వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 40

పాత చర్చ 39 | పాత చర్చ 40 | పాత చర్చ 41

alt text=2015 మార్చి 30 - 2015 ఏప్రిల్ 14 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2015 మార్చి 30 - 2015 ఏప్రిల్ 14

నా సాంకేతపదం పనిచేయుటలేదు. దయచేసి నా సమస్యను పరిష్కరించండి. వాడుకరి: భూపతిరాజు రమేష్ రాజు, సాంకేతపదం: భూపతిరాజు

ఇప్పటి వరకు(అనగా 30-3-2015 నాటికి) తెవికి లో ఎన్ని వ్యాసాలున్నాయి?

మార్చు

తెవికి లో వ్యాసాల సంఖ్య 2014 ఆఖరి నాటికి 60176 వుండగా ఆసంఖ్యను 2015 ఆఖరి నాటికి 66666 గా పెంచాలని గత తెవికి వార్షికోత్సవంలో తీసుకున్న నిర్ణయం అందరికి తెలిసె వుంటుంది. (అనగా 2015 లో సుమారు 5500 వ్యాసాలను అదనంగా సృష్టించాలని) ఈ వ్యాసాల సంఖ్య నానాటికి పెరుగుతూ..... 29.3.2015 నాటికి 61612 గా నామోదయింది. ఈ వృద్ధి రేటు ఇలాగే కొనసాగినా ఈ సంవత్సరాఖరి నాటికి మనమనుకున్న నిర్ణీత స్థాయికి చేరుకో గలము. కాని 30-3-2015 నాడు ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 60,052 వ్యాసాలున్నాయి అని చూపబడినది. అనగా ఆ సంఖ్య గతేడాది చివరి నాటిదన్న మాట. ఇది యాంత్రిక తప్పిదమా? లేక వ్యాసార్హత లేని మొలకలను తొలిగించగా ఏర్పడిన వాస్తవమా? ? ? ఈ విషయములో వాస్తవమేదో తెలుపగలరని తెవికి విజ్ఞాన వంతులకు మనవి. భాస్కరనాయుడు (చర్చ) 03:02, 30 మార్చి 2015 (UTC)]][ప్రత్యుత్తరం]

ఇప్పుడే గమనించాను. 1600 వ్యాసాలు తగ్గినట్లుగా చూపిస్తుంది. వైజాసత్య మరియు అర్జునరావు గారు, దయచేసి దోషాన్ని సవరించగలరా. లేకుంటే బగ్ ఫైల్ చేయాలేమో.--Rajasekhar1961 (చర్చ) 06:31, 31 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Bhaskaranaidu గారూ చిన్న సందేహం. తెవికీలో 2015 ఆఖరు నాటికి 66666గా పెంచాలన్న విషయంపై వార్షికోత్సవంలో ఎప్పుడు చర్చవచ్చింది? దానికి ఎవరు మద్దతు పలికారు? నిర్ణయం ఎన్ని ఓట్లతో జరిగిందో లేక ఏయే విషయాల ప్రాతిపదికన జరిగిందో కొంచెం గుర్తుచేస్తారా? ఎందుకంటే నేను రెండురోజుల సమావేశంలో చురుకుగానే పాల్గొన్నా అంత ముఖ్యమైన విషయాన్ని ఎక్కడ మిస్సయ్యానా అని డౌటుగా వుంది. మరోలా అనుకోకండి.--పవన్ సంతోష్ (చర్చ) 08:49, 31 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
@భాస్కరనాయుడు, @Rajasekhar1961 "29.3.2015 నాటికి 61612 గా నామోదయింది" ఇది ఎక్కడనుండి వచ్చింది? --వైజాసత్య (చర్చ) 23:21, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ రోజు అనగా 3/4/2015 నాడు తెవికి మొదటి పుటలోవున్న వాఖ్యాన్ని యదాతదంగా పేస్టు చేస్తున్నాను గమనించండి. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 60,069 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి. 29/3/2015 నాటికి 61612 గా వున్న సంఖ్య మూడు రోజుల తర్వాత ఎక్కువ కావాలి గాని, వెయ్యికి పైగా సంఖ్య తగ్గి పోవడము జరగదు కదా??? అదె నా సందేహము. [[భాస్కరనాయుడు (చర్చ) 02:41, 3 ఏప్రిల్ 2015 (UTC)]][ప్రత్యుత్తరం]
అంటే, మూడు రోజుల క్రితం కూడా మొదటి పేజీలోనే చూశారా? ఎందుకడుగుతున్నానంటే కొన్ని గణాంకాల పట్టికలలో అయోమయనివృత్తి పేజీలను కూడా పేజీలుగానే పరిగణిస్తారు. కొన్ని పరికరాలు, పేజీని తెరిచి, పరిశీలించి చూడవు --వైజాసత్య (చర్చ) 05:57, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • చర్చలో మధ్యలో వస్తున్నందుకు క్షమించగలరు. మొదటీ పేజీలో చూపించే గణాంకాల సంఖ్య https://www.mediawiki.org/wiki/Manual:Article_count వద్ద ఇవ్వబడిన సూత్రం ప్రకారం వచ్చే సంఖ్య ద్వారా వస్తుంది. క్వారీ లో రెండు గణాంకాలనూ వచ్చేలా క్వెరీలు వ్రాసాను, పరిశీలించగలరు, ఇంతకుముందు క్వారీలో ఇచ్చిన రెండవ క్వెరీని వాడేవారు ఇప్పుడు మొదటిది వాడుతున్నారు. ఆ ప్రకారంగా ప్రతుతం తెవికీలో సున్నా పేరుబరి, అంటే వ్యాసప్పేరుబరిలో 61380 వ్యాసాలున్నా, వీటిలో కొన్ని వ్యాసాలకు అంతరవికీ లంకెలా వాడుకునే సౌలభ్యం లేదు. అవి వ్యాసాల సంఖ్యలో ప్రస్తుతం పరిగణింపబడలేదు, అందువల్ల ఈ వ్యాఖ్య వ్రాసే సమయానికి వ్యాసాల సంఖ్య 60065 అని చూపిస్తుంది. ఈ విషయమై ఒక బగ్ కూడా ఉంది. https://phabricator.wikimedia.org/T68867 వద్ద చూడగలరు. సంఖ్యాపరంగా తెవికీ ముందుకు సాగాలి నిజమే, కానీ నాణ్యతా పరంగా కూడా మరింత మెరుగవ్వాలి. మన తెవికీలో ఇప్పుడు మొలకల శాతం 22% వరకూ ఉంది. ఒక ప్రత్యేక మూస ద్వారా గ్రామ వ్యాసాల అభివృద్ధి చేసి దాదాపు 40% ఉన్న మొలకలను తగ్గించుకున్నాం. అయితే ఆ మూసలు నింపాల్సిన బాధ్యతా అందరమూ తీసుకోవాలి. నిరంతరం వ్యాసాల సంఖ్య లాంటి గణాంకాలు గమనించే వారు ఇలాంటి విషయాలు గమనిస్తున్నారని తెలుసు. Rajasekhar1961 గారి సహాయం తీసుకొని కొత్త వ్యాసాల అభివృద్ధి తో పాటుగా ఉన్న వ్యాసాల నాణ్యతాభివృద్ధి కూడా చేపట్టాలి. --రహ్మానుద్దీన్ (చర్చ) 19:06, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారూ, ధన్యవాదాలు. మరీ ఈ 1600 పేజీలు దారిమార్పు పేజీలా? --వైజాసత్య (చర్చ) 03:06, 5 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
en:Template:Wikipedia languages ఈ జాబితాలో మన వికీపీడియా చేరగలిగినప్పుడే తెలుగు వికీపీడియాకు కనీస గౌరవం దక్కుతుంది. ఉత్తుత్తి గణాంకాలతో లక్ష వ్యాసాలకు చేరినా పెద్ద లాభం లేదు. లక్షల వ్యాసాలున్న హిందీ వికీపీడియాను కూడా వీళ్లు చేర్చలేదు. కాబట్టి ప్రస్తుత తెలుగు పరిస్థితిలో ఇలాంటి వ్యాసాల సంఖ్యల పరుగులు అనవసరం. సి.ఐ.ఎస్ ప్రణాళికలో ఇలాంటి లక్ష్యాలు తీసివేస్తే బాగుంటుంది --వైజాసత్య (చర్చ) 03:25, 5 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • [1] వద్ద అంచనా ప్రకారం ఇంకా ఎక్కువే ఉండవచ్చు (అన్ని పేరుబరులు కలుపుకొని 4160 పేజీలున్నాయి). సీఐఎస్-ఎ2కె ప్రణాళిక ద్వారా చేరే వ్యాసాలు మొలకలు కాకుండా ఉండేలా ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడున్న ముసాయిదా ప్రణాళికలో ఏ ఏ అంశాలు సీఐఎస్ వారు చెయ్యలేరో తెలిపితే అవి తీసివేయవచ్చు. ఇక 66666 అన్నది సమూహ నిర్ణయం, సీఐఎస్ నుండి వచ్చిన నిర్ణయం కాదు. సంస్థాగత భాగస్వామ్యాల ద్వారా వచ్చే వికీపీడియనులను చేరదీసి వారి చేత నాణ్యమైన వ్యాసాలు చేరేలా బాధ్యత తీసుకోవచ్చు. నేను సంఖ్యల వెనుక పడకుండా వ్యాసాల నాణ్యత కొలమానమైన ఆర్టికల్ డెప్త్ పెంచాలని మాత్రమే విజ్నప్తి చేసాను. ఇంకా గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాలను సరిచేయటమూ మనకున్న ప్రధాన సవాలు. ఆ దిశగా సమూహ సభ్యుల ఆసక్తిని కోరగా ఎవ్వరూ ఆసక్తి చూపలేదు, అందుకని అది ప్రణాళిక లో చోటు చేసుకోలేదు. అడపా దడపా వాటిని నేను వ్యక్తిగత స్థాయిలో సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ 982 వ్యాసాలు సరి అయి, గ్రామ్య వ్యాసాలు మొలక స్థాయి దాటితే నాణ్యతలో చాలా ముందుకు వెళతాము. గ్రామ్య వ్యాసాల కోసం ఎన్నో సందర్భాలలో ఎన్నో వనరులు మనకు అందినా అవి పూర్తి సమాచారం కాకపోవటం (ఉదా : సెన్సస్ జాలస్థలంలో కేవలం జనాభా లెక్కలే దొరుకుతాయి, చారిత్రక, భౌగోళిక, సామాజిక అంశాలు రావు) సమూహంలో అందరూ ఆసక్తి చూపకపోవడం ఒక కారణం. అయితే ఈ మారు ఒక ప్రయోగంగా జిల్లాల వారీగా ఆర్టీఐ వాడి కొంత సమాచారం రాబట్టాలని చూస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు నాయకత్వం గుళ్ళపల్లి నాగేశ్వర రావు గారు తీసుకుంటారు. మొత్తం సంవత్సరంలో ఒక కృష్ణా జిల్లా వరకూ పని చేసి ఫలితాలననుసరించి మిగితా జిల్లాలకు ఇది అనుకరించాలన్నది ఆలోచన. సీఐఎస్ ప్రణాళిక ప్రకారం 65000 (అంచనా), 68000(డ్రీం టార్గెట్) వ్యాసాల సంఖ్య లక్ష్యంగా ఉంది. ప్రణాళికలోని అన్ని ప్రాజెక్టులూ కాకపోయినా కొన్ని సఫలమైనా మనం ఈ లక్ష్యాలను సులువుగా చేరుకోగలము. ప్రణాళికలో ఏం మార్పులు చేస్తే మనం మరింత బాగా తెవికీ అభివృద్ధి చేయవచ్చో తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 18:13, 5 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
66666 వ్యాసాల సంఖ్యలాంటి లక్ష్యాలు నిర్ణయించడం ఎవరూ చేసినా (సముదాయంలో కొందరు సభ్యులైనా, సి.ఐ.ఎస్ అయినా) అది సరైన లక్ష్యం కాదు. You get what you measure. వ్యాసాల సంఖ్య లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, ఆ లక్ష్యాన్ని చేరటానికి వేల సంఖ్యలో నాఖ్యతలేని మొలకలను చేరుస్తారు. అంతెందుకు ఈ చర్చలోనే చక్కని ఉదాహరణ ఉన్నది. మొలకలశాతంను మానిటర్ చేస్తూ వచ్చాం, అందుకు పెద్ద ఎత్తులో గ్రామాల వ్యాసాల్లో అనవసరమైన ఖాళీ వర్గాలని చేర్చి, మొలకలశాతం తగ్గించామనిపించారు. ఇలాంటివి నివేదికల్లో, సభల్లో చెప్పుకోవటానికి బాగుంటాయి కానీ దీర్ఘకాలికంగా తెవికీకి ఒరిగే ప్రయోజనమేమీ లేదు. గుళ్ళపల్లి నాగేశ్వర రావు చేస్తున్నది, బాటు చేయాల్సిన పని. ఇలాంటి యాంత్రికమైన పనులు మనుషులు చెయ్యటం భావ్యం కాదు. రహ్మానుద్దీన్ గారూ, జనాభా లెక్కల పని మీరూ, నేను కలిసి పనిచేయగలిగేందుకు చక్కని అవకాశం. ఒక బాటు వ్రాసి ఈ గ్రామాలన్నింటిలో గణాంకాలు చేర్చే పనిచేపడదాం --వైజాసత్య (చర్చ) 20:11, 5 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామవ్యాసాల్లో మూలాలు చేర్చేందుకు ఓ అవకాశం

మార్చు

ఇక్కడ గ్రామవ్యాసాల గురించి నాణ్యత గురించి లోతైన చర్చ జరుగుతున్నందున ఇక్కడే రాస్తున్నాను. కొన్ని నెలల నుంచీ గ్రామవ్యాసాల్లో నాణ్యత పెంచేందుకు, మూలాలు చేర్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ఐతే వేలాది సంఖ్యలో ఉన్న ఈ వ్యాసాల నాణ్యతను తేలికైన విధానాలతో అభివృద్ధి చేసేందుకు నాకు తోచినంత ఆలోచనలు, పైలట్ ప్రాజెక్టుల్లాంటి ప్రయత్నాలు నేను చేస్తూ కొన్ని విషయాలు గమనించాను. దానిలో ఒకటేంటంటే ఈ గ్రామాల వ్యాసాల్లో కొందరు అనానిమస్‌గా మార్పులు చేసినవాళ్ళలో ఇన్లైన్ రిఫరెన్సులు చేర్చి మరీ రాద్దామన్న ప్రయత్నం చేశారు. వారి దారిన వారు ఈనాడు జిల్లా ఎడిషన్లు, ఇతర వార్తాపత్రికలలోని వార్తలు, వ్యాసాలూ రిఫర్ చేసేందుకు అన్ని వివరాలతో ట్రై చేశారు. కాకుంటే వాళ్ళకి వికీ మార్కప్ కోడ్‌లో రాయడం రాలేదు. అందుకే దానిలో రిఫరెన్సు మూసలు వాడకుండా (4) అని అంకె వేసి కిం 4.అని పెట్టి రిఫరెన్సులు రాసేశారు. మనం వీటిని క్వైరీల ద్వారా గుర్తించి, వాటిని యాంత్రికంగా సరిజేయగలిగితే చాలా వ్యాసాల నాణ్యత పెరుగుతుంది. ఒక ఉదాహరణ కోసం ఈ గ్రామవ్యాసం చూడండి.వాడుకరి:వైజాసత్య, వాడుకరి:రహ్మానుద్దీన్, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:C.Chandra Kanth Rao గార్లు వంటివారెవరైనా తదుపరి చర్చలు చేపడితే బావుంటుంది.--పవన్ సంతోష్ (చర్చ) 09:55, 11 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ, గ్రామవ్యాసాలపై ఆసక్తి చూపిస్తున్నందుకు సంతోషము. అసలు తెవికీలో అత్యధిక వాటా కలిగియున్నవి గ్రామావ్యాసాలే. తెవికీకి మంచి పేరు రావాలంటే గ్రామవ్యాసాలు నాణ్యతను కలిగియుండటం తప్పనిసరి. నేను ప్రారంభం నుంచే గ్రామవ్యాసాలకు ప్రాధాన్యత ఇస్తున్నాను. ప్రతి గ్రామవ్యాసానికి మూసపెట్టాలనే ఆలోచన కూడా మొదటిసారిగా నేనే తీసుకువచ్చాను. పాలమూరు జిల్లా (మహబూబ్‌నగర్ జిల్లా)తో పాటు రంగారెడ్డి, ఆదిలాబాదు జిల్లాలకు చెందిన చాలా గ్రామ వ్యాసాల సమాచారాన్ని అప్పట్లో వృద్ధిచేశాను. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల, కొందరి చర్యల వల్ల తాత్కాలికంగా చురుకుదనం తగ్గించాను. తెవికీ నాణ్యతకై ఇచ్చిన సూచనలను పట్టించుకోనందున, చివరికి సీనియర్ సభ్యులు కూడా చిన్న దిద్దుబాట్లు చేసేవారికే మద్దతు ఇవ్వడం వల్ల విసుగుచెంది "ఎవరికీ అభ్యంతరం లేనప్పుడు నాకూ అభ్యంతరం లేనట్లుగానే భావిస్తాన"ని ప్రకటించి చెప్పడం మానివేశాను. ఇప్పుడు చూడండి వైజాసత్యగారు ప్రత్యేకంగా పేరుపెట్టి చిన్నదిద్దుబాట్లు బాటుద్వారా మాత్రమే చేయాలని, యాంత్రికమైన పనులు మనుషులు చెయ్యటం భావ్యం కాదని వారించిననూ ఎవరూ పట్టించుకోవడం లేదు సరికదా సదరు సభ్యులు మరింతగా చిన్నదిద్దుబాట్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్చలవల్ల ప్రయోజనమేంటి? చర్చల సారాంశాన్ని పట్టించుకోకపోతే చర్చలెందుకు? గ్రామవ్యాసాలు ఎలా అభివృద్ధి చేయాలో ఉదా:కు భూత్పూర్ గ్రామవ్యాసం చూడవచ్చు. నా బ్లాగులో జిల్లాకు చెందిన అన్ని గామవ్యాసాలున్నాయి. ఉదా:కు భూత్పూర్ మండలంలోని గ్రామవ్యాసాలు చూడండి. ఒక పద్దతిపై పనిచేస్తే నాణ్యత పెంచవచ్చు. ఎవరికివారు అందులోనూ కేవలం దిద్దుబాట్లు పెంచుకోవడానికే గ్రామవ్యాసాలలో పనిచేస్తే తెవికీ నష్టపోతుంది. ఇదివరకు గ్రామవ్యాసాలలో ఖాళీవిభాగాలు వద్దని నేను సూచించిననూ ఎవరూ పట్టింకోలేరు. వేలవ్యాసాలలో అలాంటి ఖాళీ విభాగాలు సమూహం అనుమతి లేకుండా ఎలా చేర్చారు? సూచించిననూ ఎందుకు ఆపలేకపోయారు? ఇతర సభ్యులు ఎందుకు పట్టింకోలేరు? అప్పట్లో చిన్నదిద్దుబాట్లు గురించి నేను చెప్పే ప్రతి సందర్భంలో వైజాసత్యగారు నన్ను వ్యతిరేకించేవారు. ఈ ఒక్క విషయంలోనే నాకూ వైజాసత్యగారికి తేడా ఉండేది. ఇప్పుడు అదే వైజాసత్యగారూ చిన్నదిద్దుబాట్ల గురించి సభ్యులకు వారించారంటే పరిస్థితి ఎంతగా విషమించిందీ ఆలోచించాల్సిందే. అయిననూ ఇలాంటివీ ఎవరూ పట్టించుకోరు. ఇదివరకు ఇలాంటి చర్చలన్నీ వృధాగానే ఉండిపోయాయి. ఇక మీ మూలాల సంగతి గురించి చెప్పాలంటే గ్రామవ్యాసాలకు మూలలు కోకొల్లలు. దినపత్రికలే కాకుండా పలు గ్రంథాలలో మూలాలు మనకు లభ్యమౌతాయి. అంతేకాకుండా జిల్లాస్థాయి, మండలస్థాయి కార్యాలయాలలో గ్రామాలకు సంబంధించి అన్ని వివరాలు అందిస్తారు. గ్రామాలకు చెందిన చాలా వివరాలు ఇప్పుడు అంతర్జాలంలో కూడా లభ్యమౌతోంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:39, 11 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్ర కాంత రావు గారూ, నన్ను క్షమించగలరు. 2012-2014లో నేను ఇక్కడ అంత చురుకుగా పాల్గొనలేదు. సదుద్దేశం అనుకోలు ప్రకారం వారు సదుద్దేశంతోనే వారు ఆయా మార్పులు చేస్తున్నారనుకున్నాను. కానీ ఏవి, ఎందుకు, ఎలా జరుగుతున్నాయో ఇటీవలే అర్ధమైంది. అందరూ స్వఛ్ఛందంగా లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నప్పుడు ఈ సదుద్దేశంతో చేస్తున్నారనే భావన చాలా చక్కగానే పనిచేసింది. కానీ పరిస్థితులు మారాయి. గణాంకాలు పురస్కారాలను ఇతరేతర ప్రయోజనాలను సమకూరుస్తున్నప్పుడు ఒక conflict of interest ఏర్పడింది. కొందరు gaming the system మొదలుపెట్టారు. కాబట్టి వీటికి అనుగుణంగా ఇక్కడ నియమాలు పద్ధతులు మార్చుకొని చక్కదిద్దుకోవటం మన బాధ్యత. --వైజాసత్య (చర్చ) 06:48, 14 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమాపణలు వద్దండి వైజాసత్యగారూ, ఇప్పటికైనా పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు సంతోషమే. మీరన్నట్లు ఇదివరకు తెవికీలో అందరూ స్వఛ్ఛందంగా లాభాపేక్ష లేకుండా పనిచేసేవారు. పరిస్థితులు మారి ఇప్పుడంతా వాణిజ్యధోరణులు, స్వప్రయోజనాలు, రాజకీయ లక్షణాలు చోటుచేసుకుంటున్నాయి. తెవికీలో గుణాత్మక విలువలు కంటే పరిమాణాత్మక విలువలకే ప్రాధాన్యత ఏర్పడింది. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:37, 14 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అర్థం చేసుకోవాల్సిన వారు అర్థం చేసుకునే సరికి మన పుణ్యకాలం గడిచిపోతుందం.డీ!! JVRKPRASAD (చర్చ) 01:59, 15 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఎ2కె తెవికీ ప్రణాళిక జులై 2015-జూన్ 2016

మార్చు

నమస్కారం. గతసంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సిఐఎస్-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం తెవికీ ప్రణాళిక తయారు చేసింది. తెవికీ 11వ వార్షికోత్సవ వేడుకలలో మరియు గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగిన చర్చల అధారంగా, తెవికీ సభ్యుల సూచనలు సలహాలు పరిగణలోనికి తీసుకొని ఈ సమిష్టి ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఆంగ్లంనుండి తెలుగుకు తర్జుమా చేయడానికి తెవికీ మిత్రుల సహకారాన్ని అభ్యర్థిస్తున్నాను. ఈ ప్రణాళికను మెరుగు పరచడానికి సూచనలు సలహాలు చర్చా పేజిలో ఇవ్వగలరు. ప్రణాళికలో భాగంగా గత సంవత్సరం తెవికీలో మరియు క్రిందటి ఏడాది ప్రణాళికపరంగా జరిగిన ప్రగతి విశ్లేషణ కూడా జరుపబడింది. ఈ ప్రణాళిక మెటాలో ఇక్కడ ఉంచబడింది, తెవికీ సభ్యులు మెటాలోకూడా మీసూచనలు సలహాలు మరియు ఆమోదం తెలియజేయగలరు. --విష్ణు (చర్చ) 14:46, 30 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రణాళికని అభివృద్ధి చేసే దిశగా కొన్ని సలహాలు, సూచనలూ ప్రణాళిక చర్చ పేజీలో వ్రాశాను. గత సంవత్సరం సీఐఎస్-ఎ2కె చేసిన చాలా కార్యక్రమాల్లో హాజరై, కొన్ని సమావేశాలకు వ్యక్తిగతాసక్తితోనూ, వేరే గ్రాంటు పనుల్లోనూ భాగంగా నిర్వహణలు చేసిన అనుభవంతో నేనిది లోతుగా పరిశీలించాను. చూడండి. తెవికీలో ఈ ప్రణాళిక విషయమై ఆసక్తి వున్న ఇతరులు కూడా ఓమారు చూస్తారనే ఉద్దేశంతో ఇక్కడ వ్రాస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:38, 31 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీ లో ఒక లక్ష పదాలు

మార్చు

విక్షనరీలో చేర్చ బడిన పదాలు 2-4-2015 నాటికి ఒక లక్ష దాటినది. ఆ లక్షవ పదము ఏదై యుండునో ???? భాస్కరనాయుడుయ.

లక్షవ పదమేమోగానీ లక్ష పదాలకు విక్ష్నరీ చేరుకోవడం చాలా సంతోషకరమైన విషయం. తెలుగు భాష అభివృద్ధి విషయంలో ఈ కృషి శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ కృషిలో భాగమైనవారందరికీ, ఈ విషయాన్ని గుర్తించిన భాస్కరనాయుడు గారికీ అభినందనలు, కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (చర్చ) 17:59, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Bhaskaranaidu గారూ, అందుకోండి శుభాభినందనలు. విక్షనరీని ముందుండి అక్షరలక్షలవైపు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 23:13, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు భాస్కరనాయుడు గారు...--Pranayraj1985 (చర్చ) 06:12, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీ ప్రగతిబాట

మార్చు

విక్షనరీ ప్రగతిబాటలో తన లక్షణమైన లక్ష సంఖ్యను [2], [3] 01.4.2014 నాడు అందుకున్నదని, అందుకు ఎంతో సంతోష సంబరముతో మన మిత్రబృంద వాడుకరులందరకూ తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఈ ప్రముఖ అంకెను అందుకునేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఈ సందర్భమున తెలియజేస్తున్నాను. సదా వికీ సేవలో మీ తోటి వాడుకరి--JVRKPRASAD (చర్చ) 14:16, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీలో నాకు తెలిసినంతవరకు విశేషంగా కృషి చేసిన User:T.sujatha,వాడుకరి:Mpradeep, [[User:JVRKPRASAD, వాడుకరి:Bhaskaranaidu, Rajasekhar1961 మరియు సహాయపడిన ఇతర సభ్యులకు అభినందనలు. ఈ సమయంలో విక్షనరీ సమీక్షించడం, వ్యాసాన్ని విస్తరించడం ప్రసారమాధ్యమాల్లో మంచిపనవుతుంది.--అర్జున (చర్చ) 04:15, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
విక్షనరీలో విశేషంగా కృషిచేసిన వారిలో భాస్కరనాయుడు ముఖ్యులు. తప్పకుండా విక్షనరీ అభివృద్ధిని సమీక్షించి ప్రసార మాధ్యమాలలో ప్రజలందరికీ తెలియజేద్దాము. కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు. గణాంకాలను సంవత్సరాల వారీగా ఎవరైనా గ్రాఫిక్ పద్దతిలో విశ్లేషిస్తే మేము చేసిన పనిని వివరిస్తూ ముందుకెళ్దాము.--Rajasekhar1961 (చర్చ) 05:16, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సందర్భాన్ని గురించి పత్రికలో వార్తలు

మార్చు
  • విక్ష్నరీ గురించి పత్రికామాధ్యమాల్లో ప్రచారం తీసుకురావడానికి తప్పకుండా కృషిచేయవచ్చు. తెవికీ తరుఫునుంచి మనం ఓ పత్రికా ప్రకటన విడుదల చేయాలంటే కొన్ని వివరాలు అవసరమౌతాయి. అలాంటి వివరాల్లో కొన్నిటిని ఉదాహరణ కోసం నేను కింద ప్రశ్నలుగా పొందుపరుస్తున్నాను.
  1. ఎంతమంది వాలంటీర్లు విక్ష్నరీలో పనిచేశారు?
  2. పనిచేసిన వాలంటీర్లలో అతిఎక్కువ మార్పులు చేసినవారు, పదాలు చేర్చినవారు ఎవరు?
  3. విక్ష్నరీ లక్ష్యాలు ఏమిటి?
  4. ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటివరకూ మందకొడిగా పనిచేసింది, ఎప్పుడు వేగం పుంజుకుంది?
  5. మందకొడిగా పనిచేసినప్పుడు ఒంటిచేత్తో నడిపినవారెవరైనా ఉంటే వారి పేరు.
  6. హఠాత్తుగా వేగం పుంజుకునే వేరే స్థాయికి చేరుకోవడానికి ఒకరిద్దరు కారణమైతే వారి పేరు.

ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటే, నేను వాటిని పత్రికా ప్రకటన రూపంలోకి తీసుకురాగలను. ఇది రాష్ట్రవ్యాప్తమైన ఘటన కాబట్టి నాకు తెలిసినవారూ, వికీ పట్ల గతంలో సానుకూలంగా స్పందించినవారూ అయిన విలేకరులు ఎక్కడున్నా వారికి నేను పత్రికా ప్రకటన పంపి, ఓ ఫోన్ కొడతాను. ఈ విషయంలో చేయగలిగిన అన్ని పనులూ చేయవచ్చు. గతంలో విక్ష్నరీ అరవైవేల మార్కు దాటినప్పుడనుకుంటా భాస్కరనాయుడు గారితో కేక్ కట్ చేయించాం. అలాంటి ఫోటోలు కూడా జతచేస్తే మరింత బావుంటుంది. ఇక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంగతి అటుంచితే, ఈ వివరాలతో నేరుగా మనమే వెబ్జైన్లలో రాద్దాము. ఈ విషయంపై ఎవరు ఏ విధమైన పత్రికా ప్రకటన తయారుచేయాలన్నా వికీపీడియా:రచ్చబండ (పత్రికా సంబంధాలు)లో దాని డ్రాఫ్ట్ పెడితే కొంత చర్చించి మెరుగు పరచవచ్చు. లేదూ పై గణాంకాలు వివరాలు తెలిసినవారెవరైనా సవివరంగా ఓ ప్రయోగశాలలోనో, వికీపీడియా పేరుబరిలోని ఓ పేజీ క్రియేట్ చేసో వివరంగా రాసినా దాన్ని వాడుకోవచ్చు. స్పందించబోయేవారికి ముందస్తుగా ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 08:10, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో 60 వేలవ వ్యాసము సృష్టించ బడిన సందర్భంగా..... రహమానుద్దీన్ గారు ఆవిషయాన్ని గుర్తించి .... ఆ వ్యాసాన్ని నేనే సృష్టించానని ఆరోజు చెప్పి నాచేత కేక్ కట్ చేయించారు. ఈ సంఘటన వికీపీడియాలో..... విక్షనరీలో కాదు. భాస్కరనాయుడు (చర్చ) 09:13, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
-పవన్ సంతోష్ గారు, మీరు ఉదహరించిన ప్రశ్నలు చాలా బావున్నాయి. ఇంకా ఇలాంటి మరిన్ని ప్రశ్నలు వీలయినన్ని ఏర్చి కూర్చి ఇక్కడ లేదా విక్షనరీ నందు పొందు పరచిన నాకు చేతయినంత వరకు మూలాలుతో జవాబులు పొందు పరచ గలను. అన్ని ప్రసారమాధ్యమాలకు ఏమేమీ కావలసినవి అన్నీ దయచేసి తెలియజేయగలరు. మరికొంతమంది వాడుకరులుతో పాటుగా, సాంకేతిక సహకారముతో పని చేయగలవారు కూడా ఇందులో సహకరించిన యెడల ఒక మంచి వ్యాసము తయారు కాగలదు. ముందుగా మీరు నాంది పలకగలరని మరియు మరికొంత మంది సహకరించగలరని ఆశిస్తాను. ధన్యవాదములతో -- JVRKPRASAD (చర్చ) 13:42, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • భాస్కరనాయుడు గారూ కరెక్టే.. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. విషయంలో కన్ఫ్యూజ్ అయినా పాయింట్ మాత్రం అదే. ప్రసాద్ గారూ నేను అడిగిన ప్రశ్నల సమాధానాలే చాలు పత్రికా ప్రకటన తయారుచేసి విడుదల చేయడానికి. నేను విక్ష్నరీలో గట్టిగా పనిచేసిందీ లేదు, సాంకేతికంగా వాటిని అనాలసిస్ చేసేంత సామర్థ్యమూ లేదు. అందుకే కేవలం ప్రశ్నలకు, వాటి సమాధానాలు రాబట్టాకా చేయగల పత్రికా ప్రకటన విడుదల వంటివాటికి పరిమితమయ్యాను. అవైతే నేను చేసేయగలను. ప్రసార మాధ్యమాలకు నిత్యవ్యవహారంలో జరిగే కృషి కన్నా ఒక మైలురాయి వంటి ఇలాంటి ఘటనలపై ఆసక్తివుంటుంది కనుక ఇది పాతపడేలోపు స్పందించి ప్రయత్నించగలరు.--పవన్ సంతోష్ (చర్చ) 15:00, 3 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీ సమీక్ష

మార్చు

విక్షనరీలో జరిగిన పురోగతి సమీక్షను ఇక్కడ[4] భాస్కరనాయుడు గారు మరియు నేను తయారుచేశాము. సభ్యులు దానిలోని లోపాల్ని, ఇంకా అభివృద్ధి చేయాల్సిన భాగాలను తెలియజేయండి. పవన్ సంతోష్ మీరు ఈ సమాచారం పత్రికల కోసం సరిపోతుందో చెప్పండి. నాకు కనిపిస్తున్నంతవరకు గణాంకాలు ఇంకా విపులంగా కొన్ని బొమ్మలతో చూపిస్తే బాగుంటుందనిపిస్తుంది. వైజాసత్య గారు ఈ సహాయం చేయగలరని కోరుతున్నాను. విక్షనరీలో కృషిచేసిన సభ్యులందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:16, 8 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీ మెటా వార్త

మార్చు

విక్షనరీ మెటా వార్త [5] నందు విక్షనరీ మైలురాయి దయచేసి చూడగలరు. అందులో 2.4.2015 నాడుగా గుర్తించారు. కానీ మనము (నేను) 1.4.2015 నాటికి 1,00,013 వరకు వచ్చిన తదుపరి ఆరోజుకు ఆపి, నా వాడుకరి పేజీలో గణాంకాలు పేజీ (సీరియల్ నం.10)లో వేసుకున్నాను. ఏది ఏమయినా మన లెక్క 1వ తారీఖు కానీ వారు గుర్తించినది మాత్రము 2.4.2014. కానీ మెటావార్త లోనే ఈ క్రింద విధముగా ఒక పట్టిక Wiktionaries by entry-count milestone [6] నందు ఇవ్వబడినది.

  • 100,000 Norwegian (Bokmål) (10 June 2009); Burmese (23 April 2011); Indonesian (31 December 2011); Malayalam (24 March 2012); Limburgish (19 May 2012); Cherokee (20 August 2013); Romanian (8 November 2013); Japanese (25 December 2013); Uzbek (17 November 2014); Telugu (1 April 2015)
  • కాబట్టి మనము 100,000 మైలురాయిని 1.4.2015 నాటికే చేరామని దయచేసి వాడుకరులు గమనించగలరని మనవి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:22, 4 ఏప్రిల్ 2015 (UTC)

వికీవ్యాఖ్య

మార్చు

వికీవ్యాఖ్య నందు తెలుగు వ్యాఖ్యలు 24 నవంబరు, 2011 నకు 200 సంఖ్య అందుకుంది. ప్రస్తుతము అవి ఈ నాటికి [7] వాటి సంఖ్య 359 గా నమోదు అయ్యింది. కాస్త బాధగానే ఉంది. వీలయితే అ సంఖ్య కనీసంలో కనీసం 500 ఈ నెలలో పూర్తి చేస్తాను. వాడుకరులందరూ దయచేసి సహకరించ గలరు. JVRKPRASAD (చర్చ) 03:16, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 11వ వార్షికోత్సవాల నివేదిక పూర్తి

మార్చు

అందరికి నమస్కారం... ఫిబ్రవరి 14,15 రోజులలో జరిగిన తెవికీ 11వ వార్షికోత్సవాల నివేదిక పూర్తయింది. నివేదిక కొరకు ఇక్కడ చూడగలరు. నేను ఏవైనా మరిచిపోయివుంటే సభ్యులు ఆ సమాచారాన్ని చేర్చగలరు. ధన్యవాదాలు... --Pranayraj1985 (చర్చ) 09:54, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Pranayraj1985 గారూ, వివరణాత్మకమైన నివేదిక సమర్పించినందుకు ధన్యవాదాలు --వైజాసత్య (చర్చ) 20:13, 5 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Requesting to enhance బీదర్ కోట article

మార్చు

Hi all, I here by reachout to Telugu Wikipedia community to enhance బీదర్ కోట article. I'm requesting other Indic language wikipedian's to do the same. This exercise is a part of my kannada wikipedia community activity. I'm trying to build a community of regional wikipedians around Bidar since last one year. For the first time, I will be meeting them this weekend to exchange my knowledge and ideas with this group. I'm also trying to demonstrate how QRCode can help the travelers visiting Bidar and Bidar fort to learn about the historical monuments and the History behind it. Looking forward for a quick help. This would be an ongoing project and we would try to create and enhance articles around Bidar in coming months. Bidar community can help writing the articles in English, Kannada, Hindi, Urdu and Telugu. The current strength of the community is small but through regular interactions and training sessions, we can surely help them gain confidence in Wiki editing. Thanks in advance Omshivaprakash (చర్చ) 08:01, 6 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాలంటే ఇలా ఉండాలి

మార్చు

చక్కని వికీపీడియా వ్యాసాలంటే ఇలా ఉండాలి రభస, ఆగడు, గోవిందుడు అందరివాడేలే. పవన్ జంధ్యాల గారు ఈ వ్యాసాలపై నెలల తరబడి పనిచేశారు. ఇవి అందరూ చూసి నేర్చుకోదగినవి. ఇలాంటి ఒక్క వ్యాసం చాలు అవార్డు ఇవ్వటానికి అనిపించేలా ఉన్నాయి. ఇవే వ్యాసాల్ని ఈయన ఆంగ్లంలో వ్రాసినప్పుడు పూర్తిగా ఆంగ్లమూలాలను ఉపయోగించడం మరో హైలైట్. ఇలాంటివి ఒక వెయ్యి వ్యాసాలు తయారుచేయగలిగితే అది ఒక విజ్ఞానసర్వస్వానికి నిజమైన అభివృద్ధి. తెలుగు వికీపీడియా పేరుప్రతిష్టలు ఇనుమడింపజేస్తుంది. --వైజాసత్య (చర్చ) 11:49, 7 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వైజాసత్య గారు, మీరు మెచ్చుకునే వ్యాసాలు తప్పకుండా భవిష్యత్తులో రాబోతాయని ఆశిస్తున్నాను. నా వంతు ప్రయత్నము నేను చేస్తూనే ఉంటాను. JVRKPRASAD (చర్చ) 11:59, 7 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ జంధ్యాల నిజంగా అద్వితీయమైన కృషి చేస్తున్నాడు. కొంతకాలం తెలుగు వికీపీడియాలో పనిచేసిన తర్వాత అతడు ప్రస్తుతం ఎక్కువగా ఆంగ్ల వికీపీడియాలో పనిచేస్తున్నాడు. కారణం తెలియదు. మరళ తెలుగులో కూడా తన రచనలు కొనసాగించమని కోరాము; కానీ తను సమయాభావం వలన తెలుగులో వ్రాయలేకపోతున్నారని చెప్పాడు.--Rajasekhar1961 (చర్చ) 03:39, 9 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు సినిమాల వ్యాసాలు అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు నాకు పవన్ గారి వ్యాసాలే గీటురాయి. వాటిలా రాయాలని ప్రయత్నం చేస్తూంటాను. ఇన్లైన్ రిఫరెన్సులు కూడా చాలా చక్కగా ఇస్తూంటారాయన. గతంలో పలుమార్లు తెవికీలో ఆయనతో కలిసిపనిచేయాలన్న ప్రయత్నాలు చేశాను. ఇంకా కలిసిరాలేదు. ఆంగ్లంలో అయన తయారు చేసిన వ్యాసాలు గుడ్ ఆర్టికల్, ఫీచర్డ్ ఆర్టికల్ క్రైటీరియాలు కూడా అందుకునేంత నాణ్యతతో ఉన్నాయి. మీ ఉద్దేశం అర్థమైంది. ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలి పట్టుదలగా అంటున్నారనుకుంటాను. తప్పకుండా, నాకూ అలాంటి కోరికలు, ఆలోచనలు ఉన్నాయి. ప్రయత్నిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:59, 8 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
అవును. ఎవరి వ్యక్తిగత ప్రాధమ్యాలు, పనులు వారికుంటాయి, ఆయన ఇక్కడ ప్రస్తుతం పనిచేయలేకపోతే మనం చేసేదేమీ లేదు. కానీ ఆ స్ఫూర్తితో తప్పకుండా మనమూ అదే స్థాయిలో కృషిచేయవచ్చు --వైజాసత్య (చర్చ) 05:47, 12 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ లవ్స్ ఫుడ్ ఫోటో కంటెస్ట్ పైలట్ ప్రాజెక్ట్

మార్చు

కామన్స్.వికీమీడియా.ఆర్గ్‌లో వికీ లవ్స్ ఫుడ్ అనే ఫోటో కాంటెస్ట్ విస్తృతస్థాయిలో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా భారతీయ ఆహారపదార్థాలకు సంబంధించిన రకరకాల ఫోటోలతో పోటీలో పాల్గొనాల్సివుంటుంది. ఐతే దీన్ని విస్తృతంగా నిర్వహించేముందు మొదటి దశలో 50మంది వికీమీడియన్లతో నిర్దిష్టంగా ఓ మొదటి దశ నిర్వహిస్తే తర్వాత విస్తృతంగా నిర్వహించబోయే ఫోటో కాంటెస్టు విజయవంతమయ్యే వీలుంటుందని వీరు భావిస్తున్నారు. అందుకుగాను ప్రతి భాషా సముదాయం నుంచి కనీసం ఇద్దరు ఫోటోలపై ఆసక్తివున్న వికీమీడియన్లను ఎంపికచేసి ట్రైల్ రన్‌లా చేయాలనుకుంటున్నారు. దీనికి ఆయా భాషా వికీపీడియాలో కమ్యూనిటీ ఆమోదంతో వారి పేర్లు నామినేషన్‌గా పంపాల్సివుంటుంది. పోటీలో పాల్గొనేవారు ఇప్పటిదాకా వికీ కామన్స్‌లో అప్లోడ్ చేసివుండని కొత్త ఫోటోలు, అవీ భారతీయ ఆహారపదార్థాలకు సంబంధించినవి కామన్స్‌లో ఎక్కించి, పైన చెప్పిన పేజీలో సూచించినట్టుగా దానికి వికీ లవ్స్ ఫుడ్ అనే వర్గాన్ని చేర్చి పోటీపడాల్సివుంటుంది. దీనికి మనం కూడా కమ్యూనిటీ నుంచి ఇద్దరు ఫోటోలపై ఆసక్తివున్న వికీమీడియన్లను దీనిలో పాల్గొని సహకరించేందుకు నామినేట్ చేస్తేబావుంటుంది. పోటీల్లో పాల్గొనేందుకు కాక వాలంటీరుగా పోటీల నిర్వహణలో సహకరించేందుకు ఇప్పటికే మన సహ తెలుగు వికీమీడియన్ కశ్యప్ ముందుకువచ్చినట్టు ఇక్కడ వాలంటీర్ల పేర్లను బట్టి గ్రహించాను. కనుక ఆయన ఒక్కరినీ నామినేట్ చేసేందుకు వీలులేదు.--పవన్ సంతోష్ (చర్చ) 16:15, 9 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]


రాజశేఖర్ గారు, నాయుడుగారు తెలుగు వికీ కమ్యూనిటీ పరంగా Wiki Loves Food నామి నేట్ అయ్యారు అని తెలిసినది, వారికి అభినందనలు --కశ్యప్ (చర్చ) 14:53, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విక్షనరీ ఇంటర్ వికీ లింకులు - ఇతర భాషలు

మార్చు

విక్షనరీ ఇంటర్ వికీ లింకులు [8] అన్ని ఇతర భాషలు విక్షనరీలలో చే(ర్చు)ట కొరకు చాలాకాలము క్రితం చేశా(ను)ము. అ రోజుల్లో ఆనాడు ఎవరూ అభ్యంతరము పెట్టడము జరుగలేదు. ఇప్పుడు అదే పని చేస్తుంటే, వారి భాషలో ఆ కొత్త పదాలు ప్రస్తుతము లేవు కనుక లింకు చేర్చవద్దు [9] అని అంటున్నారు. పోనీ వేరే ఇతర భాషలో మన తెలుగు లింకు వారి పేజీలలో ఇస్తుంటే, మీకు, మా పేజీలు మీ దాంట్లో లేవు కనుక వారు కూడా తెలుగు లింకు వారి పేజీలో ఇవ్వ వద్దని అన్నారు. కనీసం వారిని వారి పదాలను ఎగుమతి చేయమని అడిగాను, [10] కానీ వారు స్పందించ లేదు. మరి కొత్త పదాలు మనకు విక్షనరీ నందు ఎలా దిగుమతి అవుతాయి ? అసలు ఇంటర్ వికీ లింకులు అనేవి బాటు ద్వారానే చేయాలా ? ఇతర వికీలలో మన దగ్గర ఉన్న పేజీలు వారి వారి దగ్గర ఉన్నాయో లేదో తెలుసుకోవడము ఎలా ? ఈ సమస్య నాది కాదు. ఒక పరిష్కారము పొందవచ్చని వ్రాస్తున్నాను. వాడుకరుల స్పందనలకు అవసరమయితే జవాబులు వ్రాయగలను. దయచేసి ఎవరికి తెలిసిన అభిప్రాయము వారు పొందు పరచగలరు. JVRKPRASAD (చర్చ) 10:24, 10 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, ఇంటర్ వికీ లింకులు అనే పద్ధతిని తీసేశారు (కనీసం వికీపీడియాలో). దాని స్థానంలో వికీడాటా వచ్చింది. ఆటోవికీబ్రౌజర్ను ఆయా వికీల్లో వాడాలాంటే, ఆయా సముదాయాల్లో నియమాలకు అనుగుణంగా అనుమతి తీసుకోవాలి. ఆటోవికీబ్రౌజరు కంటెనూ, బాటుతో ఇలాంటివి చేర్చటం సరైన పద్ధతి అని వారి ఉద్దేశం. --వైజాసత్య (చర్చ) 06:21, 14 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
విక్షనరీలో ఇంకా ఇంటర్ వికీ లింకులు కొనసాగుతున్నట్టుంది --వైజాసత్య (చర్చ) 06:26, 14 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు, విషయం కొంతవరకు అర్థం అయ్యింది. కానీ సలహాలు ఇచ్చేముందు చాలా మందికి అవగాహాన లేకనో మరేమో కానీ తప్పుసలహాలు స్వీకరించాల్సి వస్తున్నది. విక్షనరీ నందు పెద్దగా ఎవరూ శ్రద్ధ పెట్టకపోవడము అని అనను కానీ, సరి అయిన సలహాలు మాత్రము సమయానికి ఆనాటి నుండి అందులో పని చేస్తున్నవారు అందుకోలేక పోతున్నారు. ఆనాడు ఇంటర్ వికీ లింకులు లేకపోవడము వలన పేజీలు సంఖ్య పెరగడము లేదని, కనీసం ఒక లింకు అయినా ఉండాలని అభిప్రాయములు చెప్పారు. ఇతర భాషా పదాలు మన తెలుగులోకి తెచ్చుకుంటే సంఖ్య పెరుగుతుందన్నారు. కానీ ఎలా దిగుమతి చేసుకోవాలో నాకు తెలియదు. ఇతర విక్షనరీలలో పైన చెప్పిన విధంగా సమస్యలు వచ్చాయి కాబట్టి ఇది వరకు ఇంటర్ వికీ లింకులు ఇచ్చి ఉన్నాము కావున తెలుగు పదాలకు ఇప్పుడు లింకులు ఇచ్చాను. అవి కూడా ఇవ్వకూడదని ఇప్పుడు మీద్వారా తెలిసింది.

తదుపరి, వికీడాటా వస్తున్న సందర్భములో ఇంక ముందు రోజుల్లో అసలు విక్షనరీతో పని లేదని, అది దండగతో సమానం అని ఒక సమావేశములో సీనియర్ వాడుకరి తెలియజేయటము జరిగింది. అప్పటికి గుచ్చిగుచ్చి అడిగాను. ఆయన చెప్పిందే వేదంలా అయ్యింది. అంతటితో నా పని ఆపేశాను. (ఎప్పుడు ఆపానో నెలవారీ గణాంకాలు ద్వారా బాగా తెలుస్తుంది). ఇలా తెలిసీతెలియక కొందరు వాడుకరులు సభ్యులకు సలాహాలు ఇస్తూ ఉంటే అనేక సమస్యలు ముందు వస్తున్నాయి. దయచేసి మీలాంటి వారు సలహాలు వెంటవెంటనే ఈ విధముగానే ఇస్తూ ఉంటే మాలంటి వారికి అనవసర ఆయాసం తగ్గుతుంది. JVRKPRASAD (చర్చ) 06:49, 14 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Stewards confirmation rules

మార్చు

Hello, I made a proposal on Meta to change the rules for the steward confirmations. Currently consensus to remove is required for a steward to lose his status, however I think it's fairer to the community if every steward needed the consensus to keep. As this is an issue that affects all WMF wikis, I'm sending this notification to let people know & be able to participate. Best regards, --MF-W 16:13, 10 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కాపీహక్కుల నిర్ధారణ

మార్చు

[11] ఈ పుస్తకం గద్వాల సంస్థాన సాహిత్య పోషణము గురించిన సిద్ధాంత గ్రంథం. [12] లోకోక్తిముక్తావళి అనే తెలుగు సామెతల పుస్తకం. [13] శ్రీపాదవారి విజయనగర రాజుల కథలు. ఇవి ఆర్కీవులో పూర్తి పుస్తకాలు ఉన్నవి. వీని కాపీహక్కులు నిర్ధారించగలిగితే వికీసోర్స్ లో నేను చేరుస్తాను.--Rajasekhar1961 (చర్చ) 13:56, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి 1961లో మరణించారు.ఆయన రచనలు ఇంకా కాపీహక్కుల పరిధిలోనే ఉన్నట్టున్నాయి. పునర్ముద్రితాలూ అవుతున్నాయి. మిగిలినవాటి గురించి నాకు తెలియదు మరి.--పవన్ సంతోష్ (చర్చ) 16:09, 13 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
శ్రీపాద వారి సమగ్ర సాహిత్యం మనసు ఫౌండేషన్ వారు విడుదల చేయనున్నారు. ఆహ్వాన పత్రిక చూడగలరు. ఈ పుస్తకం వెలువడుతున్నదంటే ఆ పుస్తకం కాపీరైటు హక్కుదార్లు జనసామాన్యానికి ఆ రచనలు విడుదల చేస్తున్నట్టే. గమనించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 12:46, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • రహ్మాన్ గారూ ఈ ఆహ్వానం ఇవాళే నాకూ అందింది. కాకుంటే వాటిని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేస్తున్నారా మనసు ఫౌండేషన్ వాళ్ళు? నాకీ విషయం తెలియదు. ఇంతకుముందు పతంజలి సాహిత్యం విడుదల చేసినప్పుడు నేనూ అందర్లా కొనుక్కుని చదివాను. కానీ వాటిలో కాపీహక్కుల పునర్విడుదలకు సంబంధించి ఏమీ లేదే! ఇంతకుముందు వరకూ లేని ఈ సంప్రదాయంలో వాళ్ళు శ్రీపాద వారి రచనలనే విడిగా పునర్విడుదల చేస్తున్నారా?--పవన్ సంతోష్ (చర్చ) 13:57, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  • లేదు. వారు జనసామాన్యం స్వేచ్ఛగా చదువుకునేందుకు మాత్రమే పుస్తకాలను ప్రచురిస్తారు. వికీలో, మీకు తెలియందేముంది, అచ్చువేసుకుని ధరకు అమ్ముకునే స్వేచ్ఛ, పుస్తకాన్ని యథేచ్ఛగా మార్పులు చేర్పులు చేసుకునే స్వేచ్ఛ ఉంటే గానీ చేర్చలేం. అయితే వారి వారసులతో తెవికీ సభ్యులు సంప్రదించేందుకు ఈ కార్యక్రమం అవకాశమవవచ్చు అని ఇక్కడ ఆహ్వానం ప్రతి ఇవ్వటం జరిగింది. హైదరాబాదులో ఉండే సభ్యులు పాల్గొని, వారి వారసులతో ఈ విషయమై చర్చించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:25, 17 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

గోల్డెన్ త్రెషోల్డ్ వద్ద ఎడిటధాన్

మార్చు

వికీ మిత్రులకు శుభోధయం... ఈ రోజు (14-04-2015) మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం వరకూ ఎడిటధాన్ జరుగుతున్నది. నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ల వరకూ అందరికీ తెలియపరిచాను. మిగతా సభ్యులకు తెలియపరచడానికి అవకాశం దొరకలేదు. ఇదే ఆహ్వానంగా భావించి అందరూ హాజరు కావాలని మా కోరిక...--విశ్వనాధ్ (చర్చ) 04:03, 14 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ఏప్రిల్ 19, 2015 సమావేశం

మార్చు

అందరికి నమస్కారం... తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం ఏప్రిల్ 19, 2015 నాడు మధ్యాహ్నం 3 గం.ల నుండి సాయంత్రం 6 గం.ల వరకూ హైదరాబాద్, అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో జరుగుతుంది. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది. సమావేశ పేజి కొరకు ఇక్కడ చూడగలరు. --Pranayraj1985 (చర్చ) 06:57, 14 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]