చింతకాయల అయ్యన్న పాత్రుడు

అనకాపల్లి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు
(చింతకాయల అయ్యన్నపాత్రుడు నుండి దారిమార్పు చెందింది)

చింతకాయల ఆయ్యన్న పాత్రుడు, (జననం:1957 4 సెప్టెంబరు 04) ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. అతను 2024 జూన్ 21న ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 21వ స్పీకర్‌‌గా  ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రస్తుత స్పీకర్‌గా అధికారంలో ఉన్నారు.[8][9][10] అతను నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎనికైనాడు.[11] అతను 2024 అసెంబ్లీ ఎన్నికలలో నర్సీపట్నం సీటునుండి ఎనికైనారు.[12]

చింతకాయల అయ్యన్న పాత్రుడు
చింతకాయల అయ్యన్న పాత్రుడు

2023లో అయ్యన్న పాత్రుడు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 22 [1]
ముందు తమ్మినేని సీతారాం

పదవీ కాలం
2017 ఏప్రిల్ 02 [2] – 2019 మే 29
గవర్నరు ఇ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు సిద్ధా రాఘవరావు
తరువాత మాలగుండ్ల శంకర నారాయణ

పదవీ కాలం
2014 జూన్ 08[3] – 2017 ఏప్రిల్ 01[4]
గవర్నరు ఇ.ఎస్.ఎల్.నరసింహన్
ముందు రాష్ట్రపతి పాలన
తరువాత నారా లోకేష్

పదవీ కాలం
1999–2004
గవర్నరు * సి.రంగరాజన్ * సుర్జీత్ సింగ్ బర్నాలా
ముందు పి. రామసుబ్బారెడ్డి
తరువాత శత్రుచర్ల విజయరామరాజు

పదవీ కాలం
1996[5]–1998
ముందు కొణతాల రామకృష్ణ
తరువాత గుడివాడ గురునాథరావు
నియోజకవర్గం అనకాపల్లి

పదవీ కాలం
1994–1996
గవర్నరు కృష్ణకాంత్
తరువాత నందమూరి హరికృష్ణ

పదవీ కాలం
1984–1986
గవర్నరు * శంకర్ దయాళ్ శర్మ
ముందు పూసపాటి ఆనంద గజపతి రాజు

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 జూన్ 04
ముందు పెట్ల ఉమాశంకర్ గణేష్
నియోజకవర్గం నర్సీపట్నం
పదవీ కాలం
2014[6] - 2019
ముందు బోలెం ముత్యాల పాప
తరువాత పెట్ల ఉమాశంకర్ గణేష్
నియోజకవర్గం నర్సీపట్నం
పదవీ కాలం
1999[7] - 2009
ముందు వేచలపు శ్రీరామమూర్తి
తరువాత బోలెం ముత్యాల పాప
Constituency నర్సీపట్నం

వ్యక్తిగత వివరాలు

జననం (1957-09-04) 1957 సెప్టెంబరు 4 (వయసు 67)
నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ Telugu Desam Party
జీవిత భాగస్వామి సి.హెచ్. పద్మావతి
సంతానం 2 (కుమారులు)
నివాసం నర్సీపట్నం

బాల్యం

మార్చు

చింతకాయల అయ్యన్న పాత్రుడు 1957 సెప్టంబరు 04న విశాఖ జిల్లాలోని నర్సిపట్నంలో జన్మించాడు. ఇతని తండ్రి వరహలు దొర.

విద్య

మార్చు

ఇతదు కాకినాడలోని పి.ఆర్ కళాశాలలో బి.ఎ. పట్టా పొందాడు.

కుటుంబం

మార్చు

ఇతడు 1983 జూన్1న పద్మావతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

రాజకీయ ప్రస్థానం

మార్చు

అయ్యన్న పాత్రుడు 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 శాసనసభ ఎన్నికలలో 7 సార్లు తెలుగుదేశం పార్టీ తరుపున నర్సీపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులుగా ఎన్నికయ్యాడు. 1984-1986 లో సాంకేతిక విద్యా మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణా సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు.[13]

1994-96 లో రహదారులు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశాడు. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు.

1996 లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం తరుపున అనకాపల్లి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో వచ్చిన తరువాత అయ్యన్న అటవీశాఖ మంత్రి పదవిలో కొనసాగాడు. ఆ సమయంలో నియోజకవర్గం లోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు.

2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజయం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగా ఉన్నారు.

2014 ఎన్నికలలో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.[14] అతను 1989, 2009, 2019లో అదే శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయాడు. అతను 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశాడు.

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ 16 శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[15][16] తెలంగాణ విభజించిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ స్పీకరుగా 2024 జూన్ 22న ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

పార్లమెంటు సభ్యుడుగా ఎన్నిక

మార్చు

అయన్నపాత్రుడు 1996 భారత సార్వత్రిక ఎన్నికలలో, అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 11వ లోక్‌సభ సభ్యుడుగా ఎన్నికయ్యాడు.[17]

శాసనసభ ఎన్నికలలో పోటీచేసిన వివరాలు

మార్చు
అయ్యన్నపాత్రుడు శాసనసభ ఎన్నికలలో పోటీచేసిన వివరాలు
సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ
1983 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 38490 రామచంద్ర రాజు శ్రీ రాజ సాగి కాంగ్రెస్ పార్టీ 37498 992
1985 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 43218 శ్రీరామ మూర్తి వేచలపు కాంగ్రెస్ పార్టీ 42407 811
1989 నర్సీపట్నం కృష్ణమూర్తిరాజు రాజ సాగి కాంగ్రెస్ పార్టీ 53818 చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 42863 10955
1994 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 62385 కృష్ణమూర్తిరాజు రాజ సాగి కాంగ్రెస్ పార్టీ 41206 21179
1999 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 59853 కృష్ణమూర్తిరాజు రాజ సాగి కాంగ్రెస్ పార్టీ 51294 8559
2004 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 60689 వెంకట సూర్యనారాయణ రాజు దాట్ల స్వతంత్ర అభ్యర్థి 36759 23930
పెట్ల రామచంద్ర కాంగ్రెస్ పార్టీ 15453
2009 నర్సీపట్నం బోలెం ముత్యాల పాప కాంగ్రెస్ పార్టీ 65465 చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 57718 7747
రుత్తల యెర్ర పాత్రుడు ప్రజారాజ్యం పార్టీ 18917
2014 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 79726 పెట్ల ఉమా శంకర్ గణేష్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 77388 2388
నేతల నాగేశ్వరరావు (షెడ్యూల్ కులం) బహుజన్ సమాజ్ పార్టీ 2721
2019 నర్సీపట్నం పెట్ల ఉమా శంకర్ గణేష్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 93818 చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 70452 23366
2024[18] నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీ 99849 పెట్ల ఉమా శంకర్ గణేష్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 75173 24676

మూలాలు

మార్చు
  1. "Ayyanna Patrudu to be elected as A.P. Assembly Speaker unanimously on June 22". The Hindu. 21 June 2024.
  2. "AP Chief Minister Chandrababu Naidu constitutes his council of ministers". The Economic Times. 8 June 2014.
  3. "AP Chief Minister Chandrababu Naidu constitutes his council of ministers". The Economic Times. 8 June 2014.
  4. "Andhra Pradesh Cabinet: Chandrababu Naidu inducts son, 4 YSRC MLAs who switched sides". The Economic Times. 2 April 2017.
  5. "Anakapalli Lok Sabha Election Result - Parliamentary Constituency".
  6. "Narsipatnam Assembly Constituency Election Result - Legislative Assembly Constituency".
  7. "Narsipatnam Assembly Constituency Election Result - Legislative Assembly Constituency".
  8. Andhrajyothy (22 June 2024). "ఏడుసార్లు అసెంబ్లీకి, నాలుగుసార్లు మంత్రిగా". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  9. "Andhra Pradesh: TDP's C Ayyannapatrudu elected unopposed as speaker of Legislative Assembly - India Today". web.archive.org. 2024-06-23. Archived from the original on 2024-06-23. Retrieved 2024-06-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-05-16. Retrieved 2024-06-23.
  11. "Ayyanna Patrudu files papers". The Hindu. 28 March 2004. Archived from the original on 22 April 2004. Retrieved 25 May 2011.
  12. "Narsipatnam Assembly Election Results 2024: Narsipatnam Election Candidates List, Election Date, Vote Share - IndiaToday". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-07-29.
  13. http://www.sakshi.com/news/andhra-pradesh/be-the-retirement-of-another-round-of-137943
  14. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.
  15. "Andhra Pradesh: TDP's C Ayyannapatrudu elected unopposed as speaker of Legislative Assembly - India Today". web.archive.org. 2024-06-23. Archived from the original on 2024-06-23. Retrieved 2024-06-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  16. Bureau, The Hindu (2024-06-21). "Ayyanna Patrudu to be elected as A.P. Assembly Speaker unanimously on June 22". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-06-23.
  17. https://www.eci.gov.in/eci-backend/public/api/download?url=LMAhAK6sOPBp%2FNFF0iRfXbEB1EVSLT41NNLRjYNJJP1KivrUxbfqkDatmHy12e%2FzVx8fLfn2ReU7TfrqYobgIhiBCOyGU9qy%2Bi8UZE4xdt1qGDitfmYlwDfSAaL0f%2FkuxpvxYoqWlGD6ZURaqQ7Luil1%2BxWiAq5NYOr2d6QmG307YZvDNFRzRqs%2FTBwA6JEo
  18. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Narsipatnam". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.

వెలుపలి లంకెలు

మార్చు