పంచవింశ బ్రాహ్మణం
వేదసంహిత లోని మంత్రమును, శాస్త్రవిధిని వివరించేది, యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. ఇది గృహస్తులకు ఎక్కువగా వినియోగపడుతుంది. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, సాంఖ్యాయన బ్రాహ్మణము అనే రెండు విభాగాలున్నాయి. అలాగే శుక్ల యజుర్వేదంలో శతపథబ్రాహ్మణము, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ బ్రాహ్మణము, మైత్రాయణ బ్రాహ్మణములు ఉన్నాయి. సామవేదంలో ఛాందోగ్య బ్రాహ్మణము, తాండ్య (పంచవింశ) బ్రాహ్మణము, ఆర్షేయ బ్రాహ్మణము, షడ్వింశ బ్రాహ్మణము, అదభుత బ్రాహ్మణము, ఉపనిషత్ బ్రాహ్మణములు ఉన్నాయి. అధర్వణ వేదం లోని బ్రాహ్మణమును గోపథ బ్రాహ్మణము లోని అంటారు.
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
తాండ్య బ్రాహ్మణా న్ని పంచవింశ బ్రాహ్మణం లేదా ప్రౌఢ బ్రాహ్మణం అని కూడా వ్యవహరింతురు. ఇది సామవేదము నకు చెందిన ఇరవైఅయిదు ప్రపాఠకాలు (అధ్యాయాలు) కలిగి ఉన్న బ్రాహ్మణం. ఇది కౌతుమ , రణయణీయ అనే రెండు శాఖ లకు చెందినది. సాధారణంగా ఇది ఉద్గతారుల బాధ్యతలు, మరీ ముఖ్యంగా వివిధ రకాల శ్లోకాల యొక్క బాధ్యతల గురించి వ్యవహరిస్తుంది (తెలియజేస్తుంది).[1]
విషయాలు
మార్చు- భరతుడు పురోహితులు వశిష్టగణం, (పం.విం.బ్రా.15.4.24)
- విశ్వామిత్రుడు ఋషిత్వము సంపాదించారు. (పం.విం.బ్రా.14.3.12)
- తాండ్యబ్రాహ్మణంలో కుసురబిందు (22.15.10) బహుభావ ఫలమును సాధించే దశరాత్రయాగం చేసి భాగ్యాన్ని పొందాడు అని ఉటంకించ బడ్డది..
విభాగాలు
మార్చు- పంచవింశ బ్రాహ్మణం 25 ప్రపాఠకాలు గా విభజించబడింది, ఆ తదుపరి ఇవి తిరిగి 347 ఖండాలు (ఖండికలు) గా విభజింప బడ్డాయి. ఈ క్రింద సూచించిన పట్టిక ద్వారా మనము తెలుసుకోవచ్చును
- ప్రపాఠకం I : యజుస్సుల సేకరణ
- ప్రపాఠకం II-III : విస్తుతులు
- ప్రపాఠకం IV–IX.2: వివిధ ఆచారాలు (జ్యోతిష్టోమ, ఉక్థ్య, అతిరాత్రం,, ప్రకృతి యొక్క ఏకాహాలు, ఆహ్నలు),
- ప్రపాఠకం IX.3–IX.10: సోమప్రాయశ్శ్చిత్తాలు
- ప్రపాఠకం X–XV: దాదశాంశ కర్మ (లు)
- ప్రపాఠకం XVI–XIX: ఒక రోజు కర్మ (లు)
- ప్రపాఠకం XX–XXII: ఆహ్నికర్మలు
- ప్రపాఠకం XXIII–XXV: దీర్ఘకాలం కర్మ (లు)