Vinfnr
స్వాగతం
మార్చుVinfnr గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. లేదా నా చర్చ పేజిలో నన్ను అడగండి.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సాయీ(చర్చ) 09:59, 13 మార్చి 2008 (UTC)
వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
గ్రామాల ఛరిత్ర చేర్చుట గురించి
మార్చుమీరు అప్లోడ్ చేసిన ఈ బొమ్మ చాలా బాగుంది. కాని బొమ్మ గురించి గాని, లైసెన్సు గురించి గాని ఏమీ వివరాలు ఇవ్వలేదు. దయ చేసి వివరాలు ఇవ్వండి. అలాగే ఇది ఏ వూరు, ఏ గుడి లోనిది కూడా తెలుపండి --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:03, 4 మే 2008 (UTC)
Image:Venugopala svamy.jpg లైసెన్సు వివరాలు
మార్చుVinfnrగారు, మీరు అప్లోడు చేసిన, Image:Venugopala svamy.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.
మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.
ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.
- ఉపయోగకరమైన లింకులు
- బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి — బొమ్మలు వాడే విధానం — బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి — లైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.
ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి.
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
- కొన్ని గ్రామాల చరిత్ర సేకరించాను.ఆ వివరాలను ఆయా గ్రామాల పేజీలలొ చేరుస్తున్నను.అభ్యంతరం ఏమీ లేదుగా ?
- అబ్యంతరం లేదు. అలా ఆయాగ్రామాల పేజీలలో చరిత్ర వివరాలను చేరుస్తున్నప్పుడు, మీరు ఆ చరిత్ర వివరాలను ఎక్కడి నుండి సేకరించారో కూడా తెలుపండి. ఇక నుండీ చర్చ పేజీలలో రాసేటప్పుడూ మీ వ్యాఖ్య చివరన నాలుగు టిల్డేలు (~~~~) చేర్చి మీ సంతకాన్ని పెట్టండి. అప్పుడు భవిష్యత్తులో ఏ వ్యాఖ్య ఎవరు చేసారో స్పష్టంగా తెలుస్తుంది. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 12:01, 17 మార్చి 2008 (UTC)
- వినయ్!
- ప్రదీప్ చెప్పిన విషయాన్ని మీరు పొరపాటుగా అర్ధం చేసుకొన్నారనిపిస్తుంది. వ్యాసాలలో సంతకం పెట్టవద్దు. చర్చా పేజీలలో మాత్రమే సంతకం పెట్టవచ్చు. అవి వ్యాసాల గురించి చర్చలు కాని, సభ్యుల గురించి చర్చలు గాని (ఈ పేజీ లాంటివి).
- మీరు వివిధ గ్రామాల గురించి వ్రాస్తున్న సమాచారం చాలా చక్కగా ఉంది. అభినందనలు. ఆ సమాచారాన్ని మీరు ఎలా సేకరించగలిగారు? చెబితే ఇతరులకు కూడా ఉపయోగపడగలదు. వ్యాసం పేజీలో క్రింద "వనరులు" అన్న సెక్షన్‌లో సమాచారం ఎక్కడినుండి సేకరించారో వ్రాస్తే బాగుంటుంది.
--కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:44, 18 మార్చి 2008 (UTC)
- Vinfnr గారు, వ్యాసంలో పేర్లకు ముందు శ్రీ, చివరన గారు లాంటి గౌరవ సూచిక పదాలు వాడడానికి ప్రస్తుత నిబంధనలు అంగీకరించుటలేదు. కాబట్టి నేను పాలెం (బిజినేపల్లి) వ్యాసంలో దాన్ని తొలిగించాను. దయచేసి గమనించండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 15:51, 3 మే 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
- వ్యాసం పేజీలో క్రింద చివరన "వనరులు"అనే దగ్గర నేను వ్రాసే వ్యాసం ఎక్కడనుంచి సేకరించారో తెలియ చేయమన్నారు.కాని అది నాకు అర్థం కావటం లేదు .'వనరులు'అనేది ఎక్కడ ఉందో తెలియడం లేదు.అలాగే ఏదైనా ఒక వ్యాసానికి సంభందించి న ఫోటో జతచేయాలంటే ఎలాగో కూడా అర్థం కావటం లేదు.కాపీ,పేస్ట్ చేస్తే ఫోటో కాపీ కావట్లేదు.ఇలా అడుగుతున్నందుకు దయచేసి అన్యధా భావించకండి.నాకు కంప్యూటర్ పరిజ్ఞానము లేదు.కనుక దయచేసి వివరంగా తెలియచేస్తారని ఆశిస్తున్నాను.
- వినయ్ గారు, సందేహాలు అడగటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కొత్త సభ్యుల సందేహాలకు సీనియర్ సభ్యులు ఎప్పుడూ సహకరిస్తుంటారు. అలా తెలియని విషయాల గురించి, కొత్తగా తలెత్తిన సందేహాల గురించి నివృత్తి చేసుకోవడమే చాలా మంచి పద్దతిగా భావించబడుతుంది. ఇక మీరు అడిగిన విషయానికి వస్తే వ్యాసంలో వనరులు అనే ఒక విభాగం తయారుచేసి దాని కిందుగా మీరు ఆ వ్యాసాన్ని ఏ గ్రంథంనుంచి సేకరించారో తెలియజేస్తే సరిపోతుంది. నేను బీచుపల్లి వ్యాసంలో సరిచేశాను చూడండి. వనరులు వ్రాస్తున్నాం కదా అని ఇతర గ్రంథాల నుంచి యధాతథంగా ఉన్న విషయాన్ని మాత్రం కాపీ చేయరాదు. అలా చేయడం కాపీ హక్కుల ఉల్లంఘన కిందుకు వస్తుంది. అంతకంటే మేలైన మార్గం ఆయా గ్రంథాల నుంచి కొన్ని పాయింట్లు మాత్రమే తీసుకొని వాటికి రెఫరెన్సు ఇవ్వడం ఉత్తమం. మీ రెండో సందేహం ఫోటోలు జతచేసే విషయానికి వస్తే కాపీ, పేస్ట్ పనికిరాదు. పేజీ ఎడమభాగాన పరికరాల పెట్టెలో ఫైలు అప్లోడుపై నొక్కి అక్కడి నిబంధనలు పాటిస్తూ పోవడమే. మరింత సమాచారం కొరకు వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం చదవండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 10:05, 4 మే 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
మార్చు{{సహాయం కావాలి}}
- నేను మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలంలోని మక్తా మాధవరం గ్రామ పేజీలో ఆ గ్రామంలో కల వేణుగోపాలస్వామి దేవాలయం గురించి వ్యాసం వ్రాసినాను.ఆ దేవాలయంలో కల స్వామివారి విగ్రహాలను ఫోటో తీసినాను.ఆ ఫోటో ను వ్యాసానికి జత చేయడం రాలేదు.తమరు దయచేసి అట్టి ఫోటోను ఆ వ్యాసానికి చేర్చగలరు.
విలువైన సలహాలనిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు క్రుతజ్ణుడను़vinayవినయ్.
- వినయ్ గారూ! ఏదైనా ఫోటోలను వ్యాసంలో చేర్చాలంటే ముందుగా ఆ బొమ్మను వికీపీడియాలోకి ఎగుమతి(అప్లోడ్) చేయాలి. తరువాత ఆ బొమ్మ పేరును, వ్యాసంలో [[బొమ్మ:బొమ్మపేరు.jpg/png/gif]] చేర్చాలి. ఉదాహరణకు మీరు అప్లోడు చేసిన ఫైలు పేరు GOD.JPG అనుకుందాం. అప్పుడు వ్యాసంలో అబి చేరిస్తే సరిపోతుంది. మొదటి పేజీలో ఎడమ భాగం వైపు అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి. రవిచంద్ర(చర్చ) 08:37, 5 మే 2008 (UTC)
- వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా ఈ లింకుని నొక్కి మీరు అప్లోడ్ చేసిన బొమ్మకు లైసెన్సు పట్టీని తగిలించండి. తగిలించడం అంటే ఏమీ లేదు. [బొమ్మ:Venugopala svamy.jpg మీ బొమ్మ పేజీ]కి వెళ్ళి మార్చు అని నొక్కి {{లైసెన్సు పట్టీ}} అని పేస్టు చేసి సేవ్ చెయ్యండి. రవిచంద్ర(చర్చ) 08:44, 5 మే 2008 (UTC)
- వినయ్! ఉదాహరణగా నేను బొమ్మను మక్తమాదారం వ్యాసంలో చేర్చాను. ఇంతకూ వూరి పేరు సరేనా? మక్తమాదారం? మఖ్తామాదారం? మఖ్తామాధవరం? మరేదైనా? --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:07, 5 మే 2008 (UTC)
వినయ్, బొమ్మ:Venugopala svamy.jpg కు {{సొంత కృతి|GFDL-no-disclaimers|cc-by-sa-3.0,2.5,2.0,1.0}} అనే లైసెన్సు ట్యాగ్ చేర్చాను. ఇది మీకు అభ్యంతరం ఉండదనే అభిప్రాయం తోనే. మీకు ఓకే అయితే అలా ఉంచేయండి. కాకుంటే మార్చవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:52, 5 మే 2008 (UTC)