అంతర్వేది

కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలలోని గ్రామం
(అంతర్వేది (సఖినేటిపల్లి) నుండి దారిమార్పు చెందింది)

అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. బంగాళాఖాతపు సముద్రం గోదావరి నదీశాఖ వశిష్టానది సంగమం చెందు ప్రశాంత ప్రాంతం అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో కల ఈ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం ఉంది.

అంతర్వేది
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిర విమాన భాగం
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిర విమాన భాగం
పటం
అంతర్వేది is located in ఆంధ్రప్రదేశ్
అంతర్వేది
అంతర్వేది
అక్షాంశ రేఖాంశాలు: 16°20′N 81°44′E / 16.333°N 81.733°E / 16.333; 81.733
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంసఖినేటిపల్లి
విస్తీర్ణం33.09 కి.మీ2 (12.78 చ. మై)
జనాభా
 (2011)
15,605
 • జనసాంద్రత470/కి.మీ2 (1,200/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు8,010
 • స్త్రీలు7,595
 • లింగ నిష్పత్తి948
 • నివాసాలు4,153
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533252
2011 జనగణన కోడ్587858

భౌగోళికం

మార్చు

భౌగోళికంగా అంతర్వేది అక్షాంశ, రేఖాంశాలు 16°20′00″N 81°44′00″E / 16.3333°N 81.7333°E / 16.3333; 81.7333.[2] ఇది దాదాపు సముద్రమట్టంలో ఉంది.ఇది మండల కేంద్రమైన సఖినేటిపల్లి నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నరసాపురం నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు
  • 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4153 ఇళ్లతో, 15605 జనాభాతో 3309 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8010, ఆడవారి సంఖ్య 7595. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4612 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 42. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 587858.[3].
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 15, 763. ఇందులో పురుషుల సంఖ్య 8, 039, మహిళల సంఖ్య 7, 724, గ్రామంలో నివాసగృహాలు 3, 743 ఉన్నాయి.

స్థలపురాణం

మార్చు
 
బ్రహ్మ రుద్రయాగం చేసిన ప్రదేశం (కమలం)

కృత యుగం లోని మాట ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేదిని గురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

క్షేత్ర నామం

మార్చు

ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు.వశిష్ఠుడు ఇక్కడ యాగం చేసినందున ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి గాంచింది.

రక్తవలోచనుని కథ

మార్చు

ఒకానొక సమయంలో రక్తావలోచనుడు (హిరణ్యాక్షుని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వంతో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడుకి వశిష్ఠుడుకి ఆసమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఙపై ఈ రక్తావలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనంపై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనంను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తిని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధంను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్యలో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.

లక్ష్మి నరసింహస్వామి దేవాలయం

మార్చు

అంతర్వేది, శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నిర్మింపజేసిన, గొప్ప భగవద్భక్తుడుగా కీర్తివహించిన కొపనాతి కృష్ణమ్మవర్మ జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా, అల్లవరం మండలం, బెండమూర్లంక శివారు ఓడలరేవు గ్రామంలో జన్మించాడు.ఇతను అగ్నికులక్షత్రియ కులానికి చెందిన, రఘుకుల గోత్రిజ్ఞుడు.[4] ప్రముఖ నౌకా వ్యాపారవేత్త ఇతని తండ్రి కొపనాతి ఆదినారాయణ. ప్రస్తుతపు ఆలయ నిర్మాణం ఇతని విరాళాలు, కృషి ద్వారానే జరిగింది. ఆలయ ప్రధాన ముఖద్వారానికి ముందు అతని శిలా విగ్రహం ఉంది. ఈ ఆలయం చక్కని నిర్మాణశైలితో ఉంది. దేవాలయం రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా (నడవా) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసారు. ప్రాకారం సైతం రెండు అంతస్తుల నిర్మాణంగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించారు. ఆలయానికి దూరంంగా వశిష్టానదికి దగ్గరగా విశాలమైన కాళీస్థలంనందు కళ్యాణమండపం నిర్మించారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణం తిలకించే ఏర్పాటు చేసారు.ఈ ఆలయం సా.శ.300 కు పూర్వం నిర్మింపబడిందని అక్కడి కొన్ని విగ్రహల ద్వారా తెలుస్తుంది.

సందర్శనాస్థలాలు

మార్చు

వశిష్టాశ్రమం

మార్చు

అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్రతీరానికి దగ్గరగా ఈ వశిష్టాశ్రమం ఉంది. మొదట తగిన పోషకులు లేకుండుటచే ఆశ్రమ సముదాయం సరియైన సౌకర్యాలు లేవు. తదుపరి దాతల సహకారాలు, దేవస్థాన సహాయంంతో ఇక్కడ అందమైన ఆశ్రమం నిర్మించబడింది.ఈ ఆశ్రమం వికసించిన కమలం మాదిరిగా నాలుగు అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరం మధ్య కలువపూవు ఆకారంలో ఈ ఆశ్రమం అత్యంత అద్భుతమైన కట్టడం. దీనికి సమీపంగా ద్యానమందిరం, పఠనాశాల, యోగశాల, విశ్రాంతి మందిరం మొదలగునవి ఉన్నాయి. యాత్రికుల విశ్రాంతి కొరకు నిర్మించిన పర్ణశాలల వంటి అందమైన కట్టడాలు ఉన్నాయి.

దీప స్తంభం

మార్చు

దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరానికి దగ్గరగా దీప స్తంభం (లైట్ హౌస్) ఉంది. దీనిని బ్రిటిష్ పాలకుల కాలంలో కట్టినట్టుగా చెపుతారు. దీని చుట్టూ అందమైన తోటలు, పచ్చక పెంచబడుతున్నది. కేవలం భక్తులు, యాత్రికులే కాక ఇక్కడికి పిక్నిక్, వనభోజనాలు వంటి వాటి కోసం వచ్చే సందర్శకుల, విద్యార్థులతో ఈ ప్రాంతం కళ కళలాడుతూ ఉంటుంది. లైట్ హౌస్ పైకివళ్ళి చూసేందుకు ఇక్కడ అనుమతి ఉంది. మూడురూపాయల నామమాత్ర రుసుం టికెట్ కొరకు వసూలు చేస్తారు. దీని పైనుండి చూస్తే లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, వశిష్టాశ్రమం, మిగిలిన దేవాలయాలు, దూరదూరంగా కల పల్లెకారుల ఇళ్ళ సముదాయాలు, తీరప్రాంతం వెంబడి కల సర్వితోటలు అత్యద్భుతంగా కానవస్తాయి.

అశ్వరూడాంభిక (గుర్రాలక్క) ఆలయం

మార్చు

నరసింహస్వామి సోదరిగా భావించే అశ్వరూడాంభిక ఆలయం ప్రధాన దేవాలయమునకు ఒక కిలోమీటరు దూరములో ఉంది. స్థల పురాణ రెండవ కథనం ప్రకారం రక్తావలోచనుడు వరగర్వంతో పాపాలు చేస్తున్నపుడు నరహరిఆతన్ని సంహరించేందుకు వస్తాడు. నరహరి సుదర్శనం ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా బీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, పార్వతి అంశతో ఒక మాయాశక్తిని సృష్టిస్తాడు. రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా ఆ మాయాశక్తి అశ్వరూపంలో తన నాలుకను విశ్వవ్యాపితం చేసి పడిన రక్తబిందువులను పడినట్లుగా పీల్చేస్తూ రక్తవలోచనుని మరణంలో శ్రీమహావిష్ణువుకు సహాయం చేస్తుంది. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గానూ మాయాశక్తి అశ్వరూడాంభిక గానూ వెలిశారు.

అన్న చెళ్ళెళ్ళ గట్టు

మార్చు

సముద్రములో వశిష్ట నది కలిసే చోటును అన్న చెళ్ళెళ్ళ గట్టు అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత

సముద్రతీరం

మార్చు

వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు నాలుగు కిలోమీటర్లమేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. ప్రయాణ సౌకర్యాల కొరత వలన, బీచ్ వరకూ సరియైన రహదారి లేకుండుట చేత దీనిని పెద్దగా అభివృద్ధి పరచలేదు. కాని ఇవే కారణాల వలన తీరం పొడవునా పరిశుభ్రంగానూ, స్వచ్ఛంగానూ ఉండి మనసుకు ఆహ్లాదం కల్పిస్తుంది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, దీపస్తంభం (లైట్ హౌస్), గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.

ఇతర ఆలయాలు

మార్చు

లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామంలోనూ, సముద్రతీరానికి వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైనవి. క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు, గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయి.

ఇతర విశేషాలు

మార్చు

అంతర్వేది గ్రామంలో చాలా సినిమాలు చిత్రీకరించారు. ఇక్కడ అలనాటి నలుపు తెలుపుల చిత్రాలైన మూగమనసులు లాంటి చిత్రాలనుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైనకొత్తలో లాంటి సినిమాల చిత్రీకరణ జరిగింది.

వసతి సౌకర్యాలు

మార్చు

అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం ఉంది. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు పది వరకూ ఉన్నాయి. రెండు ప్రైవేటు లాడ్జిలు ఉన్నాయి. ఇంకనూ మంచి వసతుల కొరకు నరసాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవ

దేవాలయ పండుగలు, ఉత్సవాలు

మార్చు

గ్రామ సౌకర్యాలు

మార్చు

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల మలికిపురంలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల సఖినేటిపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్‌ పోడూరులోను, మేనేజిమెంటు కళాశాల నర్సాపురంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల శివకోడులోను, అనియత విద్యా కేంద్రం అమలాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

అంతర్వేదిలో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఐదుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి. అన్ని రకముల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

అంతర్వేదిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

బస్సు.

అంతర్వేదికి పశ్చిమగోదావరి జిల్లా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి చేరవచ్చు. రాజమండ్రి, కాకినాడల నుండి రావులపాలెం, రాజోలు మీదుగా సకినేటిపల్లి చేరవచ్చు. విజయవాడ, ఏలూరుల నుండి నరసాపురం మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సులు అంతర్వేదికి ఉన్నాయి.

రైలు

హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా నరసాపురం చేరవచ్చు.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

అంతర్వేదిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 2018 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 108 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1183 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 537 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 646 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

అంతర్వేదిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 561 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 85 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

అంతర్వేదిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

చేపల వలలు

చేతివృత్తులవారి ఉత్పత్తులు

మార్చు

లేసుల అల్లిక

చ్చు.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Falling Rain Genomics.Antarvedi". Archived from the original on 2007-10-01. Retrieved 2007-05-27.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. ఆలయ విశేషాలు

బయటి లింకులు

మార్చు