పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

అంతరాక్కర[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. అంతరాక్కర అత్యంత ప్రాచీన పద్యరూపం. తెలుగు పద్య కావ్యాలలో వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది.

పద్య లక్షణము మార్చు

నాలుగు పాదములు ఉండును.
ప్రతి పాదమునందు ఒక సూర్య , రెండు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును

ప్రాస మార్చు

నియమము కలదు.

యతి మార్చు

ప్రతి పాదమునందు 3వ గణము యొక్క చివరి అక్షరము యతి స్థానము

ఉదాహరణలు[2] మార్చు

అంతరాక్కర

స్వర్ణమయ సంధ్య యది చంచలమ్మై పిల్చు
వర్ణముల చిత్ర మది వైభవమ్మై నిల్చు
కర్ణములు గీతికల కాకలీ-నాదంపు
పూర్ణ-సుఖ మందె నహ బుద్బుదమ్మీ యింపు!

మరికొంత సమాచారము మార్చు

ఇది తటాలున చూచినప్పుడు తేటగీతి, ద్విపద మొదలయిన వానివలె భాసించును. అట్లనుకొని చూచిన ఎడల దాని అసలు నడవడి మనకు స్ఫురించదు.పాదమున యతి వరకు తుంచుకొని, నడక సరిచూడవలెను. అనంతుడు '''అక్కరల యతి నిర్ణయము ''' నిట్లని చెప్పియున్నాడు:

విరతి-చతుర్గణము మహా
క్కర మేకోనాక్షర త్రిగణ మంతరకున్
వరగణయుగ యతి నల్పా
క్కర మధ్యయు మధురయుం ద్రిగణయతుల-హరీ! "

ఏకోనాక్షర త్రిగుణము విరతి, అంతరాక్కరకు: అనగా మూడవ గణమున చివరి అక్షరమునకు ముందు విశ్రాంతి ఏర్పడును. మూడవ గణము చివరి అక్షరమున వళి (యతి) నిలుచునని సారాంశము. అనంతుని అంతరాక్కరకు ఉదాహరణ:

ఇను డొకండును నింద్రి-లిద్దరును నొక్క
వనజ వైరియు గూడి-వైభవ మొనర్చ
గనక వస్త్రుని గృత్త-కైటభుని గొల్తు
రనుచు జెప్పుదు రంత-రాక్కర బుధులు.

ఈ పద్యము కర్ణాట చతుష్పద (5 మాత్రల గణములు, ఒక సూర్య గణము) రీతిగాను, ద్విపద రీతిగాను నడచినది (చివరి పాదము). రెండవ పాదము తేటగీతి రీతిగా గూడ నడచును.

అనంతునకు తరువాతివారగు చిత్రకవి పెద్దనార్యుడును, అప్పకవియు ఇట్లే త్రిగణాంత వర్ణమున యతి నిలువవలెనని చెప్పురి. చిత్రకవి పెద్దనార్యుడు దీనిని అక్కరల 5 ఇంటిలో చివరిదిగా పేరొనినాడు. తక్కిన వారందరు దీనిని నాల్గవదానిగా చెప్పిరి.

మూలాలు మార్చు

  1. "అంతరాక్కర". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.
  2. "అంతరాక్కర ఉదాహరణలు". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.