వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/1
శిక్షణ తరగతులు | |
---|---|
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు | |
| |
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20 | |
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30 |
కార్యక్రమము
మార్చు
తేదీ: 07.04.2024 ఆదివారం. సమయం: ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు
శిక్షణాంశం: "తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు"
జనవరి 26-28 మధ్య మనం విశాఖపట్నంలో జరుపుకున్న తెవికీ పండగ 2024 సందర్భంగా CIS/A2K ఇంకా తెలుగు కోరా బృందంవారు నిర్వహించి నివేదించిన సమీక్షలతో మన తెలుగు వికీమీడియన్లు తెవికీ వ్యాసాలలో నాణ్యత మెరుగుపరచాలనేది పూర్తిగా ఏకీభవించిన అంశం. ఈ నేపథ్యంలో మొదటగా "తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు" అనే విషయాన్ని శిక్షణాంశాలలో చేర్చడం జరిగింది.
పాల్గొనేవారు: (సభ్యనామం /సంతకం)
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:25, 2 ఏప్రిల్ 2024 (UTC)
- V.J.Suseela --VJS (చర్చ) 19:07, 2 ఏప్రిల్ 2024 (UTC)
- __చదువరి (చర్చ • రచనలు) 23:54, 2 ఏప్రిల్ 2024 (UTC)
- --యర్రా రామారావు (చర్చ) 03:14, 3 ఏప్రిల్ 2024 (UTC)
- Mothiram 123 (చర్చ) 04:00, 3 ఏప్రిల్ 2024 (UTC)
- Pravallika16 (చర్చ) 15:01, 3 ఏప్రిల్ 2024 (UTC)
- --Kasyap (చర్చ) 04:38, 4 ఏప్రిల్ 2024 (UTC)
- ఉదయ్ కిరణ్ (చర్చ) 05:59, 4 ఏప్రిల్ 2024 (UTC)
- --V Bhavya (చర్చ) 13:50, 5 ఏప్రిల్ 2024 (UTC)
- --A.Murali (చర్చ) 15:12, 5 ఏప్రిల్ 2024 (UTC)
- -- నేతి సాయి కిరణ్ (చర్చ) 06:25, 6 ఏప్రిల్ 2024 (UTC)
- --RATHOD SRAVAN (చర్చ) 10:25, 6 ఏప్రిల్ 2024 (UTC)⁶
- -- అభిలాష్ మ్యాడం (చర్చ) 16:43, 6 ఏప్రిల్ 2024 (UTC)
- -- Tmamatha (చర్చ) 17:27, 6 ఏప్రిల్ 2024 (UTC)
- -- Muralikrishna m (చర్చ) 04:08, 7 ఏప్రిల్ 2024 (UTC)
- ప్రభాకర్ గౌడ్చర్చ 13:39, 24 మే 2024 (UTC) (నన్ను కేవలం వినడానికి అనుమతించగలరు. ధన్యవాదాలు)
సమావేశం లింక్
https://meet.google.com/zii-ejfb-efz
శిక్షకులు: చదువరి గారు
ఈ శిక్షణా తరగతి నివేదికను శిక్షణా కార్యక్రమాలు/1 పేజీలో చూడవచ్చు.
నివేదిక
మార్చు
తెలుగు వికీమీడియన్ల యూజర్ గ్రూపు ఏర్పాటు చేసిన తొట్టతొలి శిక్షణ కార్యక్రమం ఇది. యూజర్ గ్రూపుకు వికీమీడియా ఫౌండేషను గుర్తింపు లభించాక జరిగిన వికీమీడియన్ల తొలి సమావేశం కూడా ఇదే.
సమావేశం 7.4.2024 ఆదివార ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 వరకు జరిగింది. 20 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఆన్‌లైనులో గూగుల్ మీట్ ద్వారా జరిగింది.
ముందుగా విజె సుశీల గారు స్వాగతం పలికారు. శిక్షణాంశం గురించి వివరించారు. ఆ తరువాత పవన్ సంతోష్ గారు యూజర్ గ్రూపుకు ఫౌండేషను గుర్తింపు లభించిన విధానం గురించి, యూజర్ గ్రూపు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించీ చెప్పారు. చేయబోయే కార్యక్రమాల గురించి ప్రతిపాదించారు.
చదువరి గారు తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు అను అంశం వివరిస్తూ స్క్రీన్ షేర్ చేసి చూపించారు. వ్యాస అంశాలలో - వాడుకరులు ఇటీవల మార్పులు, రచ్చబండ తరచూ చూడవలసిన అవసరం గురించి ప్రస్తావించారు. క్లుప్త వివరణ, ప్రవేశిక, అనాధ వ్యాసాలు, అభాగ్య వ్యాసాలు, ఇతర భాషాలింకులు, వికీడేటా లింకులు, సమాచారపెట్టి, వర్గాలు, మూలాలు, సమాచార నవీకరణ తదితర విషయాల గురించి వివరణ, చర్చలు జరిగాయి.
శిక్షణ
మార్చుశిక్షణాంశం: తెవికీ వ్యాసానికి ఉండాల్సిన హంగులు
చదువరి (తుమ్మల శిరీష్ కుమార్) శిక్షణను నిర్వహించారు. ఆయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ఇవి:
- తెవికీ సంపాదకులు (ఎడిటర్లు) / వాడుకరులు ముఖ్యంగా చూడాల్సిన పేజీ ఇటీవలి మార్పులు. వివిధ పేజీల్లో ఏయే మార్పులు జరుగుతున్నాయో, ఏయే పేజీల్లో ఏయే చర్చలు జరుగుతున్నాయో తెలుసుకోవాలంటే ఇటీవలి మార్పులు చూడాలి.
- వ్యాస శీర్షిక వ్యాసవిషయానికి సరిపడేలా ఉండాలి.
- ప్రవేశిక: వ్యాసంలో ఉన్న పూర్తి సమాచారాన్ని సంక్షిప్తంగా చూపేలా ప్రవేశిక ఉండాలి
- వ్యాసాన్ని వివిధ విభాగాలు చెయ్యాలి
- ప్రధాన సమాచారానికి చివర "ఇవి కూడా చూడండి", "గమనికలు", "మూలాలు", ఆ తరువాత నేవిగేషను మూసలు ఉండాలి
- వ్యాసానికి, ఇతర వ్యాసాల నుండి (ప్రధానబరి లోని పేజీల నుండి) కనీసం ఒక్కటైనా ఇన్‌కమింగు లింకు ఉండాలి.
- వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు ఔట్‌గోయింగ్ లింకులుండాలి. ఈ విధమైన లింకులు లేని వ్యాసాలు తెవికీలో చాలా అరుదుగా ఉంటాయి, కాబట్టి దీని గురించి అంతగా పట్టించుకోనక్కర్లేదు
- వ్యాసాలనికి ఇతర భాషా లింకులుండాలి. అంటే వికీడేటాలో సంబంధిత అంశం పేజీలో సిట్ లింకుగా ఈ వ్యాసం పేరును చేర్చాలి
- వ్యాసంలో కనీసం ఒక్కటైనా వర్గం ఉండాలి. ఎర్రవర్గాలను చేర్చరాదు. ఎర్రవర్గాన్ని చేర్చినపుడు వెంటనే ఆ వర్గానికి పేజీని సృష్టించాలి
- ఈ సందర్భంగా తెవికీలో వర్గీకరణ అనేది సరిగా జరగడం లేదని దాన్ని సవరించడానికి పెద్దయెత్తున పూనుకుని కృషి చెయ్యాలని హాజరైన సభ్యులు కొందరు అభిప్రాయపడ్డారు
- వ్యాసంలో క్లుప్తవివరణ రాయాలి. తెవికీలో చేసిన క్లుప్తవివరణ దిద్దుబాటు ఇక్కడ కాకుండా వికీడేటాలోనే నమోదౌతుందని చెప్పారు. తెవికీలో రాస్తే ఆటోమాటిగ్గా వికీడేటాలో కనిపిస్తుందని, అలాగే వికీడేటాలో వువరణలో రాసినది ఆటోమాటిగ్గా తెవికీలో కనిపిస్తుందనీ చెప్పారు.
పాల్గొన్నవారు
మార్చు- ప్రణయ్‌రాజ్ వంగరి
- V.J.Suseela
- చదువరి
- యర్రా రామారావు
- Mothiram 123
- Kasyap
- A.Murali
- నేతి సాయి కిరణ్
- RATHOD SRAVAN
- జనార్దన్ కె.
- Muralikrishna m
- Palagiri
- పవన్ సంతోష్
- నేతి సాయి ప్రశాంతి
- గుంటుపల్లి రామేశం
- అనిల్ ఉప్పలపాటి
- ప్రభాకర్ గౌడ్ నోముల
- భాస్కర్
- రెహ్మానుద్దీన్
- సాకీవార్ సాకీవెర్
ఇంటివద్ద చేయాల్సిన పని
మార్చు- ఈరోజు చెప్పుకున్న అంశాలకు సంబంధించి వాడుకరులందరూ కనీసం మూడు వ్యాసాలపై పనిచేసి, వాటి గురించి రెండు వారాల తరువాత జరిగే శిక్షణా తరగతిలో చెప్పాలని
వచ్చేవారం
మార్చుక్లాసులు ప్రతీవారం క్రమం తప్పకుండా జరగాలని తీర్మానించారు.
- వచ్చేవారం - ఏప్రిల్ 14 వ తేదీన - ఇదే అంశాలపై మరింత లోతుగా క్లాసును నిర్వహించాలని, చదువరే ఈ క్లాసును నిర్వహించాలనీ తీర్మానించారు.