ప్రధాన మెనూను తెరువు

చరిత్రసవరించు

తరువోజ ఛందోరీతి అత్యంత ప్రాచీనమైన తెలుగు పద్య ఛందోరీతుల్లో ఒకటి. ప్రాఙ్నన్నయ యుగముగా పేర్కొనే 9వ శతాబ్ది నాటి పండరంగని నెల్లూరి శాసనంలోని పద్యం తరువోజ ఛందస్సులో ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు[1].

లక్షణములుసవరించు

  • పద్యమునకు నాలుగు పాదములుండును.
  • పాదమునకు మూడు ఇంద్ర గణములు, ఆ పైన ఒక సూర్య గణము, మళ్ళీ మూడు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము ఉండవలెను.

యతిసవరించు

పాదములోని మొదటి అక్షరమునకు మూడు చోట్ల యతి ఉండవలెను.
పాదాది అక్షరమునకు పాదంలోని మూడవ, ఐదవ, ఏడవ గణముల మొదటి అక్షరముతో యతి నియమమున్నది.

ప్రాససవరించు

రెండవ అక్షరమున ప్రాస నుంచవలెను.

గమనికసవరించు

ఒక్కొక్క తరువోజ పాదము రెండు ద్విపద పద్యపాదములు కలసిన రీతిలో (అనగా ఒక ద్విపద పద్యము వలె) ఉంటుంది. ఒకే ఒక భేదమేమిటంటే ప్రతి పాదంలో మూడు చోట్ల యతి కలుస్తుంది - అంటే ద్విపద పద్యములోని రెండు పాదములకూ సాధారణంగా ఉండే యతి కాక పాదాల మొదటి అక్షరములకు కూడా యతి నుంచవలెను. అప్పుడు మొదటి అక్షరముతోనే రెండు పాదములకు మొత్తమూ యతి చెల్లించినట్టు అవుతుంది.

ఉదాహరణసవరించు

  1. ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Retrieved 7 December 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=తరువోజ&oldid=2342862" నుండి వెలికితీశారు