అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం
అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న ప్రధానంగా దీని పరిధితో అనంతపురం జిల్లాను కుదించడమైనది.
అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం | |
---|---|
లోక్‌సభ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | అనంతపురం |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
జనాభా | 4,083,315 (2011 అనంతపురం జిల్లా జనాభా) |
ఓటర్ల సంఖ్య | 1,173,138 |
ముఖ్యమైన పట్టణాలు | అనంతపురం |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1952 |
నియోజకవర్గం సంఖ్య | 26 |
ప్రస్తుత పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ఏ నొఇయోజకవర్గం నుండి దీన్ని ఏర్పరచారు | 1952 |
ప్రస్తుత సభ్యులు | జె. సి. దివాకర్ రెడ్డి |
మొదటి సభ్యులు | పైడి లక్ష్మయ్య |
చరిత్ర
మార్చు2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మూలంగా నియోజకవర్గపు భౌగోళిక స్వరూపంలో మార్పులు వచ్చిననూ సెగ్మెంట్ల సంఖ్యలో మార్పులేదు. గతంలో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్నరాప్తాడు మండలం, అనంతపురం రూరల్ మండలం కొంతభాగం, ఆత్మకూరు మండలాలు ఇప్పుడు హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైనాయి.
శాసనసభ నియోజకవర్గాలు
మార్చునియోజకవర్గంలో పార్టీల బలాబలాలు
మార్చుఈ నియోజకవర్గంలో మొదటినుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన 14 లోక్‌సభ ఎన్నికలలో 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 1952, 62, 67, 71, 77, 80, 89, 91, 96,98, 2004 లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, 1957లో సి.పి.ఐ.కు చెందిన తరిమెల నాగిరెడ్డి, 1984, 99 లలో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందినారు. 1971లో నీలం సంజీవరెడ్డి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి అయిన పి.ఆంథోనీరెడ్డి చేతిలో ఓడిపోవడం విశేషం.[1] తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన 7 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులే 6 సార్లు విజయం సాధించారు.[2]
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
మార్చులోక్సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ మొదటి 1952-57 పైడి లక్ష్మయ్య భారత జాతీయ కాంగ్రెస్ రెండవ 1957 తరిమెల నాగిరెడ్డి కమ్యూనిష్టు పార్టీ మూడవ 1962 ఉస్మాన్ అలీ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967 పొన్నపాటి ఆంటోని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971 పొన్నపాటి ఆంటోని రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977 దారుర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980 దారుర్ పుల్లయ్య భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984 డి.నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989 అనంత వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991 అనంత వెంకటరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996 అనంత వెంకట రామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పన్నెండవ 1998 అనంత వెంకటరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పదమూడవ 1999 కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004 అనంత వెంకటరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 15వ 2009 అనంత వెంకటరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ 16వ 2014 జె. సి. దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 17వ 2019 తలారి రంగయ్య వైఎస్సార్‌సీపీ 18వ[3] 2024 అంబికా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ
ఎన్నికల ఫలితాలు
మార్చు2002,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | అనంత వెంకటరామిరెడ్డి | 458,925 | 52.44 | +4.97 | |
తెలుగుదేశం పార్టీ | కలవ శ్రీనివాసులు | 385,521 | 44.05 | -6.22 | |
బహుజన సమాజ్ పార్టీ | నాగభూషనం గడ్డల | 9,296 | 1.06 | ||
ఇండిపెండెంట్ | యాతం పోతలయ్య | 7,102 | 0.81 | ||
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | కె.వెంకటేశులు | 6,232 | 0.71 | -6.56 | |
తెలంగాణా రాష్ట్ర సమితి | ఎ.జగన్మోహనరావు | 4,419 | 0.50 | ||
Independent | బి.ఎస్.అమరనాథ్ | 3,640 | 0.42 | ||
మెజారిటీ | 73,404 | 8.39 | +11.19 | ||
మొత్తం పోలైన ఓట్లు | 875,135 | 68.42 | +5.43 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +4.97 |
2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకట రామిరెడ్డి మళ్ళీ పోటీ చేస్తున్నాడు.[4] ప్రజారాజ్యం పార్టీ తరఫున జి.ఎస్.మన్సూర్ పోటీలో ఉన్నాడు.[5]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 26 అనంతపురం జనరల్ శ్రీ అనంత వెంకటరామిరెడ్డి పు భారత జాతీయ కాంగ్రెస్ 457876 కలవ శ్రీనివాసులు పు తెలుగు దేశం పార్టీ 379955
2014 ఎన్నికలు
మార్చు2014,లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
పార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | జె. సి. దివాకర్ రెడ్డి | 606,509 | 50.33 | -6.06 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | అనంత వెంకటరామిరెడ్డి | 545,240 | 45.25 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | అనిల్ చౌదరి.పి | 16,659 | 1.38 | ||
మెజారిటీ | 61,269 | 5.08 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,205,054 | 78.41 | +7.55 | ||
తెలుగుదేశం పార్టీ hold | Swing |
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-06-21. Retrieved 2008-09-13.
- ↑ EENADU (12 June 2024). "అనంతపురం". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ananthapur". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009