పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి[1].

చంపకమాలసవరించు

నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్.

లక్షణములు[2]సవరించు

  • పాదాలు: 4 పదాలు కలవు
  • ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21
  • ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
  • యతి : ప్రతిపాదంలోనూ 1 వ అక్షరముకు 11 వ అక్షరముకు యతిమైత్రి చెందుతుంది
  • ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

గణ విభజనసవరించు

చంపకమాల వృత్త పాదము యొక్క గణ విభజన
I I I I U I U I I I U I I U I I U I U I U
దము లబట్టి నందల కుబా టొ కయింత యులేక శూరతన్

ఉదాహరణసవరించు

 
పోతన

పోతన తెలుగు భాగవతంలో 486 చంపకమాల వృత్త పద్యాలను వాడారు.

పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం
జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్
వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.

మూలాలుసవరించు

  1. మిరియాల), Dileep Miriyala(దిలీపు. "చంపకమాల (సరసీ) — తెలుగు ఛందస్సులు". chandam.apphb.com. Archived from the original on 2017-11-24. Retrieved 2019-08-25.
  2. "ఛందోపరిచయము : చంపకమాల".

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=చంపకమాల&oldid=3905434" నుండి వెలికితీశారు