కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
కాకినాడ | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | గోదావరి |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | కాకినాడ |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1952 |
ప్రస్తుత పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | మల్లిపూడి మంగపతి పళ్లంరాజు |
మొదటి సభ్యులు | సి.హెచ్.వి.రామారావు |
చరిత్ర
మార్చు2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వలన ఈ నియోజకవర్గం పెద్దగా మార్పులకు గురికాలేదు. ఈ నియోజకవర్గంలోని అన్ని శాసనసభా నియోజకవర్గములు కూడా జనరల్ స్థానాలుగానే ఉండటం విశేషం. ఈ నియోజకవర్గ పరిధిలో కాపు కులస్థులు అధికంగా ఉండుటవలన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఆ కులస్థులకే అత్యధిక సార్లు సీట్లు కేటాయించాయి. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారికి కేంద్రంలో మంత్రిపదవులు కూడా చాలా సార్లు లభించాయి.[1] గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన యు.వి.కృష్ణంరాజు మంత్రిపదవిని పొందగా, రామసంజీవరావు కేంద్ర సమాచార శాఖా మంత్రిగా పనిచేశాడు. రామసంజీవరావు కుమారుడైన పళ్ళంరాజు 2009-2014 మధ్యలో దేశాన్ని పరిపాలించిన ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి 2014 మేలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఘోర పరాజయమును చవిచూసినారు.
అసెంబ్లీ నియోజకవర్గాలు
మార్చునియోజకవర్గపు గణాంకాలు
మార్చునియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
మార్చు2004 ఎన్నికలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | మల్లిపూడి పల్లం రాజు మంగపాటి | 410,982 | 49.38 | +9.69 | |
తెలుగుదేశం పార్టీ | ముద్రగడ పద్మనాభం | 353,730 | 42.50 | -11.14 | |
Independent | చంద్రావతి ద్వారంపూడి | 30,153 | 3.62 | ||
బహుజన సమాజ్ పార్టీ | పూగల అప్పారావు | 16,373 | 1.97 | ||
కమ్యూనిస్టు పార్టీ పాహ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్ | నైనాలశెట్టి మూర్తి | 9,458 | 1.13 | +0.04 | |
Independent | పువ్వుల ఆనందరావు | 8,544 | 1.03 | ||
Independent | చాగంటి సూర్యనారాయణ మూర్తి | 3,044 | 0.37 | ||
మెజారిటీ | 57,252 | 6.88 | +21.83 | ||
మొత్తం పోలైన ఓట్లు | 832,284 | 68.44 | +2.90 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +9.69 |
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున బిక్కిన విశ్వేశ్వరరావు పోటీ చేస్తున్నాడు.[4] కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.ఎం.పళ్ళంరాజు పోటీలో ఉన్నాడు.[5]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 23 కాకినాడ జనరల్ ఎం.ఎం.పల్లంరాజు పు కాంగ్రెస్ 323607 చలమలశెట్టి సునీల్ పు ప్ర.రా.పా 289563
2014 ఎన్నికలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | తోట నరసింహం | 514,402 | 46.76 | +20.04 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | సునీల్ కుమార్ చలమలసెట్టి[7] | 510,971 | 46.45 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | మల్లిపూడి మంగపతి పల్లంరాజు | 19,754 | 1.80 | ||
RPI (K) | మోత శారద | 6,836 | 0.62 | ||
CPI(ML)L | యేగుపాటి అర్జునరావు | 1,495 | 0.14 | ||
BSP | ముతాబత్తుల రత్నకుమార్ | 2,511 | 0.23 | ||
AAP | శ్రీనివాస్ దంగేటి | 2,356 | 0.21 | ||
None of the above | None of the Above | 41,674 | 3.8 | ||
మెజారిటీ | 3,431 | 0.31 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,099,999 | 77.59 | +1.27 | ||
తెదేపా gain from INC | Swing |
మూలాల విభాగం
మార్చు- ↑ సాక్షి దినపత్రిక, తేది 13-09-2008
- ↑ http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=92628&subcatid=20&categoryid=3
- ↑ Election Commision of India (7 June 2024). "2024 Loksabha Elections Results - Kakinada". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 27-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ "KAKINADA LOK SABHA (GENERAL) ELECTIONS RESULT". Archived from the original on 2016-04-11. Retrieved 2016-05-19.
- ↑ Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.