పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

తరలి[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. తరలి ఛందోరూపం ప్రాచీనమా? ఆధునికమా? వివరములు తెలియ వలసి ఉంది. ఈ పద్యరూపం మరో ఛందోరూపం ఐన ఉత్సాహము చాలా సారూప్యత ఉంది. పద్య లక్షణాలలో తేడా ఉన్నప్పటికీ ఒక పద్యం రెండు ఛందో ప్రక్రియల స్వభావానికి సరి పోతాయి. అంటే తరలి లో వ్రాయ బడిన అన్ని పద్యములు ఉత్సాహము కుడా అవవచ్చు, కానీ అన్ని ఉత్సాహములు తరలి కావు. ఈ క్రింద ఉదాహరించిన పద్యం మీరు పరిశీలన చేయ వచ్చు.

పద్య లక్షణము మార్చు

నాలుగు పాదములు ఉండును.
ప్రతి పాదమునందు భ, స, న, జ, న, ర గణములుండును.


ప్రాస మార్చు

నియమము కలదు.


యతి మార్చు

ప్రతి పాదమునందు 11వ అక్షరము యతి స్థానము


మాత్రా శ్రేణి మార్చు

త్రిమాత్రా శ్రేణి: U I - I I I - U I - I I I - U I - I I I - U I - U
చతుర్మాత్రా శ్రేణి: U I I - I I U - I I I I - U I I - I I U - I U
పంచమాత్రా శ్రేణి: U I I I - I U I I - I I U I - I I I U - I U
షణ్మాత్రా శ్రేణి: U I I I I - U I I I I - U I I I I - U I U
మిశ్రగతి శ్రేణి (5-4) : U I I I - I U I - I I I U - I I I I - U I U

ఉత్సాహము, తరలి మాత్రా శ్రేణి భేదము మార్చు

తరలి: UI I - I I U - I I I - I U I - I I I - U I U
ఉత్సాహము: UI- I I I- UI - I I I - U I - I I I - U I- U



ఉదాహరణలు[2] మార్చు

తరలి

సుమనఃపతియుగము సోముండును
నెమకంగఁ బ్రావళ్ళు నిండిమీఱ
గమనీయవిభవంబుగాంచునెప్డు
రమణీయ మల్పాక్కరము కృతుల


తరలి

చారుభసన భూరిజన రసాంద్రగణములన్‌ దిశా
సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్‌.
చారుభసన భూరిజన రసాంద్రగణములన్‌ దిశా
సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్‌.

మూలాలు మార్చు

  1. "తరలి". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.
  2. "తరలి ఉదాహరణలు". Archived from the original on 2017-11-24. Retrieved 2017-02-23.
"https://te.wikipedia.org/w/index.php?title=తరలి&oldid=3886886" నుండి వెలికితీశారు