Saleemahamed
స్వాగతం
మార్చుSaleemahamed గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
- వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
- చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
- వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
- వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
ఇకపోతే..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని ప్రతీ ఊరికీ, ప్రతీ మండలానికీ, జిల్లాకీ, ప్రతీ పట్టణానికీ, నగరానికీ వికీలో పేజీ ఉంది. మీ ఊరి పేజీ చూడండి. అందులో సవరణలు ఏమైనా అవసరమనుకుంటే చేసెయ్యండి. వెనకాడకండి.
- ప్రతీ తెలుగు సినిమాకీ ఒక పేజీ పెట్టాలనేది సంకల్పం. అందులో మీరూ పాలుపంచుకోవచ్చు.
- మానవ పరిణామం, మాయాబజార్, ఇస్రో, సూపర్‌స్టార్ కృష్ణ, జవాహర్ లాల్ నెహ్రూ, చంద్రుడెలా పుట్టాడు, తిరుమల ప్రసాదం, హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు, కొండారెడ్డి బురుజు,.. రండి. విజ్ఞాన సర్వస్వ ప్రపంచంలో విహరించండి. ఇక్కడ రాయండి. తప్పులను సరిదిద్దండి. ఒప్పులకు మెరుగులు పెట్టండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Bhaskaranaidu (చర్చ) 09:29, 13 ఆగస్టు 2020 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 5
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల [వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] (చర్చ) 09:29, 13 ఆగస్టు 2020 (UTC)
ఆయుర్వేద దోషాలు వ్యాసం
మార్చునమస్కారమండి. ఆయుర్వేద దోషాలు వ్యాసం రాస్తున్నందుకు ధన్యవాదాలు. మంచి విషయాన్ని ఎంచుకున్నారు. వ్యాసాన్ని సరిగా రూపు దిద్దేందుకు మరింత సమయ్ం, మరెన్నో దిద్దుబాట్లూ అవసరం పదతాయని నాకు తెలుసు. దీన్ని విడిచి పెట్టకుండా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. నావి కొన్ని సూచనలు:
- వ్యాసం పేరు మరింత స్పష్టంగా ఉంటే బాగుంటుంది. ఆయుర్వేద దోషాలు అంటే ఆయుర్వేదంలో దోషాలు అనే అర్థం వస్తోంది; ఆయుర్వేదం నిర్వచించిన దోషాలు అనో ఆయుర్వేదం ప్రకారం జీవుల లోని దోషాలు అనో లేదా మరేదైనా పేరుకో.. మారిస్తే బాగుంటుంది. పరిశీలించండి.
- వ్యాసానికి కొంత ప్రవేశిక (ఉపోద్ఘాతం) ఉండాలి. అసలు దోషాలంటే ఏంటి, వాటిని ఎందుకు నిర్వచించింది, వాటిని వైద్యానికి ఎలా వాడుతుంది ఇలాంటి క్లుప్త సమాచారాన్ని అక్కడ వివరించాలి. వీటిని మిగతా వ్యాసంలోని వివిధ విభాగాల్లో వివరించబోతారన్నమాట. ఈ ప్రవేశికను తరువాతైనా రాయవచ్చు లెండి.
- "మరియు" అనే మాట తెలుగు భాషకు సహజమైన వాడుక కాదు. వికీలో దాన్ని రాయకూడదు.
పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 02:11, 3 డిసెంబరు 2020 (UTC)
జుట్టు కోసం ప్రోటీన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుజుట్టు కోసం ప్రోటీన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- భాష కృతకం. యంత్రికానువాదం లాగా ఉంది. పాఠ్యం, విజ్ఞాన సర్వస్వ శైలిలో లేదు. ముఖ్యమైన చోట్ల మూలాల్లేవు. ఇచ్చిన రెండు మూలాలూ పనికి రావు. ఒక వారం లోగా సవరించకపోతే తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/జుట్టు కోసం ప్రోటీన్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చ • రచనలు) 02:03, 18 డిసెంబరు 2020 (UTC) చదువరి (చర్చ • రచనలు) 02:03, 18 డిసెంబరు 2020 (UTC)
మీ రచనలపై సూచనలు
మార్చువాడుకరి:Saleemahamed గారు, మీ వికీకృషికి అభివందనలు. మీరు ఇటీవల చేర్చిన జుట్టునుంచి దుర్వాసన, గతంలో చేర్చిన ఇటువంటి వ్యాసాలు జుట్టు వ్యాసంలో వుంటే బాగుంటుంది. ఆంగ్ల మూలాలు వాడారు కావున మీరు విషయ అనువాద ఉపకరణం వాడి అనువాదాలు చేస్తే మీ కృషి తొలగింపుకు గురి అయ్యే అవకాశాలు తక్కువ. పైన స్వాగత సందేశంలో విలువైన సమాచారం అధ్యయనం చేయండి. తొలి 100 మార్పులు ఇప్పటికే వున్న వ్యాసాలలో చేయండి. చర్చలకు స్పందించటం వికీ కృషికి చాలా ముఖ్యం. అలాగే మీ సందేహాలు అడగండి. అర్జున (చర్చ) 22:56, 17 మార్చి 2021 (UTC)
- సలీం అహ్మద్ గారు, పైన అర్జున గారు చెప్పినట్లే మీరు జుట్టు పెరుగుదలకు తలలో రక్త ప్రసరణ అనే వ్యాసం రాశారు. దీన్ని కూడా జుట్టు వ్యాసంలో విలీనం చేయాలి. దానికి తగ్గ ప్రతిపాదననను వ్యాసం పై భాగంలో ఉంచాను గమనించండి. ఇంకొక విషయం, మీరు వ్యాసంలో ప్రశ్న జవాబుల రూపంలో రాస్తున్నారు. అది వార్తా పత్రికల వ్యాసం గానో ఇంకో రకంగానో సరిపోతుంది కానీ వికీ శైలికి సరిపడదు. దయచేసి గమనించగలరు. రవిచంద్ర (చర్చ) 05:56, 9 ఏప్రిల్ 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
మార్చుGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.