యండమూరి వీరేంద్రనాథ్

ప్రముఖ రచయిత
(యండమూరి వీరేంధ్రనాథ్ నుండి దారిమార్పు చెందింది)

యండమూరి వీరేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14, 1948లో జన్మించాడు.[3] ఈయన తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి.

యండమూరి వీరేంద్రనాథ్
జననం (1948-11-14) 1948 నవంబరు 14 (వయసు 75)[1]
ఇతర పేర్లుయండమూరి
విద్యసి. ఎ
వృత్తిచార్టర్డ్ అకౌంటెంట్
రచయిత
సినిమా, టి.వి దర్శకుడు
వ్యక్తిత్వ వికాస నిపుణుడు
ఉద్యోగంస్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఆంధ్రా బ్యాంకు
జీవిత భాగస్వామిఅనుగీత[2]
పిల్లలుప్రణీత్ [2]
తల్లిదండ్రులు
  • యండమూరి చక్రపాణి (తండ్రి)
  • నరసమాంబ (తల్లి)
వెబ్‌సైటుyandamoori.com

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

యండమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14, 1948లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు.

ఉద్యోగం

మార్చు

వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన యండమూరి ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో, పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు చిన్న తరహా పరిశ్రమల విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

కుటుంబం

మార్చు

ఆయనకు 10-03-1974 లో అనుగీతతో వివాహం జరిగింది. వారి కుమారుడి పేరు ప్రణీత్.

పురస్కారాలు

మార్చు

రచనా శైలికి ఉదాహరణలు

మార్చు

వివిధ నాటకాలు, నాటికలు, నవలలు, సినిమాల కోసం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఉపన్యాసాలలో ఈయన వ్రాసిన ఈ పంక్తులు, చెప్పిన మాటలు ఈయన శైలి ఏమిటో చెబుతాయి.

  • ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!
  • ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!
  • నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.
  • మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
  • వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?
  • దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు.
  • దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒక గీతకి కేవలం అటూ ఇటూ ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం.
  • కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!
  • జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.
  • ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.
  • విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?
  • దెయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి, భయం అన్న పేరుతో.
  • అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే, నమ్మకంతో వచ్చిన ఓటమే గొప్ప సంతృప్తి నిస్తుంది.
 
మైండ్ పవర్ బుక్ కవర్

యండమూరి పుస్తకాలు (ఫిక్షన్) [4]

మార్చు

యండమూరి పుస్తకాలు (నాన్‌- ఫిక్షన్) [6]

మార్చు

సినిమాలుగా వచ్చిన యండమూరి నవలలు

మార్చు
నవల పేరు సినిమా పేరు
వెన్నెల్లో ఆడపిల్ల హలో ఐ లవ్ యూ
తులసిదళం తులసిదళం
తులసి కాష్మోరా
అభిలాష అభిలాష
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఛాలెంజ్
అగ్నిప్రవేశం అగ్నిప్రవేశం
ఆఖరి పోరాటం ఆఖరి పోరాటం
మరణ మృదంగం మరణ మృదంగం
నల్లంచు తెల్లచీర దొంగమొగుడు*
ఒక రాధ-ఇద్దరు కృష్ణులు ఒక రాధ-ఇద్దరు కృష్ణులు
స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్
రుద్రనేత్ర రుద్రనేత్ర
రాక్షసుడు రాక్షసుడు
ధ్రిల్లర్ ముత్యమంత ముద్దు
అంతర్ముఖం సంపూర్ణ ప్రేమాయణం
  • దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచు తెల్లచీర నవల వ్రాయబడింది. రెండింటి మధ్య చాలా తేడాలు (పాత్రలు, కథ) ఉన్నాయి.

వ్యక్తిత్వ వికాస రచనలు

మార్చు

నాటికలు

మార్చు
  1. కుక్క[9]
  2. మనుషులోస్తున్నారు జాగ్రత్త
  3. చీమకుట్టిన నాటకం
  4. రుద్రవీణ

ఇతర రచనలు

మార్చు

సినిమా మాటల/స్క్రీన్ ప్లే రచయితగా

మార్చు

సినీ దర్శకుడిగా

మార్చు

నటుడిగా

మార్చు
  1. విలేజ్ లో వినాయకుడు
  2. బన్నీ అండ్ చెర్రీ (2013)


బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "జీవిత సంగ్రహం". yandamoori.com. 12 July 2008. Archived from the original on 31 మే 2008. Retrieved 12 July 2008.
  2. 2.0 2.1 "యండమూరి జీవిత సంగ్రహం". yandamoori.com. 12 July 2008. Archived from the original on 31 మే 2008. Retrieved 12 July 2008.
  3. "యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం". Archived from the original on 2006-04-28. Retrieved 2006-04-07.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-19. Retrieved 2013-05-28.
  5. అభిషిక్తం....ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-08. Retrieved 2013-05-28.
  7. చిన్న కథలు....విజయానికి ఆరవ మెట్టు
  8. విజయం వైపు పయనం..దిగులు అంటే ఏమిటి
  9. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.