|
- మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకతతో సింగూరులో టాటా నానో పరిశ్రమలో పనులను టాటామోటార్స్ నిలిపివేసింది.
- ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా 54వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానం జరిగింది. ఉత్తమ నటీనటుల పురస్కారాలను ప్రియమణి, సౌమిత్ర చటర్జీలు అందుకున్నారు.
- థాయిలాండ్ లో అత్యవసర పరిస్థితి విధించబడింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా థాయిలాండ్ ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.
- ఒలింపిక్ చాంపియన్ అయిన రస్యాకు చెందిన ఎలీనా దెమెంతియెవా అమెరికన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.
|
|
- ప్రపంచంలోనే అతిశక్తిమంతులైన 100 మంది జాబితాలో ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ సోదరులకు స్థానం లభించింది. వీరికి 67 వ స్థానం లభించగా, తొలి స్థానాన్ని రష్యా ప్రధానమంత్రి వ్లాదిమిర్ పుతిన్ పొందినారు.
- అగ్రవర్ణ పేదలకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
- లియాండర్ పేస్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
- ఫిఫా తాజా ర్యాంకింగ్‌లో భారత్ రెండు స్థానాలు పైకి ఎదిగి 151వ స్థానంలో నిలిచింది. ఆసియా దేశాల్లో భారత్ 24వ స్థానంలో ఉంది.
|
|
- లియాండర్ పేస్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిట్ కైవసం చేసుకున్నాడు. కారా బ్లాక్ (జింబాబ్వే)తో జతకట్టిన పేస్ ఫైనల్లో 7-6(8-6), 6-4 స్కోరుతో లీజెల్ హ్యూబెర్, జేమీ ముర్రేలపై విజయం సాధించారు.
- బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో స్వర్ణపతకం సాధించిన అభినవ్ బింద్రాకు శ్రీరామచంద్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేయాలని నిర్ణయించింది.
|
|
- బెంగుళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ కు చెందిన పంకజ్ అద్వానీ విజయం సాధించాడు. ఫైనల్లో గీత్ సేథిపై విజయం సాధించాడు.
- అమెరికన్ ఓపెన్ టెన్నిస్ డబుల్స్‌లో లియాండర్ పేస్ జోడి ఓటమి. చెక్ కు చెందిన లూకాస్ తో జతకట్టిన పేస్ ఫైనల్లో బ్రయాన్ సోదరులపై 6-7, 6-7 తేడాతో ఓటమి చెందాడు.
|
అమెరికా బారతదేశమునకు అణు ఇందనము సరపరా చేయుతకు అంగీకరించినది.
|
ప్రపంచం అంతమవుతందంటూ వచ్చిన వదంతులను పటాపంచలు చేస్తూ జెనీవాలో LHC(Large Hadron Collider) ను CERN ఆధ్వర్యంలో విజయంతం గా పరీక్షించారు. ఇందు లో వివిధ దేశాలకు చెందిన రెండు వేల మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.'బిగ్ బ్యాంగ్' ప్రయొగ ఫలితాలు వెలువడటానికి నెల రోజులు పడుతుంది.
|
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 11
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 12
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 13
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 14
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 15
|
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి గోవాడ మల్లికార్జునరావు కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో మృతిచెందాడు.
- డాలరుతో రూపాయి మారకం విలువ భారీగ పతనం చెందింది. ఒక్క రోజులోనే 83 పైసలు (1.8%) పతనం చెందింది.
- బీజింగ్ లో జరిగుతున్న పారాలింపిక్స్ క్రీడలలో బ్లేడ్ రన్నర్‌గా పారుగాంచిన ఆస్కార్ పిస్టోరియస్ మూడో స్వర్ణం సాధించాడు.
|
|
- థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు.
- సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్‌గా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎం.ఎల్.కుమావత్ నియమితులయ్యాడు.
- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ చైర్మెన్ ఎ.వి.ఎస్.రాజు అతిపెద్ద గ్రంథం రచించినందుకు గిన్నిస్‌బుక్‌లో పేరు సంపాదించాడు.
- బీజింగ్‌లో పారాలింపిక్స్ క్రీడలు ముగిశాయి. 89 స్వర్ణాలతో సహా మొత్తం 211 పతకాలు సాధించి చైనా ప్రథమస్థానం పొదగా, బ్రిటన్, అమెరికాలు రెండో, మూడో స్థానాలలో నిలిచాయి.
- ప్రపంచ మహిళల చదరంగం చాంపియన్‌షిప్ టైటిల్‌ను రష్యాకు చెందిన అలెక్సాండ్రా కోస్టెనిక్ గెలుచుకుంది.
- ఇండియన్ క్రికెట్ లీగ్లో చేరిన బంగ్లాదేశ్ క్రికెట్ క్రీడాకారులపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పదేళ్ళ నిషేధం విధించింది.
- భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఎం.కె.కౌశిక్ నియమితుడైనాడు.
|
|
- విదేశీ వార్తామేగజైన్లు భారత్‌లో తమ సంచికలను ప్రచురించుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
- ఆసియా మహిళల కబడ్డీ టోర్నమెంటు పోటీలు మధురైలో ప్రారంభమయ్యాయి.
|
|
- పోలవరం ప్రాజెక్టుకు పాపికొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని స్థలాన్ని ఉపయోగించడానికి సుప్రీంకోర్టు ఆమోదించింది.
- భారతీయ వార్తాపత్రికల సంఘం అద్యక్షుడిగా బాంబే సమాచార్ వీక్లీ పత్రికకు చెందిన హోర్మస్‌జీ కామా ఎన్నికయ్యాడు.
- ఆంధ్రప్రదేశ్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన తాజార్యాంకింగ్‌లో 12వ స్థానానికి ఎదిగింది.
|
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 20
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 21
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 22
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 23
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 24
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 25
వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 26
|
- ఢిల్లీలో మళ్ళి బాంబుపేలుళ్ళు జరిగి ఇద్దరు మృతిచెందారు, 20 మందికిపైగా గాయపడ్డారు.
- మున్సిపల్, జిల్లా, మండల పరిషత్తు పాఠశాలలకు శాశ్వత గుర్తింపు కల్పిస్తూ ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
- తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) అద్యక్ష పదవి నుంచి కాకర్ల ప్రభాకర్‌ను తొలిగించాలని తానా పాలకమండలి నిర్ణయించింది.
- చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
- ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి. వదోదరలో జరిగిన ఫైనల్లో ఢిల్లీ జట్టుపై 187 పరుగుల ఆధిక్యతతో గెల్చింది.
- ప్రముఖ సినీగాయకుడు మహేంద్ర కపూర్ ముంబాయిలో మరణించాడు.
- ప్రముఖ హాలివుడ్ నటుడు పాల్ న్యూమన్ లాస్ ఏంజిల్స్ లో మరణించాడు.
- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అద్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్‌కు దక్కింది.
- భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా కృష్ణమాచారి శ్రీకాంత్ ఎన్నికయ్యాడు.
- భారత మహిళల క్రికెట్ జట్టు సెలెక్టర్‌గా ఆమ్ధ్ర ప్రదేశ్‌కు చెందిన పూర్ణిమారావు ఎంపికైంది.
- చైనా మాస్టర్స్ సూపర్ సీరీస్ టోర్నమెంటు సమీఫైనల్లో సైనా నెహ్వాల్ పరాజయం పొందింది.
|
|
- అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
- 6 దశాబ్దాల నిరీక్షణ అనంతరం సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఐఎన్‌ఏలో కెప్టెన్‌గా వ్యవహరించిన లక్ష్మీ పండాకు స్వాతంత్ర్య సమరయోధురాలిగా గుర్తింపు లభించింది.
- ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నగిషెట్టి ఉష స్వర్ణపతకం సాధించింది.
- సింగపూర్ గ్రాండ్‌ప్రిని గెలిచి తొలి రాత్రి ఫార్మూలా-1 రేసు విజేతగా నిల్చి ఫెర్నాండో అలొన్సో రికార్డు సృష్టించాడు.
- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చేతన్ ఆనంద్ చెక్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు.
|
|
- రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
- భారతదేశంతో ఫ్రాన్స్ అణు ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అణువ్యాపారానికి ఎన్.ఎస్.జి. దేశాల ఆమోదం అనంతరం ఇది తొలి ఒప్పందం.
|