యండమూరి వీరేంద్రనాథ్
యండమూరి వీరేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14, 1948లో జన్మించాడు.[3] ఈయన తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి.
యండమూరి వీరేంద్రనాథ్ | |
---|---|
జననం | [1] | 1948 నవంబరు 14
ఇతర పేర్లు | యండమూరి |
విద్య | సి. ఎ |
వృత్తి | చార్టర్డ్ అకౌంటెంట్ రచయిత సినిమా, టి.వి దర్శకుడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు |
ఉద్యోగం | స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, ఆంధ్రా బ్యాంకు |
జీవిత భాగస్వామి | అనుగీత[2] |
పిల్లలు | ప్రణీత్ [2] |
తల్లిదండ్రులు |
|
వెబ్‌సైటు | yandamoori.com |
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుయండమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14, 1948లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందువల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి ల లోనూ, ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదివాడు. 1972లో సీ.ఏ. పట్టా పుచ్చుకున్నాడు.
ఉద్యోగం
మార్చువృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన యండమూరి ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో, పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు చిన్న తరహా పరిశ్రమల విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
కుటుంబం
మార్చుఆయనకు 10-03-1974 లో అనుగీతతో వివాహం జరిగింది. వారి కుమారుడి పేరు ప్రణీత్.
పురస్కారాలు
మార్చు- రఘుపతి రాఘవ రాజారాం నాటకానికి 1982 లో సాహిత్య అకాడెమీ అవార్డు
- 1996 లో వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహికకు ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం.
రచనా శైలికి ఉదాహరణలు
మార్చువివిధ నాటకాలు, నాటికలు, నవలలు, సినిమాల కోసం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఉపన్యాసాలలో ఈయన వ్రాసిన ఈ పంక్తులు, చెప్పిన మాటలు ఈయన శైలి ఏమిటో చెబుతాయి.
- ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!
- ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!
- నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.
- మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
- వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?
- దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు.
- దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒక గీతకి కేవలం అటూ ఇటూ ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం.
- కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!
- జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.
- ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.
- విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?
- దెయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి, భయం అన్న పేరుతో.
- అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే, నమ్మకంతో వచ్చిన ఓటమే గొప్ప సంతృప్తి నిస్తుంది.
- వీళ్ళనేం చేద్దాం?
- డేగ రెక్కల చప్పుడు
- ఒక వర్షాకాలపు సాయంత్రం
- రెండు గుండెల చప్పుడు
- వెన్నెల్లో ఆడపిల్ల
- ఆనందో బ్రహ్మ
- అంతర్ముఖం
- డబ్బు టు ది పవరాఫ్ డబ్బు
- కాసనోవా 99
- డబ్బు మైనస్ డబ్బు
- తులసీ దళం
- తులసి
- అష్టావక్ర
- ప్రియురాలు పిలిచె
- ది డైరీ ఆఫ్ మిసెస్ శారద
- మరణ మృదంగం
- రాక్షసుడు
- ప్రేమ
- ధ్యేయం
- అనైతికం
- అతడే ఆమె సైన్యం
- లేడీస్ హాస్టల్
- చీకట్లో సూర్యుడు
- థ్రిల్లర్
- అతడు ఆమె ప్రియుడు
- సిగ్గేస్తోంది
- అంకితం
- మరో హిరోషిమా
- ప్రార్థన
- పర్ణశాల
- వెన్నెల్లో గోదారి
- మంచు పర్వతం
- 13-14-15
- అభిలాష
- నల్లంచు తెల్లచీర
- చెంగల్వ పూదండ
- అగ్ని ప్రవేశం
- భార్యా గుణవతి శత్రు
- స్వర భేతాళం
- దుప్పట్లో మిన్నాగు
- యుగాంతం
- ఋషి
- క్షమించు సుప్రియా!
- నిశ్శబ్థం-నీకూ నాకూ మధ్య
- రాధ - కుంతి
- ఒక రాధ, ఇద్దరు కృష్ణులు
- రక్త సింధూరం
- ఆఖరి పోరాటం
- స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్
- ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్ [5]
- భేతాళ ప్రశ్నలు
- ఇడ్లీ-వడ-ఆకాశం - తరువాత దీని పేరును "ఇడ్లి - ఆర్కిడ్ - ఆకాశం" మార్చారు. విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథకు ఇది స్వేచ్ఛానువాదం.
- మంచుపూల వర్షం
- విజయ రహస్యాలు
- తప్పు చేద్దాం రండి
- విజయానికి ఆరో మెట్టు
- విజయానికి ఐదు మెట్లు
- మైండ్ పవర్ - నెం.1 అవటం ఎలా?
- విజయంలో భాగస్వామ్యం
- చదువు - ఏకాగ్రత
- పిల్లల పేర్ల ప్రపంచం
- విజయం వైపు పయనం
- మిమ్మల్ని మీరు గెలవగలరు
- మీరు మంచి అమ్మాయి కాదు
- మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే?
- గ్రాఫాలజీ
- పడమటి కోయిల పల్లవి
- మంచి ముత్యాలు
- పాపులర్ రచనలు చేయడం ఎలా?
- లోయనుంచి శిఖరానికి
సినిమాలుగా వచ్చిన యండమూరి నవలలు
మార్చు- దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచు తెల్లచీర నవల వ్రాయబడింది. రెండింటి మధ్య చాలా తేడాలు (పాత్రలు, కథ) ఉన్నాయి.
వ్యక్తిత్వ వికాస రచనలు
మార్చునాటికలు
మార్చు- కుక్క[9]
- మనుషులోస్తున్నారు జాగ్రత్త
- చీమకుట్టిన నాటకం
- రుద్రవీణ
ఇతర రచనలు
మార్చుసినిమా మాటల/స్క్రీన్ ప్లే రచయితగా
మార్చుసినీ దర్శకుడిగా
మార్చునటుడిగా
మార్చు
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "జీవిత సంగ్రహం". yandamoori.com. 12 July 2008. Archived from the original on 31 మే 2008. Retrieved 12 July 2008.
- ↑ 2.0 2.1 "యండమూరి జీవిత సంగ్రహం". yandamoori.com. 12 July 2008. Archived from the original on 31 మే 2008. Retrieved 12 July 2008.
- ↑ "యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం". Archived from the original on 2006-04-28. Retrieved 2006-04-07.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-19. Retrieved 2013-05-28.
- ↑ అభిషిక్తం....ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-08. Retrieved 2013-05-28.
- ↑ చిన్న కథలు....విజయానికి ఆరవ మెట్టు
- ↑ విజయం వైపు పయనం..దిగులు అంటే ఏమిటి
- ↑ ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.