వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/8
కార్యక్రమం
మార్చు
శిక్షణ తరగతులు | |
---|---|
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు | |
| |
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20 | |
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30 |
తేదీ: 26.05.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
శిక్షణాంశం: వికీమీడియా వారు అందించే గ్రాంట్లు, సి ఐ ఎస్, వికీమీడియా ఫౌండేషన్ లు వివిధ ప్రాజెక్ట్ లకు అందించే సహకారాల గురించిన ప్రసంగం, చర్చ
శిక్షకులు: పవన్ సంతోష్ గారు
వేదిక: గూగుల్ మీట్
లింక్: https://meet.google.com/yuy-enyx-zcw
నమోదు చేసుకున్న సభ్యులు
సభ్యనామం / సంతకం
- ''వి.జె.సుశీల'' (చర్చ) 10:45, 19 మే 2024 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:13, 20 మే 2024 (UTC)
- చదువరి (చర్చ • రచనలు)
- ప్రభాకర్ గౌడ్చర్చ 13:43, 24 మే 2024 (UTC)
- KINNERA ARAVIND (చర్చ) 04:58, 25 మే 2024 (UTC)
- యర్రా రామారావు (చర్చ) 07:58, 26 మే 2024 (UTC)
- Muralikrishna m (చర్చ) 09:00, 26 మే 2024 (UTC)
నివేదిక
మార్చు
తెవికిబడి 8వ శిక్షణా కార్యక్రమం తే 26.05.2024 ఆదివారం నాడు మధ్యాహ్నం 2.00 నుంచి సుమారు 4.15గం వరకు గూగుల్ మీట్ లో జరిగింది.
- 12 మంది సభ్యులు- చదువరి, ఎం.మురళీకృష్ణ,యర్రా రామారావు, వి.జె.సుశీల, ప్రణయ్ రాజ్ వంగరి, ప్రభాకర్ గౌడ్ నోముల, పాలగిరి రామకృష్ణ, అరవింద్ కిన్నెర, పవన్ సంతోష్, కృష్ణా రెడ్డి, బివి ప్రసాద్,ఉదయ కిరణ్ గారులు పాల్గొన్నారు.
- పవన్ సంతోష్ గారు వికీమీడియా వారు అందించే గ్రాంట్లు, సి ఐ ఎస్, వికీమీడియా ఫౌండేషన్ లు వివిధ ప్రాజెక్ట్ లకు అందించే సహకారాల గురించిన ప్రసంగం, చర్చ నిర్వహించారు.
- ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తెలుగు వికీపీడియా నిర్వహించే బుక్ స్టాల్, జనవరిలో జరపబోయే 21వ తెవికీ పండగ గురించిన ప్రస్తావన, చర్చ జరిగింది.
ఫీడ్‌బ్యాకు
మార్చు- నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. గ్రాంట్ల గురించిన స్థూల సమాచారం తెలుసుకున్నాను. రెండు రోజుల పాటు చదివితే తప్ప తెలుసుకోలేని సమాచారాన్ని ఈ రెండు గంటల పాఠంతో తెలుసుకున్నాను. అ తరువాత ఒక గ్రాంటు రాసే ప్రయత్నం చేసాను. నేను గమనించినవివి:
- గ్రాంట్ల గురించి తెలుసుకున్నంత మాత్రాన చాలదు, ఒక గ్రాంటు అప్లికేషను రాసినపుడే దాని గురించి పూర్తిగా తెలుస్తుంది.
- ఫ్లక్స్స్ లో ఖాతా సృష్టించుకుని గ్రాంటు అప్లికేషను తయారుచేయవచ్చు. దాన్ని సమర్పించనక్కరలేదు. అప్లికేషను ఫారం పూర్తిచేసి దాన్ని పంపించకుండా భద్రపరచుకోవచ్చు. దాన్ని కాపీ చేసుకుని వర్డ్, గూగుల్ డాక్స్ వంటి వాటిల్లో పేస్టు చేసి ఇతరులకు చూపించవచ్చు. లోటుపాట్లను సవరించుకోవచ్చు. ఈ అనుభవం వలన భవిష్యత్తులో గ్రాంటు రాయడం తేలికౌతుంది.
- ఇలా గ్రాంటు రాసే ప్రయోగం అందరం కలిసి మూకుమ్మడిగా ఒక క్లాసులో చెయ్యవచ్చు. ఒక రోజు క్లాసులో, రెండు గంటల్లో ఈ పని అవకపోవచ్చు, రెండు క్లాసుల్లో చేద్దాం.
- బడి నిర్వాహకులు పరిశీలించవలసినది. పవన్ గారికి, ఈ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న సుశీల గారికి, ప్రణయ్ గారికీ ధన్యవాదాలు. __చదువరి (చర్చ • రచనలు) 02:52, 3 జూన్ 2024 (UTC)
చదువరి (చర్చ) గారికి తమ స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు. నిజమే ఈ ప్రక్రియ అందరు అభ్యాసం చేస్తే బావుంటుంది. ఇంకో క్లాస్ నిర్వహించ వచ్చు. --''వి.జె.సుశీల'' (చర్చ) 08:13, 6 జూన్ 2024 (UTC)