పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

మహాస్రగ్ధరసవరించు

 
కొలిచెం బ్రోత్సాహ వృత్తిం గుతల గగనముల్గూడ రెం డంఘ్రులం దా
బలిఁ బాతాళంబు చేరం బనిచె గడమకై బాపురే వామనుం డ
స్ఖలితాటో పాఢ్యుఁ డంచుం గరిగిరివిరమాకారిమారన్సతానో
జ్జ్వ లసోద్యద్రేఫయుగ్మాశ్రయ గురుల మహాస్రగ్ధరం జెప్ప నొప్పున్.

గణ విభజనసవరించు

మహాస్రగ్ధర వృత్త పాదము నందు గణవిభజన
IIU UUI UUI III IIU UIU UIU U
కొలిచెం బ్రోత్సాహ వృత్తింగు తలగ గనము ల్గూడరెం డంఘ్రులం దా

లక్షణములుసవరించు

మహాస్రగ్ధర వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.
22
ప్రతిపాదంలోని గణాలు: స త త న స ర ర గ
యతి : ప్రతిపాదంలోనూ 9వ, 16వ వ అక్షరములు
ప్రాస: పాటించవలెను
ప్రాస: యతి చెల్లదు

ఉదాహరణ 1సవరించు

పోతన తెలుగు భాగవతంలో వాడిన మహాస్రగ్ధర వృత్త పద్యాల సంఖ్య: 2

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయ)/బలరాముని తీర్థయాత్ర|భా 10.2-940-మస్ర.)

కనియెం దాలాంకుఁ డుద్యత్కట చటుల నటత్కాల దండాభ శూలున్
జన రక్తాసిక్త తాలున్సమధిక సమరోత్సాహ లోలుం గఠోరా
శని తుల్యోదగ్ర దంష్ట్రా జనిత శిఖక ణాచ్ఛాది తాశాంతరాళున్
హననవ్యాపార శీలున్నతి దృఢ ఘన మస్తాస్థి మాలుం గరాళున్.

మూలాలుసవరించు