భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలు

(భారత జాతీయ భాషలు నుండి దారిమార్పు చెందింది)

భారతదేశం లోని వివిధ ప్రాంతాల ప్రజలు అనేక భాషలు మాట్లాడుతారు. దేశంలో కనీసం 800 భాషలు, 2000 వరకు యాసలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు గాను హిందీ, ఇంగ్లీషు భాషలను వాడాలని భారత ప్రభుత్వం నిర్దేశించింది. వివిధ రాష్ట్రాలు తమతమ అధికార భాషలను వాడుతాయి. కేంద్ర ప్రభుత్వంతో సంపర్కించేందుకు ఇంగ్లీషు వాడుతాయి. ఉదాహరణకు, కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హిందీ, ఇంగ్లీషుల్లో ఉత్తరాలు రాస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషుల్లో రాస్తుంది. హిందీ, ఇంగ్లీషులతో కలిపి భారత్ లో 24 అధికార భాషలు ఉన్నాయి. అధికార భాషా కమిషను వద్ద ఈ భాషలకు ప్రాతినిధ్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు పై భాషల్లో దేనిలోనైనా సమాధానాలు రాయవచ్చు.

Language region map of India
భారతదేశం లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యంత సాధారణంగా మాట్లాడే భాషలను పై పటంలో చూడవచ్చు. వీటిలో చాలా వరకు షెడ్యూల్ భాషలే గానీ, నాగాలాండ్ లోని అవో, మేఘాలయ లోని ఖాసీ, లడఖ్ లోని లడఖీ, మిజోరాం లోని మిజో, అరుణాచల్ ప్రదేశ్ లోని నైషి వంటివి షెడ్యూల్ భాషలు కావు. అనూహ్యంగా, మిజో షెడ్యూల్ భాష కానప్పటికీ, రాష్ట్ర స్థాయిలో దానికి అధికార భాష హోదా ఉంది. సిక్కింలో ఎక్కువగా మాట్లాడే భాష నేపాలీ అయినప్పటికీ, అది షెడ్యూల్ భాష అయినప్పటికీ, అది సిక్కిం రాష్ట్ర అధికార భాష కాదు.[1][2][3][a]

భారత రాజ్యాంగం లోని 343 వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. 1950 లో రాజ్యాంగంలో పొందుపరచినట్లుగానే 1965 లో ఇంగ్లీషు అధికార భాష హోదాను (హిందీతో సమానంగా) కోల్పోయింది. ఆ తరువాత దాన్ని అదనపు అధికార భాషగా కొన్నాళ్ళపాటు కొనసాగించి, హిందీని పూర్తి స్థాయిలో అమలుపరచాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఉండేది. అయితే, హిందీ అంతగా ప్రాచుర్యం పొందని దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడంతో జంట భాషల పద్ధతి ఇంకా కొనసాగుతూ వస్తోంది. శీఘ్ర పారిశ్రామికీకరణ, ఆర్థిక వ్యవస్థపై బహుళజాతి సంస్థల ప్రభావం మొదలైన వాటి కారణంగా ప్రభుత్వంలోనూ, బయటా కూడా దైనందిన కార్యకలాపాల్లో ఇంగ్లీషు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. దాన్ని తొలగించాలన్న ప్రతిపాదనలు అటకెక్కక తప్పలేదు.

అధికార భాషలు - కేంద్ర ప్రభుత్వం

మార్చు

కేంద్ర ప్రభుత్వం రెండు భాషలను ఉపయోగిస్తుంది:

  1. హిందీ: హిందీ రాష్ట్రాలతో వ్యవహరించేటపుడు హిందీ భాషను వాడుతుంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో, అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ, జమ్మూ కాశ్మీరు, లడఖ్, దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా హిందీ అధికార భాష.
  2. ఇంగ్లీషు: ఇతర రాష్ట్రాలతో వ్యవహరించేటపుడు కేంద్రం ఇంగ్లీషు వాడుతుంది.

భారతదేశ అధికార భాషలు

మార్చు

హిందీ ఇంగ్లీషులు కాకుండా, 22 ఇతర భాషలను అధికార భాషలుగా భారత రాజ్యాంగం గుర్తించింది:

రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూలు గుర్తింపు పొందిన భాషలు

మార్చు

భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూలులో 22 షెడ్యూల్డ్ భాషల జాబితా ఉంది. రాజ్యాంగం రూపొందించే సమయంలో ఈ జాబితాలో భాష ఉండడం అంటే - అధికారిక భాషా కమీషనుకు తమ తరఫున ప్రాతినిధ్యం పంపగల అర్హత ఉన్నట్టు,[4] అప్పటికి యూనియన్ అధికార భాష అయిన హిందీని సుసంపన్నం చేసేందుకు స్వీకరించదగ్గ ఆధారాల్లో ఒకటిగా ఆ భాష ఉపకరిస్తుందనీ [5] అర్థం. ఐతే తర్వాతి కాలంలో ఈ జాబితా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఈ భాషలు "అత్యంత వేగంగా సుసంపన్నమవుతూ ఎదిగి, ఆధునిక విజ్ఞాన ప్రసారంలో ప్రభావశీలమైన సాధనం అయ్యేలా" వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలిగివుంది.[6] దీనితో పాటుగా, అత్యున్నత స్థాయిలో పబ్లిక్ సర్వీస్‌ల కోసం నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే విద్యార్థి వీటిలో ఏదోక భాషను పరీక్షను రాయడానికి మాధ్యమంగా ఉపయోగించవచ్చు.[7]

వీటిలో 14 భాషలు మొదట్లోనే రాజ్యాంగంలో చేర్చారు. సింధీ 1967లోనూ, కొంకణీ, మణిపురీ, నేపాలీ వంటి భాషలు 1992లోనూ రాజ్యాంగ సవరణల ద్వారా చేరాయి. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో నాలుగు కొత్త భాషలు– డోగ్రీ, మైథిలీ, సంతాలి, బోడో–లు భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేరాయి.[8]

ఈ కింది పట్టిక 2008 మేలో ఉన్న 8వ షెడ్యూల్లోని 22 భాషలను, వాటిని సాధారణంగా ఉపయోగించే ప్రదేశాలతో సహా జాబితా వేస్తోంది.

ఆంగ్లం విదేశీ భాష కావడంతో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చకున్నా, అది భారత యూనియన్ అధికారిక భాషల్లో ఒకటి.[9]

భాష రాష్ట్రాలు
అస్సామీ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్
బెంగాలీ పశ్చిమ బంగ, త్రిపుర, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు, జార్ఖండ్[10]
బోడో అస్సాం
డోగ్రీ జమ్ము కాశ్మీరు, లడఖ్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్
గుజరాతీ దాద్రా నగరు హవేలీ, డామన్, డయ్యు, గుజరాత్
హిందీ అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బంగాల్[11][12]
కన్నడ కర్ణాటక
కాశ్మీరీ జమ్ము కాశ్మీరు, లఢక్
కొంకణీ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ (కొంకణ్ తీరం)[13][14]
మైథిలీ బీహార్
మలయాళం కేరళ, లక్షద్వీప్, పాండిచ్చేరి
మణిపురి మణిపూర్
మరాఠీ మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యు
నేపాలీ సిక్కిం, డార్జిలింగ్, ఈశాన్య భారతం
ఒడియా ఒడిశా,జార్ఖండ్,[15][16][17] పశ్చిమ బంగ[11][12]
పంజాబీ చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్[11][12]
సంస్కృతం ఉత్తరాఖండ్
సంతాలీ చోటానాగ్‌పూర్ ప్రాంతంలోని (బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించింది) సంతాలీ గిరిజనులు.
సింధీ సింధ్ ప్రావిన్సు (ప్రస్తుతం పాకిస్తాన్‌ లోని సింధ్)
తమిళం తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పాండిచ్చేరి, కేరళ
తెలుగు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, తమిళనాడు ,కర్ణాటక, పశ్చిమ బెంగాల్ (Kharagpur), ఒడిశా (బరంపురం, రాయగడ, పర్లకిమిడి).,
ఉర్దూ జమ్ము కాశ్మీరు, తెలంగాణ, జార్ఖండ్, ఢిల్లీ, బీహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రరాష్ట్రం [11][12]

22 అధికారిక భాషల్లో 15 ఇండో-ఆర్యన్, 4 ద్రవిడ, 2 టిబెటో-బర్మన్, ఒకటి ముండా భాషా కుటుంబాలకు చెందినవి. 2003 నుంచి, ప్రభుత్వ కమిటీ ఎనిమిదవ షెడ్యూల్లోని అన్ని భాషలను భారతదేశపు అధికారిక భాషలుగా పరిగణించడంలోని సంభావ్యతను పరిశీలిస్తోంది.[18]

వివిధ రాష్ట్రాల అధికార భాషలు

మార్చు
  1. అస్సామీఅసోం అధికార భాష
  2. బెంగాలీత్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అధికార భాష
  3. బోడో భాషఅసోం
  4. డోగ్రిజమ్మూ కాశ్మీరు లడఖ్ అధికార భాష
  5. గోండి — గోండ్వానా పీఠభూమి లోని గోండుల భాష.
  6. గుజరాతీదాద్రా నాగరు హవేలీ, డామన్ డయ్యు, గుజరాత్ రాష్ట్రాల అధికార భాష
  7. కన్నడకర్ణాటక అధికార భాష
  8. కాశ్మీరీజమ్మూ కాశ్మీరు అధికార భాష
  9. కొంకణిగోవా అధికార భాష
  10. మలయాళంకేరళ, లక్షద్వీపాలు, మాహే (కేంద్రపాలిత ప్రాంతం, పాండిచ్చేరి) రాష్ట్రాల అధికార భాష
  11. మైథిలి - బీహార్ అధికార భాష
  12. మణిపురి లేక మైతై — మణిపూర్ అధికార భాష
  13. మరాఠిమహారాష్ట్ర అధికార భాష
  14. నేపాలీసిక్కిం అధికార భాష
  15. ఒరియాఒడిషా అధికార భాష
  16. పంజాబీపంజాబ్, చండీగఢ్ ల అధికార భాష, ఢిల్లీ, హర్యానాల రెండో అధికార భాష
  17. సంస్కృతంఉత్తరాఖండ్లో రెండో అధికార భాష
  18. సంతాలీ - ఛోటా నాగపూర్ పీఠభూమి (జార్ఖండ్, బీహార్, ఒడిషా, చత్తీస్‌గఢ్) రాష్ట్రాల్లోని భాగాల లోని సంతాలు గిరిజనుల భాష
  19. సింధీ - సింధీ ల మాతృభాష
  20. తమిళంతమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల అధికార భాష
  21. తెలుగుఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, యానాం అధికార భాష
  22. ఉర్దూజమ్మూ కాశ్మీరు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికార భాష

ఈ భాషలు లక్ష కంటే ఎక్కువ మాట్లాడే రాష్ట్రాలు

మార్చు
వరుస నంఖ్య భాష లక్ష కంటే ఎక్కువ మంది మాట్లాడే రాష్ట్రాలు
1 అస్సామీ అస్సాం (1)
2 బెంగాలీ/బంగ్లా త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంచల్,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, భీహార్, మేఘాలయ, అస్సాం, ఝార్ఖండ్, ఒడిషా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, (13)
3 బోడో అస్సాం (1)
4 డోగ్రి జమ్మూ కాశ్మీర్, లడఖ్ (2)
5 గుజరాతీ డామన్ & డయ్యు, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక (6)
6 హిందీ అస్సామ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, చత్తీస్‌ఘడ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఒడిషా, గుజరాత్, పంజాబ్ (19)
7 కన్నడ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ (4)
8 కాశ్మీరి జమ్మూ & కాశ్మీర్ (1)
9 కొంకణి గోవా, కర్ణాటక, మహారాష్ట్ర,గుజరాత్ (4)
10 మైథిలి బీహార్, ఝార్ఖండ్, (2)
11 మలయాళం కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు (4)
12 మణిపురి మణిపూర్,అస్సాం (2)
13 మరాఠీ మహారాష్ట్ర, గోవా, మధ్య ప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌ఘడ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, (7)
14 నేపాలీ సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తర ప్రదేశ్, (4)
15 ఒరియా ఒడిషా, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్. (7)
16 పంజాబీ చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర (11)
17 సంస్కృతం (ప్రాచీన భాష) భారతదేశం మొత్తం మీద 14135 మంది మాత్రమే. అందులో సగం మంది ఉత్తరప్రదేశ్లో ఉన్నారు (7048)
18 సంతాలి బీహార్,అస్సాం, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఒడిషా, పశ్చిమబెంగాల్ (5)
19 సింధీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర (4)
20 తమిళం (ప్రాచీన భాష) తమిళ నాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, పుదుచ్చేరి (6)
21 తెలుగు (ప్రాచీన భాష) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్‌ఘడ్, అండమాన్ నికోబార్ దీవులు (8)
22 ఉర్దూ ఉత్తర ప్రదేశ్, బీహార్, ఉత్తరాంచల్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిషా, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు. (15)

ముఖ్యమైన ఇతర రాష్ట్రస్థాయి భాషలు

మార్చు

జాతీయ స్థాయిలో అధికార భాషలుగా గుర్తింపు పొందనప్పటికీ, రాష్ట్ర స్థాయిలో అధికార భాషలుగా గుర్తింపు పొందిన భాషలు ఇవి:

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Report of the Commissioner for linguistic minorities: 47th report (July 2008 to June 2010)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. pp. 84–89. Archived from the original (PDF) on 13 May 2012. Retrieved 16 February 2012.
  2. "Languages Included in the Eighth Schedule of the Indian Constitution | Department of Official Language | Ministry of Home Affairs | GoI". rajbhasha.gov.in. Retrieved 2022-07-31.
  3. "Report of the Commissioner for linguistic minorities: 50th report (July 2012 to June 2013)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. Archived from the original (PDF) on 8 July 2016. Retrieved 17 September 2016.
  4. భారత రాజ్యాంగం, ఆర్టికల్ 344(1).
  5. భారత రాజ్యాంగం, ఆర్టికల్ 351.
  6. "The Official Languages (Use for Official Purpose of the Union) - Rules 1976 (As Amended, 1987) - Paragraph 2". Archived from the original on 25 March 2010. Retrieved 10 June 2015.
  7. "The Official Languages (Use for Official Purpose of the Union) - Rules 1976 (As Amended, 1987) - Paragraph 4". Archived from the original on 25 March 2010. Retrieved 10 June 2015.
  8. National Portal of India: Government: Constitution of India Archived 31 మార్చి 2008 at the Wayback Machine
  9. Constitution of India Archived 9 సెప్టెంబరు 2014 at the Wayback Machine, page 330, EIGHTH SCHEDULE, Articles 344 (1) and 351]. Languages.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-01-06. Retrieved 2018-04-15.
  11. 11.0 11.1 11.2 11.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Telegraph:1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  12. 12.0 12.1 12.2 12.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Indiatoday:1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  13. "The Origins of the Konkani Language". www.kamat.com. August 15, 1997 – January 15, 2016.
  14. "Indian Languages: Konkani Language". iloveindia.com.
  15. "Oriya gets its due in neighbouring state- Orissa- IBNLive". Ibnlive.in.com. 2011-09-04. Archived from the original on 2014-07-04. Retrieved 2012-11-29.
  16. Naresh Chandra Pattanayak (2011-09-01). "Oriya second language in Jharkhand - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Archived from the original on 2011-11-07. Retrieved 2012-11-29.
  17. "Bengali, Oriya among 12 dialects as 2nd language in Jharkhand". daily.bhaskar.com. 2011-08-31. Retrieved 2012-11-29.
  18. "A Committee has been constituted under the Chairmanship of Shri Sita Kant Mohapatra to make recommendation, inter-alia on the feasibility of treating all languages in the Eighth Schedule to the Constitution, including Tamil, as Official Languages of the Union. The Government will consider the recommendations of the Committee and take a suitable decision in the matter."Indian parliament Archived 21 జూలై 2009 at the Wayback Machine

బయటి లింకులు

మార్చు


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు