకీలో చోటు చేసుకుంటే వికీపీడియా విలువ తక్కువగా అంచనా వేస్తారని నా అభిప్రాయము. మిగిలిన సభ్యులు ఈ విషయములో తమ అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తున్నాను.--t.sujatha 19:34, 2 జూన్ 2011 (UTC)

  • ఇలాంటి సంస్కృత పదాలకు సంబంధించిన పేజీల గురించి మీ అభ్యంతరాలు వివరంగా తెలియజేయండి. ఇంగ్లీషు వికీపీడియాలో ఈ వర్గం చూడండి. Category:Sanskrit words and phrases. ఇలాగే తెలుగు భాషలోని చాలా పదాలకు సంస్కృత పదాలు మూలం. ఇలాంటి పదాలకు వ్యాసాలు తయారుచేయాలని నా ఆలోచన. దీనికోసం మీ అందరి అభిప్రాయాలు తెలియజేస్తే అదే విధంగా వాటిని అభివృద్ధి చేస్తాను.Rajasekhar1961 10:36, 3 జూన్ 2011 (UTC)Reply


గూగుల్ అనువాద వ్యాసాల సంస్కరణ-తెవికీ వార్త వ్యాసం మార్చు

మీగూగుల్ అనువాద వ్యాసాల సంస్కరణ చాలా బాగుంది.ఈ పనిలో చిట్కాలు తెవికీ వార్తతో త్వరలో పంచుకోమని కోరుతున్నాను. మీ వ్యాసం మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా వుంటుంది.

--అర్జున 06:19, 13 జూలై 2011 (UTC)Reply

మీ వ్యాసం మొదలెట్టారనుకుంటాను. ఎప్పటిలోగా పూర్తిచేయగలరో తెలుపగలరు. అర్జున 04:27, 16 సెప్టెంబర్ 2011 (UTC)

మహాభారతము మార్చు

సుజాత గారు మీరు పొందుపరుస్తున్న మహాభారతం చాలా బాగంది. మిగిలిన భాగాలు కూడా పొందుపరచగలరు. మహాబారతం పుస్తక రూపంలొ లబి0చగలదా ? దయచేసి వివరాలు నా ఈమెయిల్ కు పంపగలరు.


nalla.praveenkumar@gmail.com

ప్రవీణ్ కుమార్ గారూ మీ అభినందనలకు ధన్యవాదాలు. మహాభారతము పుస్తక రూపంలో సంపూర్ణంగా ఎలా లభిస్తుందో నాకూ అవగాహన లేదు. బహుశా తిరుపతి తిరుమల దేవస్థానంలో కొన్ని భాగాలుగా లభిస్తాయని అనుకుంటున్నాను. మిగిలిన భాగాలను కూడా పొందుపరచాలన్నదే నా భావన. ప్రస్తుతము నేను ఇంటికి దూరముగా ఉన్నందువలన కొన్ని మాసములు వీకీలో చురుకుగా పాల్గొనలేక పోతున్నాను. మిగిలిన భాగాలను కూడా తప్పక పొందుపరుస్తాను. కాని కొంత సమయము పట్టవచ్చు. --t.sujatha 19:52, 2 జూన్ 2011 (UTC)


సుజాత గారూ! నమస్కారం. ఈ మధ్య కాలంలో నా ఇతర పనుల కారణంగా వికీపీడియాలో ఎక్కువగా పని చేయలేక పోతున్నాను. మీ మహాభారతం రచన దాదాపు పూర్తి అయినట్లున్నది. ఇంతటి బృహత్కార్యాన్ని సాధించినందుకు అభినందనలు మరియు ధన్యవాదములు. సమయం చూచుకొని మీ వ్యాసాలను కొంత క్రమబద్ధీకరిస్తాను. ఇకపోతే తెలుగులో మహాభారతం పెక్కు విధాలుగా లభిస్తున్నది. తి.తి.దే. వారు 18 పర్వాలను 15 సంపుటాలుగా కవిత్రయం పద్యాలు, మరియు తాత్పర్య వ్యాఖ్య సహితంగా ముద్రించారు. ఇది కేవలం 2 వేల రూపాయలే. గొల్లపూడి వీరాస్వామి సన్స్ వారి ఒక ప్రచురణ సరళ వచనంతో క్లుప్తంగా ఉన్నది. ఇక మీరు వ్రాసిన వికీ పీడియా మహాభారతం కూడా చెప్పుకోదగిన కృషి. మీ వ్యాసాలను పరిష్కరించి (అచ్చుతప్పులు వగైరాలను సరి చేసి) వాటిని ఒక పిడిఎఫ్ ఫైలుగా చేస్తే చదువరులకు ఉపయోగంగా ఉంటుందనుకొంటున్నాను. --కాసుబాబు 17:03, 11 సెప్టెంబర్ 2011 (UTC)


Invite to WikiConference India 2011 మార్చు

 


Hi T.sujatha,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.


But the activities start now with the 100 day long WikiOutreach.


Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)



As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.


We look forward to see you at Mumbai on 18-20 November 2011

అనువాద వ్యాసాలు వ్యాస సృష్టి మార్చు

మీ వ్యాసాన్ని తెవికీవార్తలో ప్రచురించదలిచారు కాబట్టి, ప్రస్తుతానికి మీ వాడుకరి పేజీ ఉపవ్యాసంగా మార్చమని కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా ప్రాజెక్టు లోకి మార్చి విస్తరించవచ్చు -అర్జున 12:09, 26 సెప్టెంబర్ 2011 (UTC)


మహాభారతం గురించి మార్చు

సుజాత గారూ! నమస్కారం. మీరు మహాభారతంలో సవరణలు అవీ చేస్తున్నారు గదా? ఈ ప్రయత్నంలో కొన్ని విషయాలు గమనించండి.

  1. ప్రతి వ్యాసంలోనూ కనీసం ఒకటైనా (నీలిరంగు) లింకు ఉండాలి. లేకుంటే దానిని వికీపీడియా వ్యాసంగా పరిగణించదు. ముఖ్యమైన పేర్లకు (ఉదా: కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు వంటివి) ప్రతి వ్యాసంలోనూ ఒక్కొక్క లింకు ఉండేలా చూడండి. ఒకటికంటే ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు.
  1. ప్రస్తుతం ఉన్న ఆశ్వాసాల సంఖ్య కవిత్రయం భారతంలో ఉన్న విధంగానే ఉన్నాయా? లేక మీరు సౌలభ్యం కోసం చేశారా? ఒక క్రొత్త మూస చేయడం కోసం ఈ విషయం అడుగుతున్నాను.
  1. ప్రతిపర్వంలోనూ మొదటి అశ్వాసానికి పర్వం పేరే ఉంది (ఉదా: ఆది పర్వము). మిగిలినవాటికి అశ్వాసాల సూచికలున్నాయి. (ఉదా: ఆదిపర్వము ద్వితీయాశ్వాసము). ఏకీకృత విధానం కొఱకు ప్రస్తుత ఆది పర్వము అనే వ్యాసాన్ని ఆదిపర్వము ప్రథమాశ్వాసము అనే పేరుకు తరలించాలి. మరియు ఆది పర్వము అనే క్రొత్త వ్యాసంలో అన్ని అశ్వాసాలకు లింకులు ఇవ్వాలి. మీ అభిప్రాయం చెప్పండి. మీకు సమ్మతమైతే ఈ పని నేను ప్రారంభిస్తాను.


--కాసుబాబు 15:26, 26 సెప్టెంబర్ 2011 (UTC)

  • మహాభారతం విషయములో మీరు చుపిస్తున్న ఆసక్తికి ధన్యవాదాలు. అత్యంత చురుకైన అనుభవమున్న తెవీకి సభ్యులైన మీ అభిప్రాయాలు అత్యంత విలువైనవి. వ్యాసాలలో నీలి రంగు లింకులు ఇస్తాను. అవి తక్కువగా ఉండెలా చుస్తాను.
  • ప్రస్తుతం ఉన్న అశ్వాసాలు కవిత్రయంలో ఉన్నవే కనుక వాటిలో మార్పులు అవసరం లేదు. ఇది సౌలభ్యం కొరకు చేసినది కాదు. కనుక కొత్త మూసతో పని లేదు.
  • మొదటి అశ్వాసానికి పర్వము పేరే ఉంది. కనుక దానిని మార్చి ముసలో కూడా తగిన మార్పులు చేయాలి. ఇది నేను చెస్తాను. అయ్య రవాలకు ప్రత్యేక వ్యాసం అవసర మనుకుంటే ప్రధమాశ్వాసాలకు కొత్త పేజీ సృష్టించి విషయాలను అందులోకి మార్చ వచ్చు. అప్పుడు అయా పర్వాలకు మాత్రం ప్రత్యేక పేజీలు ఉంటుంది కనుక వాటిని అభివృద్ధి చెయాలి. అవి పద్దెనిమిది ఉంటాయి. ఆసక్తి కలిగిన సభ్యులు ఆ పనిని చేపట్ట వచ్చు. ఈ పని నెను చేయగలను.
  • వ్యాసాలలో ఉన్న హెడ్డింగ్స్ మాత్రమే నెను సౌలభ్యం కొరకు చేసాను. పాఠకులు తమకు ఆసక్తి కలిగిన భాగాలను ప్రత్యేకంగా చదవడానికి వీలు కలగడనికి అలా వ్రాసాను.
  • కాసుబాబు గారూ ఈ పనులకు నా అనుమతి అవసరం లేదు. మీ భాగస్వామ్యం ఈ వ్యాసాలను మరింత మెరుగు పరుస్తుంది.
  • కాసుబాబుగారూ సమాధానాలు సరి చూసుకోవడనికి వీలుగా ఉంటుందని నా చర్చా పెజీ లోనే సమాధానం ఇచ్చాను.
  • --t.sujatha 16:31, 26 సెప్టెంబర్ 2011 (UTC)


"ప్రతి వ్యాసంలోనూ ఒక్కొక్క లింకు ఉండేలా చూడండి. ఒకటికంటే ఎక్కువ ఉండడం కూడా మంచిది కాదు." - అని నేను వ్రాసినది స్పష్టంగా లేదనుకొంటాను. పేజీలో ఎన్ని లింకులైనా ఉండవచ్చును. కాని అవి వేరు వేరు పదాలై ఉండాలి. నా ఉద్దేశం కృష్ణుడు అనే లింకు ఒక పేజీలో ఒకసారి కంటే ఎక్కువగా రిపీట్ కాకూడదు.--కాసుబాబు 19:10, 26 సెప్టెంబర్ 2011 (UTC)
  • మీరు చెప్పినది స్పష్టముగానే ఉంది. ఒక్కొ పాత్రకు ఒక్క లింకు ఉంటే చాలని అనుకున్నాను.--t.sujatha 04:09, 27 సెప్టెంబర్ 2011 (UTC)



సుజాతగారూ! మరికొన్ని సందేహాలు.


  • ప్రస్తుతం {{మహాభారతం పర్వాలు}} (ఇటీవల నేను చేసింది, పేజీల పైభాగంలో ఉంచడానికి వీలుగా), {{మహాభారతం}} (ఇదివరకునుండి మనం వాడింది. పేజీల దిగువ భాగంలో ఉండేది) అనే రెండు మూసలున్నాయి. ఇందులో "మహాభారతం పర్వాలు" అనే మూసలో ఆశ్వాసాల పట్టీ ఉన్నది గనుక "మహాభారతం" అనే మూసలోంచి దిగువ భాగమైన ఆశ్వాసాలను తొలగించాలనుకొంటున్నాను. మీ అభిప్రాయం ఏమిటి?
  • "ఆది పర్వము", "ఆది పర్వము" (మధ్యలో స్పేస్ ఉంది)- ఈ రెండింటిలో ఏది సరైన విధానం? మనం ఏదైనా ఒక విధానాన్ని ఏకీకృతం చేద్దాము. నాకు తెలిసినంతవరకు "సభాపర్వము" అనేది సరైన విధానం. ("సభా పర్వము" అనేది తప్పు). ఎందుకంటే "సభా" అని దీర్ఘం ఉన్నది గనుక సమాసంలో రెండు పదాలు కలిసి ఉండాలి ("రామారావు" లాగా). కాని ఈ విధానాన్ని "అనుశాసనిక పర్వము" లేదా "అనుశాసనికపర్వము" లలో ఎలా అన్వయించాలో నాకు తెలియడంలేదు. మీరు కొంచెం పరిశోధించగలరా?

--కాసుబాబు 09:04, 30 సెప్టెంబర్ 2011 (UTC)

  • కాసుబాబుగారూ !
  • మీరు చేసిన మూస{{మహాభారతం పర్వాలు}} బాగుంది. అన్ని అశ్వాసాలను చదవడానికి ఈ మూస బాగా ఉన్నది కనుక దిగువభాగములో ఉన్న " {{మహాభారతం}} " మహాభారత అశ్వాసాల పట్టీ ఇక అవసరము లేదు కనుక దానిని ఇక తొలగించ వచ్చు.
  • ఇక ఆది పర్వము అని స్పీసు ఉన్న పీర్లను తీసి స్పీసు లేకుండా ఆదిపర్వము ఉంచితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సభా పర్వము సరి కాదు సభాపర్వము సరి అయిన పదము మీరి అనుకున్నది సరి అయినదే. సభాపర్వము అనేది సంధి పదము. సభ+పర్వము = సభాపర్వము ఇది సవర్ణదీర్ఘ సంధి. సభ అనే పదము లోని చివరి అక్షరమైన భ లో ఉండే అ కారము పర్వము అనే పదము లోని ప లో ఉన్న అ కలసినప్పుడు ఇలా భ లో ఉండే అ కారము భా లో ఆ కారముగా మారుతుంది. కనుక రెండు పదములు కలసినప్పుడు ఇలాంటి మార్పిడి చేయడం చంధోబద్ధంగా సరి అయినది. ఈ సూత్రం అనుశాసనిక పర్వానికి వర్తిస్తుంది కనుక అనుశాసనికాపర్వము చంధోబద్ధంగా సరి అయిన పదము. నాకు తెలిసినంత వరకు సమాసము అంటే రెండు సమాన పదములు కలియిక జరగాలి ఉదాహరణగా, అన్నదమ్ములు, తల్లితండ్రులు, పూలూపండ్లు, కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, ఇరుగుపొరుగు ఇలాంటివి సమాసాలు. నేను చేసిన వివరణలో సందేహాలు ఉంటే తిరిగి అడగండి నాకు తెలిసిన వరకు తెలియజేస్తాను.--t.sujatha 16:18, 30 సెప్టెంబర్ 2011 (UTC)
  • కాసుబాబుగారూ 1
  • ఆలోచించి చూస్తే సభాపర్వము ఒక్కటే దీర్ఘముతో ఉంది కాని మిగిలినవాటికి దీర్ఘం పొసగదని అనిపిస్తుంది. --t.sujatha 02:17, 1 అక్టోబర్ 2011 (UTC)



సుజాత గారూ! మహాభారతంలో నేను భీష్మ పర్వమును అమర్చిన విధానాన్ని ఒకమారు పరిశీలించగలరు. ఈ పద్ధతిలో ప్రతి పర్వానికి ఒకో పేజీ, మరియు అందులో ఆశ్వాసాలకు ఒకో పేజీ ఉంటాయి. ఆ పర్వానికి సంబంధీంచిన ఆధ్యాత్మిక, సాహిత్య విశేషాలను పర్వము పేజీలో వ్రాయవచ్చును. మరియు కధా సంగ్రహాన్ని ఆశ్వాసాల పేజీలో వ్రాఐవచ్చును. ఈ పద్ధతి ఓకే అని మీరు భావిస్తే ఆ దిశలో పని మొదలు పెడతాను. --కాసుబాబు 16:37, 2 అక్టోబర్ 2011 (UTC)
కాసుబాబుగారూ నేను కూడా మీరు అనుకున్నట్లే అనుకున్నాను. పర్వానికి సంబంధింన విశేషాలు అనేకము ఉన్నాయి కనుక వ్యాసాన్ని సులువుగానే వ్రాయ వచ్చు. అలాగే చేస్తాము. భీష్మపర్వములో ఒక భాగము మూసలో లేదని సరిదిద్దే సమయంలో గమనించాను. నేను దానిని మూసలో చేరుస్తాను.--t.sujatha 17:00, 2 అక్టోబర్ 2011 (UTC)


Images for Mahabharatam మార్చు

Madam I upload some images for your Mahabharatam project. Please add them to your projects. Here is the link..


Images for Mahabharata

--Sridhar1000 15:33, 12 అక్టోబర్ 2011 (UTC)

శ్రీధర్ గారు, మీరు చేర్చిన బొమ్మల నకలుహక్కులు వికీపీడియా విధానలకు సరిపడిలేవు. అవి త్వరలో తొలగించబడతాయి. మీరు వికీ విధానాలగురించి మరింత తెల్సుకొని మీ కృషి కొనసాగించండి. -- అర్జున 07:17, 13 అక్టోబర్ 2011 (UTC)
అర్జునరావుగారూ వీకీ నిబంధనలకు అనుగుణంగా లేవనిభావిస్తే వాటిని తొలగించండి.--t.sujatha 07:24, 13 అక్టోబర్ 2011 (UTC)

విన్నపం మార్చు

మీ మెయిల్ చూచి వెంటనే స్పందించండి అర్జున 16:01, 13 నవంబర్ 2011 (UTC)


మాటామంతీ మార్చు

సుజాత గారూ, మీ మాటమంతీ పేజీని మీ వాడుకపి పేజీ క్రిందికి తరలించాను. గమనించండి. ఇదీ కొత్త లంకె: వాడుకరి:T.sujatha/మాటామంతీ. — వీవెన్ 03:40, 24 నవంబర్ 2011 (UTC)

నేను అక్షరదోషాలు, ఇతర సవరింపులు చేశాను. వ్యాసం బాగుంది. -- అర్జున 17:13, 27 నవంబర్ 2011 (UTC)
అర్జునరావుగారు ! అక్షరదోషాలు సవరించినందుకు, మీ ప్రశంశకు ధన్యవాదాలు. --t.sujatha 03:06, 28 నవంబర్ 2011 (UTC)
తెవికీవార్త విడుదలైంది. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున 07:30, 9 డిసెంబర్ 2011 (UTC)
ఇందులో నా సహకారం ఎంతండి. మీ కృషి చెప్పుకోతగినది.t.sujatha 08:12, 9 డిసెంబర్ 2011 (UTC)
మాటామంతీలో వాడిన మీ ఫోటో లైసెన్స్ ని ఆ పేజీలో చెప్పినట్లుగా నవీకరించండి.అవసరమైన వర్గాలను చేర్చి, తొలగింపుకు సూచించే వర్గాలను తొలగించండి. లేకపోతే తొలగించబడుతుందట. -- అర్జున 05:43, 10 డిసెంబర్ 2011 (UTC)
అర్జునరావుగారూ ! గమనించాను కొత్త లైసెన్స్ చేర్చాను. అది సరిపోతుందేమో చూడండి. సూచించినందుకు ధన్యవాదాలు t.sujatha 06:01, 10 డిసెంబర్ 2011 (UTC)
సరిపోవాలి. నేను హెచ్చరికను తొలగించాను.-- అర్జున 07:11, 10 డిసెంబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్ ప్రయత్నం మార్చు

మీరు వెబ్ ఛాట్ వాడటాన్ని ప్రయత్నించవచ్చు. నేను సాధ్యమైనంతవరకు కంప్యూటర్ వాడేటప్పుడు, వెబ్ ఛాట్ లో #wikipedia-te లో వుంటాను. -- అర్జున 15:35, 19 డిసెంబర్ 2011 (UTC)

మీరు వెబ్ ఛాట్ లో తెలుగు నేరుగా టైప్ చెయ్యడంలో కృతార్థులయ్యారా? --అర్జున 07:03, 23 డిసెంబర్ 2011 (UTC)
తెలుగులో టైపు చేయగలుగుతున్నను. అర్జునరావుగారూ మీరు చూపిస్తున్న శ్రద్ధకు కృతజ్ఞతలు. t.sujatha 12:21, 23 డిసెంబర్ 2011 (UTC)
మంచిది, సాధ్యమైనంతమందిని ఆధునిక ఉపకరణాలు వాడటం మొదలుపెట్టటానికి సహాయం చేస్తే తెవికీ గురించి చింత తగ్గించుకోవచ్చనే వుద్దేశం మండి. --అర్జున 04:47, 24 డిసెంబర్ 2011 (UTC)

షిజూ ఆలోచనల అనువాదం మార్చు

తెలుగు అనువాదం బాగుంది. మీ కృషి శ్లాఘనీయం. -- అర్జున 05:01, 24 డిసెంబర్ 2011 (UTC)
షిజూ అలెక్స్ గారి ఆలోచనలు బాగున్నాయి. ఇవి మనందరికీ చాక్కగా ఉపకరిస్తాయని నా అభిప్రాయం. అవి సభ్యులందకీ అందరికీ చేరడానికి ఇలా అనువదించాను.t.sujatha 05:07, 24 డిసెంబర్ 2011 (UTC)

Thank you Sujatha for translating my message to Telugu here. I noticed it just now. Thanks for the helping hand.--Shiju 10:27, 23 డిసెంబర్ 2011 (UTC)

సభ్యపేజీలో మార్పులు మార్చు

మీ సభ్యపేజీలో స్వతంత్రించి మార్పులు చేశాను. మీకు నచ్చకపోతే మన్నించాలి. --అర్జున 15:08, 30 డిసెంబర్ 2011 (UTC)

అర్జునరావుగారూ నా పేజీలో హర్షించతగిన మార్పులు చేసినందుకు కృతజ్ఞతలు.t.sujatha 13:49, 1 జనవరి 2012 (UTC)Reply

నిర్వాహకహోదా గురించి మార్చు

సుజాతాగారు, తెవికీలో ప్రస్తుతం ఉన్న నిర్వాహకుల కొరత దృష్ట్యా మీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు నిర్వాహకహోదాకై నేను ప్రతిపాదించదలిచాను. మీరు కేవలం సభ్యురాలిగా కాకుండా నిర్వాహకురాలిగా కుడా తెవికీ సేవలందించడం పై మీ అభిప్రాయం చెప్పండి. మీరు సరేనంటే నేను ప్రతిపాదించి మద్దతు ఇస్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:17, 1 జనవరి 2012 (UTC)Reply

చంద్రకాంతరావుగారూ నా పట్ల మీ అందరి అభిప్రాయం తెలియనిది కాదు. మీ అందరి సహకారంతోనే నేనీ పని కొనసాగించగలుగుతున్నాను. నిర్వాహకత్వంవహించాలన్నది మీ అభిప్రాయం అయితే అలాగే చేస్తాను. ఇంతకాలం మీరంతా నిర్వహణ చక్కగా చేస్తున్నారనే నేనా విషయంపై ఆలోచించలేదు. మీ సూచనకు ధన్యవాదాలు.t.sujatha 14:45, 1 జనవరి 2012 (UTC)Reply
చంద్రకాంతరావు గారు. మీది చక్కటి ఆలోచన. సుజాత గారు, మీ సమ్మతి హర్షనీయం. --అర్జున 15:24, 1 జనవరి 2012 (UTC)Reply
అర్జునరావుగారూ మీ అభిమానానికి ధన్యవాదాలు. ఇలా మీ అందరి అభిమానం పొదగలగడం నా అదృష్టం.t.sujatha 15:32, 1 జనవరి 2012 (UTC)Reply
సుజాత గారు, మీపేరును నిర్వాహక హోదాకై ప్రతిపాదించాను ఇక్కడ మీ వివరణ వ్రాసి సంతకం చేసి అదే సమయాన్ని ఆపైన సరిచేయండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:59, 1 జనవరి 2012 (UTC)Reply

జిల్లాల వ్యాసాల అభివృద్ధి మార్చు

సుజాత గారు జిల్లాల వ్యాసాలు అభివృద్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు. 80 శాతం వీక్షణులు భారతదేశం నుండే కావున ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ విషయాలు అందునా ప్రతీ సంవత్సర పుస్తకము లో వుండే విషయాలు మన తెవికీలో అభివృద్ధి చేయటం చాలా ముఖ్యం. --అర్జున 08:52, 6 జనవరి 2012 (UTC)Reply

అర్జునరావుగారూ ! మీరుచెప్పిన మాట వాస్తవమే. వీక్షణలు అధికంగా భారతదేశం ఉంటాయి కనుక భారతదేశం గురించి అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి అభివృద్ధి చేయడం సబబే అయినా తెలుగువాళ్ళు తెలుగులో అంతర్జాతీయ విషయాలు తెలుసుకోవడమూ అవసరమే. అంతర్జాతీయ విషయాలు కుతూహలం కలిగిస్తాయి. కనుక అన్ని విషయాలు కలిసేలా అభివృద్ధి చేస్తూ ఉంటాము. జాతీయవిషయాలు ప్రాజెక్టులుగా అభివృద్ధిచేస్తాము. అంతర్జాతీయ విషయాలు ఆసక్తిని అనుసరించి సభ్యులు ఎన్నుకుని చేస్తుంటారు.t.sujatha 14:14, 6 జనవరి 2012 (UTC)Reply

వెబ్ ఛాట్ లో వుండడం మార్చు

మీరు కంప్యూటర్ లో పనిచేసేటప్పుడు వెబ్ ఛాట్ లో లాగిన్ అయివుండగలరా. ఎవరైనా సంభాషించాలంటే వీలుగా వుంటుంది. ప్రస్తుతం ప్రయత్నించగలరా. నేను రాజశేఖర్ ఈ విషయమై చర్చించి వీలైనంతవరుక ఛాట్ లో వుందామని నిశ్చయించాను. వీలైతో పదినిముషాలలో ఛాట్ లో కలవండి. --అర్జున 16:42, 10 జనవరి 2012 (UTC)Reply

అర్జునరావుగారూ ! మీరుచెప్పినట్లు లాగి ఔతాను. నాకు అలా ఉండాలని ఉంది. అలా ఉండడం ఉపకరిస్తుందని అనుకుంటున్నాను.़़़़

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణం వాడుక మార్చు

మీరు వెబ్ ఛాట్ లో మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణబుక్ మార్క్లెట్ ద్వారా వాడితే CTRL+M తో ఇంగ్లీషు, తెలుగు మధ్య మారవచ్చు అవసరమైనప్పుడు. వికీపీడియా లోని అప్రమేయ ఉపకరణంలో Esc కీ లాగా. అది వాడి మీ అనుభవాన్ని అంటే (వికీమీడియాలోని అప్రమేయ ఉపకరణంతో పోల్చి) తెలపండి. --అర్జున 12:31, 11 జనవరి 2012 (UTC)Reply


మూస:ఖాతా మార్చు

సుజాత గారు మీకు ఒక చిన్న అభ్యర్థన ఇకపై మీరు మూస:ఖాతా ‎ను వాడే విధానాన్ని మార్చి {{subst:ఖాతా}} గా వ్రాయమని కోరుచున్నను, ఈ మూస(ఖాతా) ఇకపై నాలుగు టిల్డెలతో (~~~~) సంతకం చెయ్యవలసిన అవసరం లేదు, ఆటో సైన్ చేసే విదంగా మార్చను ధన్యవాదాలు. రమేష్ రామయ్య చర్చ 20:11, 12 జనవరి 2012 (UTC)Reply

అలాగే మీసూచనను అనుసరించి చేస్తాను.t.sujatha 02:31, 13 జనవరి 2012 (UTC)Reply
ధన్యవాదాలు సుజాత గారూ. సమయాభావము వలన తరచుగా రాయలేకపోతున్నాను. నాకిష్టమైన వ్యాపకాలలో వికీలో రాయడం ఒకటి. విశ్వనాధ్.బి.కె. 13:41, 19 జనవరి 2012 (UTC)Reply

సుజాత గారూ మీకు మెయిల్ ఐడి ఉందా? నాకు ఇస్తారా ఏడ్ చేసుకుంటాను. విశ్వనాధ్.బి.కె. 14:37, 19 జనవరి 2012 (UTC)Reply

కొత్త సభ్యులకు ఆహ్వానం మార్చు

సుజాతా గారు, మీరు కొత్త సభ్యులను ఆహ్వానించడానికి {{subst:స్వాగతం|సభ్యుడు=T.sujatha}} మూసను ఉపయోగించండి. కేవలం {{స్వాగతం}} మూసను మాత్రమే ఉపయోగిస్తే సంతకం, తేది రాకపోవడమే కాకుండా ఆ మూసను మార్చినప్పుడల్లా ఆ మూస ఉన్న పేజీలలో సమాచారం కూడా మారుతుంది. అలా మారకుండా ఉండాలంటే subst తప్పనిసరి. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:42, 27 జనవరి 2012 (UTC)Reply


మీరు చేర్చిన బొమ్మలు మార్చు

బొమ్మలు చేరుస్తున్నందులకు ధన్యవాదాలు. మీ స్వంతంగా తీసినవైతే కామన్స్ లో చేర్చితే అన్ని ప్రాజెక్టులకు వాడటానికి అనుకూలంగా వుంటాయి.ఇప్పటికే తెవికీలో చేర్చినవాటిని నకలుహక్కులు సరిపోతే కామన్స్ లోకి తరలించమని కోరిక. గమనించగలరు. --అర్జున 17:10, 8 ఫిబ్రవరి 2012 (UTC)Reply

బొమ్మల స్థానం మార్చు

వ్యాస ప్రారంభంలో బొమ్మలు ఎడమవైపు పెడితే ఎబ్బెట్టుగా వుంటున్నాయ.‌ (ఉదా: http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%96%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%A8%E0%B0%82&oldid=689547 )విషయసూచిక ప్రక్కకు జరుగుతుంది. సాధ్యమైనంతవరకి కుడివైపే వుండనివ్వండి.--అర్జున 13:12, 10 ఫిబ్రవరి 2012 (UTC)Reply

అర్జునరావు గారూ ! వ్యాసం మధ్యలో ఏర్పడుతున్న ఖాళీని తగ్గించడానికి అలా మార్చాను. అది బాగుండదని మీరు భావిస్తే ఇక మార్చను.t.sujatha 13:15, 11 ఫిబ్రవరి 2012 (UTC)Reply


మీరు ఉపయోగించే శీర్షిక (http://wikimania2012.wikimedia.org/wiki/User:T.sujatha) మార్చు

సాధారణంగా మీరు ఉపయోగించే శీర్షిక (http://wikimania2012.wikimedia.org/wiki/User:T.sujatha) మీరు ప్రస్తావించిన


అంశాలకు సంబంధించినదిగా వుండాలి.


కాని మీరు ప్రస్తావిస్తావించిన అంశానికి శీర్షికగా మీ పేరు పెట్టడం సాంప్రదాయం కాదు.



దయచేసి ప్రస్తావించిన విషయాలకు సరి అయిన శీర్షిక ఉపయోగించండి


మీకు సుభకాంక్షలతో Hindustanilanguage 09:29, 24 ఫిబ్రవరి 2012 (UTC)Reply


Article requests మార్చు

Hi! Do you do article requests in Telugu?

Thanks WhisperToMe (చర్చ) 22:47, 3 ఏప్రిల్ 2012 (UTC)Reply

Ok. The request is en:Peel District School Board - I would like a Telegu version of it. There is even a Telegu website at http://www.peelschools.org/telugu/home/ which should have info to help you write the article - Thanks WhisperToMe (చర్చ) 15:10, 4 ఏప్రిల్ 2012 (UTC)Reply
Start an article at Peel District School Board or at a Telugu transcription of the title - Write about it in Telugu. Add the external link for the Telugu website. Link to the other language versions - That is what I would like. Thanks WhisperToMe (చర్చ) 18:27, 4 ఏప్రిల్ 2012 (UTC)Reply

Thank you so much for starting it! WhisperToMe (చర్చ) 07:32, 5 ఏప్రిల్ 2012 (UTC)Reply

నిర్వాహక సూచనలు మార్చు

సుజాత గారు, IP నంబర్లకు ఎకౌంటు తీసుకోమని సూచనలు ఇస్తున్నారు. ఫలితం ఎంతవరకు వుంది? దానికంటె పనిచేస్తున్న వారికి గుర్తింపులు ప్రోత్సాహకరంగా వుండగలవు. అలాగే మొదటిపేజీ నిర్వాహకత్వంలో ఉదా: ఈ వారం బొమ్మ లాంటివాటిగురించి ఆలోచించండి.--అర్జున (చర్చ) 13:10, 7 ఏప్రిల్ 2012 (UTC)Reply

అర్జునరావుగారూ ! వికీపీడియాలో IP నంబరుతో మాత్రమే వ్రాయడం సరి అయిన పద్ధతి కాదు. వారికి గుర్తింపు ఉండదు వారిని ప్రోత్సహించడానికి వీలు కాదు. నా పనిలో అది ఒక భాగమేకాని ఈ మద్యకాలంలో వ్యాసాలు కూడా వ్రాస్తున్నాను. గుర్తించారని అనుకుంటాను. ఏ సభ్యులైనా ఉపయోగకరమైన విషయం కాని వ్యాసం కాని వ్రాసినప్పుడు కూడా స్పందన వ్రాస్తున్నను. అది వారికి ప్రోత్సాహంగా ఉంటుందని అలా వ్రాస్తుంటాను. అలాగే ఈ వారం బొమ్మ వంటివి చేయాలంటే చేస్తాను. కాని ఏమి చేయాలో మీరు సూచించండి. నాకు వీలైనంత చేస్తాను. మీరిలా సూచించి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు .t.sujatha 03:46, 8 ఏప్రిల్ 2012 (UTC)
వ్యాసాలు రాయటం, సభ్యుల పేజీలలో కూడా స్పందన ఇస్తున్నారు గమనించాను. IP చిరునామాకి వివరణలు, మీ సమయాన్ని సరిగా వినియోగించకపోవటం అని నేను భావిస్తాను. జిల్లాల ప్రాజెక్టును ఒక స్థాయికి తీసుకురావాల్సిన పని ఇంకా వుంది. మీరు సమీక్ష చేసి సలహాలు పంచుకుంటే బాగుంటుంది. అలాగే ఒకరు చెప్పినట్లు కాకుండా, మీకు తెవికీ అవగాహన చాలా వుంది కాబట్టి మీరు కొత్త ఆలోచనలు పంచుకుంటే బాగుంటుంది.--అర్జున (చర్చ) 06:16, 8 ఏప్రిల్ 2012 (UTC)Reply



విజ్ఞప్తి మార్చు

సుజాత గారు నేను వికీపీడియా నిర్వాహక హోదాకు అప్లై చేశాను. దయచేసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరు. దీనికి లింకు వికీపీడియా:నిర్వాహక_హోదా_కొరకు_విజ్ఞప్తి/sridhar1000 --Sridhar1000 (చర్చ) 14:21, 12 ఏప్రిల్ 2012 (UTC)Reply

ద్వారపూడి(మండపేట) మార్చు

ద్వారపూడి(మండపేట)వ్యాసాన్ని ప్రశంసిస్తూ అభినందించినందుకు ధన్యవాదంRama krishna reddy.P 08:12, 14 ఏప్రిల్ 2012 (UTC)

ఈ వారపు బొమ్మ మార్చు

విక్షనరీలో మీరు ఈ వారపు బొమ్మ మూస విషయము గురించి చూడగలరు అని ఆశిస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 14:11, 14 మే 2012 (UTC)Reply

అలాగే చూస్తాను.--t.sujatha (చర్చ) 14:14, 14 మే 2012 (UTC)Reply

తెవికీ నుండి పుస్తకాల రచన మార్చు

మీరు తెవికీ వ్యాసాలలో 5000 పైగా మార్పులు చేశారు. మీ కృషి అభివందనీయం. మీరు రాసిన వ్యాసాలు వర్గీకరణ మెరుగుపరచి,మీకు ఆసక్తి గల విషయాలపై తెలుగు వికీ సమాచారంతో పుస్తకాలు వెలువరించవచ్చు. ఆ దిశగా కృషిచేయమనికోరుతున్నాను--అర్జున (చర్చ) 08:17, 22 మే 2012 (UTC)Reply

అర్జునరావుగారూ ! మీ అభినందనలకు ధన్యవాదాలు. నాకు దేశాలు,నగరాలు, పర్యాటక ప్రదేశాలు వాటి చరిత్ర వంటి విషయాలంటే ఆసక్తి అధికం వాటిని మెరుగు పరిచే దిశగా కృషి చేయాలని అనుకుంటున్నాను. పుస్తకాల విషయం మీతో సంప్రదించి చేయాలి. ఆ విషయం ఇంకా నాకు సరి అయిన అవగాహన లేదు.--t.sujatha (చర్చ) 14:23, 23 మే 2012 (UTC)Reply
ఒక ఆసక్తిగల విషయం తీసుకొని ఆ వర్గంలో వ్యాసాల నాణ్యతను పెంచండి. హాట్‌కేట్ కూడా వాడవచ్చు. కలెక్షన్ పొడిగింత స్థాపనకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతము వికీపీడియా:రచ్చబండ_(ప్రతిపాదనలు) లో సభ్యుల అభిప్రాయాలు కోరడమైనది. అక్కడ స్పందించండి. ఆ తరువాత వికీలో వ్యాసాలు ఎంచుకొని, వాటిని లిబ్రెఆఫీసులో కి తెచ్చుకొని పుస్తకము చేయవచ్చు.--అర్జున (చర్చ) 16:38, 23 మే 2012 (UTC)Reply

అనుమతి మార్చు

సుజాతగారు నా బ్లాగ్ నుండి మీకు అవసరమైన డేటాను మరియు ఫోటోలను తీస్కుని వికీపీడియా లో చేర్చండి . నాకు ఏటువంటి అభ్యంతరము లేదు . నాకు సమయం దొరికినప్పుడు నేను కూడా వికీపీడియా లో మార్పులు చేయడానికి ప్రయత్నిస్తాను . --వాడుకరి:Rajachandra


Wikimania2012 మార్చు

Hello there, will you be attending Wikimania2012? If so, please let me know. I too will be there from Jul9th till 16th. Thanks. You can catch me at English Wiki w:user:Viswaprabha Viswaprabha (చర్చ) 23:20, 1 జూలై 2012 (UTC)Reply

విక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది మార్చు

సుజాత గారు విక్షనరీ నందు నా నిర్వాహక తాత్కాలిక హోదా రద్దు అయినది. అందువలన నా హోదా కాలము పొడిగింపునకు [1]విజ్ఞప్తి చేసి ఉన్నాను. దయచేసి మీ అభిప్రాయాన్ని అక్కడ తెలుపగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:36, 9 ఆగష్టు 2012 (UTC)


స్వాగతం మార్చు

వికీకి తిరిగి స్వాగతం. ఏమైనా విహారయాత్రలు చేశారు. విశేషాలను పంచుకోండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 03:56, 2 సెప్టెంబర్ 2012 (UTC)

    • రాజశేఖర్ గారూ ! గుర్తింపుకు ధన్యవాదాలు. యాత్రకు వెళ్ళ లేదు. మా అత్తగారు కాలం చేసారు అందుకే 16 రోజులు వరకు ఇంట్లో లేను. రాజసేఖర్ గారూ ! ఈ లింకు చూడండి. [2] ఇక్కడ పంచద్వారకా యాత్ర గురించిన వివరాలు వ్రాసాను. --t.sujatha (చర్చ) 15:23, 2 సెప్టెంబర్ 2012 (UTC)


Another article request మార్చు

Hi! I found that en:Badruka College is a business college in Hyderabad, but it does not yet have an article in Telugu. Would you be interested in starting this article?

Thanks

WhisperToMe (చర్చ) 03:22, 24 సెప్టెంబర్ 2012 (UTC)


I found some more:

It may be helpful to have the articles on Hyderabad food in Telugu

WhisperToMe (చర్చ) 02:46, 17 అక్టోబర్ 2012 (UTC)

2012 లోమీ కృషికి అభివందనలు మార్చు

 , --అర్జున (చర్చ) 07:00, 15 జనవరి 2013 (UTC)Reply

బాద్యత మార్చు

తెవికీ అభివృద్ధికి రచ్చబఁడ లోని చర్చలు ఎంతో దోహదపడతాయనే విషయం మీకు తెలియనిది కాదు. నిర్వహణాధికారిగా మీరు స్పందించ వలసిన అవసరం ఉంది. కొత్త సభ్యులకు దిశానిర్ధేశం చేయవలసిన మీరు చర్చల పట్ల ఉదాసినంగా ఉండటం మాకు బాథ కలిగిస్తుందిః దయచేసి రచ్చబండలో "ఏకవాక్య వ్యాసాలు" కు మీస్పందనను తెలియజేయండి.(Rojarani (చర్చ) 04:17, 25 జనవరి 2013 (UTC))Reply


ధన్యవాదములు మార్చు

ప్రియమైన సహోదరి సుజాత గార్కి నమస్కారములు,

మీ వంటి వారు అందిస్తున్న ఆదరాభిమానాలకు, సోదర సభ్యులకు అందిస్తున్న ఉత్సాహానికి, ప్రేరణకు ధన్యవాదములు.తెవికీలో నాకు తెలిసిన అంశాల్ని చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను.( కె.వి.రమణ- చర్చ 15:35, 25 జనవరి 2013 (UTC))Reply


శ్రీ సూజాత గార్కి,

నమస్కారము,నేనుకావించిన చిన్నపాటి రచనలకు పెద్దమనస్సుతో అభినందించినందుకు ధన్యవాదాలుపాలగిరి (చర్చ) 07:35, 30 జనవరి 2013 (UTC)Reply

Return to the user page of "T.sujatha/పాతచర్చలు 2".