వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 34
← పాత చర్చ 33 | పాత చర్చ 34 | పాత చర్చ 35 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2014 జూలై 2 - 2014 సెప్టెంబరు 1
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
జూలై నెల మొలకల జాబితా
మార్చుజూలై నెల మొలకల జాబితా వచ్చేసింది. ఇంకా జూన్, మే నెలల మొలకలు చాలా వరకూ అభివృద్ధి చెందలేదు. అందరూ ఈ మొలక వ్యాసాలపై కృషి చేయగలరు. ముఖ్యంగా ఎవరి మొలకల బాధ్యత వారిదే! --రహ్మానుద్దీన్ (చర్చ) 02:16, 2 జూలై 2014 (UTC)
- డిఫాల్ట్‌గా డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాల జాబితాల్లోని కొన్ని పేజీలు వచ్చేశాయి. అవి క్రమభివృద్ధి చెందుతాయి. --పవన్ సంతోష్ (చర్చ) 03:46, 2 జూలై 2014 (UTC)
- ఔను మరి ప్రాజెక్టు పేజీలకు ఉపపేజీలుగా ఉండాల్సిన పేజీలను వ్యాస పేరుబరికి చేర్చేసారు. సరిచేయండి.--రహ్మానుద్దీన్ (చర్చ) 13:09, 2 జూలై 2014 (UTC)
ఆంధ్రప్రదేశ్ కొత్త పటము
మార్చుఆంధ్రప్రదేశ్ (విభాజిత) పటము తయారైనదా ? తెవికీలో నగరాలు, పట్టణాలు మరియు ఊర్ల పేజీలలో ఉపయోగించడానికి అక్షాంశ రేఖాంశాలతో కూడిన పటమేదైనా తయారైనదా? ఆంగ్ల వికీలో తయారై ఉపయోగింపబడుచున్నది. అహ్మద్ నిసార్ (చర్చ) 20:55, 6 జూలై 2014 (UTC)
బాట్ హోదా కొరకు అభ్యర్థన.
మార్చునేను ఒక నెల క్రితం బాట్ కోసం అభ్యర్థించాను, కాని ఇంత వరకు ఆమోదం పొందలేదు. దయచేసి అధికారులు ఈ సమస్యను త్వరగా చూసి పరిష్కరించడానికి ప్రయత్నించగలరు.Praveen Grao (చర్చ) 10:25, 17 జూలై 2014 (UTC)
IMPORTANT: Admin activity review
మార్చుHello. A new policy regarding the removal of "advanced rights" (administrator, bureaucrat, etc) was recently adopted by global community consensus (your community received a notice about the discussion). According to this policy, the stewards are reviewing administrators' activity on smaller wikis. To the best of our knowledge, your wiki does not have a formal process for removing "advanced rights" from inactive accounts. This means that the stewards will take care of this according to the new admin activity review here. We have determined that the following users meet the inactivity criteria (no edits and no log actions for more than 2 years):
- Gsnaveen (administrator)
- Trivikram (administrator)
- Vnagarjuna (administrator)
These users will receive a notification soon, asking them to start a community discussion if they want to retain some or all of their rights. If the users do not respond, then their advanced rights will be removed by the stewards. However, if you as a community would like to create your own activity review process superseding the global one, want to make another decision about these inactive rights holders, or already have a policy that we missed, then please notify the stewards on Meta-Wiki so that we know not to proceed with the rights review on your wiki. Thanks, Rschen7754 01:11, 18 జూలై 2014 (UTC)
ఆంధ్ర లయోలా కాలేజీతో సీఐఎస్-ఏ2కే సంస్థాగత భాగస్వామ్యం
మార్చుఇటీవలే సీఐఎస్-ఏ2కే నిర్వహించిన "Knowledge and Openness in the Digital era" అనే రెండు రోజుల నేషనల్ వర్క్ షాప్ విజయవాడలోని లయోలా కళాశాలలో జరిగింది. దాదాపుగా 50 మంది డిగ్రీ-పీజీ బోధనా ఉపాధ్యాయులకు వికీపీడియా, స్వేచ్ఛా విజ్ఞానం మీద శిక్షణ ఇవ్వటం జరిగింది. ఈ వర్క్‍షాప్ పర్యవసానంగా కళాశాల యాజమాన్యం వారి బోధనలోకి వికీపీడియా, స్వేచ్ఛా విజ్ఞానం, స్వేచ్ఛా విద్య వనరులను చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతూ సీఐఎస్-ఏ2కే తో మరింత అనుబంధంగా ఉండాలన్న ఆలోచనను వ్యక్తం చేసారు. ఈ దిశగా సీఐఎస్-ఏ2కే ఆంధ్ర లయోలా కాలేజీ యాజమాన్యంతో సంస్థాగత భాగస్వామ్యంపై అవగాహనకు రానుంది. ఈ అవగాహనా పత్రం ప్రకారం ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్ధులకు వికీపీడియాలో శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. వృక్షశాస్త్రం, భౌతిక శాస్త్రం, తెలుగు, అర్థశాస్త్రం మొ॥ విషయాలలో కొన్ని విశేష అంశాలకు సంబంధించిన వ్యాసాలు మన తెవికీలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థుల ద్వారా చేర్చబడతాయి. వికీపీడియా, ఓపెన్ నాలెజ్, ఓపెన్ కంటెంట్ మొదలగు అంశాలపై ఎంపిక చేసిన విద్యార్థులకు లోతైన శిక్షణ ఇవ్వనున్నాము. ఈ మొత్తం కార్యక్రమం సీఐఎస్-ఏ2కే పర్యవేక్షణలో జరగనుంది. ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం చాలా అవసరం. ముఖ్యంగా సహసభ్యులు విద్యార్థులకు వికీపీడియాపై సూచనలు సలహాలు ఇస్తూ, కొత్తగా వచ్చే వ్యాసాల నాణ్యత దెబ్బతినకుండా చూడగలము. ఈ కార్యక్రమం డిజైన్ త్వరలోనే ప్రాజెక్ట్ పేజీగా తెలుగు వికీలో ఉంచుతాము. ఇందుకు సంబంధించి సహసభ్యులు సహాయ సహకారాలందిస్తూ, ముందస్తు సూచనలు, సలహాలు క్రింద తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:11, 18 జూలై 2014 (UTC)
సూరా వ్యాసంలో సూరాల లింకులిచ్చుట ఎలా?
మార్చుసూరా వ్యాసంలో సూరాల వరుస క్రమం వున్నది. అందులో సూరా ల లింకు వికీసోర్సు లోని సూరా సమాచార వ్యాసానికి ఎలా లింకు ఇవ్వాలో తెలియరావడం లేదు. ఓ పదింటికి లింకులు ఇచ్చాను, సరిగా లింకు వచ్చినది. కాని మిగతా వాటికి లింకులిస్తే "లాక్" గుర్తు వస్తున్నది, దానిని క్లిక్ చేస్తే కురాన్ భావామ్రుతంలోని సూరా పేజీకి పోవడంలేదు. అహ్మద్ నిసార్ (చర్చ) 20:08, 19 జూలై 2014 (UTC)
- [[s:<వికీసోర్స్ లో పేజీ శీర్షిక | లంకెలో కనిపించాల్సిన పాఠ్యం]] ఇలా వాడగలరు. పది వరకూ చేసాను! --రహ్మానుద్దీన్ (చర్చ) 16:14, 25 జూలై 2014 (UTC)
- ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 07:19, 1 ఆగస్టు 2014 (UTC)
మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా ప్రాచుర్యమైన వ్యక్తి
మార్చుమా టీవీలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే గేమ్‌షో వస్తూంది. ప్రస్తుతానికి ఇది మొదటి సీజన్ ఐనా ప్రాచుర్యం పొందింది. ఈ సీజన్‌లో తూర్పుగోదావరి నుంచి ప్రోగ్రామ్‌కి వచ్చిన పేరి ఉమాకాంత్ అనే వ్యక్తి తన అపూర్వమైన మేధస్సు, విస్తారమైన విజ్ఞానం, బాల్యపు అమాయకత్వం కలగలిసి ఆ షో ద్వారా విశేష అభిమానం, ఆదరణ పొందారు. చిన్న టీచర్‌గా పనిచేస్తున్న ఆయన ప్రొఫైల్ ఇక్కడ లభ్యం. మహా విజ్ఞానశాలిగా, నాగార్జునతో పాటుగా పలువురి మాటల్లో నడిచే విజ్ఞాన సర్వస్వంగా పేరొందిన ఈయన గురించి తెవికీలో ఓ పేజీ తయారు చేయవచ్చా? ఆయన ప్రాచుర్యం అందుకు సరిపోతుందా?--పవన్ సంతోష్ (చర్చ) 17:02, 24 జూలై 2014 (UTC)
- సరిపోదు. మీలో యెవరు కోటీశ్వరులు పేజీ సృష్టించి, ఆపై అతని గురించి ఒక సెక్షన్ చేర్చి ఆ తరువాత ఇలాంటి చర్చలు మొదలుపెట్టండి. మీరు పూర్తి చేయాల్సిన మొలకల సంఖ్య ఇంతింతై వటుడింతై అని పెరుగుతూంది. నేను మీకు ప్రాజెక్టు ఉపపేజీలుగా పుస్తకాల జాబితాలని మార్చమని చెప్పిన సలహా కూడా మీకందినట్టూ లేదు! --రహ్మానుద్దీన్ (చర్చ) 16:17, 25 జూలై 2014 (UTC)
- మీలో ఎవరు కోటీశ్వరుడు గురించి మీ సలహా బావుంది. తప్పనిసరిగా పాటిస్తాను.
- నా మొలకల సంఖ్యను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూనే ఉన్నాను. తక్కువే వున్నాయి. అవీ మొలకల స్థాయి నుంచి తప్పిస్తాను.
- మీరు గతంలో చర్చా పేజీలోనూ, వ్యక్తిగత సంభాషణలోనూ జాబితాలను ప్రాజెక్టు ఉపపేజీలుగా మార్చే విషయంపై చేసిన సూచన విషయం ఇక్కడ చర్చకు పెట్టాను. నేను జాబితా పేజీల ప్రధాన సూచికను ప్రాజెక్టు ఉపపేజీగా మార్చగా సహసభ్యులు వెంకట రమణ గారు వెంటనే ఫోన్ చేసి అన్ని పేజీలు అలా మార్చవద్దు, కంటెంట్ పేజీగానే అభివృద్ధి చేయాల్సిందని సూచించారు. భిన్నాభిప్రాయాలు వస్తూండడంతో ప్రాజెక్టు చర్చ పేజీలో చర్చకుపెట్టి ఆయనను అభిప్రాయం అక్కడే వ్యక్తపరచమన్నాను. ఇప్పటికి ఆయన మాత్రమే స్పందించారు. మీరు కూడా ఈ విషయంపై మీ స్పందన ప్రాజెక్టు చర్చాపేజీలో వ్యక్తపరిస్తే బావుంటుంది. కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 07:03, 26 జూలై 2014 (UTC)
తెలుగు సినీ గేయ రచయితలు
మార్చుసినీ సాహిత్యానికి తెలుగు వారి జీవితాలకి అవినాభావ సంబంధం. వేటూరి, సిరివెన్నెల, ఆత్రేయ, ఆరుద్ర, సముద్రాల, సినారె, దాశరధి మొ|| భాషలో,వ్యాకరణంలో భాగమయ్యారు. ఎందరో మహానుభావులు, ఆందరికీ వందనములు.
- వికీలో ఏదైనా చర్చను ప్రారంభించినా, లేదా జరుగుతున్న చర్చలో పాల్గొన్నా సంతకం చేయడం ఆనవాయితీ. మీ సంతకాన్ని మీరు చేర్చిన సమాచారం చివర (నాలుగు టిల్ట్ లు ఇలా Rajasekhar1961 (చర్చ) 05:41, 1 ఆగస్టు 2014 (UTC)) చేయవచ్చును.Rajasekhar1961 (చర్చ) 05:41, 1 ఆగస్టు 2014 (UTC)
- --~~~~ అని సంతకం చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 05:50, 1 ఆగస్టు 2014 (UTC)
విశేష వ్యాసాలు
మార్చుఇప్పటికి తెవికీ లో 25 విశేష వ్యాసాలున్నాయి. వీటి సంఖ్య పెంచే అవకాశం మెండుగా వున్నది. నాణ్యత గలిగిన వ్యాసాలు చాలా వరకు వున్నాయి. ఈ దఫా ఓ పది వ్యాసాల ప్రతిపాదనలు చేద్దామనే ఉద్దేశ్యం. సభ్యులు స్పందించ గలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 07:22, 1 ఆగష్టు 2014 (UTC)
- ధన్యవాదాలు. మీరు ఒక 5-10 మంచి వ్యాసాల్ని ప్రతిపాదించండి. అందరం కలిసి అభివృద్ధి చేద్దాము.Rajasekhar1961 (చర్చ) 07:32, 1 ఆగష్టు 2014 (UTC)
- మీరు అభివృద్ధి చేసేప్పుడు అవసరాన్ని బట్టి డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా గ్రంథాల జాబితాకు సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా నేనెలాగూ పుస్తకాలు కాటలాగ్ చేస్తున్నాను కనుక చక్కని మూలాలుగా పనికివచ్చే గ్రంథాలు నేను వెతికిపెడతాను. మీరు విశేష వ్యాసాలను ప్రతిపాదిస్తే దాన్ని బట్టి నాకు దొరికిన, దొరుకుతున్న పుస్తకాలను మూలాలుగా మీకందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:16, 1 ఆగష్టు 2014 (UTC)
- సభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:26, 3 ఆగష్టు 2014 (UTC)
అయ్యంకి వెంకటరమణయ్య స్మారక డిజిటల్ గ్రంథాలయ అవగాహన శిక్షణా కార్యక్రమం
మార్చుతెలుగు వికీపీడియాలో వికీమీడియా ఫౌండేషన్ వారి సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని గ్రంథాలను జాబితా చేసేందుకు, తద్వారా వికీమీడియా ప్రాజెక్టులకు సమాచారం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రారంభమైన వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అన్న ప్రాజెక్టు గురించి అవగాహన కల్పించి, శిక్షణను ఇచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహించన్నాము. మాంటిస్సోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, హౌసింగ్ బోర్డు కాలనీ, తాడేపల్లిగూడెంలో ఆగస్టు 7, 2014 - ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నాము. కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు వికీపీడియా:సమావేశం/డిజిటల్ గ్రంథాలయ అవగాహన శిక్షణా కార్యక్రమం/తాడేపల్లిగూడెం పేజీలో సంతకం చేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 08:25, 2 ఆగష్టు 2014 (UTC)
వికీపీడియా - విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ
మార్చుసభ్యులు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 పేజీని ఓసారి చూసి అందులోని ప్రతిపాదిత వ్యాసాల జాబితాను పరిశీలించండి. అందులో విశేష వ్యాసాలకు కావలసిన లక్షణాలుంటే, వాటిని మీ ఆమోదం తెలుపండి, వాటిని విశేష వ్యాసాలుగా గుర్తించేందుకు వీలుంటుంది. మీ అభిప్రాయాలు ప్రతిపాదిత వ్యాసాల క్రింద "సభ్యుల అభిప్రాయాలు" శీర్షికలో వ్రాయండి. అలాగే, వ్యాసాలపేర్ల క్రింద మీ అంగీకారం తెలుపుతూ సంతకం చేయండి. మీ అంగీకారం ఓటుగా పరిగణింపబడును. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలతోనే వ్యాసం విశేష వ్యాసంగా ఎన్నుకోబడుతుంది. సభ్యులందరూ తప్పక పాల్గొనవలసినదిగా మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:33, 3 ఆగష్టు 2014 (UTC)
విశేష వ్యాసాలు
మార్చులోహిత్ గారి సందేహాలు;
తెవికీలో చాలా వ్యాసాలు విస్తరింవబడినవి ఉన్నట్లున్నవి. ఉదాహరణకు పాలగిరి వ్రాసిన అనేక నూనెల వ్యాసాలు, రసాయన శాస్త్ర వ్యాసాలన్నీ పూర్తిగా విస్తరింపబడినవి ఉన్నవి. వాటిని విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? చంద్రకాంతరావు గారు విశేషంగా వ్రాసిన తెలంగాణ వ్యాసం వంటివాటిని విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? మీరు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 లో సూచించని అనేక విస్తరిత వ్యాసాలు తెవికీలో ఉన్నవి. వాటిని కూడా విశేష వ్యాసాలుగా పరిగణించవచ్చా? వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 లో సూచించిన వ్యాసాలను విశేషంగా అభివృద్ధి చేసినయెడల వాటిని విశేష వ్యాసాల హోదాలు ఎలా యివ్వాలి. విశేష వ్యాసాల వర్గంలో చేర్చితే సరిపోతుందా? సందేహ నివృత్తి చేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 13:07, 4 ఆగష్టు 2014 (UTC)
విశేష వ్యాసాలు – ప్రతిపాదనలు – సందేహాలు – నివృత్తులు – మార్గదర్శకాలు
మార్చు- వెంకటరమణ గారూ, మీరన్నట్టు, తెవికీలో చాలా వ్యాసాలు విస్తరింపబడి యున్నవి. అందుకొరకే విశేష వ్యాసాల పరిగణనా ప్రక్రియ. ఈ సంవత్సరాంతానికి ఓ వంద విశేష వ్యాసాలు చూడవచ్చనే ఆశ.
- తెవికీలో 25 విశేష వ్యాసాలున్నాయి (మొత్తం వ్యాసాల సంఖ్య = 58,545 - ఆగస్టు 4, 2014 నాటికి)
- ఇవికీలో 4,323 విశేష వ్యాసాలున్నాయి (మొత్తం వ్యాసాల సంఖ్య = 4,573,497)
- తెవికీలో అనేక వ్యాసాలు విస్తరింపబడి యున్నవి, ప్రతిపాదనలలో వాటి పేర్లు ఉండవచ్చు, లేకపోవచ్చు.
- ప్రతిపాదింపదలిస్తే;
- విశేష వ్యాసాల కొరకు ఏ సభ్యులైనా ప్రతిపాదించవచ్చు.
- ఎన్నైనా ప్రతిపాదించవచ్చు.
- చంద్రకాంతరావు గారు వ్రాసిన తెలంగాణా వ్యాసమూ ప్రతిపాదించవచ్చు.
- విశేష వ్యాసాల ప్రతిపాదన ఎన్నిక కొరకు ఈలింకులు చూడండి.
- విశేష వ్యాసాల జాబితా : వికీపీడియా:విశేష వ్యాసాలు.
- అలాగే "విశేష వ్యాసాల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది" కొరకు వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు చూడండి.
- అలాగే ఇవికీలో ఈపేజీ చూడండి Wikipedia:Featured_articles.
- కేవలం విశేష వ్యాసం వర్గంలో ఉంచిన యెడల అది విశేష వ్యాసం కాదు. ఇవికీ నుండి తర్జుమా కొరకు విషయాన్ని ఇవికీనుండి కాపీ చేసి తెవికీలో వుంచినందువలన, ఆ వ్యాసం ఇవికీలో విశేష వ్యాసం అయివున్నందువలన, విశేష వ్యాసం వర్గంలో చేరి ఉండవచ్చు. అలా అయిన పక్షంలో, ఆవ్యాసం నుండి వర్గం:విశేష వ్యాసం తొలగించవచ్చు.
విశేష వ్యాసాల ఎన్నిక సభ్యుల అభిప్రాయాలతోనే జరుగుతుంది. ఈ ఎన్నిక ప్రక్రియ వలన లాభాలేమంటే, ప్రతిపాదించేవారు ఆయా వ్యాసాలను ఒక సారి పరికిస్తారు, వాటి నాణ్యతా విషయాలు గుర్తిస్తారు, ఇంకా ఇతర విషయాల దిద్దుబాట్లు చేస్తారు, ఆతరువాతే ప్రతిపాదిస్తారు. సరిగ్గా మనకు కావలసిందీ ఇదే.
- విశేష వ్యాసాల కొరకు నిబంధనలు / మార్గదర్శకాలు ;
- వ్యాసం పరిపూర్ణంగాను, ఖచ్చితత్వాన్ని కలిగి వుండాలి
- నిష్పక్షపాతంగా వుండాలి
- సమతౌల్యతలను పాటించి వుండాలి
- మూలాలు కలిగి ఉండవలెను
- అధిక లింకులు కలిగి ఉండవలెను
- ఎర్రలింకులు లేకుండా ఉండవలెను.
- సంబంధిత వ్యాసాలకు, వాటి విషయాలకు తగిన బొమ్మలు కలిగి వుండాలి
- సభ్యుల ఆమోదాలతోను, నిర్ణయాలతో ఎన్నికై వుండాలి.
- విశేష వ్యాసంగా ఎన్నికైన వ్యాసాన్ని,
- {మూస:విశేష వ్యాసం /(ఎన్నికైన తేదీని గుర్తిస్తూ)}, మరియు [వర్గం:విశేష వ్యాసం] లో చేరుస్తారు.
ఇంకనూ చర్చించవలసిన విషయాలుంటే, సభ్యులు చర్చించవచ్చు. (ఈ విభాగాన్ని రచ్చబండలోనూ, విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 చర్చాపేజీలోనూ ఉంచుతున్నాను). అహ్మద్ నిసార్ (చర్చ) 14:47, 4 ఆగష్టు 2014 (UTC)
తెవికీలో విశేష వ్యాసాల సంఖ్య - సందేహాలు
మార్చు- తెవికీ వికీపీడియా:విశేష వ్యాసాలు పేజీలోని మూసలో 25 వ్యాసాలున్నట్టు, పేజీలో 22 వ్యాసాలున్నట్టు, అలాగే [వర్గం:విశేష వ్యాసాలు] లో 28 వ్యాసాలున్నట్లు కానవస్తున్నది. సీనియర్ సభ్యులు వైజాసత్య, చంద్రకాంతరావు, అర్జున, రాజశేఖర్ గార్లు, దీనిని సరిదిద్దగలరని ఆశిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 16:24, 4 ఆగష్టు 2014 (UTC)
సభ్యులకు ఒక సూచన
మార్చు- గమనిక : ఇప్పటికే విశేషవ్యాసాలుగా అభివృద్ధి చెందిన వ్యాసాలు - వ్యాసాలను విశేషవ్యాసాలుగా అభివృద్ధి చేయుట ; వీటి తేడాను గుర్తించి ఇప్పటికే చక్కగా తీర్చి దిద్దబడి, అభివృద్ధి చేయబడిన వ్యాసాలను మాత్రం విశేషవ్యాసాలుగా ప్రతిపాదించండి. ఉదాహరణకు విశ్వనాధన్ ఆనంద్ వ్యాసం చాలా చిన్నవ్యాసం, దీన్ని విశేష వ్యాసం గా ప్రస్తుతం పరిగణించలేము, కానీ విశేషవ్యాసంగా తీర్చిదిద్దే అవకాశాలున్నాయి. తీర్చి దిద్దబడిన తరువాత, దానిని విశేషవ్యాసం గా ప్రతిపాదనలలో పెట్టవచ్చు.
సభ్యుల స్పందన
మార్చువిశేష వ్యాసాల ఎంపికపై సభ్యుల విశేష స్పందన లభిస్తోంది. అలాగే ఓ విషయాన్ని సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను. కనీసం ఐదుగురు సభ్యుల అంగీకారం పొందిన వ్యాసాల సంఖ్య కేవలం ఐదు వ్యాసాలు మాత్రమే. సభ్యులందరూ తగిన విధంగా స్పందించాలని మరియు ఈకార్యక్రమంలో పాల్గొనాలని మనవి. అహ్మద్ నిసార్ (చర్చ) 12:31, 7 ఆగష్టు 2014 (UTC)
- 18-08-2014 నాటికి 5 లేక 6 సభ్యుల అంగీకారాలు పొందిన వ్యాసాలు దిగువ ఇవ్వబడ్డాయి.
- ఆరు ఓట్లు పొందిన వ్యాసాలు 4.
- ఐదు వోట్లు పొందిన వ్యాసాలు 5.
- ఎంపిక చేద్దామా వద్దా సభ్యులు తెలుపగలరు. ఎంపిక ఐనచో, వాటికి తుదిమెరుగులు దిద్ది విశేషవ్యాసాలుగా ప్రకటిద్దాం. సభ్యులు స్పందించగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 11:27, 18 ఆగష్టు 2014 (UTC)
- విశేష వ్యాసాల ఎన్నికకు గాను దాదాపు 48 వ్యాసాలు ప్రతిపాదనకు వచ్చాయి. అందులో 4 వ్యాసాలు 6 వోట్లు పొందాయి. ఎన్నికకు ఓటు చేసిన వారు సుజాత , రాజశేఖర్ , భాస్కర్ నాయుడు , వెంకటరమణ , సుల్తాన్ ఖాదర్, పవన్ సంతోష్ మరియు అహ్మద్ నిసార్ గార్లు. ఈ ప్రక్రియ అనకున్నంత ఉర్సాహంగా సాగలేదనిపిస్తుంది. కారణం విశేష వ్యాసాలను గుర్తించడంలో కలిగిన ఇబ్బంది కావచ్చు. అయినా, ఈ ప్రక్రియ వల్ల, సభ్యులకు విశేషవ్యాసాలకు కావలసిన హంగుల గూర్చి కొంత అవగాహన ఏర్పడి ఉండవచ్చు అలాగే, విశేష వ్యాసాల ఆవశ్యకత గురించీ తెలియరావడం మంచి పరిణామమే.
- ఆరు ఓట్లు పొందిన వ్యాసాలు : ఆంగ్కోర్ వాట్ , తాజ్ మహల్ , విశాఖపట్నం , భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలు .
ఈ వ్యాసాలను సభ్యులు విశేషవ్యాసాలుగా అంగీకరించారు. సీనియర్ సభ్యులు చాలామంది ఆక్టివ్ గా లేరు. కానీ వికీపీడియా నిరంతరం ప్రవాహంలాంటిది. ఈ ప్రక్రియ తుది నిర్ణయం కొరకు మూడు రోజులు ప్రకటిస్తే మంచిదని భావిస్తున్నాను. సభ్యులు తమ తుది అభిప్రాయాలను ప్రకటించేది. లేదనగా మౌనం అంగీకార సూచకంగా భావించి వీటిని విశేషవ్యాసాలుగా మూడు రోజుల తరువాత ప్రకటిద్దాం. అహ్మద్ నిసార్ (చర్చ) 15:56, 25 ఆగష్టు 2014 (UTC)
- ఎన్నుకోబడ్డ విశేష వ్యాసాలు - ప్రకటన;
రాజశేఖర్ గారూ వీటిని విశేష వ్యాసాలుగా ప్రకటించ వలసినదిగా మనవి. ఆలాగే వెంకటరమణ , సుల్తాన్ ఖాదర్ గార్లూ, ఈ వ్యాసాలకు తుది మెరుగులు ఏమైనా అవసరమా కొంచే పరికించి సరిదిద్దగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 21:35, 2 సెప్టెంబరు 2014 (UTC)
గైడెడ్ టూర్ పొడిగింత స్థాపన గురించి
మార్చుఆంగ్ల వికీపీడియాలో ది వికీపీడియా అడ్వెంచర్ అనే ఒక ఆట ఉంది, ఆట ఆడుతూ ఆడుతూ వాడుకరులు వికీ విధి విధానాల గురించి తెలుసుకుంటారు. ఈ ఆటను తెలుగులోకి నేనూ, ప్రవీణ్ స్థానికీకరిస్తున్నాం. అయితే ఇందుకు గైడెడ్ టూర్ అనే పొడిగింత స్థాపన అవసరం. ఈ పొడిగింత స్థాపించాలంటే సమూహంలో చర్చ జరగాలనే నిబంధన కలదు. దయచేసి ఈ పొడిగింత స్థాపనకు సంబంధించి మీ స్పందన తెలుపగలరు.
నాకు సమ్మతమే
మార్చు- 119.235.50.12#--నాందేవ్ (చర్చ) 19:32, 21 ఆగష్టు 2014 (UTC)
- --రహ్మానుద్దీన్ (చర్చ) 15:40, 4 ఆగష్టు 2014 (UTC)
- --Praveen Grao (చర్చ) 16:59, 4 ఆగష్టు 2014 (UTC)
- -సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:05, 5 ఆగష్టు 2014 (UTC)
- తప్పకుండా స్థాపించండి.--Rajasekhar1961 (చర్చ) 15:12, 5 ఆగష్టు 2014 (UTC)
- నాకు అంగీకారమే. --t.sujatha (చర్చ) 16:00, 5 ఆగష్టు 2014 (UTC)
- --మురళి ఎమ్ (చర్చ) 10:52, 6 ఆగష్టు 2014 (UTC)
- -- తెవికీలో ఓ కొత్తదనం అహ్మద్ నిసార్ (చర్చ) 11:08, 6 ఆగష్టు 2014 (UTC)
- --నాకు కూడా అంగీకారమేPalagiri (చర్చ) 12:42, 6 ఆగష్టు 2014 (UTC)
- ---- కె.వెంకటరమణ చర్చ 13:21, 6 ఆగష్టు 2014 (UTC)
- ---విశ్వనాధ్ (చర్చ) 14:36, 6 ఆగష్టు 2014 (UTC)
- --పవన్ సంతోష్ (చర్చ) 16:07, 6 ఆగష్టు 2014 (UTC)
- #Bhaskaranaidu (చర్చ) 14:42, 11 ఆగష్టు 2014 (UTC)
- --- Pranayraj1985 (చర్చ) 09:15, 12 సెప్టెంబరు 2014 (UTC)
- --- Sanjeevchandrav (చర్చ) 10:26, 23 సెప్టెంబరు 2014 (UTC)
<మీ సంతకం చేర్చగలరు> Raj.palgun13 (చర్చ) 12:00, 29 జనవరి 2015 (UTC)
నాకు సమ్మతం లేదు
మార్చు- <మీ సంతకం చేర్చగలరు
naku samaatame syamaladevitalluri .
తటస్థం
మార్చు- <మీ సంతకం చేర్చగలరు
- మీ సలహాలూ, సూచనలూను
- గమనిక
- తెవికీ సభ్యులందరికి ఒక ముఖ్యమైన గమనిక. వాడుకరి ప్రవీణ్ CIS-A2K లో intern గా ఈ కార్యక్రమంలో కృషి చేస్తున్నారని గమనించ ప్రార్థన. మరియు ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో మన తెలుగు వికీపీడియా ఈ వర్షపు ప్రణాళికలో భాగంగా తెవికీలో కొత్తవాడుకరుల పెంపుదలకై చేస్తున్న కృషి. ఈ disclosure ఆలస్యంగా ఇస్తున్నందులకు సభ్యులు సద్‌హృదయంతో మన్నించగలరు.
- ఈ పనిని రహ్మానుద్దీన్ మరియు ప్రవీణ్ చేపడుతున్నారు కనుక వారి సమర్థనను పరిగణలోకి తీసుకోకూడదనేది నా అభిమతం.
- అలాగే ఈ విహారిణి తెనుగీకరించాలి అనే సలహాలో నాకు భాగముంది కనుక నేను సమర్థన తెలుపుట లేదు.
విష్ణు (చర్చ)09:43, 21 ఆగష్టు 2014 (UTC) naku samaatame syamaladevitalluri
కర్ణాటక సంగీత కృతుల ఆడియోలు స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల కార్యక్రమం
మార్చుగౌరవ సహసభ్యులకు,
నమస్కారం. ఆగస్టు 8, 2014న తాడేపల్లిగూడెంలోని మండల పరిషత్తు హాలులో కర్ణాటక సంగీత కృతుల ఆడియోలు స్వేచ్ఛానకలు హక్కులతో విడుదల చేస్తున్నాము. అనంతరం వాటిని వికీపీడియా కామన్స్లో చేర్చనున్నాము. కర్ణాటక సంగీతంలో పలువురు వాగ్గేయకారులు చేసిన కృతులను, ప్రముఖ విద్వాంసులు ఆలపించగా ముందస్తు అనుమతితో వాటిని ఇప్పటికే నేను, మీనా గాయత్రి రికార్డు చేశాము. ఇప్పుడు వాటినే విడుదల చేస్తున్నాము. దాదాపుగా 30కి పైగా ఉండే ఈ ఆడియో ఫైళ్ళ వల్ల కర్ణాటక సంగీతాన్ని ఉమ్మడి సాంస్కృతిక సంపదగా కలిగిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వికీపీడియాలు, ఇప్పటికే కర్ణాటక సంగీతం గురించి మంచి పేజీలున్న ఆంగ్ల వికీపీడియా కూడా లాభిస్తాయి.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావును ఆహ్వానించాము. కంచికామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు సరస్వతుల హనుమంతరావు, కొందరు తెలుగు వికీపీడియన్లు కూడా హాజరుకానున్నారు. కార్యక్రమంలో భాగంగా కర్ణాటక, జానపద, భజన, నాటక సంగీత కళాకారులకు కాపీహక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నాము. ఈ కార్యక్రమానికి ఆసక్తి ఉన్న వికీపీడియన్లందరూ హాజరుకావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చేవారు, వచ్చేందుకు ప్రయత్నించేవారు వికీపీడియా:సమావేశం/కర్ణాటక సంగీత కృతుల స్వేచ్ఛా హక్కుల విడుదల పేజీలో సంతకం చేయండి. ఈ కార్యక్రమ నిర్వహణలో సూచనలు తెలిపేందుకు కూడా ఆహ్వానం.--పవన్ సంతోష్ (చర్చ) 10:02, 5 ఆగష్టు 2014 (UTC)
- మంచి కార్యక్రమం చేస్తున్నారు. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 15:13, 5 ఆగష్టు 2014 (UTC)
- కార్యక్రమం విజయవంతంగా జరిగింది. సంగీత విద్వాంసులు మొదలుకొని రాజకీయ నాయకుల వరకూ అందరికీ కాపీహక్కులు వదులుకొని స్వేచ్ఛా నకలు హక్కుల్లో సంగీత, సాహిత్యకృషి విడుదల చేయడంలో తమకు, కర్ణాటక సంగీతం/సాహిత్యానికీ, ప్రపంచంలో పలు భాషల వారికి కలిగే మేలు అర్థమయింది. --పవన్ సంతోష్ (చర్చ) 11:48, 9 ఆగష్టు 2014 (UTC)
ఆగస్టు నెల మొలకల జాబితా
మార్చుఆగస్టు నెల మొలకల జాబితా విడుదలయింది. ఒక సారి చూడగలరు. ఎవరి మొలకల బాధ్యత వారిదే అన్న సూత్రం పాటించగలరు. అలానే ఈ జాబితా చూస్తే ఒక వాడుకరి తెలుగు లలితా గీతాలను జత చేస్తున్నారు. వాటి సరియయిన స్థానం వికీసోర్స్ (అవి కాపీరైట్ హక్కుల వెలుపల ఉంటేనే! లేదా ఆ పేజీలను తీసివెయ్యాలి). ఇక మరింత సమగ్రమైన సమాచారాన్ని తెవికీలో చేర్చే దిశగా అడుగులు వేద్దాం. --రహ్మానుద్దీన్ (చర్చ) 04:40, 6 ఆగష్టు 2014 (UTC)
విజయవాడలో క్ర్రియేటివ్ కామన్స్ అనుగుణంగా పుస్తకాల పునరావిష్కరణ
మార్చుఈ ఆగస్టు 14న విజయవాడలోని స్వాతంత్ర్య సమరయోధుల భవనంలోని సోషల్ సైన్సెస్ గ్రంథాలయంలో సయ్యద్ నశీర్ అహమ్మద్ గారి రచనలు CC-BY-SA 4.0 లైసెన్స్ ద్వారా పునర్విడుదల కానున్నాయి. ఈ కర్యక్రమం ఉదయం 10 గం॥ నుండి ఉంటుంది. ఇదే కార్యక్రమంలో నూర్బాషా రహంతుల్లా గారి పుస్తకాలూ, మండలి బుద్ధప్రసాద్ గారి రచనలు కూడా లాంఛనంగా జనబాహుళ్యోపయోగంగా ఉండేందుకు CC-BY-SA 4.0 లైసెన్స్ లో విడుదల అవుతాయి. సహ వికీపీడియనులు అందరూ ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కాగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:31, 6 ఆగష్టు 2014 (UTC)
- కార్యక్రమ పేజీలో ఆసక్తి గల సభ్యులు తమ పేర్లను నమోదు చేసుకోగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 03:17, 9 ఆగష్టు 2014 (UTC)
తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు
మార్చుతెవికీలో జరుగుతున్న తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టులో తయారుచేస్తున్న పేజీలలో ఏదైనా వివరం తప్పుగా నమోదై ఉంటే సహ సభ్యులు నా వ్యక్తిగత ఈమెయిల్ ఐడీకి(pavansanthosh.s@gmail.com) తెలియజేయగలరు. వికీ స్ఫూర్తిని అందిపుచ్చుకుని మీరే ఆ తప్పును దిద్దితే మరింత సంతోషం. ఈ ప్రాజెక్టులో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నవారందరికీ ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 11:06, 10 ఆగష్టు 2014 (UTC)
Help for translate
మార్చుHello and sorry for writing in English. Can anyone help me translate a small article (2 paragraphs) from English to your language and create the article in your wiki? Please, fell free to answer in my talk page in your wiki anytime. Thanks! Xaris333 (చర్చ) 00:42, 13 ఆగష్టు 2014 (UTC)
భవిష్యత్తులో భారత దేశంలో వికీమీడియా పురొగతి ఎలా? వికీమీడియా ఫౌండేషన్ వారి వ్యూహరచన సమావేశం
మార్చునమస్కారం. వికీమీడియా ఫౌండేషన్ వారు భవిష్యత్తులో భారత దేశంలో వికీమీడియా పురొగతికై ఎలాంటి పనులు చేపడితే బాగుంటుంది అనే ఒక విజనింగ్ సమావేశం నిర్వహించదలిచారు. దీనిలో మన తెవికీ నుండి కూడా సభ్యులు చురుకుగా పాలుపంచుకోని మీ అమూల్యమైన సూచనలు మరియు సలహాలు అందిచగలరు. మనం గత ఫిబ్రవరిలో తెవికీ భవిష్యత్ పురోగతికై ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే విషయమై విజయవాడలో జరిగిన దశమ వార్షికోత్సవంలో తెవికీ సభ్యులందరు చక్కని సూచనలు పంచుకున్నారు. వీటిని వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇతర జాతీయ, అంతర్జాతీయ వికీమీడియనుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి చక్కని అవకాశం. మనలో నుండి ఒకరిద్దరిని ఈ సమావేశానికి మనం నామినేట్ చేయగలిగితే మంచిదని నా అభిమతం. ఈ సమావేశానికి ప్రయాణ, విడిది మరియు భోజనవసతి సౌకర్యాలు వికీమీడియా ఫౌండేషన్ వారే భరిస్తారు. సమావేశంలోనే కాకుండా ఈ మెటా వికీ పేజి సందర్శించి అక్కడి చర్చా పేజిలో సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయగలరు.
ఈ సమావేశానికి హాజరుకావాడనికి మనలో ఒకరిద్దరిని త్వరలో (అంటే ఆగస్టు 26 లోపు) నామినేట్ చేస్తే టికెట్లు ఇతరత్రా సదుపాయాల వెసులుబాటుకు వికీమీడియా ఫౌండేషన్ వారి కి వీలుగా ఉంటుంది.సభ్యులు దీనిపై చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాను.--విష్ణు (చర్చ)10:26, 21 ఆగష్టు 2014 (UTC)
- విష్ణు గారూ, నమస్కారం, మంచి సమావేశం. ఈ సమావేశానికి మనలో ఇద్దరికీ నామినేట్ చేద్దామంటున్నారు, చర్చ కూడా ఇక్కడే జరిపి నామినేట్ చేస్తే బాగుంటుందా! కొంచెం వివరించగలరు. అహ్మద్ నిసార్ (చర్చ) 11:16, 21 ఆగష్టు 2014 (UTC)
- చర్చ పేజీలో పాల్గొనేవారిని సెల్ఫ్ నామినేట్ చేస్తున్నారు అటువంటి ప్రయత్నమేదైనా చేయవచ్చా? లేదంటే ఇక్కడే వికీపీడియా రచ్చబండలో చర్చించి చేయాలా? మలయాళ వికీపీడియన్లు, ఆంగ్ల వికీపీడియన్లు దాదాపు నలుగురైదుగురు నామినేట్ చేసుకున్నారు. ఇంతకీ ఏది సరైన పద్ధతి?--పవన్ సంతోష్ (చర్చ) 12:56, 21 ఆగష్టు 2014 (UTC)
- తేదీ ఖరారైతే ఎవరినైనా ఉత్సాహపరచి పంపించవచ్చు, విజయవాడలో అనుకున్న వాటిలో కొన్ని ముఖ్యమైనవి వారి ద్వారా అందించవచ్చు. విశ్వనాధ్ (చర్చ) 16:09, 22 ఆగష్టు 2014 (UTC)
- తేదీలు ఖరారు అయినవి. అక్టోబర్ లో 4 మరియు 5 తేదీల్లో ఈ కార్యక్రమం ఉండవచ్చు. దయచేసి ఇక్కడ కింద నామినేట్ చేయగలరు. అలానే అక్కడ చర్చా పేజీలో కార్యక్రమ స్థలం నిర్ణయంలో కూడా వోటింగ్ లో పాల్గొనవచ్చు ( మీరు హాజరుకాకపోయినా!) దయచేసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకోవచ్చు కూడా అన్న విషయం గుర్తు పెట్టుకోండి. --రహ్మానుద్దీన్ (చర్చ) 03:45, 26 ఆగష్టు 2014 (UTC)
- అహ్మద్ నిసార్ గారు మీరన్నట్లుగానే ఈ క్రిందే చర్చ జరిపి ఇద్దరిని నామినేట్ చేస్తే మంచిది.
- పవన్ సంతోష్ గారు మనం మన పద్దతి పాటిద్దాం. మనలోనుంచి ఇద్దరిని తెలుగు వికీపీడియా సముదాయ రిప్రెసెంటేటివ్స్‌గా నామినేట్ చేయడం మంచిదని నా అభిప్రాయం. మిగతా వారు పాల్గొనదలిస్తే వారు కూడా సమావేశానికి రావచ్చు.
- విశ్వనాధ్ గారు తేదీలు ఖరారు అయినవి కావున మనం త్వరగా నామినేషన్ పూర్తిచేయగలిగితే బాగుంటుంది. మీరు మరియు ఇతర సభ్యులు త్వరితగతిన దీనిపై స్పందించగలరు.--విష్ణు (చర్చ)10:06, 26 ఆగష్టు 2014 (UTC)
- నమస్కారం. నామినేట్ చేసేముందు, తెవికీ మిత్రులు నా ఈ చిన్ని సూచనలని సద్మనస్సుతో పరిశీలిస్తారని ఆశిస్తున్నాను... 1) ఇది ఒక వ్యూహరచనా సమవేశం కావున, భారత దేశంలో వికీమీడియా సముదాయాల కృషి, మరియు తెవికి పుట్టుక-పెంపు-ఆటుపోట్లు-సముదాయ సరళి వంటి విషయాలపై అవగాహన కలిగిన తెవికీ మిత్రులను మనం నామినేట్ చేయగలిగితే చాలా మంచిది; 2) తెవికీ దశమవార్షికోత్సవంలో జరిగిన చర్చల సారాంశాన్ని ఆంగ్లములో లే క హిందీలో స్పష్టంగా తెలియజేయగలిగే వారై ఉంటే మంచిది; 3) వికీమీడియాలో చూసే ఏకైక అర్హత వికీప్రాజెక్టులపై కృషి, కావున కనీసం ౩ సంవత్సరాలకు తక్కువ కాకుండా తెవికీ ప్రాజెక్టులపై చురుకుగా కృషి చేసినవారిని పరిగణిస్తే మంచిది - e.g. నా లాంటి కొత్త వాడుకరి తెవికీ సముదాయాన్ని రిప్రజెంట్ చేయడం సబబు కాదు; 4) మనం నామినేట్ చేయకున్నా వేరే విధంగా ఈ సమావేశానికి తప్పక హజరయ్యేవారు ఉంటారు, కావున వారిని నామినేట్ చేసే కంటే మిగతా వారిని పరిగణలోకి తీసుకోవడం మంచిది - e.g. నేను లేదా రహీం CIS-A2K నుండి తప్పక పాల్గొనవలసి ఉంటుంది; --విష్ణు (చర్చ)18:04, 27 ఆగష్టు 2014 (UTC)
- తేదీ ఖరారైతే ఎవరినైనా ఉత్సాహపరచి పంపించవచ్చు, విజయవాడలో అనుకున్న వాటిలో కొన్ని ముఖ్యమైనవి వారి ద్వారా అందించవచ్చు. విశ్వనాధ్ (చర్చ) 16:09, 22 ఆగష్టు 2014 (UTC)
- చర్చ పేజీలో పాల్గొనేవారిని సెల్ఫ్ నామినేట్ చేస్తున్నారు అటువంటి ప్రయత్నమేదైనా చేయవచ్చా? లేదంటే ఇక్కడే వికీపీడియా రచ్చబండలో చర్చించి చేయాలా? మలయాళ వికీపీడియన్లు, ఆంగ్ల వికీపీడియన్లు దాదాపు నలుగురైదుగురు నామినేట్ చేసుకున్నారు. ఇంతకీ ఏది సరైన పద్ధతి?--పవన్ సంతోష్ (చర్చ) 12:56, 21 ఆగష్టు 2014 (UTC)
ప్రతిపాదనలు
మార్చువాడుకరి పేరు
మార్చు- నాకు సమ్మతమే - అహ్మద్ నిసార్ (చర్చ) 11:08, 26 ఆగష్టు 2014 (UTC)
- రహ్మానుద్దీన్ గారు ఈ సమావేశాలలో తెవికీ వాణిని అర్ధవంతముగా వినిపిస్తారని వారి పేరును ప్రతిపాదిస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:43, 26 ఆగష్టు 2014 (UTC)
- విశ్వనాధ్ మరియు వెంకటరమణ పేర్లను నేను ప్రతిపాదిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 11:20, 26 ఆగష్టు 2014 (UTC)
- పవన్ సంతోష్ పేరును నేను ప్రతిపాదిస్తున్నాను..--విశ్వనాధ్ (చర్చ) 12:30, 26 ఆగష్టు 2014 (UTC)
- I support to Pavan santhosh and viswanath . -- కె.వెంకటరమణ చర్చ 14:58, 27 ఆగష్టు 2014 (UTC)
- నేను రాజశేఖర్ గారు, కశ్యప్ మరియు విశ్వనాథ్ గారి పేర్ల్లను ప్రతిపాదిస్తున్నాను, పవన్ సంతోష్ కు ఇంకా తెవికీ విధి-విధానాలు, భారతదేశంలో ఇప్పటి వరకూ జరిగిన వికీమీడియా కార్యకలాపాలు, తెవికీ చేస్తున్న కార్యక్రమాల గురించి పూర్తి అవగాహన కలిగించుకోవాల్సి ఉంది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన సమావేశం కావున, ఇందుకు తెవికీ నుండి ఈ ముగ్గురిలో ఎవరయినా ఇద్దరిని పంపిస్తే బావుణ్ణని నేననుకుంటున్నాను. మిగితా సభ్యులు, వారి వారి అభ్ప్రాయాలు తదనుగుణంగా మార్చుకోగలరని ఆశిస్తున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 13:53, 28 ఆగష్టు 2014 (UTC)
- ప్రతిపాదనలలో దాదాపు అందరి పేర్లూ వచ్చాయి శుభం. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన సమావేశమని అందరికీ తెలిసిందే. వారి వారి అభిప్రాయాలు వారు తెలియ జేశారు, ఒకరు చెప్పినదానికి అనుగుణంగా మార్చుకో అవసరం లేదని భావిస్తున్నాను (విషయం చర్చకు వచ్చింది కాబట్టి). అందరి అభిప్రాయాలు గౌరవించదగ్గవే. పైన విష్ణుగారు వివరంగా చెప్పారు. ప్రతిపాదనలు చేస్తూ పోతే పొడిగింత అవుతుంది. ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం. అనుభవజ్ఞులు, పాల్గొనడానికి అంగీకరించే సభ్యులు అంగీకరిస్తూ క్రింద తమ పేర్లు ఇవ్వండి, సభ్యులందరూ కలసి వారి పేర్లనే ఫైనల్ చేద్దాం. సమావేశపు తేదీ దగ్గరొస్తోంది, స్పందన తొందరగా జరగాలి. అహ్మద్ నిసార్ (చర్చ) 15:22, 28 ఆగష్టు 2014 (UTC)
- నేను రాజశేఖర్, విశ్వనాధ్, కశ్యప్, పవన్ సంతోష్ లను ప్రతిపాదిస్తున్నాను. Pranayraj1985 (చర్చ) 12:44, 30 ఆగష్టు 2014 (UTC)
అంగీకారం తెలిపే సభ్యులు
మార్చు- . పైన ప్రతిపాదనల్లో నా పేరు చర్చకు రావడాన్ని గమనించాను. ఈ కార్యక్రమానికి వెళ్ళేందుకు నాకు వ్యక్తిగతమైన ఇబ్బందులు ఏమీ లేవు.--పవన్ సంతోష్ (చర్చ) 04:53, 29 ఆగష్టు 2014 (UTC)
- .
- .
పంపాలి
మార్చుఅహ్మద్ నిసార్ గారు వెళ్ళి అప్పట్లో విజయవాడ హొటల్ రూలో అనుకొన్నవి మరియు తెలుగు వాళ్ళకు వేరుగా పౌండేషన్ స్థాపనపై తెలు వికీపీడియన్ల తరుపున మరిద్దరితోనైనా కలసి ఒక బాంక్ బ్లాస్ట్ చేయాల్సిందిగా నా కోరిక. పవన్ సంతోష్ ప్రస్తుతం ఉత్సాహ్ంగా ఉన్నడు కనుక ఆయన మరెవరైనా ఒకరు ఉండాలని నా సూచన.విశ్వనాధ్ 13:11, 26 ఆగష్టు 2014
వద్దు
మార్చుతటస్థం
మార్చు±syamaladevitalluri naaku samaatame syamaladevitalluri 28august2014,
నిర్ణయం
మార్చువికీమీడియా ఫౌండేషన్ వారి కీలకమైన సమావేశం గురించిన చర్చలో పాల్గొన్న సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ చర్చల ఆధారంగా విశ్వనాధ్, అహ్మద్ నిసార్ లను తెవికీ తరపున ప్రాతినిధ్యం వహించడానికి నిర్ణయించాము. పవన్ సంతోష్ వ్యక్తిగత గ్రాంటు గ్రహీతగా తన అనుభవాల్ని తెలియజేయడానికి సమావేశానికి హాజరుకమ్మని కోరుతున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:37, 31 ఆగష్టు 2014 (UTC)
ఇంకా ముఖ్యమైన విషయం. సభ్యులందరూ మన తెలుగు వికీపీడియా అభివృద్ధి ఎలా ఉండాలి, ఏమేవి పనులకు, ప్రాజెక్టులకు ప్రాధాన్యత నివ్వాలి, కమ్యూనిటీని అభివృద్ధిచేయడానికి ఇంకా ఏవేవి పనులు చేయాలి, ఫండింగ్ విషయంగా వాని వినియోగం మన నియంత్రణలోనే ఉండాలా లేదా, వికీమీడియా ఫౌండేషన్ మన అభివృద్ధికోసం ఇంకా ఎలా మనకు తోడ్పడవచ్చు, వికీసోర్సులో లిప్యంతరీకరణకు ఉపకారవేతనం చెల్లించి ముఖ్యమైన పుస్తకాలను పూర్తిచేయడం, కొన్ని డిక్షనరీలను సాంకేతిక సహాయం ద్వారా విక్షనరీలో చేర్చడం, మొదలైన విషయాలపై సభ్యుల అభిప్రాయాలను ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పేజీలో వ్యక్తపరచండి.Rajasekhar1961 (చర్చ) 09:33, 31 ఆగష్టు 2014 (UTC)
- ఈ నిర్ణయం ప్రకారం విశ్వనాధ్ మరియు అహ్మద్ నిసార్ గార్ల పేర్లను ఈ టేబుల్లో చేర్చడం జరిగింది.--విష్ణు (చర్చ)11:37, 1 సెప్టెంబరు 2014 (UTC)
- అహమ్మద్ నిస్సార్ గారు ఈ సమావేశం పట్ల ఆసక్తి చూపడం శుభపరిణామం అని భావించవచ్చు. వారి ప్రతినిధ్యం వహిస్తే తెవికీ సభ్యులందరూ ప్రతినిధ్యం వహించినట్లే. అలాగే విశ్వనాధ్ గారికి తెవికి పట్ల చక్కని అవగాహన ఉంది. వారిద్దరూ పాల్గొనడం నాకు అంగీకారమే. --t.sujatha (చర్చ) 18:08, 8 సెప్టెంబరు 2014 (UTC)
- ఇండియన్ కమ్యూనిటీ సమావేశాలకు ప్రతిపాదనలు జరిగాయి. ఆతరువాత, నాపేరును, విశ్వనాథ్ గారిపేరునూ తెవికీ సమూహం ఎన్నుకోవడం జరిగినది. నామీద మరియు విశ్వనాథ్ గార్లపై సంపూర్ణ విశ్వాశం వుంచినందుకు తెవికీ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే పవన్ సంతోష్ గారు మరియు ప్రణయరాజ్ గార్లు కూడా ఔత్సాహికంగా పాల్గొంటున్నారు. అలాగే మన సభ్యులు సి.ఐ.ఎస్. తో అనుసంధానమున్నవార్లలో ఒకరిద్దరు ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు వున్నాయి. ఈ సమావేశాలలో భారతీయ సముదాయాల గురించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు వున్నాయి. కాబట్టి, సమావేశంలో చర్చించి తీసుకునే నిర్ణయాలపై తెవికీ పురోగతి ఆధారపడి వున్నది. కాబట్టి ఎలాంటి చర్చలు తీసుకురావాలి సభ్యులు తెలిపేది. రాజశేఖర్ గారు చెప్పారు (1) తెవికీకు ప్రత్యేక చాప్టరు, (2) తెవికీ సమూహానికి స్వతంత్రత కలిగిన ప్రత్యేకమైన ఫండింగ్. (3) గౌరవభ్రుతులు చెల్లించి పెండింగ్ లో వున్న కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం. అలాగే (4) కొత్త ప్రాజెక్టులు సామూహికంగా చేపట్టి తెవికీని విశాలపరచుకోవాలి.
- అహమ్మద్ నిస్సార్ గారు ఈ సమావేశం పట్ల ఆసక్తి చూపడం శుభపరిణామం అని భావించవచ్చు. వారి ప్రతినిధ్యం వహిస్తే తెవికీ సభ్యులందరూ ప్రతినిధ్యం వహించినట్లే. అలాగే విశ్వనాధ్ గారికి తెవికి పట్ల చక్కని అవగాహన ఉంది. వారిద్దరూ పాల్గొనడం నాకు అంగీకారమే. --t.sujatha (చర్చ) 18:08, 8 సెప్టెంబరు 2014 (UTC)
• సభ్యులు తెవికీని రాబోయే కాలంలో ఎలాగుండాలని భావిస్తున్నారు? చర్చించండి. • ప్రస్తుతం వున్న వికీ ఒరవడి సరైన దిశలో సాగుతున్నదా? • కొత్త ఒరవళ్ళు అవసరమా? అవునంటే ఎలా వుండాలి. ఏవిధంగా మనం రచనలు చేబట్టే కొత్త సభ్యులను రాబట్టవచ్చు. గడచిన రెండు మూడు సంవత్సరాలుగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా తెవికీ సందర్శకులు వస్తున్నారు గాని, దిద్దుబాట్లు చేసే సభ్యులు రచనలు చేసే సభ్యులు చేరలేదనే భావించాలి. కొత్త సభ్యులు చేరినా వారు చేసే దిద్దుబాట్లకు మనం దిద్దుబాట్లు చేయవలసి వస్తోంది. ఉన్న తెవికీ సభ్యుల వనరులతోనే అభివృద్ధి పయనం జరుగుతున్నది. కమిట్టేడ్ సభ్యులే తెవికీకి కొండంత బలం. వీరి కాంట్రిబ్యూషన్ తోనే తెవికీ నేటి స్థితిలో వున్నది. వికీపీడియా ముఖపేజీలో తెవికీ చేరుకోవాలి. దీని కొరకు క్వాలిటీ వ్యాసాలు రావాలి. కానీ, వికీపీడియా వాలంటీరిజం పైనే ఆధారపడి వున్నది. మనకు వాలంటీర్ల వనరులు తక్కువ. వీటిని పెంచడానికి సి.ఐ.ఎస్. తో పాటు తెవికీ పాటుపడాలి. సి.ఐ.ఎస్. సంస్థ ఫుల్ టైమ్ సంస్థ. కానీ తెవికీ, వాలంటీరిజం నరనరాల్లో వుండే కొద్ది మంది సభ్యులతోనే నడుస్తున్నది. రాజశేఖర్ గారు సూచించిన విషయాలు చాలా ముఖ్యమైనవి. వీటిపై చర్చించేది. అహ్మద్ నిసార్ (చర్చ) 13:35, 13 సెప్టెంబరు 2014 (UTC)
Letter petitioning WMF to reverse recent decisions
మార్చుThe Wikimedia Foundation recently created a new feature, "superprotect" status. The purpose is to prevent pages from being edited by elected administrators -- but permitting WMF staff to edit them. It has been put to use in only one case: to protect the deployment of the Media Viewer software on German Wikipedia, in defiance of a clear decision of that community to disable the feature by default, unless users decide to enable it.
If you oppose these actions, please add your name to this letter. If you know non-Wikimedians who support our vision for the free sharing of knowledge, and would like to add their names to the list, please ask them to sign an identical version of the letter on change.org.
Process ideas for software development
మార్చు’’My apologies for writing in English.’’
Hello,
I am notifying you that a brainstorming session has been started on Meta to help the Wikimedia Foundation increase and better affect community participation in software development across all wiki projects. Basically, how can you be more involved in helping to create features on Wikimedia projects? We are inviting all interested users to voice their ideas on how communities can be more involved and informed in the product development process at the Wikimedia Foundation. It would be very appreciated if you could translate this message to help inform your local communities as well.
I and the rest of my team welcome you to participate. We hope to see you on Meta.
Kind regards, -- Rdicerb (WMF) talk 22:15, 21 ఆగష్టు 2014 (UTC)
--This message was sent using MassMessage. Was there an error? Report it!
Community consultation for future of Wikimedia movement in India
మార్చుHi, Wikimedia foundation is organizing a community consultation to brainstorm the future of Wikimedia movement in India. Each language community is welcome to send it's representative for this event. It would be ideal to nominate few people who can reflect your community's view well based on a sound understanding of the movement's history in India for the last few years. You can also discuss and chart a vision on behalf of the community here and ask your representative to present it in the meeting. Please nominate your representatives as soon as possible at here. I will appreciate if someone can translate this message. Thanks.--Ravidreams (చర్చ) 07:21, 25 ఆగష్టు 2014 (UTC)
వికీపీడియా మరియు కోష్రేన్ కార్యక్రమం
మార్చు22వ కోష్రేన్ సింపోజియం హైదరాబాదులో సెప్టెంబరు 22 నుండి జరుగనుంది.సెప్టెంబరు 21న వికీపీడియాలపై వైద్య సంబందిత వ్యాసాల ఎడిటింగ్ కార్యక్రమం జరుగనుంది. వైద్య సంబందిత వ్యాసాలపై కృషి చేసే తెవికీ మిత్రులు ఇందులో పాల్గొనగలరని ఆశిస్తున్నాను. ముఖ్యంగా రాజశేఖరగారు ఇందులో తప్పక పాల్గొనగలరని మనవి. వివరాలకు ఈ మెటా పేజిని చూడండి.--విష్ణు (చర్చ)17:28, 27 ఆగష్టు 2014 (UTC)
తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు
మార్చుమెటావికీ వారు ప్రతి వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాల జాబితా ఇచ్చారు. దాన్నే తెవికీ లో వికీపీడియా:వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు ఒక జాబితా తయారు చేసి ఆ ప్రాజెక్టును పూర్తిచేయడానికి ప్రయత్నం జరిగినది. అలాగే తెవికీ లో తప్పకుండా ఉండవలసిన వ్యాసాల జాబితాను వికీపీడియా:తెలుగు వికీపీడియాలో తప్పకుండా ఉండవలసిన వ్యాసాలు కూడా తయారు చేసి ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం జరిగినది. ఔత్సాహిక వికీపీడియనులు చాలా మంది శ్రమించారు, వారందరికీ ధన్యవాదాలు. కానీ ఆ జాబితాలోని కొన్ని వ్యాసాలు ఇంకనూ వ్రాయవలసియున్నవి. కావున సభ్యులు సహృదయంతో వీటిని పరిశీలించి, లేని వ్యాసాలను వ్యాయవలసినదిగా మనవి. ప్రత్యేకంగా సుజాత గారు, వెంకటరమణ గారు (లోహిత్) మరియు సుల్తాన్ ఖాదర్ గార్లకు విన్నపం, వారు ప్రత్యేకించి దృష్టి పెడితే ఈ ప్రాజెక్టులు సంపూర్ణమౌతాయని భావిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 20:45, 30 ఆగష్టు 2014 (UTC)
- అహ్మద్ నిసార్ గారూ ఈ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి సంపూర్ణ సహకారాన్నందిస్తాను.---- కె.వెంకటరమణ చర్చ 13:33, 31 ఆగష్టు 2014 (UTC)
- నిస్సార్ గారికి నా పట్ల ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు. నేను ఈ వ్యాసాలను గమనించి వ్యాసాల అభివృద్ధికి కృషిచేస్తాను. --t.sujatha (చర్చ) 18:14, 8 సెప్టెంబరు 2014 (UTC)
టి.ఎస్. శాస్త్రి గారికి వికీపీడియాపై అవగాహన
మార్చునేను ఈ నెల 24వ తేదీన హబ్సిగూడలోని టి.ఎస్. శాస్త్రి గారి ఇంటికి వెళ్లడం జరిగింది. ఆయన ఎన్.జి.ఆర్.ఐ లో భూ ఉపరితల పరిశోధన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేసి, పదవీ విరమణ తీసుకున్నారు. మా చర్చలో వికీపీడియా ప్రస్తావన వచ్చింది. తనకు వికీపీడియా గురించి పూర్తి సమాచారం అంందించాను. తను కూడా వికీపీడియాకు తనవంతు సహాయం అందిస్తానన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 80 సం. పైనే. వికీలో వ్యాసాలను రాయలేరు. కనుక వికీలోని వివిధ వ్యాసాలకు తనకు తెలిసిన పుస్తకాల మూాలాలు అందించవచ్చని చెప్పాను. అందుకు వారు సమ్మతించారు. Pranayraj1985 (చర్చ) 12:07, 31 ఆగష్టు 2014 (UTC)
- ఈ సమావేశాంకి పూర్వరంగం - టీ.ఎస్. శాస్త్రి గారు విష్ణు గారిని హిందూ ఆర్టికల్ ద్వారా మెయిల్ లో సంప్రదించడం, అందులో ఆయనకు వికీపీడియాలో ఆసక్తి ఉందని తెలియజేయడం జరిగింది. అయితే నేను హైదరాబాద్ వచ్చినపుడు ఆయన్ని కలవాలనుకున్నాను కానీ ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కలవలేకపోయాను. కమల్ అనే ఇంకొకరు కూడా అదే సమయంలో తెవికీకి తోడ్పడతాను సహాయం కావాలి అని అడగటం జరిగింది. అందువలన ప్రణయ్ ను శాస్త్రి గారినీ, పవన్ సంతోష్ ను కమల్ ని సంప్రదించి వికీ శిక్షణ ఇవ్వమని నేను కోరడం జరిగింది. అడిగిన వెంటనే సహాయం అందించినందుకు ధన్యవాదాలు ప్రణయ్! --రహ్మానుద్దీన్ (చర్చ) 05:51, 1 సెప్టెంబరు 2014 (UTC)