తైదల బాపు
తైదల బాపు, తెలంగాణకు చెందిన సినిమా పాటల రచయిత, నిర్మాత.[1] జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 2001లో వచ్చిన ‘6 టీన్స్’ సినిమాతో పాటల రచయితగా పరిచయమైన బాపు, ఆ తరువాత అనేక తెలుగు సినిమాలకు పాటలు రాశాడు.[2] ప్రస్తుం నిర్మాతగా మారి, బాపు ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.
తైదల బాపు | |
---|---|
![]() తైదల బాపు | |
జననం | బాపు ఏప్రిల్ 25 |
వృత్తి | సినీ గీత రచయిత నేపథ్యగాయకుడు |
జీవిత భాగస్వామి | నౌషీన్ (అనూష) |
తల్లిదండ్రులు |
|
జననం, విద్యసవరించు
బాపు ఏప్రిల్ 25న వెంకటి - సత్తెమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, తాండూరు మండలంలోని మాదారం గ్రామంలో జన్మించాడు.[3]
వ్యక్తిగత జీవితంసవరించు
బాపుకు 2001లో నౌషీన్ (అనూష) తో ప్రేమ వివాహం జరిగింది.[4]
సినిమారంగంసవరించు
విద్యార్థిగా ఉన్నప్పటినుండి పాటలు రాస్తున్న బాపు, టివి ఛానల్ పాటల కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఒక టీవి షోలో జరిగిన కార్యక్రమంలో 1998లో హైదరాబాద్‌కు వచ్చి వందేమాతరం శ్రీనివాస్‌ను కలిసి తను రాసిన పాటలు వినిపించి ప్రశంసలు అందుకున్నాడు. 2001లో వచ్చిన ‘6 టీన్స్’ సినిమాలో పాటల రాసే అవకాశం వచ్చింది.[5]
పాటలు రాసిన సినిమాలుసవరించు
- 6టీన్స్[6]
- గర్ల్ఫ్రెండ్: ‘నువ్వేడికెళ్తి ఆడికొస్తా సువర్ణా..’, ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’, ‘లష్కర్ బోనాల కాడ..‘
- ప్రేమలో.. పావనీ కళ్యాణ్
- జానకీ వెడ్స్ శ్రీరామ్
- మహానంది
- శ్రీరామచంద్రులు
- ఇదే నా మొదటి ప్రేమలేఖ
- అధినేత
- ఆచారి అమెరికా యాత్ర
- పటాస్
- సెల్ఫీరాజా
పురస్కారాలుసవరించు
- 2019: ‘జాతీయ కళారత్న’ అవార్డు
- విశిష్ట రచనా పురస్కారం (రచయితల సంఘం రజతోత్సవంలో చిరంజీవి, కె. రాఘవేంద్రరావు చేతులమీదుగా)[5]
ఇతర వివరాలుసవరించు
తెలంగాణ ఉద్యమంలో 2003-04 కేసీఆర్‌తో సన్నిహిత్యంగా ఉంటూ ఉద్యమ పాటలను కూడా రాశాడు.[3]
మూలాలుసవరించు
- ↑ "'పటాస్' చిత్రంలో రాసిన పాటతో నా కెరీర్ టర్న్ అయింది – గేయ రచయిత తైదల బాపు |". 2015-01-22. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
- ↑ telugu, NT News (2022-04-26). "చిత్ర నిర్మాణంలోకి." Namasthe Telangana. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
- ↑ 3.0 3.1 "గేయ రచయిత నుండి సిని నిర్మాతగా." Prabha News. 2021-04-25. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
- ↑ "పెద్దల అంగీకారంతో ప్రేమి'కుల' విజయం". www.andhrajyothy.com. 2018-02-14. Archived from the original on 2022-04-26. Retrieved 2022-04-26.
- ↑ 5.0 5.1 "అది మనందరి బాధ్యత – పాటల రచయిత తైదల బాపు". Sakshi. 2022-04-25. Archived from the original on 2022-04-25. Retrieved 2022-04-26.
- ↑ Sakshi (25 April 2022). "అది మనందరి బాధ్యత – పాటల రచయిత తైదల బాపు". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.