మొదటి దేవరాయలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మొదటి దేవ రాయలు ఇతను రెండవ హరిహర రాయలు కుమారుడు.[1] తన అన్నగారినుండి రాజ్యమును బలవంతముగా స్వాధీనము చేసుకున్నాడు.
మొదటి దేవరాయలు | |
---|---|
పరిపాలన | 1406–1422 CE |
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
యుద్దములు
మార్చుఫిరోద్ షా తో తొలి యుద్దం
మార్చుసింహాసనము ఆక్రమించిన తొలిరోజులలోనే, విజయనగర రాజ్య అంతఃకలహాలను ఆసరాగా చేసుకొని ఫిరోద్ షా విజయనగరమును ముట్టడించి, ఓడించి 32 లక్షల రూపాయలను తీసుకోనిపోయినాడని సయ్యదలీ వ్రాతల వలన తెలియుచున్నది.
రెడ్డి రాజులు, బహుమనీలపై విజయాలు
మార్చుకందుకూరును పరిపాలిస్తున్న రెడ్డి రాజులు\, ఉదయగిరి రాజ్యమందున్న పులుగునాడు, పొత్తపినాడులను జయించి తమ రాజ్యమున కలుపుకున్నారు. ఉదయగిరి దేవరాయలకు తండ్రి ఆధీనము చేసిన దుర్గము. ఈ సమయములో దేవరాయలు\, రాజమహేంద్రవరంను పరిపాలిస్తున్న కాటయవేమునితో సంధి చేసుకున్నాడు. వీరు ఇద్దరూ కలసి కొండవీటికి చెందిన పెద కోమటి వేమునితో, అతని స్నేహితుడగు అన్న దేవ చోడునితో, బహుమనీ ఫిరోద్ షా తోనూ యుద్ధము చేసారు.
దేవ రాయని మిత్రుడైన కాటయ వేముడు, పెద కోమటి వేముడుతో యుద్ధం చేస్తూ వీరమరణం పొందినాడు. దానితో దేవరాయడు రాజమహేంద్రవరం అధిపతిగా కాటయవేముని కుమారుడైన, పది సంవత్సరముల ప్రాయం వాడైన రెండవ కుమార గిరిని కూర్చొనబెట్టి, అల్లాడ రెడ్డి, అతని కుమారులు వేమ\, వీర భద్రా రెడ్డి లుతో కలసి శతృవులైన ఫిరోద్ షా, పెద కోమటి వేమా రెడ్డి సైన్యాన్ని ఓడించి రాజమహేంద్రవరం పై అల్లాడరెడ్డి ఆధిపత్యాన్ని నిలబెట్టినాడు.
ఇటువంటి ఓటమి తరువాత ఫిరోద్ షా పానుగల్లు దుర్గమును ఆక్రమించాడు. కొండవీడు, బహుమనీ ల స్నేహాన్ని చూసి కీడు శంకించిన పద్మ నాయకులు విజయనగరాధిపతతితో స్నేహం చేసుకొని పానుగల్లు దుర్గమును ఫిరోద్ షా నుండి కాపాడటానికి రెండు సంవత్సరములు యుద్ధము చేసాడు.
ఇటువంటి సమయంలో దేవరాయలు వ్యూహాత్మకంగా బహుమనీ సుల్తానులకు కొండవీడు నుండి ఎటువంటి సహాయం రాకుండా చేయడానికి సైన్యాన్ని ఏకకాలంలో తీరాంధ్రప్రదేశాన్ని ఆక్రమించడానికి పంపించాడు. ఈ సైన్యము చాలా అమోఘమైన పురోగతి సాధించి పొత్తపినాడు, పులుగులనాడు లను ఆక్రమించి మోటుపల్లి రేవు పట్టాణాన్ని ముట్టడించింది. విజయనగర ప్రభువులు ఈ రెండు యుద్ధములందూ విజయాలు సాధించి బహుమనీ సుల్తానులనూ, కొండవీడు రాజులనూ ఓడించి నల్గొండ, పానుగల్లు, తీరాంధ్ర మొత్తం విజయనగర సామ్రాజ్యములో విలీనం చేశారు.
ఇతర విశేషములు
మార్చుమొదటి దేవరాయలు ఈ స్ఫూర్తివంతమైన విజయములతో పాటూ, తన రాజధాని నగరాన్ని చక్కగా పటిష్ఠ పరిచాడు, కోట గోడలూ, బురుజులూ కట్టించాడు, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టినాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసాడు. ఇతను సాధించిన విజయాలు తరువాత తరువాత విజయనగరాన్ని ఉన్నతస్థానంలో ఉంచడానికి చాలా తోడ్పడినాయి.
కవులు
మార్చుజక్కన అను కవి విక్రమార్క చరిత్రను ఈ కాలముననే రచించాడు.
ఇంతకు ముందు ఉన్నవారు: రెండవ బుక్క రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1406 — 1422 |
తరువాత వచ్చినవారు: రామచంద్ర రాయలు |
మూలాలు
మార్చు- ↑ "పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/250 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-20.