మత్తేభ విక్రీడితము

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.

మత్తేభము

మార్చు

నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా

స భ ర న మ య వ

లక్షణములు

మార్చు
మత్తేభము వృత్తమునందు గణములు
I I U U I I U I U I I I U U U I U U I U
సి రి కిం జె ప్ప డు శం ఖ చ క్ర యు గ ముం జే దో యి సం ధిం ప డే
  • పాదాలు: నాలుగు
  • ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20
  • ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ
  • యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము
  • ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణలు

మార్చు

సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా
నవలీలం దునుమాడె రాము డదయుండై బాలుడై కుంతల
చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకన్ దాటకన్.

సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై

మూలాలు

మార్చు