వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/13
శిక్షణ తరగతులు | |
---|---|
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు | |
| |
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20 | |
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30 |
మ్యాప్స్ గురించిన శిక్షణా సమావేశం, అభ్యాసం
- తేదీ: 30.06.2024 ఆదివారం.
- సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి 3.00 వరకు
- శిక్షణాంశం: ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ పరిచయం (OSM - Open Street Map)
- శిక్షకులు: సాయి ఫణి గారు
- వేదిక: గూగుల్ మీట్
- లింక్: https://meet.google.com/rhc-pocz-kjw
సమావేశ సరళి:
- ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ సౌలభ్యాలు, ప్రదర్శన
- ప్రత్యక్ష అభ్యసనం (సాధ్యమైనంతవరకు కంప్యూటర్ వాడుకకు సిద్ధంగా వుండండి)
- ప్రశ్నలు
- తదుపరి వారంలో చేయవలసిన అభ్యసనాలు (వ్యక్తిగత లక్ష్యాలు)
సమావేశానికి ముందు పని:
- ఓపెన్‌స్ట్రీట్‌మేప్(OSM) వ్యాసం,దాని ఆంగ్ల వికీరూపం చదవటం
- https://openstreetmap.org లో ఖాతా లేకపోతే, తెరవటం (వికీపీడియాలో లాగా కాక, OSM లో మార్పులు చేయటానికి ఖాతా తప్పనిసరి, ప్రత్యేక వాడుకరి పేరు, పాస్వర్డ్ వాడనవసరములేకుండా వికీపీడియా, గూగుల్, ఫేస్బుక్ లాంటి ఖాతాలు కూడా వాడుకోవచ్చు)
- OSM Andhra Pradesh టెలిగ్రామ్ ఛానల్, OSM India టెలిగ్రామ్ ఛానల్ సముదాయాలలో చేరటం (ఇష్టమైతే)
- జనావాసాలకు వాడే place అనే కీ గురించి ఓపెన్ స్ట్రీట్ మేప్ వికీలో సమాచారం చదవటం
- OSM లో జరుగుతున్న ప్రత్యక్ష మార్పులు చూడండి
సమావేశం తరువాత వారంలోపు చేయవలసిన పని:
- మీకు పరిచయమున్న ప్రాంతాన్ని ఎంపికచేసుకోండి. ఇప్పటికే ఆ ప్రాంతంలో OSM లో ఏవేవి చేర్చారో చూడండి. వాటిలో సవరణలు గాని (ఉదాహరణకు తెలుగు పేరు లేకపోతే చేర్చటం, వికీడేటా లేకపోతే చేర్చటం, ఇతర లక్షణాలలో మార్పులు), కొత్తగా ఐదు మార్పుల సమితులు గాని చేర్చండి. వాటిలో కనీసం రెండు బిందువు కు సంబంధించినవి, రెండు గీతకు సంబంధించినవి, ఒకటి ప్రదేశానికి సంబంధించినవి అయివుండాలి. వికీపీడియాలో లాగా ధైర్యంగా మార్పులు చేయండి. ఆ మార్పుల వివరాలు చర్చాపేజీలో తెలపండి. ఏమైనా సందేహాలుంటే ఈ సమావేశపేజీ చర్చాపేజీలో, భద్రపరచిన మార్పుల సమితి సంఖ్యతో(భద్రపరచి వుంటే) అడగండి.
గమనికలు
మార్చుగమనిక: తరువాతి వారం కార్యక్రమం వికీపీడియా మ్యాపులు పరిచయం నకు OSM అవగాహన అవసరం
నమోదు చేసుకున్న సభ్యులు
మార్చు(సభ్యనామం, సంతకం)
- Vjsuseela--V.J.Suseela (చర్చ) 2024-06-24T11:41:43(IST)
- --అర్జున (చర్చ) 06:14, 24 జూన్ 2024 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:38, 24 జూన్ 2024 (UTC)
- Saiphani02 (చర్చ) 05:49, 25 జూన్ 2024 (UTC)
- ప్రభాకర్ గౌడ్చర్చ 09:36, 25 జూన్ 2024 (UTC)
- KINNERA ARAVIND (చర్చ) 05:42, 26 జూన్ 2024 (UTC)
- చదువరి (చర్చ • రచనలు) 10:10, 29 జూన్ 2024 (UTC)
- యర్రా రామారావు (చర్చ) 04:28, 30 జూన్ 2024 (UTC)
ఈ ఆదివారం అంటే జూన్ 30వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు ప్రధాన సమావేశం జరిగింది. ఆ తరువాత గంట ఆసక్తి గల వారి అదనపు సందేహాల నివృత్తి జరిగింది. గూగుల్ మీట్ లో జరిగిన సమావేశంలో సాయిఫణి గారు'OSM - ఓపెన్ స్ట్రీట్స్ మాప్స్' గురించిన శిక్షణ, అభ్యాసం నిర్వహించారు.
- 15 మంది సభ్యులు - చదువరి, A.మురళీకృష్ణ, వి.జె.సుశీల, కిమీర, యర్రా రామారావు, కశ్యప్, ఉదయ కిరణ్. గుంటుపల్లి రామేశం, అర్జున రావు, సాయి ఫణి, నివాస్,అరవింద్,ప్రణయ్ రాజ్, శ్రీపతి రావు,హర్షి గారులు పాల్గొన్నారు.
- సాయి ఫణి గారు OSM గురించిన పవర్ పాయంట్ ప్రదర్శన, తరువాత OSM వెబ్సైటులో ఖాతా తెరచుట, మ్యాపులు సృష్టించడం, సవరించడం, వికీడేటాతో అనుసంధానించడం వంటి విషయాలు స్క్రీన్ షేర్ చేసి వివరించారు. సందేహాలు గురించి చర్చించారు.
- అర్జునరావుగారు సమావేశం తదుపరి అభ్యాసంగా వారంలోగా OSM లో కనీసం 5 మార్పుల సమితులు భద్రపరచమని, ఏవైనా సందేహాలుంటే ఈ సమావేశ చర్చాపేజీలో అడగమని సూచించారు.
<ఈ సమావేశం రికార్డ్ చేయడంలో సహకరించిన నివాస్ గారికి ధన్యవాదాలు>
- సమావేశం పూర్తి రికార్డింగ్ ఇక్కడ అందుబాటులో ఉంది: youtube.com/watch?v=Y_yXIxXxGkk