జనవరి 2008
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు |
- జనవరి 31, 2008
- 2006-07 సంవత్సరానికి స్థూల దేశీయ ఉత్పత్తి పెరుగుదలరేటు 9.6%గా నమోదైనట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం ప్రకటన. అంతకు ముందు సంవత్సరంలో ఈ రేటు 9.4%గా ఉంది.
- జనవరి 30, 2008
- మహాత్మా గాంధీ 60 వ వర్ధంతి సందర్భంగా దేశమంతటా జాతిపితకు ఘననివాళులు అర్పించారు.
- త్రిపురలో శాసనసభ ఎన్నికలకై అధికారికంగా ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేసింది.
- శ్రీలంకలో ఎల్.టి.టి.ఇకి చెందిన 50కి పైగా తీవ్రవాదులు తమ దాడుల్లో చనిపోయినట్లు శ్రీలంక సైన్యం ప్రకటన.
- జనవరి 29, 2008
- 15 వ సార్క్ సదస్సుకు శ్రీలంక లోని కాండీ నగరంలో 2008 జూలై, ఆగస్టులో నిర్వహించబడుతుందని శ్రీలంక ప్రభుత్వం ప్రకటన.
- భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ ప్రముఖ నేత లాల్ కృష్ణ అద్వానీ సంకల్ప్యాత్ర చేపట్టాలని నిర్ణయం. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 23 వరకు ఈ యాత్ర జరుగనుంది.
- ప్రజాస్వామ్యం గురించి పాకిస్తాన్ భారత్‌నుంచి నేర్చుకోవాల్సి ఉందని పాకిస్తాన్ ప్రతిపక్షనేత మాజీ క్రికెట్ కెప్టెన్, తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రకటన్.
- ఆగ్నేయాసియా దేశమైన థాయ్‌లాండ్ కొత్త ప్రధానమంత్రిగా సమక్ సుందరవేజ్ ఎన్నికయ్యారు.
- భారత్‌కు చెందిన బౌలర్ హర్భజన్ సింగ్‌పై విధించిన మూడు మ్యాచ్‌ల నిషేధాన్ని ఐసీసీ తొలగించింది. నిషేధం స్థానంలో మ్యాచ్ ఫీజులో 50% కోత విధించింది.
- ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో భారత్‌కు రెండో స్థానం లభించింది.
- ఆసియా నెంబర్ వన్ మహిళా టెన్నిస్ క్రీడాకారిణిగా భారత్‌కు చెందిన సానియామీర్జా అవతరించింది.
- జనవరి 28, 2008
- భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరిగిన అడిలైడ్ టెస్ట్ డ్రా. 4 టెస్టుల సీరీస్ 2-1 ఆధిక్యంతో ఆస్ట్రేలియా కైవసం. సీరీస్‌లో 24 వికెట్లు సాధించిన బ్రెట్‌లీ మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌గా ఎన్నికయ్యాడు.
- భారత తపాలాశాఖ చే ఇన్స్టంట్ మనియార్డర్ విధానం ప్రారంభం. రూ.50 వేల లోపు డబ్బును తక్షణమే ఖాతాదారుడికి చేర్చడానికి ఈ విధానం తోడ్పడుతుంది.
- జనవరి 27, 2008
- ఇండోనేషియామాజీ అధ్యక్షుడు జనరల్ సుహార్తో మృతి. ఇతడు 1998 వరకు 32 సంవత్సరాలు దేశాన్ని పాలించాడు.
- ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల టైటిల్‌ను మూడో సీడెడ్ క్రీడాకారుడైన సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ కైవసం. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో అన్సీడెద్ క్రీడాకారుడైన ఫ్రాన్స్‌కు చెందిన జోవిల్ ఫ్రైడ్ సోంగాపై 4-6, 6-4, 6-3, 7-6 తేడాతో విజయం సాధించాడు. జకోవిచ్ గ్రాండ్‌స్లాం టైటిల్ గెలిచిన తొలి సెర్బియన్‌గా రికార్డు సృష్టించాడు.
- ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ఫైనల్లో భారత్‌కు చెందిన మహేష్ భూపతి - సానియా మీర్జా జంట పరాజయం. ఫైనల్లో నెనాద్ జిమోంజిక్ (సెర్బియా) -తియాతియాన్ (చైనా) జంట 7-6, 6-4 స్కోరుతో విజయం.
- జనవరి 26, 2008
- ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల టైటిల్ రష్యాకు చెందిన మరియా షరపోవా కైవసం. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో ఇవనోవిక్ పై 7-5, 6-3 స్కోరుతో ఓడించి 12 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ సాధించింది. షరపోవాకు ఇది మూడవ గ్రాండ్‌స్లాం టైటిల్.
- ఆస్ట్రేలియా వికెట్‌కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్.
- 2008 గణతంత్ర దినోత్సవంలో భాగంగా భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ 13 ప్రముఖులకు ప్రధానం. పద్మభూషణ పురస్కారం 35 గురికి, పద్మశ్రీ పురస్కారం 71 గురికి ప్రధానం. పద్మవిభూషణ్ పొందిన వారిలో క్రికెటర్ సచిన్ టెండుల్కర్, వ్యాపారవేత్తలు రతన్ టాటా, లక్ష్మీ మిట్టల్, విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ ముఖ్యులు.
- జనవరి 25, 2008
- సెనేట్ విశ్వాస పరీక్షలో ఓడిపోయినందుకు ఇటలీ ప్రధాన మంత్రి రొమానో ప్రోది పదవికి రాజీనామా.
- ఒడిషా మాజీ ఆరోగ్య శాఖ మంత్రి లంచం తీసుకున్నట్లు ప్రపంచ బ్యాంకు ఆరోపణ.
- ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సార్కోజీ భారత్ పర్యటన ప్రారంభం.
- ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌లో ప్రపంచ నెంబర్ వన్ స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెడరర్ సెమీఫైనల్స్‌లో ఓటమి. సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిక్ ఫెదరర్‌ను 7-5, 6-3, 7-6 స్కోరుతో వరుస సెట్లతో ఓడించాడు.[1]
- జనవరి 24, 2008
- ఆస్ట్రేలియాతో జరుగుతున్న అడిలైడ్ టెస్టులో సచిన్ తెండుల్కర్ 39వ టెస్ట్ సెంచరీ సాధించాడు.
- ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మాఫియా డాన్ బ్రజేష్ సింగ్‌ను భువనేశ్వర్ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు.
- అరుణాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా జోగీందర్ జస్వంత్ సింగ్ నియమించబడ్డాడు.
- ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు భారత ప్రతిపాదనకు రష్యా మద్దతు.
- మాస్టర్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండుల్కర్‌కు భారతరత్న ఇవ్వాలని మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ ప్రతిపాదన.
- జనవరి 23, 2008
- విమాన ప్రమాదంలోనే నేతాజీ మరణించినట్లు కేంద్రం విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.[2]
- అమెరికా స్టాక్ ఎక్సేంజీలో సత్యం కంప్యూటర్స్ డిపాజిటరీ షేర్లు నమోదుకానున్నాయి. ప్రపంచంలోని మూడు ప్రముఖ స్టాక్ ఎక్సేంజీలలో నమోదైన తొలి భారతీయ కంపెనీగా సత్యం కంప్యూటర్స్ ఘనత సాధించింది.[3]
- ఆస్ట్రేలియన్ ఓపన్ టెన్నిస్ సానియా మీర్జా - మహేష్ భూపతి జోడీ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశం.
- జనవరి 22, 2008
- ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుడులాల్ కృష్ణ అద్వానీ ఎంపిక .
- శివసేన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉద్ధవ్ థాక్రే తిరిగి రెండో పర్యాయం ఎన్నిక.
- హంగేరి లోని గ్యార్లో జరుగుతున్న హంగేరీ ఓపెన్ పోటీలో భారత షూటర్లు 7 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్య పతకాలు సాధించారు.
- జనవరి 21, 2008
- బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి సెన్సెక్స్ లో 2050 పాయింట్ల భారీ పతనం. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిలో కూడా 716 పాయింట్ల పతనం.
- భారత పర్యటనలో ఉన్న బ్రిటన్ ప్రధాన మంత్రి గోర్డాన్ బ్రౌన్కు ఢిల్లీ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం.
- శ్రీహరికోట నుంచి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్-10 ద్వారా ఇజ్రాయెల్‌కు చెందిన పోలరైస్ ఉపగ్రహం ప్రయోగం విజయవంతం.
- జనవరి 20, 2008
- నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల విమానాశ్రయాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, అమృత్సర్, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలోని విమానాశ్రయాల్లో బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు.[4]
- న్యూఢిల్లీలో శనివారం జరిగిన చర్చలు సుముఖంగా ముగియడంతో గోవా రాజకీయ సంక్షోభం గట్టెక్కింది.[5]
- జనవరి 19, 2008
- నాలుగు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ లో జరిగిన మూడవ టెస్టులో భారత్ ఒక రోజు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్ పై విజయం సాధించడం తనకు ప్రత్యేకమైన ఆనందాన్నిచ్చిందని భారత జట్టు సారథి అనిల్ కుంబ్లే తెలిపాడు. ఆల్ రౌండ్ ప్రతిభను ప్రదర్శించినందుకుగాను ఇర్ఫాన్ పఠాన్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు.
- రంజీ ట్రోఫీ చాంపియన్‌షిప్‌ను ఢిల్లీ గెలుచుకుంది. ముంబాయిలో జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ రంజీ జట్టు ఉత్తర ప్రదేశ్ జట్టుపై 9 వికెట్లతో విజయం సాధించింది. ఢిల్లీ రెండో ఇన్నింగ్సులో గౌతమ్ గంభీర్ అజేయ సెంచరీ సాధించాడు.
- ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పోటీలలో భారత్‌కు చెందిన సానియా మీర్జా మూడవ రౌండ్లో అమెరికాకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ చేతిలో 7-5, 6-4 తేడాతో పరాజయం.
- జనవరి 18, 2008
- ధర్మపురి బస్సు దుర్ఘటన కేసులో అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలకు విధించిన మరణశిక్షను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఖరారు చేసింది.[6]
- జనవరి 17, 2008
- టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు. ప్రపంచ బౌలర్లలో కుంబ్లే ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్. ఇదివరకు షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
- గోవాలో ముగ్గురు మంత్రుల రాజీనామా. సంక్షోభంలో దిగంబర్ కామత్ ప్రభుత్వం.[7]
- క్యోటో పర్యావరణ ఒప్పందంపై సంతకం చేయాలని అమెరికాకు ఆస్ట్రేలియా విజ్ఞప్తి.
- జనవరి 16, 2008
- శ్రీలంకలో జరిగిన బాంబు పేలుడులో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 23 మంది ప్రయాణికులు మరణించగా, 67 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొలొంబోకు 150 మైళ్ల దూరంలో గల ఆగ్నేయ శ్రీలంకలోని బుట్టాల ప్రాంతంలో ఉదయం 7.40 గంటల ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది.[8]
- ప్రముఖ సినీనటుడు ఘట్టమనేని కృష్ణకు ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది.
- పశ్చిమ బెంగాల్లో బర్డ్ప్ల్యూ వ్యాధి, అనేక వేల కోళ్ళ వధింపు.
- పెర్త్ టెస్ట్‌లో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు 16 వ పాట్నర్‌షిప్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు సమం చేశారు. గతంలో గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్, హేడెన్-రికీ పాంటింగ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
- ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌లో భారత్‌కు చెందిన సానియా మీర్జా రెండో రౌండ్లో విజయం సాధించి మూడో రౌండ్లో ప్రవేశించింది.
- జనవరి 15, 2008
- అమెరికాలో లూసియానా రాష్ట్రానికి భారత సంతతికి చెందిన పియూష్ బాబీ జిందాల్ 55వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇతడు రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. తక్కువ వయస్సులో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా రికార్డు సృష్టించాడు.
- మెల్బోర్న్లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌లో భారత్‌కు చెందిన సానియామీర్జా తొలి రౌండ్లో 6-2, 6-4 తేడాతో ఇరోడాను ఓడించి రెండో రౌండ్లో ప్రవేశించింది.
- జనవరి 14, 2008
- ప్రపంచంలో విలాసవంతమైన 25 రైళ్ళలో భారత్‌కు చెందిన 3 రైళ్ళు స్థానం సంపాదించాయి.
- త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. త్రిపురలో ఫిబ్రవరి 23న, మేఘాలయలో మార్చి 3న, నాగాలాండ్‌లో మార్చి 5వ తేదీ నాడు ఎన్నికలు జరుగుతాయి.
- కార్పొరేట్ రంగంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన 23 కంపెనీలకు బంగారు నెమలి అవార్డుల ప్రధానం.
- ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పోటీలు ప్రారంభం.
- జనవరి 13, 2008
- ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చైనా పర్యటన.
- అనంతపురం జిల్లాను కర్ణాటక రాష్ట్రంలో చేర్చాలని మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి ప్రకటన.
- తాజా ఐ.సి.సి టెస్ట్ ర్యాంకింగ్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది.
- జనవరి 12, 2008
- కోల్‌కతలో అగ్నిప్రమాదం వల్ల 2500 దుకాణాలు దగ్దం.
- మలేషియా పార్లమెంటరీ సభ్యుడు, మలేషియన్ భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అయిన ఎస్.కృష్ణస్వామి హత్య.[9]
- జనవరి 11, 2008
- ఎవరెస్టు శిఖరాన్నితొలి సారిగా అధిరోహించిన ఎడ్మండ్ హిల్లరీ న్యూజీలాండ్ లోని ఆక్లాండ్‌లో మృతి.
- దక్షిణాఫ్రికా క్రికెటర్ షాన్ పొలాక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన.
- 2008 ఎన్టీఆర్ అవార్డుకు సినీనటుడు కైకాల సత్యనారాయణ ఎంపిక.[10]
- జాతీయ స్థాయి సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల చాంపియన్‌షిప్ ను వరుసగా హైదరాబాదు, కేరళ జట్లు గెలుపొందాయి.
- జనవరి 10, 2008
- ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు అందుబాటులోకి రానున్న టాటా నానో కారు, ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 9వ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది.
- జనవరి 9, 2008
- దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ముక్కోణ క్రికెట్ టోర్నీలో భారత్ టైటిల్ కైవసం.[11]
- జనవరి 8, 2008
- శ్రీలంక సైన్యం మన్నార్‌లోని ఎల్టీటీఈ స్థావరాన్ని స్వాధీనం చేసుకుంది.[12]
- మలేషియాలో పని చేసేందుకు భారతీయులకు అనుమతి ఇవ్వరాదని మలేషియా ప్రభుత్వం నిర్ణయం.[13]
- కొలంబో సమీపంలో మందుపాతర పేలి శ్రీలంక మంత్రి దస్సనాయకే మృతి.[14]
- జనవరి 7, 2008
- ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అనిల్ రమేశ్ దవే ప్రమాణస్వీకారం.
- హైదరాబాదులో జరిగిన న్యాయవాదుల ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్స్‌లో భారత్ పాకిస్తాన్ పై విజయం.
- భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్‌గా వినోద్ రాయ్ ప్రమాణ స్వీకారం.
- జనవరి 6, 2008
- జైపూర్ ఫుట్ సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం.
- బహుజన సమాజ్ పార్టీలో తెలంగాణా రాష్ట్ర సమితి (ఎన్) విలీనం.
- విజయనగరం జిల్లా తెర్లాం శాసనసభ్యుడు తెంటు జయప్రకాశ్ మృతి.
- భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఫిక్కి) అధ్యక్షుడిగా రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నిక.
- చెన్నై ఓపెన్ సింగిల్స్ పురుషుల ఫైనల్స్‌లో రష్యాకు చెందిన మైకెల్ యోజ్ఞీ టైటిల్ కైవసం.
- థామస్ కప్, ఉబెర్ కప్ వరల్డ్ టీం బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ అర్హత పోటీల్లో పాల్గొనే భారతజట్టు కెప్టెన్‌గా సైనా నెహ్వాల్ ఎంపిక.
- అఖిల భారతీయ సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టైటిల్ పురుషుల విభాగంలో అనూప్ శ్రీధర్, మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ టైటిళ్ళు కైవసం.
- జనవరి 5, 2008
- కామన్వెల్త్ స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారుల సదస్సు (CSPOC) కి ఛైర్‌పర్సన్‌గా లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఎంపిక.
- శ్రీలంకలో సైన్యానికి, ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 34 మంది తీవ్రవాదుల మృతి.
- జనవరి 4, 2008
- సిడ్నీ టెస్టులో సచిన్ టెండుల్కర్ 38 వ సెంచరీ.
- ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పి.గంగారెడ్డి మృతి. ఇతడు ఆదిలాబాదు జిల్లా పరిషత్ చైర్మెన్‌గాను, 2 సార్లు పార్లమెంటు సభ్యుడు గాను, నిర్మల్ శాసన సభ్యుడుగాను గతంలో ఎన్నికయ్యాడు.
- 2007 సంవత్సరానికి అక్కినేని నాగేశ్వరరావు అవార్డుకు గాను పాతతరపు తెలుగు సినీ అంజలీదేవి ఎంపిక.
- పెర్త్ లో జరిగిన హాప్‌మెన్ కప్ ఫైనల్స్‌లో సెర్బియాపై అమెరికా విజయం.
- జనవరి 3, 2008
- 95వ భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సంస్థ వార్షిక సమావేశం విశాఖపట్నంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్చే ప్రారంభం.
- నాగాలాండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపు. భారతీయ జనతా పార్టీ మద్దతుతో కొనసాగుతున్న నిఫియురియో ప్రభుత్వం రద్దు.
- విదేశాల్లో 250టెస్టు వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు.
- జనవరి 2, 2008
- ఆంగ్ల రచనలో 2007 సాహిత్య అకాడమీ పురస్కారం బెంగుళూరుకు చెందిన మాలతీరావుకు లభించింది.
- ఫిడే తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు రష్యాకు చెందిన క్రామ్నిక్ తోపాటు సంయుక్తంగా అగ్రస్థానం లభించింది. ఇరువురూ సమానంగా 2799 పాయింట్లను కలిగిఉన్నారు.
- ఒకే జట్టు తరఫున వరుసగా 94 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా ఆడం గిల్‌క్రిస్ట్ రికార్డు సృష్టించాడు. దీనితో భారత్ తరఫున వరుసగా 93 టెస్టులు ఆడిన రాహుల్ ద్రవిడ్ రికార్డు ఛేదించబడింది.
- శ్రీలంక క్రికెట్ బోర్డు ఛైర్మన్‌గా మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నియమించబడ్డాడు.
- స్నేహితురాలితో వివాహేతర సంబంధం ఉన్న కారణంగా మలేషియా ఆరోగ్య శాఖ మంత్రి చౌవా సోయ్లీక్ పదవికి రాజీనామా.
- జనవరి 1, 2008
- హైదరాబాదులో 68 వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేత ప్రారంభం.
- శ్రీలంకలో మాజీ మంత్రి, ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ పార్టీ నేత, తమిళ నాయకుడు టి.మహేశ్వరన్ కొలంబోలో హత్యకు గురైనాడు.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-05. Retrieved 2008-01-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-05. Retrieved 2008-01-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-05. Retrieved 2008-01-26.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-26. Retrieved 2008-01-26.
- ↑ http://telugu.in.msn.com/news/national/article.aspx?cp-documentid=1198445[permanent dead link]
- ↑ http://telugu.in.msn.com/news/national/article.aspx?cp-documentid=1196598[permanent dead link]
- ↑ http://in.telugu.yahoo.com/News/National/0801/17/1080117006_1.htm Archived 2012-01-05 at the Wayback Machine యాహూ తెలుగు
- ↑ http://in.telugu.yahoo.com/News/International/0801/16/1080116006_1.htm Archived 2008-01-17 at the Wayback Machine యాహూ తెలుగు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-05. Retrieved 2008-01-12.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-19. Retrieved 2008-01-12.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-26. Retrieved 2008-01-09.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-01-05. Retrieved 2008-01-09.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-26. Retrieved 2008-01-08.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-01-10. Retrieved 2008-01-08.