భౌతిక శాస్త్ర నిఘంటువు

అక్షర క్రమంలో భౌతిక శాస్త్ర విషయాలు

- - - - - - - - - - - - - అం - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - క్ష

"విజ్ఞానం" అనేది ప్రపంచం గురించి పరీక్షించదగిన వివరణలు, భావి కథనాలు రూపంలో విజ్ఞానాన్ని రూపొందించే, నిర్వహించే ఒక రంగం. పురానతత్వ విజ్ఞాన శాస్త్రం అనేది తత్త్వ శాస్త్రానికి సమీప సంబంధాన్ని కలిగి ఉంది. ప్రారంభ నవీన యుగంలో, "విజ్ఞాన శాస్త్రం", "తత్త్వశాస్త్రం" అనే రెండు పదాలను కొన్నిసార్లు ఆంగ్ల భాషలో ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయంగా ఉపయోగించారు. అయితే, "విజ్ఞాన శాస్త్రాన్ని" ఒక అంశం గురించి విశ్వసనీయ విజ్ఞానాన్ని సూచించడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు, ఇదే విధంగా నేటికి కూడా గ్రంథాలయ విజ్ఞాన శాస్త్రం లేజా రాజకీయ విజ్ఞాన శాస్త్రం వలె నవీన పదాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఆధునిక వాడుకలో, విజ్ఞాన శాస్త్రాన్ని "తరచూ 'ప్రాకృతిక, భౌతిక శాస్త్రం'తో పర్యాయపదాలు వలె పరిగణిస్తారు", కనుక ఇది భౌతిక ప్రపంచం, వాటి న్యాయాల దృగ్విషయానికి సంబంధించి ఆ అధ్యయన రంగాలకు పరిమితం చేయబడింది, కొన్నిసార్లు పరిపూర్ణ గణిత శాస్త్రానికి మినహా సూచిస్తారు. విజ్ఞాన శాస్త్రంలో భాగంగా అభివృద్ధి చేసిన "విజ్ఞాన శాస్త్రం" యొక్క ఈ సూక్ష్మ భావం కెప్లెర్ యొక్క న్యాయాలు, గెలీలియో యొక్క న్యాయాలు, న్యూటన్ యొక్క గతి న్యాయాలు వంటి ప్రారంభ ఉదాహరణల ఆధారంగా "ప్రకృతి న్యాయాల"ను పేర్కొనడానికి ఒక విభిన్న రంగంగా మారింది. ఈ కాలంలో, ప్రాకృతిక తత్త్వశాస్త్రాన్ని "ప్రాకృతిక విజ్ఞాన శాస్త్రం" వలె సూచించడం సర్వసాధారణంగా మారింది". 19వ శతాబ్ద కాలంలో జరిగిన పరిశీలన ద్వారా, "విజ్ఞాన శాస్త్రం" అనే పదం ఎక్కువగా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జీవ శాస్త్రాలతో సహా సహజ ప్రపంచం యొక్క అనుశాసన అధ్యయనంతో అనుబంధించబడుతుంది. ఈ అధ్యయనం కొన్నిసార్లు మానవ ఆలోచన, సమాజం దృష్టిలో ఒక భాషా అనిశ్చిత స్థితిలో మిగిలిపోయింది, ఈ స్థితి ఈ విద్యా విషయక అధ్యయన రంగాలను సామాజిక శాస్త్రం వలె వర్గీకరించడం ద్వారా పరిష్కరించబడింది.

అణువు -భౌతిక శాస్త్రం

భౌతిక శాస్త్ర నిఘంటువు

మార్చు

" విజ్ఞాన శాస్త్రం "లో భాగమయిన భౌతిక శాస్త్ర అంశాలను సూక్ష్మంగా తెలుసుకొనుటకు ఉపయోగపడే నిఘంటువు.

భౌతిక శాస్త్ర పదాల అర్థాలను తెలుసుకొనే విధానము

మార్చు

మనకు కావలసిన పదం యొక్క మొదటి అక్షరం బట్టి సమాచార పెట్టెలో అక్షరాన్ని క్లిక్ చేస్తే ఆ అక్షరంతో ప్రారంభమైన పదాలు వాటి అర్థాలు సంగ్రహంగా లభిస్తాయి. పదంపై క్లిక్ చేస్తే విషయం విస్తారంగా తెలుస్తుంది.

విషయము అర్థము
అదిశరాశి పరిమాణం గలిగి దిశతో సంబధం లేని భౌతిక రాశి. ఉదా:ద్రవ్యరాశి
అణుయుగం అణుశక్తిని వాడుకలోకి తెచ్చినప్పటి నుంచి గడుస్తున్న కాలం
అతిధ్వనులు 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కు పౌనఃపున్యం ఉన్న ధ్వనులు. వీటిని మానవులు వినలేరు.
అధోస్థిరస్థానం ఉష్ణమాపకం పై క్రమాంకనం చేసిన స్కేలుపై క్రమాంకనం చేసిన స్కేలులో, మంచు ఘనీభవన స్థానాన్ని సూచించే సంఖ్య, అధోస్థిరస్థానం విలువలు, ఉష్ణమాపకంపై ఉండే స్కేలును బట్టి ఉంటాయి. ఉదా:సెంటీగ్రేడ్ స్కేలులో అధోస్థిర స్థానం 00C
అనునాదం ఒకే సహజ పౌనఃపున్యాలున్న రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేసే దృగ్విషయాన్ని "అనునాదం" అంటారు.
అనునాదం చెందే గాలి స్థంభాలు గాలి స్థంబపు సహజ కంపనాలు, శృతిదండపు కంపనాలు అనునాదంలో గల గాలి స్థంబాలను అనునాదం చెందే గాలి స్థంభాలు అంటారు.
అనుదైర్ఘ్య తరంగాలు యానకంలో తరంగ ప్రసారథిశకు యానకంలోని కణాల కంపన దిశ సమాంతరంగా ఉంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. ఉదా: శబ్ద తరంగాలు
అన్యోన్య ప్రేరణ ఒక తీగ చుట్ట లోని విద్యుత్ ప్రవహం లోని మార్పు వలన దగ్గరగా ఉన్న మరొక చుట్టలో ప్రేరిత విద్యుచ్ఛాలకబలం ( ) ఉత్పత్తి అవటాన్ని అన్యోన్య ప్రేరకత్వం అంటారు. ఉదా: ట్రాన్స్ ఫార్మర్ పనిచేసే నియమం.
అజడత్వ నిర్దేశ చట్రము భ్రమణం లోకాని త్వరణంలో కాని ఉన్నటువంటి వస్తువుకు జోడించబడిన, న్యూటన్ గమన నియమాలు పాటించని ఊహాత్మక నిరూపక వ్యవస్థను అజడత్వ నిర్దేశ చట్రము అంటారు.
అపకేంద్ర బలం సమవృత్తాకార చలనంలో ఉన్న వస్తువుపై, కేంద్రానిని అపముఖంగా పనిచేస్తూ, భ్రమణంలో ఉన్న చట్రంలో మాత్రమే గమనించటానికి వీలైన బలాన్ని అపకేంద్ర బలం అంటారు.
అపకేంద్ర యంత్రం ఇచ్చిన మిశ్రమం నుండి ఎక్కువ భారం, తక్కువ భారం కల పదార్థాలను వేరుచేసే యంత్రం. ఉదా: ప్రయోగశాలలో మిశ్రమాలను వేరు చేయుట, మజ్జిగ నుండి వెన్న తీయుట, తెనెతుట్టె నుండి తేనెను వేరుచేయుట.
అభికేంద్ర బలం రేఖీయ మార్గంలో చలించే కణాన్ని వృత్తాకార మార్గంలో చలించేందుకు, అవిచ్ఛిన్నంగా పనిచేసే బలాన్ని అభికేంద్ర బలం అంటారు.ఉదా: భూమి చుట్టూ చంద్రుడు తిరుగుట.
అభికేంద్ర త్వరణం సమ వృత్తాకార చలనంలో ఉన్న కణం వెగ దిస అవిచ్ఛిన్నంగా మారుతుండటం వలన, వృత్త కేంద్రం వైపుకి ఏర్పడే త్వరణాన్ని, అభికేంద్ర త్వరణం అంటారు.
అభిఘాతము రీకాయిల్ లో ఉండే బలం. ప్రతిచర్యలల్ల కలిగే బలం. ఉదా:బాట్ తో క్రికెట్ బంతిని మోదినపుడు బంతిపై కలిగే ప్రతిచర్యా బలం.
అమ్మీటరు విద్యుత్తు లో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం. ఇది "ఆంపియర్" ప్రమాణాలతో క్రమాంకనం చేయబడి ఉంటుంది.
అతినీలలోహిత వికిరణాలు విద్యుదయస్కాంత వర్ణపటంలో ఊదా, ఎక్స్ రే కిరణాల మధ్య గల తరంగ దైర్ఘ్యాలున్న విద్యుదయస్కాంత తరంగాలు. అంటే 400 నానో మీటరు నుంచి 4 నానోమీటరుల దైర్ఘ్యాల మధ్య ఉన్న కిరణాలు. వీటిని రిట్టర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
అయాన్ ఒక తటస్థ పరమాణువు ఎలక్ట్రాన్లు కోల్పోయినా, ఎలక్ట్రాన్లు గ్రహించినా "అయాన్"గా మారుతుంది. ఎలక్ట్రాన్ గ్రహిస్తే "ఆనయాన్" ఎలక్ట్రాన్ కోల్పోతే "కాటయాన్" యేర్పడుతుంది.ఉదా:  ,  
అయనీకరణం ఒక ద్రావణిలో పదార్థం అయాన్లుగా విడిపోవటాన్ని అయనీకరణం అంటారు. ఉదా: నీటిలో   కలిస్తే అది  ,   అయాన్లుగా విడిపోతుంది.
అయనీకరణ శక్మము వాయు స్థితిలో ఉన్న పరమాణువు భాహ్య కర్పరం నుండి ఎలక్ట్రాన్ తీసివేయుటకు కావలసిన కనీస శక్తిని అయనీకరన శక్మము అంటారు. దీని ప్రమాణాలు: ఎలక్ట్రాన్ వోల్టు, కి.కా/మోల్, కి.జౌల్/మోల్.
అనయస్కాంత పదార్థం అయస్కాంతం చేత ఆకర్షించబడని పదార్థాలని అనయస్కాంత పదార్థం అంటారు. ఉదా: కాగితం, చెక్క, ....
అయస్కాంతం అయస్కాంత పదార్థాలైన ఇనుము, కోబాల్ట్, నికెల్, వాటి సంయోగపదార్థాలను ఆకర్షించే ఒక విధమైన రాయిని అయస్కాంతం అంటారు.
అయస్కాంత అక్షం భూగ్రహం లోపల ఉండే అయస్కాంత ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే (మిధ్యా) సరళరేఖ.
అయస్కాంత పదార్థం అయస్కాంతం చే ఆకర్షించబడే పదార్థాన్ని అయస్కాంత పదార్థం అంటారు. ఉదా: ఇనుము, ఉక్కు .....
అయస్కాంత క్షేత్రం ఒక అయస్కాంతం చుట్టూ ఉన్న అంతరాళంలో ఎంత మేరకు అయస్కాంత ప్రభావం ఉంటుందో ఆ ప్రదేశాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు.
అయస్కాంతత్వం ఇది కొన్ని పదార్థాలకు ప్రత్యేక లక్షణం. ముఖ్యముగా ఇనప ఖనిజాలలో మాగ్నటైట్ అనే దానికి ఉన్న లక్షణం. మాగ్నటైట్ అనేది ఇనప ఖనిజాలలో ఒకటి. దీనిని కొన్ని రకాల పదార్థాలను (ఇనుము, ఉక్కు, కోబాల్ట్) ఆకర్షించే లక్షణం ఉంటుంది. ఈ తత్వాన్ని అయస్కాంతత్వం అంటారు.
అయస్కాంత దిగ్దర్శిని ఇది ఒక పరికరం. అయస్కాంత ధర్మాన్ని ఉపయోగించి దిశలను తెలుసుకోవటానికి వాడే సాథనం. దీన్నె దిక్చూచి అని కూడా అంటారు.
అయస్కాంత దిశా ధర్మం స్వేచ్ఛాగా వేలాడదీసిన అయస్కాంతం, భౌగోళిక ఉత్తర, దక్షిణ దిశలను సూచిస్తూ, నిశ్చల స్థితికి వస్తుంది. దేన్నే "అయస్కాంత దిశా ధర్మం" అంటారు.
అయస్కాంత ద్విధృవం సాధారణ అయస్కాంతాన్ని అయస్కాంత ద్విధృవం అంటారు.
అయస్కాంత - ధృవాల జంట అయస్కాంత ధృవాలు అన్ని పరిస్థితులలోనూ జతగానే ఉంటాయి. అత్యంత చిన్న అయస్కాంతంలో కూడా యివి జతగానే ఉంటాయి.
అయస్కాంత ప్రేరణ అయస్కాంత క్షేత్ర బలంతో అయస్కాంతం కాని పదార్థాన్ని అయస్కాంతంగా మార్చగలిగే ధర్మం
అయస్కాంత బల రేఖలు అయస్కాంత క్షేత్రంలో అతి దగ్గరగా ఉన్న రెండు బిందువులను కలిపే ఒక సరళరేఖ, అక్కడి అయస్కాంత బలరేఖను సూచిస్తుంది.
అయస్కాంత భ్రామకం అయస్కాంత క్షేత్రం వల్ల మరొక అయస్కాంతం పై ఏర్పడే బ్రామకం.
అయస్కాంత మూల రాశులు భూ అయస్కాంత ధర్మాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే అయస్కాంత రాశులు. ఉదా: దిక్పాతం, అవపాతం, క్షితిజ సమాంతరం.
అయస్కాంతీకరణ తీవ్రత
అయస్కాంతీకరణం అయస్కాంత పదార్థాన్ని అయస్కాంతంగా మార్చే విధానం
అయస్కాంతీకరణ పద్ధతులు అయస్కాంత ప్రేరణ ద్వారా కొన్ని వస్తువులను అయస్కాంతములుగా మార్చే పద్ధతి. ఇది మూడు విధాలుగా ఉంటుంది. 1.ఏక స్పర్శ పద్ధతి, 2. ద్వి స్పర్శ పద్ధతి 3. విద్యుత్ పద్ధతి.
అయస్కాంత క్షేత్ర తీవ్రత అయస్కాంత క్షేత్రంలో ఒక బిందువు వద్ద ప్రమాణ ధృవంపై ఎంత బలం ఉంటుందో దానినే ఆ బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర్ తీవ్రత అంటారు. ప్రమాణాలు:H
అయస్కాంత అభివాహం ఏదైనా ఒక వైశాల్యంలో గల అయస్కాంత బలరేఖల సంఖ్యను అయస్కాంత అభివాహం అంటారు.
అయస్కాంత అభివాహ సాంద్రత ఒక ప్రమాణ వైశాల్యానికి లంబంగా ప్రసరించే అయస్కాంత అభివాహన్ని అయస్కాంత క్షేత్ర ప్రేరణ లేదా అయస్కాంత అభివాహ సాంద్రత అంటారు.విద్యుద్వాహకాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినపుడు, దానిపై ఏర్పడే బలాన్ని "అయస్కాంత అభివాహ సాంద్రత"అందురు. దీని ప్రమాణం:వెబర్/మీ3 లేదా టెస్లా; 1 నానో టెస్లా = 19−9 టెస్లాలు
అయస్కాంత ప్రవేశ్యశీలత ఒక యానకం తనగుండా అయస్కాంత బలరేఖలను ప్రవేశింపజేసే స్వభావాన్ని లేదా తాను అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనయ్యే స్వభావాన్ని, ఆ యానకపు ప్రవేశ్యశీలత అంటారు.
అయస్కాంత భ్రామకం ఒక అయస్కాంత ధృవసత్వం, దాని పొడవుల లబ్ధాన్ని అయస్కాంత భ్రామకం అంటారు. దీనికి ఎస్.ఐ ప్రమాణం - ఆంపియర్-మీటర్2
అయస్కాంత ససెప్టబిలిటీ ఒక పదార్థపు అయస్కాంతీకరణ తీవ్రత, ప్రయోగించిన అయస్కాంత క్షేత్ర తీవ్రత ల నిష్పత్తిని అయస్కాంత ససెప్టబిలిటీ అంటారు.
అయస్కాంత ధృవములు అయస్కాంతంయొక్క ఏ బిందువుల వద్ద ఆకర్షణ బలం ఉంటుందో ఆ బిందువులను అయస్కాంత ధృవాలు అంటారు. అయస్కాంతమునకు ఉత్తర, దక్షణ ధృవాలు ఉండును.
అయస్కాంత ధృవసత్వం ఒక అయస్కాంత ధృవం మరొక అయస్కాంత ధృవమును ఆకర్షించే లేదా వికర్షించే స్వభావాన్ని దాని ధృవసత్వం అంటారు.
అయస్కాంత విలోమవర్గ నియమము రెండు అయస్కాంతాల ధృవాల మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలం వాటి ధృవసత్వాల లబ్ధానికి అనులోమాను పాతంలోను, వాటి మధ్య దూర వర్గానికి విలోమాను పాతంలోనూ ఉంటుంది.
అవపాత సూచిక అవపాతాన్ని తెలుసుకొనుటకు ఉపయోగించే సాథనం.
అవరుద్ధ డోలనాలు కాలంతో పాటు తగ్గిపోయే కంపన పరిమితులున్న ఆవర్తన చలనాన్ని అవరుద్ధ డోలనాలు అంటారు.
అవరోహణ కాలం ఒక స్వేచ్ఛాపతన వస్తువు కొంత ఎత్తు నుండి భూమిని చేరటానికి పట్టే కాలం.
అసంపీడ్యాలు ద్రవాలపై బాహ్య పీడనం ప్రయోగిస్తే, ద్రవాల సాంద్రత ఎక్కువగా మారదు. ద్రవాలకు గల ఈ ధర్మాన్ని అసంపీడ్యత అంటారు. ద్రవాలు అసంపీడ్యాలు.
అసంబద్ధ కాంతి పరమాణువులలో ఉత్తేజ స్థాయి నుండి భూస్థాయికి సంక్రమణ చెందే క్రమంలో ఎలక్ట్రాన్లు దృగ్గోచర కాంతిని ఉద్గారిస్తాయి. సాధారణ కాంతి జనకంలో ఈ కాంతి ప్రావస్థ సంబంధం లేకుండా క్రమరహితంగాను ఉంటుంది. దీనిని అసంబద్ధ కాంతి అంటారు.
అసంపూర్ణ పారదర్శకాలు పతన కాంతిలో కొంత కాంతిని మాత్రమే తమగుండా పరావర్తింపజేసే పదార్థాలు. ఉదా: నూనె పూసిన కాగితం
అస్థిర నిశ్చల స్థితి 1.ఈ స్థితిలో ఉన్న ఫలిత బలాల మొత్తం, బల భ్రామకాల మొత్తం శూన్యమునకు సమానం కాదు. ఈ స్థితిలో వ్యవస్థ త్వరణానికి గురి అవుతుంది.
2.ఒక వస్తువుపై ప్రయోగించిన బలం వల్ల వస్తువు కదిలి, తిరిగి యధాస్థితికి రాకపోతే, ఆ వస్తువు అస్థిరనిశ్చల స్థితిలో ఉందని అంటారు.
అర్థవాహకం విద్యుత్ ప్రవాహాన్ని సాపేక్షంగా తక్కువగా తనగుండా ప్రవహింపజేసే పదార్థం. దీనిలో నిషిద్ధ పట్టీ సాపేక్షంగా తక్కువ ఉంటుంది. (సుమారు 3ev)
అర్థ జీవితకాలం ఒక రేడియో ధార్మిక పదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టు కాలమును "అర్థ జీవితకాలం" అంటారు.
అర్థాయువు ఒక రేడియో ధార్మిక పదార్థంలో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టు కాలమును "అర్థ జీవితకాలం" అంటారు.
అస్పందన స్థానం స్థిర తరగంగాలలో అత్యల్ప స్థానబ్రంశం గల బిందువులను అస్పందన స్థానాలు అంటారు.
అస్వభావజ అర్థవాహకం స్వచ్ఛమైన అర్థవాహకాలకు (స్వచ్ఛమైన సిలికాన్, స్వచ్ఛమైన జెర్మేనియం) లకు చాలా తక్కువ మోతాదులో ఎంపిక చేసిన మలినాలను కలిపి వాటిలో హోలులసంఖ్య గాని, ఎలక్ట్రాన్ల సంఖ్య గాని పెంచుతారు. ఇటువంటి అర్థవాహకాలను అస్వభావజ అర్థవాహకాలు అంటారు.
అష్టకం ఒక పరమాణువు యొక్క బాహ్య కక్ష్యలో 8 ఎలక్ట్రాన్లు కలిగి యుండటాన్ని అష్టకం అంటారు.