హిందూమతంలో నాస్తికత్వం
నిరీశ్వరవాదం (ఆంగ్లం: Atheism in Hinduism) అనేక సనాతన, సాంప్రదాయ విరుద్ధ తత్త్వాలలో దైవానికి ఉనికి లేదని ఉటంకించే వాదం. భారతదేశపు తత్త్వాలలో వేదాలను ధిక్కరించే తత్వాలు మూడు. అవి
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
నాస్తికం అనే పదం సాంప్రదాయ విరుద్ధమైనను, దైవాన్ని నమ్మకపోవటంకంటే కూడా, ఈ పదం వేదాలను నమ్మకపోవటమే సూచిస్తుంది. పై మూడు వాదాలు సృష్టికర్తను కూడా ధిక్కరిస్తాయి.
హైందవ మతము కేవలం ఒక మతమే కాదు, తత్త్వము కూడా. హైందవ తత్త్వాలలోని సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, మీమాంసా దర్శనము వంటి ఇతర వ్యవస్థలలో వేదాలను, సృష్టికర్తను ధిక్కరించకుండానే దైవాన్ని, దైవం యొక్క మహిమలను ధిక్కరిస్తాయి. సాంఖ్య, యోగ దర్శనాలు ఆది-మధ్య-అంత రహితుడైన, తనను తానే సృష్టించుకొన్న సృష్టికర్తను ధిక్కరిస్తే, మీమాంస మాత్రం వేదాలను రచించినది దైవమే అన్న వాదాన్ని ధిక్కరిస్తుంది.
ఆధ్యాత్మికతను పాటించటానికి నాస్తికత్వం అవరోధాలను కలిగిస్తుంది కొన్ని వ్యవస్థలు అంగీకరించినను, నాస్తికత్వానికి చెల్లుబాటు ఉంది. హైందవ నాస్తికులు హైందవాన్ని ఒక మతంగ కంటే కూడా, ఒక జీవన విధానంగానే ఎక్కువగా అంగీకరిస్తారు.
వ్యుత్పత్తి
మార్చుసంస్కృతంలో 'అస్తి ' అనగా కలడు అని అర్థం. ఆస్తిక అంటే వేదాలను అనుసరించేవారు. 'నాస్తి ' అనగా లేడు అని అర్థం. నాస్తిక అంటే వేదాలను ధిక్కరించేవారు. అయితే వేదాలను ధిక్కరించటం అంటే దైవాన్ని ధిక్కరించటమేనా, అనేది చర్చనీయాంశం.
స్వామీ వివేకానంద ప్రకారం, "ప్రపంచంలోని కొన్ని మతాలు బాహ్యప్రపంచంలో కల దైవం యందు నమ్మకం లేని వాడిని నాస్తికుడిగా వ్యవహరిస్తాయి. కావున వేదాంతాల ప్రకారం, తనను తాను నమ్మని వాడు నాస్తికుడే. మనలోని ఆత్మ యొక్క గొప్పదనాన్ని మనమే నమ్మకుంటే, మనం నాస్తికులమే.
చారిత్రక అభివృద్ధి
మార్చువేదాలలో మొట్టమొదటిది అయిన ఋగ్వేదం, సృష్టికర్త, సృష్టి లపై ప్రాథమిక సంశయాన్ని లేవనెత్తుతుంది. భగవంతుడే సృష్టికర్త అని గానీ, భగవంతుడు ఉన్నాడు అని కానీ ఎక్కడా అంగీకరించలేదు. 10వ అధ్యాయంలో ఈ క్రిందివిధంగా చర్చించబడింది.
'''కో అద్ధా వేద క ఇహ ప్ర వోచత్కుత ఆజాతా కుత ఇయం విసృష్టి:. అర్వాగ్దేవా అస్య విసర్జనేనాథా కో వేద యత ఆబభూవ ''' మరి అయితే, ఎవరికి తెలుసు, ఎవరు తెలుపగలరు ఇదంతా ఎక్కడిది, ఈ సృష్టి ఎలా జరిగినది సృష్టి తర్వాతే దైవాలు అవతరించినవి మరి ఇదంతా ఎక్కడి నుండి వచ్చినదో నిజంగా ఎవరికి తెలుసు?
బృహదారణ్యకోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, ముండకోపనిషత్తులు సృష్టికర్తయే సర్వస్వం, సృష్టికర్తయే శూన్యం కూడా అని బోధిస్తాయి. వీటితో కలిపి ఛాందోగ్యోపనిషత్తు, ఈ నాలుగు ఆత్మశ్రయ స్వీయత పైనే దృష్టి కేంద్రీకరిస్తాయి.
వేదాలను విశదీకరించే మీమాంసా దర్శనము వాస్తవిక, బహుభావ వాదం. జైమినీయుడు రచించిన పూర్వమీమాంస సూత్రాలు దీనికి మూలము. మీమాంస తత్త్వవేత్తలు వేదాలను చాటటం పవిత్రమైనదని, వేదాలు లోపభూయిష్టాలు కావని, ధర్మాన్ని రక్షించటం కోసం వేదాలను పరిరక్షించుకొనవలెనని నమ్మేవారు. అన్ని రూపాలలోను భగవంతుని ఉనికిని ధిక్కరించారు. పూర్వమీమాంస దైవాన్ని ధిక్కరించటమే కాక, జీవితం యొక్క ఫలాలను అనుభవించటానికి కావలసిన స్థితిగతులను సృష్టించుకోవటానికి మానవ కర్మలు చాలని నమ్మేవారు. 7వ శతాబ్దానికి చెందిన ప్రభాకరుడు వంటి వారు దైవ ధిక్కారం పై స్వరం పెంచారు.
సాంఖ్య దర్శనము నాస్తిక, ద్వైత వాదము. ఈశ్వరుడు ఉన్నాడా, లేడా అన్న ప్రశ్నపై సాంఖ్య మౌనం వహిస్తుంది. 14వ శతాబ్దంలో మాత్రం సాంఖ్యవాదులు భగవంతునికి ఉనికి లేదనే వాదించారు.
6వ శతాబ్దములో భౌతికవాద నాస్తికవాద చార్వాకం ఊపందుకొన్నది. పునర్జన్మ, స్వర్గం, నరకం, విధి, చేసే కార్యాలవలన మంచి/చెడులు కలుగుతాయనే వాదం వంటి వాటిని చార్వాక దర్శనం ధిక్కరించింది.
13వ శతాబ్దములో అజీవికం వ్యాప్తి చెందినది. బుద్ధునికి, మహావీరునికి సమకాలీకుడైన మక్ఖలి గోశాలుడు ఈ వాదాన్ని కనుగొన్నాడు. అజీవికలు కూడా దైవం ఉనికిని ధిక్కరించారు.
దైవ వ్యతిరేక వాదనలు
మార్చుమీమాంసవాదులు ఈ సృష్టికి కారకుడు ఉండవలసిన అవసరం లేదన్నారు. వేదాలను రచించినవాడు దేవుడ కాదన్నారు. మంత్రోచ్ఛారణలో దైవం పేరు ఉన్నదే తప్ప, దైవం అనేది మరెక్కడా లేదన్నారు. ఆది-మధ్య-అంత రహితుడైన భగవంతుడు వేదాలను ఎలా రాయగలడని మీమాంసవాదులు ప్రశ్నించారు. ఒకవేళ భగవంతుడే అవి రాసిననూ, మానవమాత్రులకు ఉండే పరిమితులు ఆయనకు వర్తిస్తాయి కావున, ఆయన మనిషే అని వాదించారు.