కోన నీరజ
భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్
కోన నీరజ తెలుగు సినిమా క్యాస్టూమ్ డిజైనర్, స్టైలిస్ట్, గేయ రచయిత్రి. ఆమె గుండెజారి గల్లంతయ్యిందే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. నీరజ సినీ నటి సమంతకు వ్యక్తిగత క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేసింది.[3]
కోన నీరజ | |
---|---|
జననం | |
వృత్తి | క్యాస్టూమ్ డిజైనర్, స్టైలిస్ట్, గేయ రచయిత్రి |
క్రియాశీల సంవత్సరాలు | 2012 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అజయ్ |
పిల్లలు | ఆన్ష్ [1] |
తల్లిదండ్రులు | కోన రఘుపతి, రమాదేవి |
బంధువులు | కోన వెంకట్ [2] |
సినీ జీవితం
మార్చుకోన నీరజ అమెరికాలో 14 ఏళ్లు ఉండి ఫ్యాషన్ కోర్సులను నేర్చుకొని స్వదేశం తిరిగి వచ్చి ఆమె సోదరుడు కోన వెంకట్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో తొలిసారిగా హీరో నితిన్‌కి స్టైలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత రామయ్యా వస్తావయ్యా, అత్తారింటికి దారేది, ఎవడు, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలకు పని చేసి నటి సమంతకు ఆమె వ్యక్తిగత స్టైలిస్ట్ అయ్యింది.
పని చేసిన సినిమాలు
మార్చు- క్యాస్టూమ్ డిజైనర్ \ స్టైలిస్ట్
- గుండెజారి గల్లంతయ్యిందే (2013)
- బాద్షా (2013)
- కొరియర్ బాయ్ కళ్యాణ్ (2013)
- హార్ట్ అటాక్ (2013)
- రామయ్యా వస్తావయ్యా (2013)
- అత్తారింటికి దారేది (2013)
- ఆడు మగాడ్రా బుజ్జి (2013)
- ఆటోనగర్ సూర్య (2014)
- గోవిందుడు అందరివాడేలే (2014)
- అల్లుడు శీను (2014)
- రభస (2014)
- పవర్ (2014)
- ఒక లైలా కోసం (2014)
- పండగ చేస్కో (2015)
- తిక్క (2016)
- మెర్సల్ (2017)
- నిన్ను కోరి (2017)
- ఖాకీ (2017)
- వేలైక్కారన్ - తమిళ్ (2017)
- థానా సెర్ధా కూటమ్ - తమిళం (2018)
- ఇరుంబు తీరై తమిల్మ్ (2018) \ చక్ర (2021)
- చల్ మోహన రంగా (2018)
- సామి స్క్వేర్ - తమిళం (2018)
- ఎన్.జి.కె. (2019)
- మిస్ ఇండియా (2020)
- శ్యామ్ సింగరాయ్ (2021)
- వాల్తేరు వీరయ్య (2023)
- మ్యాజిక్ (2024)
- గేయ రచయిత్రి
- తిక్క (2016) [4]
- చల్ మోహన రంగా (2018)
- మిస్ ఇండియా (2020 )
మూలాలు
మార్చు- ↑ Sakshi (22 March 2016). "సమంతకు దేవుడిచ్చిన బిడ్డ." Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
- ↑ Sakshi (19 June 2014). "కోన వెంకట్ చెల్లెలు వివాహ వేడుక!". Archived from the original on 2014-06-19. Retrieved 3 December 2021.
- ↑ Andhrajyothy (9 January 2022). "ఆ ప్రయోగాలే ఫ్యాషన్ అవుతాయి". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
- ↑ Sakshi (31 July 2016). "రచయితగా మారిన స్టైలిస్ట్". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.