మూస : వేదిక తెలుగు సినిమా విశేషాలు
80వ దశకంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే, ప్రతి ఆదివారం మధ్యాహ్నం డీడీలో ప్రసారమయ్యే స్పిరిట్ ఆఫ్ యూనిటీ కాన్సర్ట్స్ అనే కార్యక్రమానికి సంగీతం అందించినది ఎ. ఆర్. రెహమాన్ అనీ! అంతకు పూర్వం గార్డెన్ వరేలీ వంటి వాణిజ్య ప్రకటనలకు జింగిల్స్ అందించాడనీ!!
జెనీలియా , ఇలియానా , కమలినీ ముఖర్జీ , పూజా హెగ్డే (ముకుంద హీరోయిన్), యామీ గౌతం వంటి హీరోయిన్ లు అందరూ తొలుత ఫెయిర్ అండ్ లవ్లీ యొక్క వాణిజ్య ప్రకటనలలో కనిపించారనీ, ఆ తర్వాతే సినిమాల్లోకి వచ్చారనీ!
దేవదాసు పేరు తో మొత్తం నాలుగు సినిమాలున్నాయనీ! వీటిలో ఒకటి దేవదాసుకు సీక్వెల్ అనీ! తెలుగు సినీరంగంలో మొట్టమొదటి సీక్వెల్ ఇదేననీ! (దేవదాసు (1953 సినిమా) , దేవదాసు (1974 సినిమా) , దేవదాసు మళ్ళీ పుట్టాడు , దేవదాసు (2006 సినిమా) )
బాల్యం నుండి హాస్యనటుని పాత్రలు పోషిస్తున్న ఆలీ కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆ దేశం నుండి భారతదేశం వలస వచ్చినదనీ, ఆలీ కడుపేదరికంలో పుట్టినా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈనాడు ఈ స్థాయికి చేరాడనీ!
ప్రిన్స్ మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు 80వ దశకంలో హీరోగా నటించారనీ! ఘట్టమనేని కృష్ణ , రమేష్ , ప్రిన్స్ లు ముగ్గురు కొడుకులు అనే చిత్రంలో అన్నదములుగా నటించారనీ!
చిరంజీవి , వెంకటేష్ , నాగార్జున , రవితేజ ల నుండి పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ , జూనియర్ ఎన్.టి.ఆర్ , రమ్యకృష్ణ , శృతి హాసన్ , కె.విశ్వనాథ్ , SPB , సిరివెన్నెల సీతారామశాస్త్రి , ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారందరూ వాణిజ్య ప్రకటనలలో తళుక్కు మన్నారనీ!
అల్లు అర్జున్ గంగోత్రి (సినిమా) లో అరంగేట్రం చేసే ముందు డాడీ (సినిమా) లో ఒక చిన్న నృత్య దృశ్యంలో తెరంగేట్రం చేశాడనీ!
అహ! నా పెళ్ళంట! (1987) సినిమా , ఒహో నా పెళ్ళంట , చూపులు కలసిన శుభవేళ , వివాహ భోజనంబు , లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాల పేర్లు అన్నీ మాయాబజార్ చిత్రంలోని పాటల ఆధారంగా వచ్చినవి.
ఇలియానా నటించిన తొలి హిందీ చిత్రం బర్ఫీ అనీ!
... ఆస్కార్ , గ్రామీ అవార్డులు అందుకొన్న తర్వాత ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారథ్యంలో విడుదలైన తొలి తెలుగు చిత్రం కొమరం పులి అనీ!
... అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ లో నటి విజయనిర్మల కు రికార్డు ఉందనీ!
... మొట్టమొదటి బ్లూ-రే డిస్క్ నాగార్జున నటించిన కింగ్ , రెండవది రామ్ చరణ్ తేజ నటించిన మగధీర అనీ!
... మాయాబజార్ పేరుతో మొత్తం నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయనీ!
...తెలుగు సినీ చరిత్రలోనే మొట్ట మొదటగా కోటి రూపాయలకు పైచిలుకు వసూలు చేసిన చిత్రం లవకుశ అనీ!
...కమల్ హాసన్ 14 సార్లు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు గెలుచుకొన్నాడనీ!
...అల్లు అర్జున్ సినిమాలు మలయాళం లోకి అనువదించబడతాయనీ, కేరళ లో చాలా మంది అతనిని అభిమానిస్తారనీ!
...మాయాబజార్ లోని ప్రతి ఫ్రేమును రంగులమయం చేస్తూ మొత్తం చిత్రాన్ని అలా చేయటానికి గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ కి 165 మందితో మూడు సంవత్సరాలు పట్టిందనీ!
...వైజయంతీ మూవీస్ తొట్ట తొలి చిత్రం ఎన్.టి.ఆర్ నటించిన ఎదురులేని మనిషి అనీ!
...చిరంజీవి కి కన్నడిగ అభిమానులు కూడా ఉన్నారనీ! (చిరంజీవి వ్యాసం)
...రాయలసీమ మాండలికం, అక్కడి జీవనశైలి ని ప్రతిబింబించిన మొదటి చిత్రం ప్రేమించుకుందాం రా అనీ!
...ఢెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు సినిమా చరిత్ర లోనే పోకిరి అతి పెద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచిందనీ!
...అత్తకి యముడు అమ్మాయికి మొగుడు తమిళ రీ-మేక్ లో రజినీ కాంత్ కి స్నేహితుడు గా చిరు ప్రత్యేక పాత్రని పోషించాడనీ!
...7/జీ బృందావన్ కాలనీ, అపరిచితుడు , బిచ్చగాడు వంటి సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ విజయవంతమయ్యాయనీ!
...వెంకటేష్ నటించిన చంటి హిందీ అనువాదం అనాడి లో కూడా తనే నటించారనీ!
...1974 లో స్థాపించిన వైజయంతీ మూవీస్ కి నామకరణం చేసింది ఎన్.టి.ఆర్ అనీ!
...మణి రత్నం దర్శకత్వం వహించిన గీతాంజలి (1989 సినిమా)ను మొదట తెలుగులోనే రూపొందించి, తమిళంలోకి డబ్ చేశారనీ!
...ల్యాటిన్ అమెరికా, ఐరోపా దేశస్థులు దొంగ (సినిమా) లోని గోలిమార్ పాటని ఇష్ట పడతారనీ!(చిరంజీవి వ్యాసం)