వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 36

పాత చర్చ 35 | పాత చర్చ 36 | పాత చర్చ 37

alt text=2014 డిసెంబరు 10 - 2015 జనవరి 19 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2014 డిసెంబరు 10 - 2015 జనవరి 19

Invitation to Bengali Wikipedia 10th Anniversary Celebration Conference 2015 మార్చు

 

Hi Community members,

Bengali Wikipedia community is organizing its 10th Anniversary Celebration Conference at Kolkata on 9 & 10 January 2015.
You can see our Official event page and the Facebook event page.

We are planning to invite our friends and well-wishers from different language wiki communities in India to this most auspicious occasion hosted by Bengali Wikimedia community! We are also planning to arrange few 30 scholarships for non-Bengali Indic Wikimedians who are interested in participating in this event. Please select your Five (5) scholarship [1] delegates from your community member for this conference and announce it here before 10th December 2014.


We look forward to see you at Kolkata on 9 & 10 January 2015

1) Scholarship included with Travel reimbursement upto 2000/- + dormitory or shared accommodation + meals during the conference hours

On behalf of Bengali Wikipedia Community (Sorry for writing in English)

Global AbuseFilter మార్చు

Hello,

AbuseFilter is a MediaWiki extension used to detect likely abusive behavior patterns, like pattern vandalism and spam. In 2013, Global AbuseFilters were enabled on a limited set of wikis including Meta-Wiki, MediaWiki.org, Wikispecies and (in early 2014) all the "small wikis". Recently, global abuse filters were enabled on "medium sized wikis" as well. These filters are currently managed by stewards on Meta-Wiki and have shown to be very effective in preventing mass spam attacks across Wikimedia projects. However, there is currently no policy on how the global AbuseFilters will be managed although there are proposals. There is an ongoing request for comment on policy governing the use of the global AbuseFilters. In the meantime, specific wikis can opt out of using the global AbuseFilter. These wikis can simply add a request to this list on Meta-Wiki. More details can be found on this page at Meta-Wiki. If you have any questions, feel free to ask on m:Talk:Global AbuseFilter.

Thanks,

PiRSquared17, Glaisher

— 17:34, 14 నవంబర్ 2014 (UTC)

అజ్ఞాత వాడుకరి సంశయం మార్చు

నాకు ఒక అజ్ఞాత వాడుకరి పంపిన సందేశం దానికి నేను ఇచ్చిన నా సమాధానము ఈ క్రింద పొందు పరచు చున్నాను. వాడుకరులు కూడా సమాధానము వారు కూడా పొందాలనుకుంటే చర్చ చేయవచ్చును.

  • ==sunayasa diddubatlu==

okasari aneka diddubatlu cheyagaliginaa kuda chinna vyaasaamuku kooda aneka sunayasa diddubatlu chesi diddubatlu number penchukuntunnaduku dhanyavadalu.--59.98.50.174 14:32, 15 నవంబర్ 2014 (UTC)

మీరు ఎవరో (గుజరాత్, అహ్మదాబాదు) తెలియదు. కానీ విషయము మాత్రం గ్రహించాను. ఈ సందర్భముగా మీకు సమాధానము చెప్పవలసి ఉంది. కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చేయాలి. మీలా నాకు అంత అనుభవము, ఆరోగ్యం, అవకాశములు లేవు. మాకు విద్యుత్తు కాస్త ఆంతరాయం ఉంది. చేతులు, కళ్ళు సహకారాము అంతగా లేవు. ఇది సంజాయిషీ మాత్రం కాదు. చేతనయితే వెలుగులోకి రండి. మాట్లాదాము. చేసిన పని కాస్త అయినా పూర్తి చేస్తే నాకు సంతోషము. తదుపరి సునాయాసము ఏవో విషయములు తెలియజేయండి, ఎందుకు చేయవలసి వచ్చిందో చెబుతాను. ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఏదో రాస్తే సరిపోతుంది అని అనుకోకుండా సరిచేయాల్సి వస్తుంది. దిద్దుబాట్లు సంఖ్య గురించి ఆలోచించ వలసిన అవసరము లేదు. మీరన్నట్లు కేవలం దిద్దుబాట్లు సంఖ్య పెంచుకోవాలని అనుకుంటే, మీలాంటి వారి విమర్శలకు తావు లేకుండా కూడా అతి తేలికగా పెంచుకునే అవకాశములు చాలా ఉన్నాయి. దిద్దుబాట్లు పెరిగితే దినసరి భత్యం పెరుగుతుందా ? అయినా అంత తేలిక అనుకున్నప్పుడు ఆ పని ఏదో మీరే చెయ్యవచ్చును కదా ! అందుకు ఎత్తిపొడుపులు ఎందుకు ? చీకట్లో ఉంటే వెలుగును చూడలేరు. బయటకు రండి. స్నేహంగా ఉండండి. మంచి సలహాలు ఇవ్వండి. ఏ వాడుకరికి అయినా విషయాల మీద మరింత అవగాహన ముఖ్యం. ఎవరికి ఎలా వీలయితే అలా పని ఇక్కడ చేస్తూ, చేసుకుంటూ ఉంటారు. దానిని మనం వేరే కోణంలో వివిధ రకాలుగా ఆలోచించి చూడడం అవసరము అంతగా లేదు. JVRKPRASAD (చర్చ) 03:01, 16 నవంబర్ 2014 (UTC)
భవిషత్తులో అన్ని దిద్దుబాట్లు సంఖ్యను ఒక ముద్దగా చేసి KB, MB, GB, TB ల్లోకి మార్చి అప్పుడు అందరికీ ర్యాంకులు కేటాయించితే మీలాంటి ఎందరికో చాలా ఉపశమనం కలగ వచ్చును. నిరుత్సాహ పరచే ఇలాంటి అనవసర చర్చలు ఉండవు. JVRKPRASAD (చర్చ) 06:07, 16 నవంబర్ 2014 (UTC)
JVRKPRASAD గారూ, మీరీ వ్యాఖ్యకు స్పందించనవసరం లేదు. వ్యాఖ్య చేసిన అజ్ఞాత సభ్యుడు మీరు సదుద్దేశంతో వ్యవహరిస్తున్నారని అనే అనుకోలును పాటించట్లేదు. అవతలివారి మస్తిష్కంలో ప్రవేశించి, వారి ఆలోచనలు ఆఘ్రాణింపలేని సాధారణ మనుషులందరూ, ఇతర సభ్యులు సదుద్దేశంతో వ్యవహరిస్తున్నారని అనుకోవటం వికీమర్యాద --వైజాసత్య (చర్చ) 23:47, 19 నవంబర్ 2014 (UTC)
వైజాసత్య గారికి, ధన్యవాదములు JVRKPRASAD (చర్చ) 00:03, 20 నవంబర్ 2014 (UTC)

వైజాసత్య గారికి నమస్కారం,,వృత్తిపరంగా నేనొక వైద్యుడిని,,,నాకు తెలుగు పట్ల అభిమానం చాల ఉంది,,అదే అభిమానం తో న వృత్తి సంబందమైన వైద్య శాస్త్ర రచనల విషయం నేను తెవికి కి న తోడ్పాటు అందించగలను..ఆంగ్లము నుండి తెలుగు లోనికి వివిధ వ్యాసాలను అనువదించాలనుకుంటున్నాను,,అయితే వికీ చాలా తికమక గ ఉన్నది,,ఆంగ్లము లోని వ్యాసాలను తెలుగులోనికి అనువదించుట ఎలాగో కొంచెము విసదీకరించాగాలరని ఆశిస్తున్నాను - ఇట్లు భవదీయుడు గణేష్ రేవంత్

మరొక అజ్ఞాత వాడుకరి సంశయం మార్చు

నాకు ఒక అజ్ఞాత వాడుకరి పంపిన సందేశం దానికి నేను ఇచ్చిన నా సమాధానము ఈ క్రింద పొందు పరచు చున్నాను. వాడుకరులు కూడా సమాధానము వారు కూడా పొందాలనుకుంటే చర్చ చేయవచ్చును.

  • ==khali vishayalu==

wiki lo oka nirvahakudu gramavyasalalo khali vibhagalu tolagistunte veroka nirvahakudu khali vibhagalu cherustuntaru. wikilo oka vidhanam umdada?dayachesi teliyajeyamdi.please.--59.88.242.69 14:04, 17 నవంబర్ 2014 (UTC)

బర్కంబా రోడ్డు, న్యూడిల్లీ దగ్గర వారు (ఊహ మాత్రమే) , ఎవరు మీరు ? మీ లాంటి వాళ్ళకు సమాధానము చెప్పవలనవసరము లేదు. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏం తెలుసు ? ఖాళీగా ఉన్నవి ఎక్కడ తొలగించారు ? మీరు ఎవరో ముందు పరిచయము చేసుకుంటే, పద్దతిగా ఉంటుంది. అనామకుల కోసం చర్చలు అనవసరం. గ్రామాలలో విషయములు ఒకే విధంగా ఉండాలని చేర్చుతున్నాను. మీలాంటి వాళ్ళు ముందు వికీలో పని చేయండి. విషయ అవగాహన ఉంటుంది. అయినా కృష్ణా జిల్లా గురించి (చాలా) కొంత నేను కూడా పని చేశాను.. తరువాత వీటి గురించి కూడా వ్రాస్తానని తెవికీ సభ్యులు అడిగితే సమాధానము చెబుతాను. నా విషయాల గురించి మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. JVRKPRASAD (చర్చ) 14:16, 17 నవంబర్ 2014 (UTC)
ఈ విషయం చర్చించదగినది. గ్రామాల వ్యాసాల్లో ఖాళీ విభాగాలు చేర్చితే కొత్తగా వచ్చేవాళ్లు వాటిని మార్గసూచిగా చేసుకొని ఆయా విభాగాలకు తగిన సమాచారం చేరుస్తారని ఆశించి కొందరు సభ్యులు అన్ని గ్రామాలకు ఈ ఖాళీ వర్గాలను చేర్చారు. ఇలాంటి ఖాళీ విభాగాలు ఎప్పటికీ నిండవు, మోడుబోయిన కొమ్మల్లా ఎప్పటికీ చదువరులకు కంటకంగానూ, ప్రతి గ్రామ వ్యాసంలో ఏదోసమాచారమున్నట్టు ఎండమావిలా భ్రమను సృష్టిస్తాయని మరికొందరు సభ్యులు వాటిని తొలగిస్తున్నారు. ఇరుపక్షాలు సదుద్దేశంతోనే వ్యవహరించారు/వ్యవహరిస్తున్నారని గుర్తించాలి. వ్యాసాల్లో ఖాళీ విభాగాలు చేర్చేముందు దాని గురించి విస్తృతమైన చర్చ ఏదీ జరగలేదు. చొరవతీసుకొని ఇంత పెద్దమొత్తం వ్యాసాలలో మార్పులు చేసినప్పుడు, అదే చొరవతో తొలగించేవాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. దిద్దుబాట్లు, ఆ పై దిద్దుబాట్లు ఇలానే వికీ వ్యాసాలు నాణ్యతగా అభివృద్ధి చెందుతాయి. కొన్నిసార్లు శ్రమ వృధా అయినట్టు అనిపిస్తుంది. కానీ సమిష్టి కృషిలో ఇది తప్పదు. వీలైనంతగా అనుభవజ్ఞులైన సభ్యులు, ఎలాంటి మార్పులు లేదా వ్యాసాలు దీర్ఘకాలంగా మనలేవు అని చూసి, ఆయా విషయాలపై సమయం వృధా చేసుకోవద్దని వారిస్తూ ఉంటారు. ఇలాంటి సూచనలను ఇతర సభ్యులు యధేచ్చగా మార్పులు చేసేందుకు నిరోధకంగా భావించకూడదు. ఎందుకంటే అలా వారించిన తర్వాత కూడా ఆయా సభ్యులు తమ ఇష్టానుసారం వికీసూత్రాలను ఉల్లంఘించని పద్ధతిలో మార్పులు చేసే అవకాశం ఉంది. (ఉదాహరణకు: గ్రామాల్లో గణంకాలు బాటుచే సులువుగా చేయించవచ్చు, సమయం వృధా చేసుకోవద్దని వారించాను. అయినా కొందరు సభ్యులు అలా చేర్చటం కొనసాగించారు. వారు చేసినదాంట్లో తప్పేమీలేదు. కానీ అనసవరంగా వందల గంటల సమయాన్ని వెచ్చించారు) --వైజాసత్య (చర్చ) 03:23, 20 నవంబర్ 2014 (UTC)

బెంగాళీ వికీపీడియా దశమ వార్షికోత్సవంలో పాల్గొనడం మార్చు

బెంగాళీ భాషలో వికీపీడియా ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2015 జనవరి 9,10 తేదీలలో కలకత్తాలో బెంగాళీ వికీపీడియా దశమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఇతర భాష సముదాయాల సభ్యులనుండి కూడా దరఖాస్తులను ఆహ్వానించడం [ఆహ్వానం] జరిగింది. ప్రతి సముదాయం నుండి ఐదుగురు సభ్యులకు స్కాలర్ షిప్ ఇవ్వడం జరుగుతుంది. కనుక బెంగాళీ వికీపీడియా దశమ వార్షికోత్సవంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న సభ్యులు తమకుతాముగా ప్రతిపాదించుకోవచ్చు లేదా ఇతర సభ్యులను ప్రతిపాదించవచ్చు...

ప్రతిపాదనలు

  1. ప్రణయ్‌రాజ్ వంగరి
  2. YVSREDDY
  3. Raj.palgun13 (చర్చ)
  4. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  5. [[Bhaskaranaidu (చర్చ) 15:55, 30 నవంబర్ 2014 (UTC)]]
  6. Ranjithraj (చర్చ) 12:45, 5 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  '. నేను ప్రణయ్ రాజ్ బాంగ్లా వికీపీడియా సదస్సుకు హాజరవడాన్ని సమర్ధితున్నాను. కోల్‍కతా లో జరిగే ఈ సమావేశాల్లో పాల్గొని భారతదేశ సమూహాలతో మరింత అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:37, 24 నవంబర్ 2014 (UTC)
  ' - చక్కని అవకాశం, చొరవ తీసుకొని వెళుతున్న ప్రణయ్ రాజ్ గారికి ధన్యవాదాలు. మరింతమంది వీలైన సభ్యులు వెళ్ళగలిగితే బాగుంటుంది --వైజాసత్య (చర్చ) 07:59, 25 నవంబర్ 2014 (UTC)
  ' - ప్రణయ్ రాజ్ బెంగాలీ వికీపీడియా ఉత్సవాలకు హాజరవ్వడాన్ని స్వాగతిస్తున్నాను. ఇది ఎన్నో కొత్త విషయాలు నేర్చి తెవికీలో ప్రవేశపెట్టేందుకు, మనం చేసిన మంచి మార్పులు వారికి తెలిపేందుకు వినియోగిస్తారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:42, 26 నవంబర్ 2014 (UTC)
  ' - ఉత్సాహంగా వెళుతున్న సభ్యులకు శుభాకాంక్షలు, ఒకసారి గమనించండి వారి పేజీలో మునుపు 2000 చార్జీల నిమిత్తం ఇచ్చారు. తరువాత 3000 వరకూ అని ఇచ్చారు, కనుక ఎంత వరకూ వాళ్ళు ఇస్తారో కనుగొనగలరు..రెడ్డి గారూ మీరు https://meta.wikimedia.org/wiki/Bengali_Wikipedia_10th_Anniversary_Celebration_Kolkata/Scholarships#Telugu_Community లో మీ వికీ పేరు రాయండి... విశ్వనాధ్ (చర్చ) 06:59, 27 నవంబర్ 2014 (UTC)

ఇతర సభ్యుల అభిప్రాయాలు


సభ్యులు స్పందిచగలరు...--Pranayraj1985 (చర్చ) 14:22, 21 నవంబర్ 2014 (UTC)

పేజీలో ఫొటొను పెట్టడం రావట్లేదు. మార్చు

నేను తెలుగు వికిపీడియా లో డ్రీం థియేటర్ అనే పేజీని శృష్టించాను. అందులొ ఫొటొను పెట్టడం రావట్లేదు. ఇదే పేరు గల English article లో ఉన్నది ఆ ఫొటొ. దయచేసి సహకరించండి. Sarat.iisc (చర్చ) 17:58, 21 నవంబర్ 2014 (UTC)

నమస్కారం Sarat.iisc గారు... ఇంగ్లీష్ వ్యాసంలో గల ఫోటో లింక్ ను కాపీ చేసుకొని, తెలుగు వ్యాసంలో పెస్ట్ చేస్తే ఫోటో వచ్చేస్తుంది. Pranayraj1985 (చర్చ) 11:46, 22 నవంబర్ 2014 (UTC)
Pranayraj1985 గారు. నేను మొదట అదే చేసాను కానీ ఫొటో రాలేదు. [ఇది నేను రాస్తున్న పేజీ]. Dream Theater పేజీను అనువదిస్తున్నాను. "దస్త్రం:Dream theater in 1985.jpg" అని ఎర్ర రంగులొ వస్తుంది. దయచేసి సహకరించండి. Sarat.iisc (చర్చ) 18:17, 22 నవంబర్ 2014 (UTC)
Sarat.iisc గారూ, మీ సమస్య అర్థమైంది. ఒక భాషా వికీలోని బొమ్మ అదే పేరుతో మరో వికీలో కనిపించాలంటే అది తప్పకుండా కామన్స్ లోనిదై ఉండాలి. కాని కామన్స్‌లో సార్వజనీనమైన బొమ్మలు మాత్రమే ఉంటాయి. మీరు చెప్పే బొమ్మ కాపీ హక్కులకు సంబంధించినది కాబట్టి అది కామన్స్‌లో కాకుండా కేవలం ఆంగ్లవికీలో అప్లోడ్ చేయబడింది. కాబట్టి మనం మళ్ళీ తెవికీలో అదే పేరుతో అప్లోడ్ చేయనంతవరకు ఆ బొమ్మకై అదేపేరుతో తెవికీలో ఉపయోగించడానికి వీలుండదు. మరో విషయం మీరు ఒక వ్యాసానికి సంబంధించిన చర్చలను రచ్చబండలో కాకుండా ఆ వ్యాసపు చర్చాపేజీలో కాని మీ చర్చాపేజీలో కాని వ్రాయండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:25, 22 నవంబర్ 2014 (UTC)

ప్రముఖుల వ్యాసాలలోని విభాగాలు వ్యాసాలుగా అభివృద్ధి మార్చు

తెలుగు సాహిత్య ప్రముఖులైన శ్రీశ్రీ, విశ్వనాథ, గురజాడ, చలం వంటి విస్తృత చర్చనీయులు, పరిశోధితుల గురించి వ్యాసాలను అభివృద్ధి చేస్తున్నాను నా ఆసక్తిని, నా వద్ద ఉన్న సోర్సులను అనుసరించి. ఐతే వారి గురించి చెప్పదగిన అంశాలు విపులంగా, విస్తృతంగా ఉన్నట్టు తెలిసివస్తోంది. వారి వ్యక్తిత్వాన్ని గురించి, వారి సాహిత్యాన్ని గురించి, వారి సాహిత్య ప్రభావం గురించి, అడాప్టేషన్ల గురించి వ్రాయదగ్గ విశేషాలు చాలానే వున్నాయి. పైగా వాటిని అక్కడే ఎంత తగ్గించి రాసినా వ్యాసం బాగా విపులమైపోయి చదివేవారికి విసుగెత్తుతుందేమోననీ అనిపిస్తోంది. ఆంగ్లంలో పరిశీలిస్తే షేక్స్పియర్ Shakespeare's life, Shakespeare's plays, William Shakespeare's collaborations, Shakespeare in performance, Shakespeare's sonnets, Shakespeare's influence, Shakespeare's reputation, Timeline of Shakespeare criticism, Shakespeare authorship question, Shakespeare's religion, Sexuality of William Shakespeare, Portraits of Shakespeare, Shakespeare bibliography and Chronology of Shakespeare's plays అనే విభిన్న వ్యాసాల సముదాయం (ఆయన నాటకాల గురించిన వేర్వేరు పేజీలు కాకుండా) తయారుచేశారు. ఆయన జీవితం, నాటకాలు మొదలుకొని ఇవి 14 వ్యాసాలు ఉన్నాయి. ప్రధాన వ్యాసంలో పట్టనంత ఇన్ఫర్మేషన్ ఇలా మలిచారు. ఇప్పుడు నా ప్రశ్నల్లా విశ్వనాథ సత్యనారాయణ జీవితం గురించి, శ్రీశ్రీ వ్యక్తిత్వం గురించి, గురజాడ అప్పారావు ప్రభావం గురించి, చలం వ్యక్తిత్వం గురించి ప్రామాణికమైన సోర్సుల నుంచి వ్రాయదగ్గ ఇన్ఫర్మేషన్ తో కొత్త వ్యాసం తయారుచేయవచ్చా? అక్కడ అభివృధ్ధి చేసి ఆపై విడిగా తయారుచేయమన్న సమాధానాలు వచ్చాయి కానీ ఇప్పుడు శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని గురించి ఉన్న విస్తారమైన సమాచారం సప్రమాణంగా రాస్తూ ఉంటే వ్యాసం పెద్దదైపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఇంతకీ శ్రీశ్రీ వ్యక్తిత్వం గురించి ఓ వ్యాసం విడిగా వ్రాయవచ్చా?--పవన్ సంతోష్ (చర్చ) 09:25, 24 నవంబర్ 2014 (UTC)

పవన్ సంతోష్ గారూ, తప్పకుండా వ్రాయవచ్చు. మొదట శ్రీశ్రీ వ్యాసంతో ప్రారంభించాలి. అక్కడ శ్రీశ్రీ వ్యక్తిత్వం గురించి వ్రాస్తూ పోతే, వ్యాసం సమతుల్యత కోల్పోతుంది. అప్పుడు చూసినవాళ్లు దీన్ని ప్రత్యేక వ్యాసంగా చేయాలని ప్రతిపాదిస్తారు. అలా కొత్త వ్యాసం మొదలౌతుంది. కానీ శ్రీశ్రీ ప్రధాన వ్యాసంలో మాత్రం తప్పకుండా శ్రీశ్రీ వ్యక్తిత్వం యొక్క సంక్షిప్త చిత్రం ఉండాలి. ఎందుకంటే శ్రీశ్రీ గురించి తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళకు ఈ ముఫ్ఫై వ్యాసాలు చదివితే తప్ప మీరు శ్రీశ్రీ గురించి తెలుసుకోలేరు అన్న పరిస్థితి రాకూడదు. ఇంకో పద్ధతిలో మీకు ఖచ్చితంగా వ్యాసం వ్రాయగల స్థాయిలో సమాచారం ఉందనిపిస్తే తప్పకుండా శ్రీశ్రీ వ్యక్తిత్వం అనే వ్యాసం వ్రాసి, దాన్ని సంక్షిప్తంగా శ్రీశ్రీ వ్యాసంలోనూ ఒక విభాగంగా కూడా వ్రాయాలి. --వైజాసత్య (చర్చ) 07:56, 25 నవంబర్ 2014 (UTC)
సరేనండీ. ప్రస్తుతానికి నాకే శ్రీశ్రీ వ్యాసం సమతుల్యత చెడగొడుతున్నానా అని అనుమానం వచ్చి ఇక్కడ ప్రశ్నించాను. ఆ వ్యాసంలోనే ముందు విస్తరిస్తాను. ఆపైన ఎలాగూ మీరన్న స్థితి వస్తే కొత్త వ్యాసం ప్రారంభించవచ్చు కదా.--పవన్ సంతోష్ (చర్చ) 08:05, 25 నవంబర్ 2014 (UTC)

విజయవాడ ఆంధ్ర లొయోల కళాశాలలో వికీపీడియా మార్చు

నమస్కారం,

వికీపీడియా ద్వారా విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ మరింత అభివృద్ధి చేసే విధంగా ఆంధ్ర లొయోల కళాశాల విద్యార్థులు పలు కార్యక్రమాలు చేస్తున్నారు. తెలుగు విభాగం వారు ఒక వైపు ప్రముఖ తెలుగు రచయితల జీవితచరిత్రలను చేరుస్తూ, వికీసోర్స్ లో కొన్ని పుస్తకాలను చేర్చుతున్నారు. బోటనీ, ఫిజిక్స్ విద్యార్థులు వికీ వ్యాసాల నాణ్యతను కొన్ని కొలమానాలననుసరించి అధ్యయనం చేసి ఆయా వ్యాసాలను అభివృద్ధి పరుస్తారు. ఈ సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం కళాశాల పనివేళల తరువాత సాయంత్రం 3:30 నుండి 7:00 వరకూ నేను విద్యార్థులకు కళాశాలలోనే ఉంటూ సహాయం అందిస్తున్నాను. కొందరు తెవికీ సభ్యులను ఫోన్ ద్వారా సంప్రదించి ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులను కలవాల్సిందిగా అడిగాను. తెలుగు వికీపీడియా సభ్యులు ఎవరయినా విద్యార్థులతో మాట్లాడి వారికి మరింత స్ఫూర్తిని అందించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమం డిసెంబర్ 6 వరకూ కొనసాగనుంది. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:09, 26 నవంబర్ 2014 (UTC)

నేను డిసెంబరు 6తేదీ విజయవాడ వచ్చే అవకాశం కల్పించుకుంటున్నాను. కొద్ది రోజులుగా తెవికీలో తెలుగు సాహిత్య ప్రముఖుల వ్యాసాలు అభివృద్ధి చేసే దిశగా చేసిన కృషిని వారితో పంచుకుని, నా వద్ద ఉన్న మూలాలు వారికి అందించేందుకు అవకాశం ఉంటుందా? --పవన్ సంతోష్ (చర్చ) 07:44, 26 నవంబర్ 2014 (UTC)
నేనుకూడా పాల్గొనాలని వుంది. వీలు కల్పించుకుని వస్తాను. --గుళ్ళపల్లి 09:21, 30 నవంబర్ 2014 (UTC)
కళాశాల విద్యార్ధులు చేర్చిన కొన్ని భౌతికశాస్త్ర వ్యాసాల్ని పరిశీలించాను. భౌతికంగా నేను విజయవాడ రాలేను. ఎవరినైనా నాకు ఫోన్ ద్వారా లింకు చేస్తే వారికి నా సహాయాన్ని అందించగలను. మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 17:44, 1 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

డిసెంబర్ 5 వ తేదీన నేను, ప్రణయ్‌రాజ్, పవన్ సంతోష్, గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు విజయవాడ లొయోలా కళాశాలకు వెళుతున్నాం. ఆశక్తి ఉన్న ఇతర సభ్యులు కూడా రావచ్చు...విశ్వనాధ్ (చర్చ) 06:40, 2 డిసెంబరు 2014 (UTC) ప్రస్తుతం లయోల కలేజిలో తెలుగు శేఖ అధ్వరంలో కందుకురి వీరేశళలింగం గారి రచనలు వికీసొర్సస్ లో వ్రాయతం జరుగుతుంది..106.51.151.177 17:43, 29 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతం లయోల కలేజిలో తెలుగు శేఖ అధ్వరంలో కందుకురి వీరేశళలింగం గారి రచనలు వికీసొర్సస్ లో వ్రాయతం జరుగుతుంది..Raj.palgun13 (చర్చ) 17:55, 29 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

  • ముందుగా అనుకున్న ప్రణాళికకు అనుగుణంగా నేను డిసెంబర్ 5, 2014న విజయవాడకు చేరుకుని, విజయవాడలోని లయోలాకళాశాలలోని బి.ఎ. విద్యార్థులకు వికీపీడియా గురించి, డీఎల్‌ఐ పుస్తకాలు జాబితా వేసే కార్యకలాపాల గురించి, విద్యార్థులకు ఆ పుస్తకాల ఉపయోగం గురించి ప్రసంగించాను. దాదాపుగా 30మంది ఉన్న ఆ క్లాసులో తెలుగు అధ్యాపకులు కోలా శేఖర్ గారు నన్ను మాట్లాడేందుకు అనుమతించారు. కార్యక్రమానంతరం కొంత విశ్రాంతి తర్వాత సాయంత్రం 3.30 నుంచి 6 గంటల వరకూ సీఐఎస్-ఎ2కె మరియు లయోలా కళాశాలల సంస్థాగత భాగస్వామ్యంలో భాగంగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పై అంశాలనే ప్రాక్టికల్ గా అర్థమయ్యే విధంగా కంప్యూటర్లపై శిక్షణ నిర్వహించాను. ఈ కార్యక్రమంలో మరో 20మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరందరితోనూ తర్వాతి రోజు నేను విశ్వనాథ్.బి.కె. మాట్లాడి వారికి తెవికీ గురించి ఆసక్తికరమైన వివరాలు చెప్పాము. ఈ కార్యక్రమంలో సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం ఆఫీసర్ హోదాలో అక్కడవున్న రెహ్మానుద్దీన్ ఏర్పాట్లు పర్యవేక్షించి సహకారం అందించారు.--పవన్ సంతోష్ (చర్చ) 15:16, 4 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాదు బుక్ ఫెయిర్ మార్చు

ఈసారి బుక్ ఫెయిర్ డిసెంబర్ 16 నుండి 25 వరకు నెక్లెస్ రోడ్డులో నిర్వహించబడుతోంది. దాన్లో తెవికీని ప్రచారం చేసే అవకాశాలను పరిశీలించాలి. e-తెలుగు సంస్థతో కలిసి ఒక స్టాల్ నిర్వహిస్తే బాగుంటుంది. --స్వరలాసిక (చర్చ) 16:16, 28 నవంబర్ 2014 (UTC)

e-తెలుగు ప్రస్తుతం కార్యకలాపాలేమీ చెయ్యట్లేదనుకుంటా.. కశ్యప్ గారే దానికి చాన్నాళ్ళ నుంచీ కార్యదర్శి కనుక ఈ విషయాన్ని ఆయనే నిర్ధారించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 16:32, 28 నవంబర్ 2014 (UTC)
హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో తెవికీ తరఫున ఓ స్టాల్ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్టు పేజీని భవిష్యత్తులో ప్రారంభించడం జరుగుతుంది. ఈలోగా సహసభ్యులు తగు సూచనలు చేయాల్సిందిగా మనవి. ఈ కార్యక్రమానికి సిఐఎస్-ఎ2కె వారి సహకారం తీసుకోవాలని ఆశిస్తూ అందుకూ తగ్గ ప్రయత్నాలు చేస్తున్నాము.--పవన్ సంతోష్ (చర్చ) 06:48, 1 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  1. శుభ సూచకము: ఆ బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా గురించి సమగ్ర సమాచారమున్న ఒక చేతి పుస్తకము తయారు చేసి పంపిణి చేస్తే బాగుంటుందని నా సూచన. Bhaskaranaidu (చర్చ) 06:57, 1 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియా స్వతంత్రంగా స్టాలు నిర్వహిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం ,K Chandramohan, Secretary, +91-720 73 79 241 గారిని అడిగి స్టాలు కి ఏమన్నా డిస్కౌంట్ ఇస్తారో మీకు తెలియ పరుస్తాను మాములుగా 10x9 Feet స్టాలు తొమ్మిదివేలు . నేను నాలుగు సంవత్సరాలు eతెలుగు స్టాలు లో వాంలంటీరుగా చేసాను, మీడియాకు , రచయితలకు ,తెలుగు భాషాభిమానులకు చేరువ కావటానికి ఇది మంచి అవకాశం , వచ్చే నెల విజయవాడ పుస్తక ప్రదర్శన కూడా ఉన్నది కాబట్టి మనకు పెద్ద మొత్తంలో ప్రచార సామాగ్రి అవసరం --కశ్యప్ 16:15, 1 డిసెంబరు 2014 (UTC)
మన వికీ స్టాలు నిర్వాహణకు నేను అనుకొంటున్న కనీస ఖర్చు మొత్తం : 40000

స్టాలు : 10000 బానర్లు : 2000 కరపత్రాలు : 10,000 వాలంటీర్ల , ఖర్చు : నిర్వాహణ : 8000 నేను రెండు లాప్టాపులు,ఒక ప్రోజక్టర్లలను తీసుకురావటానికి ప్రయత్నం చేయగలను --కశ్యప్ (చర్చ) 17:42, 2 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ముందుగా బుక్ ఫెయిర్‌లో స్టాల్ పెట్టడానికి సలహా అందించిన మురళీమోహన్ (స్వరలాసిక) గారికి కృతజ్నతలు. అంత మొత్తం సరిపోవు అనుకుంటూన్నాను - CIS ను మరోసారి సంప్రదించిన మిదట 70 నుండి 80 వేల వరకూ ఖర్చులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసారు. అందుకు విష్ణు, రహ్మానుద్దీన్ గార్లకు కృతజ్నతలు. నేను ఖర్చులకై కశ్యప్ను సంప్రదించి ఒక డాక్యుమెంట్‌లో రాసి నా దగ్గర ఐడిలు ఉన్నంత వరకూ అందరికీ షేర్ చేసాను. దయచేసి మార్పులు చేర్పులు సూచిస్తే. దీనిపై ఒక పేజీ ప్రారంబించవచ్చు...విశ్వనాధ్ (చర్చ) 12:33, 3 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసిక, Bhaskaranaidu , విష్ణు, రహ్మానుద్దీన్, విశ్వనాధ్, కశ్యప్, పవన్ సంతోష్ లకు ధన్యవాదాలు. బుక్ ఫెయిర్‌ కి ఎంతో సమయం లేదు. కనుక సహ సభ్యులంతా స్పందించి... విశ్వనాధ్ గారు తయారుచేసిన డాక్యుమెంట్‌ ను పరిశీలించి తగిన సూచనలు అందించగలరు. Pranayraj1985 (చర్చ) 12:51, 6 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

^విశ్వనాధ్ గారు CIS-A2K మన వికీ సముదాయ సేవలో ఉంది. కాబట్టి కృతజ్ఞతలు అనవసరం.
తెవికీ సభ్యులు వీలైనంత త్వరగా చర్చించి మెటాలో ఇక్కడ రిక్వెస్ట్ పెట్టగలరు. ఖర్చుల నిర్వహణ బాధ్యత ఎవరు తీసుకుంటారో వారి బ్యాంకు ఖాతా వివరాలు మెయిల్ ద్వారా పంపగలరు. --విష్ణు (చర్చ)14:00, 8 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ బుక్ ఫెయిర్ కోసం వికీపీడియా:హైదరాబాద్ పుస్తక ప్రదర్శన - తెవికీ స్టాల్ పేజీలో సహ సభ్యులు తమ సూచనలు, సలహాలు ఇవ్వగలరు..విశ్వనాధ్ (చర్చ) 06:50, 9 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మెటా వికీ పేజిలో బడ్జెట్ రిక్వెస్ట్ కు మద్దతు తెలుపుటకు ఇక్కడ చూడగలరు. Pranayraj1985 (చర్చ) 11:16, 9 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక శుభవార్త : ఈ సారి పుస్తక ప్రదర్శనలో e తెలుగు కి స్టాలు ఉచితంగా ఇవ్వటానికి నిర్వాహకులకు అంగీకరించారు. .. కరపత్రాలలు , బానర్లు చేయాలి --కశ్యప్ (చర్చ) 12:38, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి వార్త - కరపత్రాల తయారీ మేటర్ కొరకు అందరూ తలో చేయూ వేస్తే బావుండు....విశ్వనాధ్ (చర్చ) 14:00, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

;హైదరాబాదు బుక్ పెయిర్ లో తెలుగు వికిపీడియా నిర్వహణ గురించి ఒక నివేధిక మార్చు

1. మన తెలుగు వికీపీడియా స్టాలు లో బ్యానర్ల అలంకరణ చాల బాగున్నది.

2. 17 డిసెంబరు 2014 నుండి 26 డిసెంబరు 2014 ( 10 రోజులు) వరకు జరిగిన బుక్ పెయిర్ మన స్టాలు కొచ్చిన సందర్శకుల సంఖ్య అధికంగా వున్నది. అందరికి కర పత్రాలు పంచి వికీ పీడియా గురించి అవగాహన కలిగించ గలిగాము. ఒకరిద్దరి చేత అప్పటికప్పుడు వారి పేరును కూడ నామోదు చేయించ గలిగాము. సందర్శకులలో ముఖ్యంగా విధ్యార్తులు, ఉపాద్యాయులు, రచయితలు, ఇతర ప్రముఖులు వున్నారు. వచ్చిన వారికి కర ప్రత్రాలను ఇచ్చి అవగాహన కల్పించడముతో బాటు, ఇతర సాంకేతిక పరిజ్ఞానము కొరకు 28.12.2014 న ఆదివారము గోల్డెన్ త్రెష్ హోల్డ్ లో జరగ బోవు హాకదాన్ లో సాయంకాలము 3.00 గంటలనుండి పాల్గొని మరింతే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకో వలసినదిగా కోరడమైనది. అటు వంటి వారి పేరు, పోన్ నెంబరు కూడ మొదలగు వివరాలు కూడ నామోదు చేయడమైనది. సందర్శకుల స్పంధనను బట్టి చూస్తే ఆదివారం నాడు చాల మంది ఔత్సాహికులు వచ్చె అవకాశమున్నది. కనుక వారి అవసరార్థము తగు ఏర్పాట్లు చేయ వలసి వున్నది. ముఖ్యంగా బుక్ పెయిర్ చివరి రోజైన 26 డిసెంబరు నాడు సందర్శకుల సందడి అనూహ్యంగా వుండినది. వచ్చిన వారిలో..... తెలుగు భాషాశాస్త్ర విధ్యార్థులు, ఉపాద్యాయులు, ఎక్కువగా వచ్చారు. వారిలో కొంతమంది సివిల్సు/ గ్రూప్ పోటీపరీక్షలో 'తెలుగు సాహిత్యము ' ప్రధానాంశముగా తీసుకొన్న వారు వున్నారు. వికీపీడియాలో వారికి కావలసిన సమగ్ర సమాచార మున్నదని దాని అవగాహన కొరకు మరియు వారికి తెలిసిన సమాచారము వికీపీడియాలో వ్రాయలనే ఉత్సాహముతో మన అవగాహన సదస్సుకు వస్తామన్నారు. అటు వంటి వారికి వికీపీడియా గురించి పూర్తి అవగాహన కలిగించి వారిని ఉత్సాహ పరచ వలసిన అవసరమెంతో వున్నది. అటు వంటి వారి వలన వికీపీడియాకు, వికీపీడియా వలన వారికి చాల ఉపయోగ పడే అవకాశమున్నది. కనుక ఆవగాహన సదస్సులో వీరికి కావలసిన పరికరాలను అందుబాటులో వుంచ వలసి వున్నది. చివరి రోజున పంచడానికి కర పత్రాలు అయిపోగా ....... బ్యానర్లను పోటో తీసుకెళ్ళిన ఔత్సాహికు లెందరో వున్నారు.

3.ఒక వేళ సందర్శకులు ఎక్కువైతే .... వారిని గ్రూపులుగా విభజించి ఒక్కో గ్రూపుకు ఒక వికీపీడియన్ కేటాయించి వారికి అవగాహన కలిగించి, వారిచే అప్పటికప్పుడు వారి పేరును నామోదు చేయించి..... వికీలో వారు మార్పులు చేర్పులు చేయించేటట్లు కర్యోన్ముఖులను చేయ వలసి వున్నది. ఇంత వరకు జరిగిన వికీపీడియా అవగాహన సదస్సుల వల్లనైతేనేమి లేదా వాడుకరులు వారంతట వారే పేరు నామోదు చేసుకున్నవారు ఐతేనేమి సంఖ్యా పరంగా అటువంటి వారు చాల ఎక్కువగానే వున్నారు. అటు వంటి వారు అక్కడితోనే ఆగి పోతున్నారు. మార్పులు చేర్పులు ఏమాత్రము చేయడములేదు. కనీసము వారి వారి వాడుకరి పుటనును కూడ ప్రారంబించని వారు వేల సంఖ్యలో వున్నారు. (కొత్త వాడుకరుల గణాంకాలను చూడు) ఆ విషయాన్ని దృష్టిలో వుంచుకొని ప్రతిఒక్కరు పేరు నామోదు తర్వాత........ వారి వాడుకరి పుటను కూడ సృష్టించేటట్లు చేయాలి.

దొర్లిన అపశృతులు
ముందు ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు

1.మొదటి రెండు రోజులు.... కరపత్రాలు అందుబాటులో లేనందున కొంత ఇబ్బంది కలిగినది. అదే విధంగా చివరి రోజైన 26 డిసెంబరు నాటికి అప్పటివరకు అందుబాటులో వుండిన కరపత్రాలన్ని సా. 5.00 గంటలకే అయిపోయాయి. సాధారణంగా సందర్శకుల ప్రవాహం ఐదు గంటల తర్వాతనే ఎక్కువ. చివరి రోజున మరీ ఎక్కువ. కరపత్రాల లేమి వలన చాల ఇబ్బంది పడవలసి వచ్చినది.

2. వికీపీడియా కార్యక్రమాలంటే ఏ ఒక్కరిదో స్వంత భాద్యత కాకూడదు. స్థానికంగా వున్నవారందరూ కలసికట్టుగా పనిచేయాలి. ప్రతి ఒక్కరికి వారి వారి ముఖ్యమైన వ్వక్తిగత పనులుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని, మాట్లాడుకొని వారి తీరిక సమయంలో వికీపీడియాకు సహరించేటట్లు ముందస్తు అవగాహన చేసుకుంటే...... వికీపీడియా కార్య క్రమాలకు ఆటంకముండదు. అలాకాకుండా..... ఎవరికి వారే ఆ పని వారు చూసుకుంటారులే అని అనుకుంటే ...... ఎవరూ రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బుక్ పెయిర్ విషయంలో జరిగిందదే...... కరపత్రాలను ముద్రించడము, బ్యానర్లను తయారు చేయించడము, వాటిని బుక్ పెయిర్ స్టాలుకు తీసుక రావడము, బ్యానర్లను అలంకరించడము, బుక్ పెయిర్ అయిపోయిన తర్వాత బానర్లను విప్పడము, వాటిని జాగ్రత్త పరచడము మొదలగు పనులన్ని ఒక్కడిమీదనే వేయబడినది. హైదరాబాదులో స్థానికంగా వున్న సహ వికీపీడియన్లు కూడ సమయానికొచ్చి ఆ ఒక్కడికి సహకరించక పోవడము విచారకరము. ఎక్కడ వికీపీడియా కార్యక్రమము జరిగినా..... అక్కడి సహ వికీ పీడియనులు ఆ కార్యక్రమంలో స్వచ్చందంగా సహకారం అందించేటట్లు వుండాలి.

3. మనం చేసేది ముఖ్యంగా వికీపీడియా అవగాహన సదస్సులే..... ఇందులో ఒక్కసారిగా పది మందితో మాట్లాడవలసి వుంటుంది. అటువంటి సందర్బంలో మనకు అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని దాన్ని వాడితే ఫలితము మరింత మెరుగ్గ వుంటుంది. ఈ బుక్ పెయిర్ లో కంప్యూటర్లను పెట్టాలనుకున్నాం, ప్రొజెక్టరును పెట్టాలనుకున్నాము. కాని........... ఇవేవి అందు బాటులో పెట్టలేదు. కేవలము నోటి మాటలతోనే పని కానిచ్చామని పించుకోవలసి వచ్చినది. వచ్చిన సందర్శకులు చాలమంది..... కంప్యూటర్ పెట్టలేదెందుకని, డెమో ఇచ్చుంటే బాగుండేదని..... అన్నప్పుడు ....... ?????.

4. వికీపీడియా అంటేనే కంప్యూటర్ తో పని. అలాంటప్పుడు కంప్యూటర్ లేకుండ..... పేపర్లతోను, నోటి మాటలతోను పని కానివ్వాలనుకుంటే........ హాస్యాస్పదంగా వుంటుంది... ముందు ముందు జరగబోవు కార్యక్రమాలలో జాగ్రత్త వహించాలి.

5. సహ వికీపీడియన్లు మీ అభిప్రాయాన్ని వ్రాయండి.

ఎల్లంకి (చర్చ) 07:13, 27 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

1.కొత్త కరపత్రాల ముద్రణ కు కొంచెం సమయం పట్టినది, అంత వరకు మొదటి ఈతెలుగు కరపత్రము వాడాము. 26 డిసెంబరు నాడు రెండు వేల కరప్రతాలు అందువబాటులొ ఉన్నవి, అవి అయిపొయిన విషయం నాకు స్టాలుకు వచ్చిన తరువాత తెలిసినది. అప్పటికి ఒక గంట మాత్రమే వ్యవది ఉండటంతో నేను అంద చేయలేక పోయాను.

2. కొన్ని ఇతర కార్యకమాల వలన స్వచ్చందంగా వచ్చే వాలంతీర్ల సంఖ్య తగ్గినంది , సాయంత్రాలు సెలవు రొజులలొ స్టాలులో కనీసం ముగ్గురు వాలంటీర్లు వున్నారు. బానర్లు , కరపత్రాలు నాకు అలవాటు అయిన పనే కాక పొతే కొన్ని సాంకేతిక సమస్యాల వలన ఆలస్యం అయినది. మనం ఈ ముద్రణ పనులు మనం వారం ముందే పూర్థి చేసుకొని ఉండవలసినది. సిక్కర్లు కూడా చేయలేక పోయాము.

3. సాయంత్రం 5.30 దాకా వెలుగు ఎక్కువగా ఉండటం వలన కంప్యూటర్ లొ సరిగా చూపించ లేక పోయము, ఆదివారం ,శనివారం ఇంకా ప్రతి సాయంత్రం మనం అడిగిన వారికి కంప్యూటర్ లొ చూపించాము, ఒక లాప్టాప్ దీనికోసమే బాడుగకు తీసుకొన్నాము. స్టాలు వెనుక వైపు , కరపత్రంలో మొదటి పేజి తెరపట్టును ప్రదర్శించాము. ఆసక్తి చూపిన సందర్శకుల వివరాలు సేకరించాము, వీరి కొసమే 28 ఆదివారం సాయంత్రం ఒక అవగాహన సదస్సు తలపెట్టి 300లకు పైన చిరునమా స్లిప్పులు అందచేసాము

4. తెలుగు వికీపీడియా స్టాలు ఒక ప్రాధమిక అవగాహన కొరకు ఎర్పాటు చెయ్యబడినది అన్ని వందల స్టాళ్ళ మద్య సందర్శకులు నిలబడి కెటాయించే ఒక నిమిషమ్ం సమయంలొ వికీపీడియా గురించి వివరింప వీలు కాదు, వికీపీడియా అవగాహన సదస్సుల వలన మనం పూర్తి అవగాహాన కల్పించవచ్చు .


5. సహ వికీపీడియన్లు మీ అభిప్రాయాన్ని వ్రాయండి.--కశ్యప్ (చర్చ) 11:37, 28 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Community Participation Support at Swatantra 2014 మార్చు

Dear Wikimedians,

ICFOSS, Govt of Kerala in collaboration with FSF-India, CIS, SFLC.in, Swatantra Malayalam Computing and other like minded organisations is celebrating Swtantra-2014, fifth international free software confrence of Kerala. This is scheduled during 18-20 December 2014 at Thiruvananthapuram. More details about the event can be seen at : http://icfoss.in/fs2014/ .

CIS-A2K will be providing limited travel and stay scholarships to interested Wikimedians from various language communities to attend this event and benefit from it. Upto 10 scholarships are available for Wikimiedians applying from Kerala. Upto 3 scholarships will be considered from other Indic Wikimedians and India based English Wikipedians. If you are interested please register your name here on Meta.

Eligibility: You should have been a Wikimedian with a minimum of 200 edits on Wikimedia projects as on June 1, 2014.

Important dates: Nominate yourself by December 8, 2014 (many apologies for this delay and short notice). We will confirm support by December 9, 2014.

Travel & Stay information: (applicable only once the support is confirmed)

  • Low fare flight costs will be considered if your travel by bus/train is more than 24 hours to Thiruvananthapuram.
  • Stay in budget hotels, preferably on twin sharing basis.
  • All costs of the selected Wikimedians will be reimbursed on actual basis upon submission of original bills to CIS Office in Bangalore within 10 days of receipt.
  • It is essential to submit boarding passes along with tickets if you travel by a flight.
  • CIS could help book flight tickets upon request. Those interested to avail this support need to fill a form that we will circulate

Queries and correspondence:

  • For all queries, please write to rahim{at}cis-india.org and vishnu{at}cis-india.org

Expectations from selected Wikimedians:

  • Please see if you could utilize this opportunity to find solutions to some of the technical/other problems your community may be facing.
  • Do consider giving back the learning to your respective communities.
  • We would appreciate if you could share your experience and learning publicly. CIS-A2K will be happy to publish your write-up on our blog

If you know of a Wikimedian in your community who could benefit from this event and also could bring back learning to benefit your community, please encourage them to apply. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:30, 4 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Proposals మార్చు

--వైజాసత్య (చర్చ) 20:05, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఇండివిజువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్ కి విశ్వనాథ్ ప్రాజెక్టు ఎంపిక మార్చు

మన తెలుగు వికీలో రెండవ గ్రాంటు విజయవంతంగా ఒకే అయింది. వికీమీడియా ఫౌండేషన్ వారి ఐఈజీ (ఇండివిజువల్ ఎంగేజ్మెంట్ గ్రాంట్) కింద విశ్వనాధ్ గారు ప్రతిపాదించిన గ్రంథాలయాల సూచిక రూపొందించే ప్రాజెక్టు ఎంపిక అయింది. ఎంపిక వివరాలు. దీని ద్వారా తెవికీ ఇంకా త్వరగా ఎక్కువ నాణ్యమైన వ్యాసాలను పొందగలుగుతుంది. అభినందనలు విశ్వనాధ్ గారు. Pranayraj1985 (చర్చ) 10:23, 6 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ మిత్రులకు అందరికీ నమస్కారం. మీ అందరి సహకారంతో నేను పెట్టిన ప్రాజెక్టుకు అనుమతి లభించింది. ఆరు నెలల ఈ ప్రాజెక్టు ద్వారా తెవికీకి మరిన్ని మూలాలు, ఆధారాలు, పుస్తకాల లభ్యత కలిగించగలగడం మాత్రమే కాక, మరింత మంది గట్టి వికీపీడియన్లను తెలుగు అందించే ప్రయత్నం చేయాలని నా ఆశ. నేను ఇప్పటికే చేసిన కొంత పరిశోధన ద్వారా ఎంతో విలువైన పాత పుస్తకాలను వెలికితీసి వాటిని వికీ సోర్సుకు అందించవచ్చు, గ్రంధాలయాల ద్వారా తెలుగు వికీ పరిధిని విసృతం చేయడానికి మీ అందరి సలహాలు, సహాయం అందిస్తారని ఆశిస్తూ కృతజ్నతలతో ...విశ్వనాధ్ (చర్చ) 06:54, 6 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
అభినందనలు ఎల్లంకి (చర్చ) 14:15, 6 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
26 అర్హమైన ప్రతిపాదనలు వడపోయగా వాటిలో 7 ప్రతిపాదనలు మాత్రం సెలెక్ట్ అయ్యాయి. వాటిలో వీరిదొకటి కావడం మరింత సంతోషం కలిగిస్తోంది. విశ్వనాథ్ గారి సమర్థత, అంతకు మించిన సృజనాత్మకత ఈ ప్రాజెక్టును అభిరుచి మేరకు తీర్చిదిద్దుతూ అన్నివిధాలుగానూ ఆస్వాదించేందుకు ఉపకరిస్తాయని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 17:07, 6 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ కు అభినందనలు. ఈ ప్రణాళిక తెలుగు పుస్తకాల ద్వారా తెవికీలో మూలాలను తద్వారా నాణ్యతను అభివృద్ది చేయడానికి ఒక మెట్టు మాత్రమే. దీనిని నిరాటంకంగా పూర్తిచేసి మరొక 5 మంచి గ్రంథాలయాలను కూడా మరొక 6 మాసాల సమయాన్ని అదనంగా తీసుకొని పూర్తిచేయాలని కోరుకుంటున్నాను. పిదమ ఆయా గ్రంథాలయాలలోని అరుదైన పుస్తకాలను ఒక జాబితా తయారుచేసి; వాటిని డిజిటలైజేషన్ చేయడానికి మరొక ప్రాజెక్టు కు మూలంగా ఉపయోగిస్తుంది. పనిలో మనం అందరం విశ్వనాథ్ తో కలసిపనిచేసి తెవికీ సమూహం చాలా బలమైనదని నిరూపించాలి.--Rajasekhar1961 (చర్చ) 18:23, 6 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విశ్వనాధ్ గారికి అభినందనలు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:54, 8 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా బావుంది విశ్వనాధ్ గారికి శుభాభినందనలు --వైజాసత్య (చర్చ) 20:07, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు ఎంపిక చేసుకోవాలనుకున్న గ్రంథాలయాల్లో వేటపాలెం సారస్వత నికేతనంను కూడా పరిగణించగలరు --వైజాసత్య (చర్చ) 20:29, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

డిసెంబర్ 28 న ‘‘వికీపీడియా హాకథాన్’’ గోల్డెన్ త్రెషోల్డ్ లో మార్చు

తెలుగు వికీపీడియా కమ్యూనిటీ సభ్యులు సాంకేతిక విషయాలపై అవగాహన కోసం ఒక హాకథాన్ నిర్వహించమని సి.ఐ.ఎస్ ని కోరగా... సి.ఐ.ఎస్ వారు తగిన విధంగా స్పందించి హాకథాన్ నిర్వహించడానికి అంగీకరించారు. వికీపీడియా సీనియర్ సభ్యుల్లోని కొందరు, కొత్త సభ్యులకు సాంకేతిక అంశాలపై అవగాహన కలిపిస్తారు. పరస్పర చర్చలకు అవకాశం ఉంటుంది.

మూసల తయారి, మూలాలను చేర్చడం, ఇన్ఫోబాక్స్ తయారి, రిఫెరెన్స్ ఇవ్వడం, బొమ్మల ఎక్కింపు మరియు సరైన వాడకం, వికీ డేటా, వర్గాలు, పుస్తక డిజిటలైజేషన్ (స్కానింగ్) చేసి వికీ సోర్స్ లో ఎక్కింపు, బాట్స్ వాడడం, ఆడియో వీడియో ఎక్కింపు, పట్టికలు (టేబుల్స్) వాడుట, ఉచిత సాప్ట్ వేర్స్ మొదలైన సాంకేతిక అంశాలపై అవగాహన ఉంటుంది.

ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.

ఈ కార్యక్రమంకోసం నేను అనుకొంటున్న కనీస ఖర్చు మొత్తం : 25,000/-

  1. వేదిక అద్దె : 2,000/-
  2. వైఫై: 2,000/-
  3. మధ్యాహ్న భోజనం, టీ, స్నాక్స్ : 6,000/-
  4. ప్రయాణ ఖర్చులు : 5,000/-
  5. ప్రచార సామాగ్రి : 5,000/-
  6. వసతి : 5,000/-
మొత్తం : 25,000/-

ఖర్చు చేయగా మిగిలిన మొత్తాన్ని సి.ఐ.ఎస్ కు అందిస్తాము... సభ్యులు స్పందించి సలహాలు, సూచనలు అందించగలరు...Pranayraj1985 (చర్చ) 13:44, 6 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

హాక్ధాన్‌కు మరియు హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు సభ్యులు తమ మద్దతును తెలియచేయగలరు..హాక్ధాన్ మరియు బుక్ ఫెయిర్ రెండూ ఒకదాని క్రింద ఒకటి ఉన్నాయి. రెండిటిలో కూడా మీ సంతకం చేర్చండి...విశ్వనాధ్ (చర్చ) 06:43, 10 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

హాక్‌ధాన్ - మద్దతు తెలుపుటకు మెటా వికీ పేజి ఇక్కడ చూడగలరు. Pranayraj1985 (చర్చ) 11:07, 9 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

డిసెంబర్ నెల మొలకల జాబితా మార్చు

డిసెంబర్ నెల మొలకల జాబితా డిసెంబర్ ఒకటినే విడుదల అయింది. ఇవ్వాళ ఇక్కడ ప్రచురిస్తున్నాను. సభ్యులు గమనించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:49, 8 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా టీ హౌస్ మార్చు

ఈ కాన్సెప్ట్ ఏదో బాగున్నట్టుంది, తెవికీలో ప్రయత్నిద్దామా? --రహ్మానుద్దీన్ (చర్చ) 16:53, 8 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది రచ్చబండే (దాదాపు అలాంటిదే), ఇంతకు దీని విలేజ్ పంప్ అనే వాళ్ళు, ఆ తర్వతా పరస్పర సంభాషణా పద్ధతులు పునర్వస్థీకరించబడి టీ హౌస్ అయ్యింది --వైజాసత్య (చర్చ) 20:14, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
విలేజ్ పంప్ అనేది అలానే ఉంది. ఈ లంకె వద్ద చూడవచ్చు. టీహౌస్ అనేది కొత్త వాడుకరులకు మాత్రమే, సీనియర్ వికీ సభ్యులతో నేరుగా మాట్లాడే ఒక మాధ్యమం. --రహ్మానుద్దీన్ (చర్చ) 01:20, 16 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఓ అలాగా, ధన్యవాదాలు రహ్మానుద్దీన్ గారు. మన సముదాయపందిరిరచ్చబండ, విలేజ్ పంప్ యొక్క రూపం అనుకుంటా, ఇప్పుడు తెలుగులో సహాయసూచిక ఉన్న స్థానంలో వికీపీడియా:సహాయ కేంద్రం ఉండేది. వీటన్నింటికంటే భిన్నమైనది, మనకి పనికొస్తుందంటే తప్పకుండా అమలుపరచండి --వైజాసత్య (చర్చ) 12:11, 16 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Cite అనే కొత్త మెనూ ఆప్షన్ మార్చు

మనం వ్యాసాన్ని సవరించబోయినపుడు వచ్చే కూర్పరి(ఎడిటర్)లో ఉన్నత, ప్రత్యేక అక్షరాలు, సహాయం తో పాటుగా Cite అని కొత్త్గగా మరో ఆప్షన్ వచ్చింది గమనించారా? ఇది ఎప్పటి నుండి కనిపిస్తుంది? నేను ఇప్పుడే గమనించాను. ఇది వాడి మూలాలు చేర్చడం సులభం. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:16, 13 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు పవన్ పరిచయం చేసాడు. మొన్న హైదరాబాద్ మంత్లీ మీటింగ్‌లో. బావుంది...విశ్వనాధ్ (చర్చ) 14:46, 13 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నేను రెండు మూడు మంత్లీ మీటింగుల్లో ఆంగ్ల వికీలో వచ్చినట్టుగా సైట్ ఆప్షన్ వస్తే బావుంటుందని పలుమార్లు ప్రస్తావించగా, దాన్ని మన వైజాసత్య గారిని అడిగి చూడమని సభ్యులు సూచించారు. నేను వైజా సత్యగారి చర్చపేజీలో అడగగా అక్టోబర్ 26 నుంచి ఈ సైట్ ఆప్షన్ ను ఆయన చేర్చారు.--పవన్ సంతోష్ (చర్చ) 13:37, 15 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి పేరు, చర్చ వెంబడి వాడుకరి ప్రయోగశాల/ఇసుకపెట్టె లంకె విషయమై మార్చు

తెవికీలో ప్రతి వాడూకరికీ లాగిన్ అయ్యాక కుడి వైపు పైన వాడుకరి పేరు, చర్చ, అభిరుచులు, బీటా, వీక్షణ జాబితా, మార్పుచేర్పులు, లాగౌటవండి అని లింకులు కనిపిస్తాయి. వీటికి తోడు వాడుకరి ప్రయోగశాల/ఇసుకపెట్టెలను చేర్చాలని ప్రతిపాదన. మీ విలువైన అభిప్రాయాలు తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 03:18, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రయోగశాల లేక ఇసుకపెట్టె? మార్చు

ప్రయోగశాల మార్చు

  1. పవన్ సంతోష్ (చర్చ) 14:17, 15 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఇసుకపెట్టె మార్చు

ప్రయోగశాల అనే పేజీ ఉంచుదాం మార్చు

సమ్మతం
  1. JVRKPRASAD (చర్చ) 03:39, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  2. విశ్వనాధ్ (చర్చ) 11:25, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  3. Palagiri (చర్చ) 12:54, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  4. వైజాసత్య (చర్చ) 20:14, 14 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  5. పవన్ సంతోష్ (చర్చ) 13:39, 15 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  6. వాడుకరి:Bhaskaranaidu (చర్చ) 17:24, 15 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  7. Pranayraj1985 (చర్చ) 02:57, 19 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  8. కె.వెంకటరమణ 05:17, 19 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  9. YVSREDDY (చర్చ) 13:51, 20 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  10. వాడుకరి:Nrgullapalli గుళ్ళపల్లి నాగేశ్వర రావు--గుళ్ళపల్లి 03:06, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యతిరేకం
తటస్థం


ఫలితాలు

ప్రయోగశాల అనే లంకెను ఉపకరణాలలో చేతనం చేసుకునేలా రూపొందించాను. దయచేసి సభ్యులు చూడగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:32, 16 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చూశాను. చాలాబావుంది. ఈ ప్రయత్నం ఫలప్రదం చేసిన రహ్మాన్ గారికి ధన్యవాదాలు.--పవన్ సంతోష్ (చర్చ) 17:44, 18 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంతకుముందు ప్రయోగశాల ఎక్కడవుందో అని వెతకవలసి వచ్చేది. ఇపుడు ఆ సమస్య లేకుండా చేసిన రహ్మానుద్దీన్ కి ధన్యవాదాలు. Pranayraj1985 (చర్చ) 03:01, 19 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రయోగశాల లింకు సరైన చోటుకు తీసుకువచ్చిన రహ్మానుద్దీన్ గారికి ధన్యవాదాలు. ఈ లింకులో "మ్మీరిక్కడ ఒక వ్యాసాన్ని కూర్పు చేసి" అనే పదాలలో "మీరిక్కడ" అనే పదంతో సరిచేయండి. YVSREDDY (చర్చ) 13:51, 20 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

New Wikipedia Library Accounts Now Available (December 2014) మార్చు

Apologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!

 
The TWL OWL says sign up today :)

The Wikipedia Library is announcing signups today for, free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

Other partnerships with accounts available are listed on our partners page. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team.00:22, 18 డిసెంబరు 2014 (UTC)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

బెంగాళీ వికీపీడియా దశమ వార్షికోత్సవానికి ఆహ్వానం మార్చు

బెంగాళీ భాషలో వికీపీడియా ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2015 జనవరి 9,10 తేదీలలో కలకత్తాలో బెంగాళీ వికీపీడియా దశమ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారన్న విషయం మనందరికి తెలిసిందే.

ఇతర భాష సముదాయాల సభ్యులనుండి కూడా దరఖాస్తులను ఆహ్వానించడంతో తెలుగు వికీపీడియా నుండి దరఖాస్తుచేసుకున్న 6 మందిలో

  1. ప్రణయ్‌రాజ్ వంగరి
  2. YVSREDDY
  3. Raj.palgun13 (చర్చ)
  4. గుళ్లపల్లి నాగేశ్వరరావు
  5. Bhaskaranaidu (చర్చ) 15:55, 30 నవంబర్ 2014 (UTC) లకు బెంగాళీ వికీపీడియా దశమ వార్షికోత్సవ స్కాలర్షిప్ లభించింది. స్కాలర్షిప్ వివరాలకు ఇక్కడ చూడగలరు.

ఇలాంటి సమావేశాలలో ఇతర భారతీయ భాషల వికీపీడియన్లను కలవడం ద్వారా వారివారి సముదాయాలలో చేస్తున్న నూతన విధానాలను తెలుగు వికీపీడియా చేర్చి తెవికీ అభివృద్ధిలో పాలుపంచుకోవడానికి మరింత అవకాశం ఉంటుంది. ఇతర భారతీయ భాషల వికీపీడియన్లతో కలిసి అంతర్భాషా ప్రాజెక్టులను తయారుచేసే అవకాశం కూడా ఉంది.

బెంగాళీ వికీపీడియా దశమ వార్షికోత్సవపు అనుభావాలు రచ్చబండలో సహ వికీపీడియన్లతో పంచుకోవడం జరుగుతుంది. --Pranayraj1985 (చర్చ) 06:45, 18 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నేను తెవికీ An approach to reach to local community మీద రాసిన పేపరును బెంగాళీ వికీపీడియా దశమ వార్షికోత్సవం కమిటీ వారు అమోదించారు, నేను కూడా వెళుతున్నాను . --కశ్యప్ (చర్చ) 13:02, 21 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations మార్చు

తెవికి 11 వ వార్షికోత్సవ సభలు తిరుపతిలో జరుప నిర్ణయించ బడిన విషయము అందరికి తెలిసినదే. ఈ విషయమై ఈ క్రింద కొన్ని ప్రతిపాదనలను పొందుపరచడమైనది. సహ సభ్యులు వీటిని పరిశీలించి/పరిశోధించి తగు సలహాలు/సూచనలు/ తెలుపవలసినదిగా కోరడమైనది. అదే విధంగా ఈ నెల 28 (28 డిసెంబరు 2014) గోల్డెన్ త్రెషోల్డ్ లో జరుగబోవు ‘‘వికీపీడియా హాకథాన్’’ సహ సభ్యులు హాజరవుతున్నందున ఆ సమావేశంలో భాగంగ వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - విషయాన్ని కూడ చర్చించి సహ సభ్యుల ఆమేదము కొరకు పెట్టాలని కోరడమైనది.

ఈ పేజీవికీపీడియా చర్చ:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrationsలో మీ సూచనలు సలహాలు ఇవ్వగలరు

తెలుగు వికీమీడియా హాకథాన్ - 2014 ప్రణాళిక మార్చు

తెలుగు వికీమీడియా హాకథాన్ - 2014 ఈ నెల 28వ తేదీన అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో నిర్వహించదలచిన విషయం సభ్యులందరికి తెలిసిందే.. వికీపీడియా సీనియర్ సభ్యుల్లోని కొందరు, కొత్త సభ్యులకు సాంకేతిక అంశాలపై అవగాహన కలిపిస్తారు. పరస్పర చర్చలకు అవకాశం ఉంటుంది.

ఇది రెండు సెషన్స్ తో ఉంటుంది. వర్గాలు, మూసల తయారీ, రిఫరెన్స్, ఇన్ఫోబాక్స్, మూలాలు, పట్టికలు, బొమ్మల ఎక్కింపు మొదలైనవి ఉదయం పూట మొదటి ఒక సెషన్ లో, మిగితావి మధ్యాహ్నం సెషన్ లో జరుగుతాయి. మధ్యాహ్నం ఒక అరగంట తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవం గురించిన చర్చ ఉంటుంది. వివరాలకు తెలుగు వికీమీడియా హాకథాన్ - 2014 పేజీలో చూడగలరు.

సభ్యులు తెలుగు వికీమీడియా హాకథాన్ - 2014 చర్చ పేజీలో సూచనలు అందించగలరు. --Pranayraj1985 (చర్చ) 17:53, 26 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

లొయోల కళాశాలలో వికీపీడియా వింటర్ క్యాంప్ మార్చు

సభ్యులకు నమస్కారం

లొయోలా కళాశాలలో భౌతికశాస్త్రం, తెలుగు విభాగాలు వికీపీడియా వింటర్ క్యాంప్ నిర్వహిస్తున్నాయి. భౌతికశాస్త్ర పేజీలో వివరాలు చూడగలరు. వీలైనచో సహాయం చేయగలరు.--D. JANIBASHA (చర్చ) 10:11, 27 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు టైపింగ్ సహాయంకోసం అభ్యర్థన మార్చు

తెలుగు వికీపీడియాలో ప్రస్తుతం లిప్యంతరీకరణ, ఇన్ స్క్రిప్ట్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పటికే కొంతమంది పాత్రికేయ మిత్రులు, ఇతరులు ఆపిల్ మరియు మాడ్యులర్ లలో టైపింగ్ చేస్తుండడంతో వారికి తెలుగు వికీపీడియాలో రాయడం ఇబ్బందిగా ఉంది. తెలుగు వికీపీడియాలో ఆపిల్ మరియు మాడ్యులర్ టైపింగ్ పద్ధతులు కావాలని సి.ఐ.ఎస్ వారి మెటాలో అభ్యర్థన పెట్టడం జరిగింది.

అభ్యర్థన పేజి కొరకు ఇక్కడ చూడగలరు.

సభ్యులు మద్ధతు తెలుపగలరు. --Pranayraj1985 (చర్చ) 05:47, 28 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది చాలా మంచి సూచన. లిప్యంతరీకరణ ఇప్పుడే తెలుగులో వ్రాయడం ప్రారంభించినవారికి పనికివస్తోందే తప్ప ఏళ్ళుగా తెలుగులో టైపింగ్ చేయడం వచ్చిన పాత్రికేయులకు, ఇతర రచనా రంగంలోని వారికి ఉపకరించడంలేదు. నా వరకూ నేను ఈ సౌలభ్యం లేక నేర్చుకుని కొన్నిసార్లు వేరే చోట ఆపిల్ కీబోర్డు, మళ్ళీ వెనువెంటనే వికీలో లిప్యంతరీకరణ మార్చి మార్చి వాడి ఇబ్బందిపడ్డాను. నాకు వ్యక్తిగతంగా ఇలా ఇబ్బందిపడుతున్నవారిలో మీనా గాయత్రి కూడా ఉన్నట్టు తెలుసు. --పవన్ సంతోష్ (చర్చ) 05:55, 28 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ఆపిల్ కీబోర్డు లేదా మాడ్యులర్ లే అవుట్ ఎలా ఉంటుంది. మీ దగ్గర ఏదైనా బొమ్మ ఉంటే ఇక్కడ ఎక్కించండి. --వైజాసత్య (చర్చ) 11:36, 29 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
కీ బోర్డు అనే వ్యాసంలో ఉన్నవి --వైజాసత్య (చర్చ) 12:10, 29 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
నిన్న హ్యాకథాన్‌లో ఆపిల్ లేయవుటు తయారుచేయడం మొదలుపెట్టాను. ప్రాధమిక కూర్పు తయారయ్యింది. దీన్ని ఇక్కడ పరీక్షించవచ్చు. కోడు ఇక్కడ ఉంది. అన్నీ సరిగ్గావుంటే/సరిచేసిన తర్వాత వికీమీడియా కోడులో విలీనించమని అభ్యర్థిస్తాను. — వీవెన్ (చర్చ) 14:49, 29 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
దీని గురించి మరింత సమాచారం కోసం చూడండి: Veeven/వికీపీడియాలో వేరిటైప్ లేదా ఆపిల్ లేయవుటు. అక్కడి చర్చాపేజీలో తప్పులనూ దోషాలనూ నివేదించండి. — వీవెన్ (చర్చ) 15:38, 29 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారూ, వీవెన్ గారూ సత్వరం ప్రతిస్పందించినందుకు ధన్యవాదాలు. వీవెన్ గారు తయారుచేసిన లేఖిని వేరిటైప్ ప్రయత్నించి చూశాను. బయటి కంప్యూటర్లలో చేయాలంటే దాన్నే వాడుతున్నాను. ఈ సందేశం అలా టైప్ చేసి తెచ్చి పేస్ట్ చేసిందే. దయచేసి త్వరగా దాన్ని తెవికీలో చేర్చమని. వీలుంటే తెలుగు వికీప్రాజెక్టులన్నిటిలోనూ దాన్ని ఎనేబుల్ చేయమని విన్నపం.--పవన్ సంతోష్ (చర్చ) 07:51, 25 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

హాండ్ బుక్ గురించి మార్చు

వికీపీడియా గురించి అందరికీ అవగాహన కలిగించడానికి సమగ్ర సమాచారమున్న ఒక పుస్తకము తేవాలనే ఆలోచన ఎప్పటినుండొ వున్నదే.....అటు వంటి పుస్తకము వికీ అవగాహన సదస్సులు, మరియు సమావేశాలలో అందరికి ఇవ్వడానికి బాగుంటుంది. అటువంటి వివరాలు/ సమాచారము ఈ క్రింద ఇచ్చాను. . ఇందులోని విషయాలు ఆయా పుటలలో అనుభవజ్ఞలు వ్రాసినవి మాత్రమే అక్కడినుండి తెచ్చి ఇక్కడ అతికించాను. ఇందులోని విషయము క్రొత్త వాడుకరులకే కాక అందరికి ఉపయోగ పడుతుందని అనుకుంటున్నాను. సహ వికీపీడియనులు, అనుభవమున్న వారు, అధికారులు దీన్ని చూచి అవసరమను కొన్న మరికొంత సమాచారాన్ని చేర్చి/ అనవసరమనుకున్న విషయాలను తొలగించి ...... దీనికి సమగ్ర రూపమివ్వగలరని ఆసిస్తున్నాను. ......ఎల్లంకి (చర్చ) 17:36, 29 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ పుస్తకానికి ఒక పేరు పెట్టాలి గదా..... ఈ క్రింద కొన్ని పేర్లు సూచిస్తున్నాను. వాటిలో తగిన పేరును సూచించగలరు. లేదా మారేదైనా కొత్త పేరు చూసించగలరు.

  1. తెలుగు వికీపీడియా.... మార్గదర్శిని
  2. తెలుగు వికీపీడియా...... ప్రగతి:
  3. తెలుగు వికీపీడియా....... సమగ్ర రూపురేఖలు:
  4. తెలుగు వికీపీడియా అంటే ఏమిటి? ...... పూర్తిగా తెలుసుకోండి. (ట్యాగులైను)
ఎల్లంకి గారూ, వికీపీడియా గూర్చి సమగ్రసమాచారాన్నిచ్చే పుస్తకం తేవాలనే ఆలోచన మంచిది. ఈ పుస్తకానికి మీరిచ్చే పేర్లలో తెలుగు వికీపీడియా - మార్గదర్శిని బాగుంటుందనుకుంటున్నాను.-- కె.వెంకటరమణ 16:06, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]


సహ వికీపీడియనులు మరి కొన్ని పేర్లను సూసించండి. ఆకర్షణీయమైన పేరును ఆమోదించు కుందాం.... ఎల్లంకి (చర్చ) 02:49, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

చేతిపుస్తకము/ హాండ్ బుక్ మార్చు

ఇక్కడ వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations వద్ద మీ సూచనలు సలహాలు సవరనలు అందించగలరు..

ప్రాథమిక వాచకం మార్చు

వికీపీడియా:ప్రాథమిక వాచకం అనే పేరుతో నేను కూడా ఒక సమాచార కరపత్రం లేదా పొత్తము తయారు చేస్తున్నాను.  Y Half done అవకాశమును బట్టి అధికారులు, తోటి సహ వాడుకరులు దీనిలోని సమాచారాన్ని ఆందుకొని అందరికీ అందించగలరని నా విశ్వాసముతో మీకందరకు   ధన్యవాదాలండి!తో మనవి చేస్తున్నాను. మీ....JVRKPRASAD (చర్చ) 16:20, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మన వ్రాతలో దొర్లుతున్న తప్పులు మార్చు

'పెళ్ళి' అనే పదాన్ని రాసేటపుడు 'ళ' కు 'ళ' ఒత్తు కాకుండా 'ల' ఒత్తు రాయడం జరుగుతున్నది. ఉదా: పెళ్లి, కుళ్లిన ఇంతేకాక, 'ణ' కు 'ణ' ఒత్తు కాకుండా 'న' ఒత్తు రాస్తున్నారు. ఉదా: దేవుణ్ని. కాని, ఇలా రాయడం తప్పని నా భావన.-- Vyasri (చర్చ) 15:51, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Vyasri గారు మీ సూచనకు ధన్యవాదాలు . ఇలాంటి తప్పులను మీరూ సరిదిద్దవచ్చు. మీరు తెవికీలో అక్షరదోష నిర్మూలన దళంలో సభ్యులవ్వవచ్చు. అలాగే వీటిని బాటుల ద్వారా కూడా కొందరు సభ్యులు సరిదిద్దుతున్నారు. --విష్ణు (చర్చ)20:17, 30 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]
పెళ్ళి అనే పదాన్ని ళకు ళ ఒత్తు ఇచ్చి రాయడమే సరైన పద్ధతి. ఐతే గత శతాబ్దుల్లో వచ్చిన అచ్చుయత్రాల విప్లవం వల్ల అచ్చులో వచ్చే అక్షరాలు మార్పులు చెందాయి. ఆ క్రమంలోనే లైను స్పేసుకు అనుగుణంగా ళ ఒత్తు కన్నా ల ఒత్తు బాగా నప్పడంతో ళ్లి అని ముద్రించే వాడుక పెరిగింది. ళ్ళి అని వ్రాస్తే దాని వల్ల పేజీకి వచ్చే లైనుల సంఖ్య తగ్గి మొత్తంగా పుస్తకంలోని పేజీలు పెరిగి ప్రచురణకర్తకు భారమయ్యేది. దీనివల్ల ళ్ల అని వ్రాయడాన్నే వాడుక చేసేశారు. కానీ వ్రాతలో మాత్రం ళ్ళి అనే వ్రాసేవారు. నా ఉద్దేశం ప్రకారం, మొదట ఆ వాడుక లేకున్నా రెండు వందల సంవత్సరాల పాటు ళ్ల అని అచ్చులో రావడం దాన్ని అనుసరించి చాలామంది వ్రాయడం వల్ల ళ్ల కూడా ళ్ళతో పాటుగా ప్రామాణ్యాన్ని సంతరించుకుంది. ఐతే ణ్న అని వ్రాయడం మాత్రం ప్రజల్లో ళ్ల అని వ్రాయడానికి ఉన్నంత వాడుక లేకపోవడంతో ప్రస్తుతానికి దోషంగా పరిగణించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 06:48, 31 డిసెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

జనవరి నెల మొలకల జాబితా మార్చు

జనవరి మొలకల జాబితా వద్ద డిసెంబర్ నెలలో తయారయిన మొలకల జాబితా ఉంది. గమనించగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 06:08, 1 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ee jabithalaloni molakalanu vistarinche vaarikann molakalanu srustinchevare ee madhya ekkuvayyru.

పొరబాటున నేను వ్రాసిన సంఖ్యానుగుణ వ్యాసములు విక్షనరీలో వుండవలసినవి... వికీపీడియాలో కూడ చేరినవి. ఇవి విక్షనరీలో కూడ వున్నవి. కనుక వీటిని వికీపీడియాలో తొలగించ గలరు ఎల్లంకి (చర్చ) 02:53, 19 జనవరి 2015 (UTC)[ప్రత్యుత్తరం]