పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

మధ్యాక్కఱ ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. మధ్యాక్కఱ అత్యంత ప్రాచీన పద్యరూపం. నన్నయ కాలానికి ముందే వున్న ప్రాఙ్నన్నయ యుగములోనే ఈ పద్యరీతి శాసనాల్లో వాడుకలో ఉండడం కనిపిస్తోంది.[1] ఆపైన నన్నయ యుగంలో కూడా దీని వాడుక కనిపిస్తోంది. ఆంధ్రమహా భారత రచనలో ఆదికవి, వాగనుశాసనుడు అయిన నన్నయ్య ఈ ఛందోరీతిని వినియోగించారు. ఆపైన కావ్యాల వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది. తిరిగి వేయేళ్ళనాటి ఈ ఛందోరూపాన్ని కవిసమ్రాట్, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ తిరిగి వాడుకలోకి తీసుకువచ్చారు. తన రామాయణ కల్పవృక్షంలో వాడడమే కాక విశ్వనాథ మధ్యాక్కఱలు వంటి శతకాలు అన్నీ అవే ఛందోరూపాలతో రచించారు.

లక్షణము మార్చు

మధ్యాక్కర.
సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి యుండి
సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి వెండి
కరమొప్ప నీపాట నాఱు గణముల మధ్యాక్కరంబు
విరచింప బ్రావళ్ళు నిట్లు వెలయఁ గవిజనాశ్రయుండ. (నన్నయ గారు 5 వ గణాద్యక్షరం యతి వేసిరి)

  • పద్యమునకు 4 పాదములు
  • పాదపాదమునకు 2 ఇంద్ర గణములు, 1 సూర్యగణము, 2 ఇంద్ర గణములు, 1 సూర్యగణము, మొత్తం 6 గణములుంటాయి.

ప్రాస మార్చు

నియమము కలదు.

యతి మార్చు

నాల్గవ గణము మొదటి అక్షరము యతి స్థానము. నన్నయ గారు 5 వ గణము మొదటి అక్షరముతో యతిని కూర్చారు.

ఉదాహరణ మార్చు

'తనుమధ్య దా నొక్క కన్యక సురనదీతటమున నన్నుఁ
గనిన నక్కన్యకఁ జూచి నీ విట్టి కమనీయరూప
వొనర నా సుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య
కొనియెఁ గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.
 
'స్వామికి మాకును మధ్య శబ్ద స్వరూపవై నిల్చి
వేమారు మా నివేదనల వినిపింతు వా దేవునకును
కోమలమ్మైన నీమాట కొను నమ్మ! యీశుండు, నిన్ను
నే మెల్ల మధ్యాకర మని యింపుగా బిల్చు టందులకై!.

( నన్నయ భారతము, ఆదిపర్వము, 4 అశ్వాసము, 142 వ పద్యము)

దశరథధాత్రీశగర్భ ధాత్రి నందనుండనై పుట్టి
దశకంధరుని కంఠనాళ దళన కృత్యంబునన్ బేర్చి
దశసహస్రాబ్దముల్ ధరణి ధర్మసంధానంబుఁ జేసి
ప్రశిమితాసురుఁడనై మీదు బాములు బాయంగఁ జేతు.


ద్వాదశ మాసిక వ్రతము సలుపుదు దరుణి! మా యన్న
యీ దేశమున జేసి, సర్వ తీర్ధము లాడుచు, బ్రహ్మ
వాదుల సంగతి బ్రహ్మ చర్య సువ్రతుండనై యుండి
నీదు మనోరధ మెట్లు సలుపంగ నేర్తు నే నిపుడు?.

(విశ్వనాథ రామాయణ కల్పవృక్షము, అవతార ఖండము, 102 వపద్యము)

ఆ పరిశ్రమ లందునైన అన్యులకే పెద్దపీట
మీపైన మీకు విశ్వాసమే కనపడ దేమివింత
వేపపుల్లలు కాలద్రోసి వెర్రి పేస్టుల కాలు మ్రొక్కి
ఈ పరిస్థితి తెచ్చుకొంటి రే పరిశ్రమలుండి ఏమి?.

(సాగరఘోష కావ్యం, షష్ఠాంతరంగం, 90వ పద్యము)

మూలాలు మార్చు

  1. ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Retrieved 7 December 2014.