మందమర్రి

తెలంగాణ, మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం లోని పట్టణం
(Mandamarri నుండి దారిమార్పు చెందింది)
  ?మందమర్రి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°58′56″N 79°28′52″E / 18.98222°N 79.48111°E / 18.98222; 79.48111
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 38.84 కి.మీ² (15 చ.మై)[1]
జిల్లా (లు) మంచిర్యాల జిల్లా
జనాభా
జనసాంద్రత
65,670 (2011 నాటికి)
• 1,691/కి.మీ² (4,380/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం మందమర్రి పురపాలక సంఘం


మందమర్రి, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలానికి చెందిన పట్టణం, గ్రామం.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[3] దీని పరిపాలన మందమర్రి పురపాలక సంఘం నిర్వహిస్తుంది. ఇది పురపాలక సంఘం ముఖ్య పట్టణం.

వ్యవసాయం, పంటలు

మార్చు

మందమర్రి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 1239 హెక్టార్లు, రబీలో 531 హెక్టార్లు. ప్రధాన పంట వరి మామిడి జొన్నలు.[4]ఇక్కడ కార్మిక ఓటర్లు అధిక సంఖ్యలోఉన్నారు.[5]

ఫామ్ ఆయిల్ పరిశ్రమ

మార్చు

500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఫామ్ ఆయిల్ పరిశ్రమకు 2023, జూన్ 9న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, బీసి సంక్షేమ శాఖామంత్రి గంగుల క‌మ‌లాక‌ర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, ఆదిలాబాదు ఎమ్మెల్యే జోగు రామ‌న్న‌, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయ‌క్‌తోపాటు జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6][7]

2023, అక్టోబరు 1న రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ చేశాడు.[8] ఈ కార్యక్రమంలో ఎంపీ నేతకాని వెంకటేశ్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పాల్గొన్నారు.[9]

విద్య

మార్చు

మందమర్రి లో ప్రభుత్వ పాఠశాల, మోడల్ స్కూల్ , సోషల్ వెల్ఫేర్ వసతి గృహం కలదు.

మూలాలు

మార్చు
  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 186
  5. https://www.sakshi.com/telugu-news/komaram-bheem/1841228
  6. "Mancherial: సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌". EENADU. 2023-06-09. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.
  7. Velugu, V6 (2023-06-09). "మంచిర్యాల జిల్లా క‌లెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్". V6 Velugu. Archived from the original on 2023-06-10. Retrieved 2023-06-10.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. "ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ చేసిన కేటీఆర్". ETV Bharat News. 2023-10-01. Archived from the original on 2023-11-22. Retrieved 2023-11-22.
  9. telugu, NT News (2023-10-01). "Minister KTR | మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన.. శంకర్‌పల్లిలో ఆయిల్‌పామ్‌ పరిశ్రమకు భూమిపూజ". www.ntnews.com. Archived from the original on 2023-10-02. Retrieved 2023-11-22.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మందమర్రి&oldid=4105165" నుండి వెలికితీశారు