వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)

(పెదసనగల్లు చరితం నుండి దారిమార్పు చెందింది)
అడ్డదారి:
WP:VPR
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

రచ్చబండ లో కొన్ని విభాగాలు : ప్రతిపాదనకోసం - చర్చ

మార్చు
  వికీపీడియా:రచ్చబండ వద్ద ఉన్న చర్చను ఇక్కడికి తరలించాం: సరైన రచ్చబండ విభాగం

మన రచ్చబండ లో ఇప్పడు ఉన్నట్లు ఒకే జాబితా ఉంటే వెతుక్కోవటం కొంచెం కష్టం,అలాగే పునరావృతం అయ్యే చర్చలు ఉన్నాయి, దీనికి బదులుగా కొన్ని విభాగాలు వుంటే ఆయా పేజీలలో మరింత సులువుగా చర్చలు జరపవచ్చు , సంబధిత పాత చర్చలు చూడవచ్చు అనిపిస్తొంది, ఉదాహరణకు తమిళ, బెంగాలీ లలో ఉన్నట్లు విధాన పర్యవేక్షణ,నోటీసులు,ఫిర్యాదులు,విధానాలు,వార్తలు మరియు సాంకేతిక వంటి ఉప వర్గాలు ఉంటే అనువుగా ఉంటుందని నా ఆలోచన, ఈ విషయం మీద అందరూ సభ్యులు అభిప్రాయం తెలుపగలరు దాని ఆధారంగా ప్రతిపాదన చేద్దాం. Kasyap (చర్చ) 06:12, 6 అక్టోబరు 2023 (UTC)Reply

మనక్కూడా వార్తలు, పాలసీలు, ప్రతిపాదనలు, సాంకేతికము, ఆలోచనలు, పత్రికా సంబంధాలు, ఇతరత్రా.. అనేవి ఉన్నాయి కదండి? అయితే మనం ఆయా విభాగాల్లో రాయడమనేది ఖచ్చితంగా పాటించడం లేదు. గతంలో అర్జున గారు అప్పుడప్పుడూ అలా రాయమని చెప్పేవారు. మీరన్నట్లు అలా పాటిస్తే బాగుంటుంది. కానీ కొత్తగా విభాగాలు చెయ్యాల్సిన అవసరం ఉందా అని..!__ చదువరి (చర్చరచనలు) 17:00, 6 అక్టోబరు 2023 (UTC)Reply
కశ్యప్ గారి ఆలోచన మంచిదేగానీ, చదువరి గారు చెప్పినట్లు ఉన్నవాటినే మనం సరిగా ఉపయోగించుకోవటం లేదు.ఇక కొత్తవాటిని ఎంతవరకు ఉపయోగిస్తామనేది లేదా పాటిస్తామనేది సందేహాస్పదం.కాకపోతే లేదా కావాలంటే వార్తలు, పాలసీలు, ప్రతిపాదనలు, సాంకేతికము, ఆలోచనలు, పత్రికా సంబంధాలు, ఇతరత్రా వాటిని అలోచించి ఇంకా ఏమైనా కొత్త విభాగాలు చేర్చవలసిఉంటే చేర్చవచ్చు.కొత్త పద్దతులు నిర్వహణకు భారం కాకూడదని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 17:41, 6 అక్టోబరు 2023 (UTC)Reply
రచ్చబండలో చర్చలు పెరుగుతున్న కొద్దీ తాజా చర్చ చూడడానికి చివరివరకు అంటే 25-30 వరుసలు కూడా దాటి కిందకు స్క్రోల్ చేయవలసి వస్తుంది ప్రతిసారి. తాజా చర్చలు పైకి ఉండే తక్షణమే కనపడుతాయి, సౌకర్యంగా ఉంటుంది. సాంకేతికంగా వీలవుతే పరిశీలించండి.--VJS (చర్చ) 07:31, 8 అక్టోబరు 2023 (UTC)Reply
మీ మనస్సులో అనుకున్న దాని ప్రకారం పూర్తి వివరాలు తెలుపగలరు. యర్రా రామారావు (చర్చ) 10:23, 10 అక్టోబరు 2023 (UTC)Reply
@Kasyap గారూ, మీరనేది ఇలాగనా ? __ చదువరి (చర్చరచనలు) 11:47, 10 అక్టోబరు 2023 (UTC)Reply

నేను అనేది ఇతరవికీ లో బాక్స్ వలే ఉన్న ఇంటర్ఫేస్ గురించి, కొత్తవారికి ఉన్న ఆపట్టి సరిగా తెలియక పోవచ్చు. Kasyap (చర్చ) 10:05, 10 అక్టోబరు 2023 (UTC)Reply

మార్పుచేర్పుల సూచనలు

మార్చు
  • యర్రా రామారావు: ఈ మూసలో అవకాశముంటే ప్రాజెక్టుల విభాగం ఒకటి చేర్చితే బాగుంటుదని నా అభిప్రాయం.అలాగే సాంకేతికము విభాగం సాంకేతికం అని మార్చవచ్చు.(ము అనుస్వారం సమస్య లేకుండా) యర్రా రామారావు (చర్చ) 03:44, 11 అక్టోబరు 2023 (UTC)Reply
  • చదువరి: విభాగాల హేతువు, వాటి పునర్వ్యవస్థీకరణపై నా అభిప్రాయాలు. ముందుగా, ఈ చర్చ తెచ్చిన కశ్యప్ గారికి ధన్యవాదాలు. (ఆయన చెప్పిన తరువాత కూడా, ఇది ముఖ్యమైన అంశమని నాకు అర్థం కావడానికి కొంత సమయం పట్టింది.)
  • వార్తలు: వికీమీడియా ప్రాజెక్టులకు సంబంధించిన విశేషాలు ఈ విభాగంలో ఉంటాయి. తెవికీ తరఫున బయట చేసే కార్యక్ల్రమాలు, సమావేశాలు, ఉత్సవాల వివరాలు ఇక్కడ ఉంటాయి. సమావేశాలకు సంబంధించిన ప్రకటనలే ఇక్కడ ఉంటాయి, వాటిపై చర్చలు, నివేదికలు ఆయా పేజీల్లో ఉంటాయి. ఈ విభాగం ఉండాలి
  • పాలసీలు: తెవికీలో ప్రస్తుతం ఉన్న విధానాలు, మార్గదర్శకాల గురించిన (వాటిలో చెయ్యాల్సిన మార్పుల గురించిన) చర్చలు, కొత్తవాటికి కోసం ప్రతిపాదనలు (వాటిని వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీకి ఉపపేజీలుగా చేస్తాం) ఈ విభాగంలో ఉంటాయి. ఈ విభాగం ఉండాలి
  • ప్రతిపాదనలు: తెవికీలో విస్తృతమైన అంశాల గురించిన -ఆకృతి రీత్యా, మూల మార్పుల రీత్యా చెయ్యాల్సిన మార్పుచేర్పులు వగైరాలు -ప్రతిపాదనలు ఇక్కడ ఉంటాయి. ఓ వాడుకరి గురించో, ఓ పేజీగురించో, ఒక వర్గం, ఒక ప్రాజెక్టు గురించో, చేసే చర్చలు ఇక్కడ చెయ్యరాదు. వాటిని ఆయా చర్చాపేజీల్లోనే చెయ్యాలి. ఉదాహరణకు ఒక మూస దిగుమతి గురించి ఇక్కడ రాయకూడదు. కానీ దిగుమతులు చేసుకోవడంలో ఎదురౌతున్న సాంకేతికేతర ఇబ్బందుల గురించి రాయొచ్చు. ఈ విభాగం ఉండాలి.
  • సాంకేతికం: ఖచ్చితంగా వికీపీడియాకూ, దానికి సంబంధించిన గాడ్జెట్లు వగైరాల సాంకేతిక విషయాల కోసమే దీన్ని వాడాలి. ఈ విభాగం ఉండాలి
  • ఆలోచనలు: ఇక్కడ రాయదలచిన అలోచనలను ప్రతిపాదనలు లో రాయొచ్చు. ఈ విభాగం అనవసరం అని నా అభిప్రాయం.
  • పత్రికా సంబంధాలు: తెవికీ గురించి, ఇతర వికీమీడియా ప్రాజెక్టుల గురించీ మీడియాలో వచ్చే సమాచరాం గురించిన విశేషాలు, మీడియాలో రావాల్సిన వాటి గురించి ప్రెస్‌నోట్లు తయారుచెయ్యడం ఇక్కడ ఉంటాయి ఈ విభాగం ఉండాలి
  • ఇతరత్రా: దీన్ని ఉంచాలంటే "వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా)" కు "వికీపీడియా:రచ్చబండ" కూ తేడా ఏంటో మనం స్పష్టంగా చెప్పుకోవాలి. నాకైతే ఈ విభాగం అనవసరం అనిపిస్తోంది.
గమనిక: తీసివెయ్యాలని నిర్ణయించిన విభాగంలో ఉన్న చర్చలనూ, ఆ విభాగాన్నీ అలాగే ఉంచేసి, ఇకపై దాన్ని ట్యాబులో చూపరాదు, అంతే. ఆ తీసేసిన విభాగాల లింకులను ఏదైనా పేజీలో పెట్టొచ్చు.
కొత్త విభాగాల ప్రతిపాదనలు
  • ముఖ్యమైన పాత చర్చలు: వివిధ విభాగాల్లో జరిగిన ముఖ్యమైన చర్చల లింకులను (లింకులు మాత్రమే) ఈ విభాగంలో చేర్చాలి.
  • నాణ్యత: భాషా నాణ్యత, అనువాదాల నాణ్యత, సమాచార నాణ్యత - వంటి వివిధ నాణ్యతా పరమైన అంశాల కోసం
  • పోతే, ప్రధాన "రచ్చబండ" ఎందుకంటే.. కొత్తవాడుకరుల, పాతవాళ్ళ సమస్యల కోసం, ఏ విభాగానికీ చెందని అంశాల కోసం, ఏ విభాగంలో రాయాలో తేల్చుకోలేని అంశాల కోసం.
ఇతర అభిప్రాయాలు
  • విభాగ వివరణ:ప్రతీ విభాగం లోనూ పైన, అందులో ఏమేం రాయొచ్చో, ఏమి రాయకూడదో వివరంగా చూపాలి. లింకు, అందులో జరిగిన చర్చాంశమేంటి అనేది ఉండాలి.
  • సరదా కబుర్లు: దీని కోసం ఒక విభాగం ఉండాలి. ఈ విభాగంలో ఏయే అంశాలు నిషిద్ధమో పైన రాయాలి.
  • నిర్వహణ: రచ్చబండ నిర్వహణకు ఎవరైనా బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. ఇది చర్చల మోడరేషను కోసం కాదు, మనం మోడరేషను చెయ్యం. చర్చలను ముగించడం, చర్చల్లో నిర్ణయాలు ప్రకటించడం వారి బాధ్యత కాదు. వారి పనులు:
    • సరైన విభాగం:చర్చ సరైన విభాగంలో ఉందో లేదో చూడడం, అవసరమైతే సరైన విభాగానికి మార్చమని సూచించడం, మార్చడం
    • ఆర్కైవింగు:పేజీలను పాత చర్చల్లోకి తరలించడం
    • ముఖ్యమైన చర్చల లింకులను భద్రపరచడం:వివిధ విభాగాల్లో జరిగే ముఖ్యమైన చర్చలు/భవిష్యత్తు లోనూ పనికొచ్చే చర్చలు/ముఖ్యమైన ముగింపులు ఇచ్చే చర్చలు మొదలైనవాటి లింకులను ఏదో ఒక పేజీలో (దీని కోసం ఒక ప్రత్యేక విభాగం పెట్టుకున్నా తప్పులేదు) పెట్టాలి.
  • చర్చ ఉద్దేశం: చర్చ మొదలుపెట్టేవారు ఆ చర్చ ఉద్దేశమేంటో ముందే రాస్తే బాగుంటుంది - సమాచారం తెలియజెయ్యడం/ఒక నిర్ణయం కోసం/కేవలం అభిప్రాయ సేకరణ కోసం చర్చ.. వగైరాలు. ఇది తప్పనిసరేమీ కాదు గానీ, చేస్తే బాగుంటుంది.
  • చర్చలకు ముగింపు: ఈ విభాగాల్లో జరిగే ప్రతి చర్చకూ ఒక తార్కికమైన ముగింపు ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఊసుపోకఏదో మాట్లాడుకున్నట్లు ఉండరాదు.
  • సరదా కబుర్లు:అయితే, సరదా కబుర్లు అసలు తెవికీలో నిషిద్ధమా అనే ప్రశ్న వస్తే.. ఉండాల్సిందే అనేది నా అభిప్రాయం. కాసేపు సరదా కబుర్లు చెప్పుకోడానికి కూడా ఉండాలి. దానికోసం రచ్చబండలో ఒక విభాగం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాను.
  • ఆర్కైవింగు ఎప్పుడు:పాత చర్చల్లోకి ఎప్పుడు తరలించాలనేదానికి ఒక పద్ధతి - ఒక నిర్ణీత గడువుకో, ఒక నిర్ణీత పేజీ పరిమాణానికో తరలించాలని పెట్టుకుందాం. ప్రస్తుతం, గుర్తొచ్చినపుడు చేస్తున్నాం. అర్జున గారు పేజీ పరిమాణాన్ని గమనిస్తూ చేసేవారనుకుంటాను. నేను చేసినపుడు మాత్రం (గుర్తొచ్చినపుడు) పేజీ పరిమాణాన్ని పరిశీలించి చేసేవాణ్ణి. నిర్ణీత సమయానికి చెయ్యాలనేది నా అభిప్రాయం. రచ్చబండ ప్రధాన పేజీని మూణ్ణెల్లకు ఒకసారి చెయ్యొచ్చనుకుంటాను. మిగతా వాటిని ఏడాదికి ఒకసారి చెయ్యొచ్చు. దీని కోసం ఒక బాటుంటే బాగుంటుంది.
__చదువరి (చర్చరచనలు) 05:25, 11 అక్టోబరు 2023 (UTC)Reply
విభాగాల సూచనలు చాలా బాగున్నాయి @Chaduvari గారు, ఈ మధ్యకాలంలో, మన వికీని చూసే వారిలో ఎక్కువ మంది (90 % పైన) మొబైల్‌ను ఉపయోగిస్తున్నారు. కాబట్టి, మన వికీని మొబైల్‌లో సులభంగా ఉపయోగించడానికి ట్యాబుల కన్నా ఇలా డబ్బాల వంటి ఇంటర్ఫేస్‌ను అందించడం బాగుంటుంది. Kasyap (చర్చ) 09:59, 11 అక్టోబరు 2023 (UTC)Reply
@Kasyap గారూ, అక్కడ కూడా విలేజి పంపులో ట్యాబులున్నాయి. ఇది చూడండి. చదువరి (చర్చరచనలు) 11:07, 14 అక్టోబరు 2023 (UTC)Reply

తెలుగు వికీపీడియా లోని అంశాలపై మన అభిప్రాయాలను వెల్లడించేందుకు

మార్చు

తెలుగు వికీపీడియా గురించి, లేదా మీడియావికీ ప్రాజెక్టులు పద్ధతుల గురించీ మనకు అనేకానేక అభిప్రాయాలుంటాయి. మనం మన అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్మోహంగా నిర్మొహమాటంగా చెప్పుకోవాలి. ఎక్కడ చెప్పుకోవాలి? ప్రస్తుతం రచ్చబండ లాంటి వేదికల్లో కొన్నిటిని చర్చిస్తున్నాం. ఇలా చర్చలాగా జరపడంలో సౌలభ్యాలున్నప్పటికీ, అది అందరికీ సౌకర్యంగా ఉండకపోవచ్చు. అభిప్రాయం చెబితే అవతలి వాళ్ళు ఎలా తీసుకుంటారనో, దానిపై ఎలాంటి వ్యాఖ్యానాలు వస్తాయోననో మరొక కారణం చేతనో కొందరు చర్చలో పాల్గొనకపోవచ్చు. అంతే కాకుండా అసలు చర్చకే రాని అనేక అంశాల పట్ల కూడా మనకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండొచ్చు. ఇలాంటి అభిప్రాయాలను వెల్లడించే అవకాశం మనకు వాడుకరి: పేరుబరిలో ఉంది. అక్కడ రాసుకోవచ్చు. అయితే ఇతరులకు అవి ఉన్నాయని తెలిసే అవకాశం చాలా తక్కువ. పనిమాలా శ్రద్ధగా వెతుక్కుంటే తప్ప అవి కనబడవు. కానీ, అవన్నీ ఒకే చోట ఉండే పనైతే అవి మరింత తేలిగా అందరికీ అందుబాటులో ఉంటాయనిపిస్తోంది. మన అభిప్రాయాలను ఒక వ్యాసంలో రాసుకునే వేదిక లాగా ఇది ఉంటుంది - ఒక బ్లాగు లాగా అనుకోవచ్చు. మన స్వగతం అనుకోవచ్చు. ఇంగ్లీషు వికీలో ఎస్సే అనే ఒక కాన్సెప్టు ఇలాంటిదే ఉంది. ఇదీ అదే. స్థూలంగా నేను అనుకుంటున్నది ఇలాగ:

  1. ఎవరికి తోచిన అంశం గురించి వాళ్ళు వ్యాసం రాసుకుంటారు. అది చర్చ కాదు, ఒక వాడుకరి రాసుకునే అభిప్రాయాలు అంతే. అలా ఎన్ని పేజీలైనా రాసుకోవచ్చు. ఎప్పుడైనా రాసుకోవచ్చు.
  2. దాన్ని రచ్చబండ లోనే ఒక విభాగం లాగా పెట్టొచ్చు: "వికీపీడియా:రచ్చబండ (అభిప్రాయాలు)" అనో "వికీపీడియా:రచ్చబండ (విశ్లేషణలు)" అనో మరో లాగానో పెట్టుకోవచ్చు. దీనికింద మన అభిప్రాయాలు రాస్తాం: "వికీపీడియా:రచ్చబండ (అభిప్రాయాలు)/వికీపీడియన్లకు మరింత గుర్తింపు ఉండాలి" "వికీపీడియా:రచ్చబండ (అభిప్రాయాలు)/"మరియు" రాస్తే తప్పేంటి?" "వికీపీడియా:రచ్చబండ (అభిప్రాయాలు)/నా వోటు కాదు, నా అభిప్రాయం తీసుకోండి", వికీపీడియా:రచ్చబండ (అభిప్రాయాలు)/కొండంత వికీకి కొండంత వ్యాసం రాయమంటే ఎలా కుదురుద్ది మాషారూ! - ఇలా వివిధ అంశాలపై రాస్తాం.
  3. రచ్చబండలో వద్దనుకుంటే "వికీపీడియా:అభిప్రాయాలు/" అని ఒక ప్రాజెక్టు లాంటిది పెట్టుకుని దాని కింద ఉపపేజీలుగా రాసుకోవచ్చు.

ఈ అంశంలో మరొక పార్శ్వం కూడా ఉంది: వికీలో రాయని బయటి వ్యక్తులను కూడా వికీపీడియాపై తమ అభిప్రాయాలను రాయమనవచ్చు. విషయ పరిజ్ఞానం గలవాళ్లను, భాషావేత్తలనూ తమ అభిప్రాయాలు రాయమని అభ్యర్థించవచ్చు. తమతమ రంగంలో నైపుణ్యం కలిగిన వాళ్ళు వ్యాసాల లోటుపాట్లపై వివరించినపుడు అది మనకు పనికొచ్చే సంపద అవుతుంది. తద్వారా మన అభిప్రాయాలను కూడా మలచుకోవచ్చు/బలపరచుకోవచ్చు.

ఈ రెండు విధాలుగా వచ్చే అభిప్రాయాలు వికీని మెరుగుపరచడంలో తోడ్పడతాయని నేను అనుకుంటున్నాను. సూత్రప్రాయంగా ఇది సరేననుకుంటే దీనిపై విధివిధానాలను, మార్గదర్శకాలనూ ఆలోచించుకోవచ్చు. పరిశీలించవలసినది.

(దీన్ని ప్రధాన రచ్చబండ లోనే రాయడం మొదలుపెట్టాను. కానీ కశ్యప్ గారు చెప్పినది గుర్తొచ్చి ఇక్కడికి మార్చాను) చదువరి (చర్చరచనలు) 11:02, 14 అక్టోబరు 2023 (UTC)Reply

మంచి ప్రతిపాదన @Chaduvari గారు. వికీని వివిధ కోణాల నుండి గమనించడానికి, మన అభిప్రాయాలను మలచుకోవడానికి అభిప్రాయాలు అనేది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:39, 14 అక్టోబరు 2023 (UTC)Reply

శైలి - భౌగోళిక ప్రదేశాల ప్రసక్తి

మార్చు

వ్యాసంలో వ్యాస విషయానికి సంబంధించి ఒక భౌగోళిక ప్రదేశాన్ని ఉదహరించేటపుడు ఎలాంటి శైలిని పాటించాలి అనేది ఈ ప్రతిపాదన లోని అంశం. చాలా వ్యాసాల్లో ప్రవేశిక లోని తొలి రెండు వాక్యాలు వ్యాస విషయాన్ని పరిచయం చేస్తాయి. ఇందులో భౌగోళిక అంశాలు కూడా ఉంటాయి. ఈ సందర్భాల్లో -భారతదేశానికి సంబంధించి లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సర్వవిదితమైన కొన్ని విషయాలను ఉదహరించేటపుడు, వాటి గురించి పాఠకుల పరిజ్ఞానం విషయంలో తెలుగువికీపీడియా ఎన్వికీ కంటే కొంత ఎక్కువ చొరవ తీసుకోవాలని నా ఉద్దేశం. తెవికీ చదివేవారిలో 99.9% మంది తెలుగు రాష్ట్రాలతో పరిచయం ఉన్నవారై ఉంటారు. ఏదైనా వ్యాసంలో హైదరాబాదు ప్రసక్తి వచ్చినపుడు హైదరాబాదు తెలంగాణ లోనిదనీ, విశాఖ, విజయవాడల ప్రసక్తి వచ్చినపుడు అవి ఆంధ్రప్రదేశ్ లోనివనీ రాయనక్కర్లేదు. "అతను తెలంగాణ లోని హైదరాబాదులో పనిచేస్తున్నాడు" అనేకంటే "అతను హైదరాబాదులో పనిచేస్తున్నాడు" అంటే సరిపోతుంది, పఠనీయత బాగుంటుంది.

ఈ పద్ధతిని అనుసరించవలసినది, ఆయా స్థలాలను/ప్రాంతాలను ఉదహరించేటపుడు మాత్రమే, ఆయా స్థలాలను వివరించేటపుడు కాదు. అంటే -ఆయా స్థలాలకు సంబంధించిన స్వంత పేజీల్లో దాన్ని పరిచయం చేసేటపుడు పూర్తి చిరునామా రాయాలి. ఉదాహరణకు, హైదరాబాదు పేజీలో "హైదరాబాదు తెలంగాణ రాష్ట రాజధాని, రాష్ట్రం లోని అతి పెద్ద నగరం. భారతదేశం లోని అతి పెద్ద నగరాల్లో ఐదవది/ఆరోది.." ఇలా రాయొచ్చు. కానీ వేరే పేజీల్లో హైదరాబాదు ప్రసక్తి వచ్చినపుడు "తెలంగాణ లోని హైదరాబాదు లోని.." అని రాయనక్కర్లేదు.

ఈ విషయమై వికీపీడియా:శైలిలో కింది అంశాలను చేర్చాలని నా ప్రతిపాదన.

  • తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలను ఉదహరించేటపుడు - ముఖ్యంగా హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్లులను ఉదహరించేటపుడు రాష్ట్రాన్ని ఉదహరించనవసరం లేదు.
  • ఏ రాష్ట్రం లోని జిల్లాలనైనా సరే (తెలుగు రాష్ట్రాలతో సహా) ఉదహరించేటపుడు రాష్ట్రాన్ని ఉదహరించాలి. మరీ ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగాక ఇది తప్పనిసరి అయింది. తెలంగాణ లోని నారాయణపేట జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా అనాలి.
  • భారతదేశ రాష్ట్రాలను ఉదహరించేటపుడు దేశం రాయనక్కర్లేదు. "భారతదేశం లోని గుజరాత్ రాష్ట్రంలో" అనక్కర్లేదు, "గుజరాత్ రాష్ట్రంలో" అని రాయొచ్చు.
  • భారతదేశం లోని ప్రముఖ నగరాలను ఉదహరించేటపుడు దేశాన్ని ఉదహరించనవసరం లేదు - "భారతదేశం లోని ఢిల్లీలో", "భారతదేశం లోని చెన్నైలో", "భారతదేశం లోని ముంబైలో" ఇలా రాయనక్కర్లేదు. నేరుగా ఢిల్లీలో, చెన్నైలో అని రాయవచ్చు. లేదా "తమిళనాడు లోని చెన్నైలో". "మహారాష్ట్ర లోని ముంబైలో" అని రాష్ట్రాలను ఉదహరించవచ్చు.
  • ఇతర దేశాల లోని ప్రదేశాలను ఉదహరించేటపుడు, ఆ ప్రదేశం/ప్రాంతం ఎంత ప్రాచుర్యం పొందినదైనా సరే దేశాన్ని ఉదహరించాలి - ఉదాహరణకు, "అమెరికా లోని న్యూయార్క్" అని రాయాలి. "ఇంగ్లాండ్ లోని లండన్", "పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం" అని రాయాలి.
  • ఎన్వికీలో రాసినట్లుగా మరీ పెద్దస్థాయి చిరునామా కాకుండా వీలైనంత చిన్నస్థాయి పరిచయం రాయాలి. అంటే "జగన్నాథ్ పట్నాయక్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు" అని కాకుండా "జగన్నాథ్ పట్నాయక్ ఒరిస్సాకు చెందిన రాజకీయ నాయకుడు" అని రాయాలి. "గట్టు భీముడు తెలంగాణ రాష్ట్రం, గద్వాల జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు" అని రాయాలి.
  • "లోని" వాడుకలో విచక్షణ చూపాలి. అడ్రసు రాసేటపుడు అందులో చిట్టచివరి ప్రదేశం తరువాత మాత్రమే "లోని" రాయాలి దానికి ముందు వచ్చే ప్రాంతాలు/ప్రదేశాల తరువాత కామా ఉంచాలి. ఉదాహరణకు "ఆస్ట్రేలియా లోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం లోని సిడ్నీ లోని.. " అని రాయకూడదు. "ఆస్ట్రేలియా, న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం, సిడ్నీ లోని.. " అని రాయాలి.

ఈ అంశానికి సంబంధించి ఇవి కొన్ని స్థూలమైన అంగాలు మాత్రమే. మరింత వివరంగా రాసుకోవాలంటే రాయొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ మొదలుపెడదామన్నది నా అభిప్రాయం.

శైలి అనేది ఒక మార్గదర్శకం మాత్రమే. మార్గదర్శకాల విషయంలో తెవికీ పద్ధతి ఒకటే -వాటిని తు.చ. తప్పకుండా పాటించాలని నియమమేమీ లేదు, పాటించాల్సిన సందర్భాన్ని బట్టి విచక్షణ చూపాలి అని చెబుతుంది. ఒక ఉదాహరణగా:

నెదర్లాండ్స్ దేశపు క్రికెట్ జట్టులో ఆడుతున్న తేజ నిడమానూరు అనే విజయవాడ కుర్రాడి పేజీ రాస్తున్నపుడు.. అతను "భారతదేశం లోని విజయవాడకు చెందినవాడు" అని రాయాలి. నెదర్లాండ్స్‌ / విజయవాడ అనే విషయంలో సందిగ్ధాతీతంగా ఉండేలా స్పష్టంగా రాయాలి. అంచేత - అతను పుట్టింది విజయవాడ అనే భారత నగరంలో, నెదర్లాండ్స్‌లో కాదు అని నొక్కి చెప్పాలి. కానీ, "విజయవాడ ప్రముఖులు" అనే పేజీలో అతని ప్రసక్తి వస్తే.., అపుడు "తేజ నిడమానూరు అనే నెదర్లాండ్స్ క్రికెటరు భారతదేశం లోని విజయవాడకు చెందినవాడు" అని రాయకూడదు - అసలు రాస్తున్నదే విజయవాడ ప్రముఖుల గురించి కదా.., మళ్ళీ భారతదేశం లోని అంటూ ప్రవర చెప్పాల్సిన పని లేదు.

పరిశీలించవలసినది. మార్పుచేర్పులేమైనా ఉండాలని భావిస్తే సూచించవలసినది. ఇక్కడ వచ్చిన అభిప్రాయాలను బట్టి తగు మార్పుచేర్పులతో శైలిలో చేరుద్దాం__ చదువరి (చర్చరచనలు) 01:32, 20 అక్టోబరు 2023 (UTC)Reply

అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:23, 20 అక్టోబరు 2023 (UTC)Reply
@చదువరి గారు, మీరు సూచించిన ఈ అంశాలు వీక్షకుల పఠనీయత అనుభవాన్ని మెరుగు పరచటానికి తోడ్పడతాయని నేను అభిప్రాయపడుతున్నాను. తెవికీలో వ్యాసాలు రాసేటప్పుడు మీరు పైన ప్రస్తావించిన ఈ శైలి విషమై కొంచెం అవగాహన ఉంటె బాగుండు అనిపించింది, తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. NskJnv 07:45, 20 అక్టోబరు 2023 (UTC)Reply

తెవికీలో చెక్‌యూజర్లు ఉండాలా?

మార్చు

వికీమీడియా ప్రాజెక్టుల్లో చెక్‌యూజర్ అనే ఒక ప్రత్యేక వాడుకరి హోదా ఉంది. నిర్వాహకుడు, అధికారి లాగానే కొన్ని ప్రత్యేక బాధ్యతలు గల యూజర్ గ్రూపు ఇది. వికీమీడియా ప్రాజెక్టుల్లో దుశ్చర్యలకు పాల్పడే వారు, సాక్ పప్పెట్లు (ఒకే వ్యక్తి వివిధ ఖాతాలను సృష్టించుకుని దురుపయోగం చేయడం) మొదలైనవారిని సాంకేతిక సాధానాల సాయంతో గుర్తించి, నిర్థారించేందుకు ఉన్న ప్రత్యేక అనుమతిని చెక్‌యూజర్ అనుమతి అంటారు. తెలుగు వికీపీడియాలో ఆ అనుమతి ఎవరికీ లేదు. భారతీయ వికీపీడియాల్లో మలయాళం ఒక్కదానిలోనే ఆ అనుమతి ఉన్న వాడుకరులు ఉన్నారు. ఈ అనుమతి వలన - దుశ్చర్యలను నిర్థారించడం, సాక్ పప్పెట్లను దర్యాప్తు చెయ్యడం, నిర్థారించడం, చర్చలలో, వోటింగుల్లో వివిధ ఖాతాలను దురుపయోగం చెయ్యడం, వాడుకరులే కాకుండా, ఐపీ చిరునామాలను కూడా దర్యాప్తు చెయ్యడం వంటివి చెయ్యవచ్చు.

ప్రస్తుతం ఎలా చేస్తున్నాం?
ప్రస్తుతం మన చెక్‌యూజర్ అభ్యర్థనలను మెటాలో స్టీవార్డులకు చేస్తున్నాం. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటివరకు మనం సుమారుగా ఎన్ని అభ్యర్థనలు చేసి ఉంటాం?
సుమారు ఒక నాలుగైదు చేసి ఉండవచ్చు.
ఇకపై కూడా అలాగే చెయ్యవచ్చు గదా..? ఈ చెక్‌యూజర్లు ఇక్కడే ఉంటే కలిగే ప్రయోజనం ఏమిటి?
గతంలో కంటే ఇటీవలి కాలంలో సాక్ పపెట్ల పనులు తెవికీలో ఎక్కువయ్యాయి. ఒకే వాడుకరి వివిధ ఖాతాలు సృష్టించడం, ఇతర వాడుకరిపేర్లను పోలి ఉండేలా ఖాతాలు తెరవడం వంటివి పెరిగాయి. అవి చేసే దుశ్చర్యలు, దురుపయోగాలు పెరిగాయి. ఉదాహరణకు-
  • సూరజ్ బీరా అనే వ్యక్తి పేరిట ఒక ప్రచార వ్యాసం వచ్చింది. Ventakeswaraswamigovinda, Lakshmiprasadv, Katherinetoday అనే మూడు ఖాతాలు దీని కోసమే పుట్టి ఈ పేజీని సృష్టించి పెద్ద చేసాయి. పూర్తిగా ప్రచార వ్యాసం. చర్చ:సూరజ్ బీరా పేజీలో జరిగిన చర్చ చూస్తే వివరాలు తెలుస్తాయి.
  • వాడుకరి:రవిచంద్రంచ - పాత వాడుకరి పేరును పోలి ఉండేలా పేరు పెట్టుకున్నారు. కొన్ని దుశ్చర్యలు చేసారు. ఈ ఖాతాను తెవికీలో నిరోధించలేదు. కానీ, స్టీవార్డులు సార్వత్రికంగా నిషేధించారు. ఈ ఖాతాను సృష్టించినవారు ఇంకా ఇతర ఖాతాలేమైనా సృష్టించారేమో తెలీదు.
  • Arjunarao అనే పేరును పోలి ఉండేలా 11 ఖాతాలు వచ్చాయి. నిరుడు వాటన్నిటినీ నిరోధించాం. ఇంకా ఏమైనా ఉన్నాయేమో తెలీదు.
  • Pkraja1234, Surya923,jags1111, Sunrise600 వగైరా ఖాతాలు కేవలం ఒక ప్రచార పేజీని సృష్టించి పోషించేందుకు పాటుబడ్డాయి. వాళ్ళు వేరే వికీమీడియా ప్రాజెక్టుల్లో కూడా దుశ్చర్య చేయడంతో, సార్వత్రిక నిరోధం విధించారు. అప్పటిదాకా మనకు ఆ సంగతి తెలియలేదు. ఆ తరువాత వాళ్ళను ఇక్కడ నిరోధించాం.
  • Induvadhone, AgniPuthra, Agni Puthra 26, Msnlalithprem, PenVenR అనే ఖాతాలు ఒకే పేజీపై ఎక్కువగా పనిచేసాయి. ఇతర వికీపీడియాల్లో కూడా అదే పేజీపై పనిచేసాయి. చెక్‌యూజరుతో చెక్ చేయిస్తే వాటి సంగతి బహుశా సకాలంలో తెలిసేది
  • నిరుడు ఒక మాజీ నిర్వాహకుడు, కొందరు (లేదా ఒక్కరేనేమో) ఐపీ వాడుకరులూ ఐదారుగురు నిర్వాహకులపై, తెవికీపై దాడి చేసారు. స్టీవార్డులను అడిగాం వాటి సంగతి చూడమని. నమోదైన ఖాతాలను ఐపీలనూ కలిపి చూడం అని చెప్పారు. పోనీ ఐపీలను మాత్రమే విడిగా చూడవచ్చు గదా.. కానీ అలా చూళ్ళేదు.
  • పివిఆర్ రాజా, గేదెల శ్రీనుబాబు, గ్లోబల్ టెక్ సమ్మిట్, మండవ సాయి కుమార్, సూరజ్ బీరా వంటి పేజీలు రావడం చూసాం. ఇలాంటివి ఇంకా కొన్ని ఉంటే ఉండవచ్చు.
  • రెడ్డి గారి వ్యాసాలు, REDDY GARI VYASALU - ఈ ఖాతాలు మీవేనా చెప్పండి అని YVSREDDY గారిని 2020 మేలో అడిగాం. మళ్ళీ YVSRWIKI అనే కొత్త ఖాతా వచ్చింది. 2023 ఫిబ్రవరిలో ఈ విషయమై మళ్ళీ అడిగితే అప్పుడు, మూడేళ్ళ తరువాత, చెప్పారాయన - అవి తనవేనని.
  • వాడుకరి:Googlehelps గురించి జరిగిన చర్చ చూడండి. ఇంత ఖచ్చితమైన అనుమానాలు చూపినపుడు ఇక్కడి చెక్‌యూజర్లైతే వీటిపై స్పందించేవారు.
  • అనేక సంవత్సరాలుగా ఉంటూ, వేలాది దిద్దుబాట్లు చేసిన వాడుకరులు కూడా దొంగ ఖాతాలతో దుశ్చర్యలు చేస్తున్నారు. ఈ దుశ్చర్యలను గుర్తించే వ్యవస్థ తెవికీలో ఉంటే వీటిపై కొంత అదుపు ఉండవచ్చు.
  • అన్నిటికంటే ముఖ్యమైనది - సకాలంలో చెక్ చెయ్యడం! కాలాతీతమైపోతే చెక్ చెయ్యడానికి డేటా లభించదు. సముచితమైన అనుమానాలను వాడుకరులు వ్యక్తపరచినపుడు స్థానిక చెక్‌యూజర్లు వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. మెటాలో అనుమానాలు తెలిపేందుకు అందరూ ముందుకు రాకపోవచ్చు. అలా ముందుకు రానందువలన బయటపడని కేసులు కూడా ఉంటే ఉండి ఉండవచ్చు కూడా.
గతంలో ఈ విషయంపై తెవికీలో చర్చలు జరిగాయా?
2016 లో ఒకసారి సందర్భవశాత్తూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది ఇక్కడ చూడవచ్చు. అ తరువాత 2018 లో ఒకసారి, 2019 లో మరోసారి ప్రస్తావనకు వచ్చాయి గానీ, పెద్దగా చర్చేమీ జరగలేదు. కానీ ఈ చివరి చర్చాంశం ఈ వ్యవస్థ అవసరాన్ని నొక్కి చెబుతోంది.

తెవికీ వృద్ధి చెందే కొద్దీ, కొత్త వ్యవస్థలను సృష్టించుకుంటూ, ఉన్నవాటిని బలోపేతం చేసుకుంటూ సాగాలి. చెక్‌యూజరు వ్యవస్థ అలాంటిదే. దాన్ని, తప్పు జరిగాక పరిశోధన చేసే వ్యవస్థగా మాత్రమే కాక, తప్పు జరక్కుండా నిరోధించే వ్యవస్థగా కూడా చూడాలి. తప్పు బయటపడే అవకాశం ఉందని తెలిస్తే తప్పులు జరగడం తగ్గుతుంది.

ఏం చెయ్యాలి? వ్యవహారం ఎలా ముందుకు పోతుంది, ఎలా ముగుస్తుంది?

మార్చు
  1. ముందు, ఈ వ్యవస్థ మనకు అవసరమా కాదా అనేది చర్చించి నిశ్చయించుకోవాలి. అందుకే ఈ ఆలోచనను సముదాయం ముందుకు తెచ్చాను. ఇది కావాలి అనుకుంటే కింది అంగలకు వెళ్తాం. అక్కర్లేదనుకుంటే ఇక్కడితోటే స్వస్తి.
  2. వ్యవస్థ ఉండాలని నిర్ణయించుకుంటే, సంబంధిత నియమాలు, నిబంధనలను రాసుకోవాలి.
  3. ఆ తరువాత చెక్‌యూజర్లుగా ఉండేందుకు ఎవరు ముందుకొస్తారో చూడాలి, కనీసం ఇద్దరు రావాలనేది నియమం
  4. వారికి చెక్‌యూజరు అనుమతి ఇచ్చేందుకు సముదాయం చర్చించి ఆమోదించాలి. కనీసం 20 వోట్లు+మొత్తం పోలైన వోట్లలో 70% రావాలి.
  5. ఆమోదించిన ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పేర్లను స్టీవార్డులకు చెబుతాం
  6. స్టీవార్డులు వారికి చెక్‌యూజరు అనుమతులను ఇస్తారు.

అభిప్రాయాలు

మార్చు

వాడుకరులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను కింద రాయవలసినది.

  1. వికీలో నిరోధాలు విధించినప్పుడు ఈ సాక్ పప్పెట్లు పుట్టుకొస్తున్నాయి.పైన వివరించిన విషయాలనుబట్టి, చెక్‌యూజర్లు వ్యవస్థ ఉండాలని నేను భావిస్తున్నాను.దీనికి నేను అంగీకరిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:39, 25 అక్టోబరు 2023 (UTC)Reply
  2. .

చదువరి (చర్చరచనలు) 01:32, 24 అక్టోబరు 2023 (UTC)Reply

వికీపీడియాలో ఉండాల్సిన వ్యాసాలను కోరే (పొందుపరిచే) పేజీ

మార్చు

@యర్రా రామారావు గారూ, వికీపీడియా:కోరుచున్న_వ్యాసములు పుటను ఇందుకు వాడుకోవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 04:48, 28 జనవరి 2024 (UTC)Reply

ఇది ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం కాదు.ఇలాంటి విషయాలు నేరుగా సంబందిత వాడుకరి చర్చాపేజికి రాయవచ్చు. యర్రా రామారావు (చర్చ) 04:15, 19 మార్చి 2024 (UTC)Reply

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు

మార్చు

తెలుగు వికీపీడియాలో నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి పేజీనొకదానిని సృష్టించబడింది. తెవికీలో నిర్వాహకత్వ బాధ్యతలు పొందుటకు నిర్వర్తించవలసిన బాధ్యతలు, మార్గదర్శకాలు, ప్రతిపాదనల విధానం మొదలగు విషయాలు గురించి సుమారు 15 సంవత్సరాలపై క్రిందట 2005 నుండి 2008 మధ్య తయారుచేయబడినవి. అవి ఇప్పటి పరిస్థితులకు చాలావరకు అనువుగా లేవు. కొన్ని సందిగ్ధంగా ఉన్నవి. వాటిలో కొన్నిటిని ఇప్పటి పరిస్థితులకు అనువుగా మార్చుటకు, కొన్ని కొత్త మార్గదర్శకాలు, బాధ్యతలు మొదలగు విషయాలు చేర్పు అవసరముందని భావించి, పైవాటిని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గదర్శకాలు ప్రతిపాదించటమైనది. తెవికీలో నిర్వాహకుల చురుకుదనం కొరతపై, విశాఖలో జరిగిన తెవికీ పండగ-2024లో చర్చకు వచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు. పాత వాటిలో కొన్నిటిని సవరణలతో, కొన్ని కొత్త మార్గదర్శకాలతో పొందుపర్చి తగిన విధానాలపేజీ అనేది ఒకటి ఉండాలనే అభిప్రాయంతో ఈ పేజీ తయారుచేయబడింది. వీటివలన నిర్వహాకత్వం మంచివాతావరణతో ఉండి, తెవికీ మరింత అభివృద్ధికి దోహదపడగలదని భావించటమైనది.కావున సముదాయ సభ్యులు నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు అనే ఆ పేజీలోకి వెళ్లి అక్కడ వాటిని కూలంకషంగా పరిశీలించి ఈ రోజు నుండి 2024 మార్చి 31 లోపు తగిన అభిప్రాయాలు, సూచనలపై స్పందించవలసినదిగా కోరటమైనది. యర్రా రామారావు (చర్చ) 04:42, 19 మార్చి 2024 (UTC)Reply

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలకు పేజీ తయారుచేసినందుకు ధన్యవాదాలు @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:25, 19 మార్చి 2024 (UTC)Reply

నిర్వాహకత్వం మార్గదర్శకాలు ప్రతిపాదనలలో మధ్యంతర ప్రతిపాదనలు

మార్చు

నిర్వహణ హక్కులు లేనంతమాత్రాన నిర్వహణ పనులు చాలా చేయవచ్చు. నిర్వహణాధికారం లేకుండా, ప్రతిపాదన అక్కరలేకుండా "నిర్వహణ బడి" అన్న ఒక ప్రాజెక్టును స్థాపించి, అందులో నమోదుచేసుకున్న ప్రతీ వాడుకరితోనూ ప్రత్యేకాధికారాలు అక్కరలేని నిర్వహణ పనులు చేయించి (నోటీసులు పెట్టడం, చర్చల్లో పాల్గొనడం, విధానాలు ప్రతిపాదించడం, వగైరా) వారు మరింత మెరుగైన నిర్వాహక ప్రతిపాదన చేసుకునేలా, నిర్వాహకులు కాకుండానే నిర్వాహణ సంబంధమైన పనులు ఏమిటి అనే విషయమై స్పష్టమైన అవగాహన ఏర్పడి, ఎవరినీ అడగకుండానే వాడుకరులు నిర్వాహక అభ్యర్థిత్వానికి సిద్ధం కావటానికి, "నిర్వహణ బడి" లో తమకు అవసరమైన సహాయం అందుకుని ప్రతిపాదనకు సన్నద్ధం కావటానికి, తగిన చర్యలలో భాగంగా గుర్తించిన అంశాలు నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు విధానపేజీలో చేర్చటానికి మధ్యంతర ప్రతిపాదనలు విభాగంలో ప్రతిపాదించబడినవి. కావున సముదాయసభ్యులు స్పందనలు తెలియజేయవలసినదిగా కోరటమైనది. యర్రా రామారావు (చర్చ) 15:54, 27 మార్చి 2024 (UTC)Reply

రాష్ట్ర శీర్షికలతో సంబంధం ఉన్న సందిగ్ధ వర్గాలపై చర్చ

మార్చు

రాష్ట్రాల శీర్షికలతో మొదలయ్యే కొన్ని వర్గాలు తెవికీలో రెండు రకాలుగా ఉన్నవి. అలా ఉన్నందువలన రాష్ట్ర శీర్షికను పరిగణనలోకి తీసుకోకుండా ఏమైనా కొత్త వర్గాలు సృష్టించేటప్పుడు ఎవరికి తోచినట్లు వారు రెండు లేదా మూడు రకాలుగా సృష్టింపు జరుగుతుంది. దీని వలన కొన్ని వ్యాసాలు ఒక రకం వర్గంలో, మరికొన్ని వ్యాసాలు ఇంకో రకం వర్గంలో చేరుతున్నాయి. బాగా పరిశీలించేవారికి గందరగోళపరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతమున్న కొన్ని రాష్ట్రాల శీర్షికలతో మొదలయ్యే ప్రధాన పేరుబరి పేజీలు, వర్గాలు ఇప్పుడు ఉన్న రాష్ట్ర శీర్షికలు మాదిరిగా కాకుండా అసోం (అస్సాం), ఉత్తర ప్రదేశ్ (ఉత్తరప్రదేశ్), పశ్చిమ బెంగాల్ (పశ్చిమబెంగాల్), ఒడిశా (ఒరిస్సా), మిజోరం (మిజోరాం), బ్రాకెట్లో చూపిన విధంగా, ఇక జమ్మూ కాశ్మీరును వివిధ రకాలుగా రాస్తున్నాం. గతంలో దీనిమీద జరిగిన ఈ చర్చలో ఎవ్వరూ స్పందించలేదు. వర్గాల తికమకను నివారించాలంటే ముందుగా రాష్ట్ర శీర్షికలపై ఒకసారి సముదాయం చర్చించి నిర్ణయం చేయవలసిన అవసరముంది. ఒకసారి దీనిమీద సమగ్ర చర్చ ఉంటే కొత్తవారకి సందిగ్థం ఉండదని బావించి, ఇంకా పై విషయాలను దృష్టిలో పెట్టుకుని సముదాయ సభ్యులు చర్చించటానికి రాష్ట్ర శీర్షికలతో సంబంధం ఉన్న సందిగ్ధ వర్గాలపై చర్చ పేజీ నొకదానిని ఇక్కడ తయారుచేసి ఈ ప్రతిపాదనలు తీసుకురావటమైనది. ఈ లింకులో మీ అభిప్రాయాలు తెలుపవలసినదిగా కోరటమైనది. ఈ చర్చ ప్రకారం సంబందిత వర్గాలు, ప్రధాన పేరుబరి వ్యాసాలు ఏకరూపతగా సవరించాలిసిన అవసరముంది. యర్రా రామారావు (చర్చ) 04:59, 28 సెప్టెంబరు 2024 (UTC)Reply

"ఉత్తరప్రదేశ్", "మధ్యప్రదేశ్" పేర్లతో ఉన్న వర్గాలను ఈమధ్య "ఉత్తర ప్రదేశ్", "మధ్య ప్రదేశ్" పేర్లతో మార్చాను. జమ్మూ కాశ్మీర్/జమ్మూ కాశ్మీరు, అసోం/అస్సాం, పశ్చిమ బెంగాల్/పశ్చిమబెంగాల్, మిజోరం/మిజోరాం వగైరాలను మార్చాల్సి ఉంది. __ చదువరి (చర్చరచనలు) 08:28, 30 సెప్టెంబరు 2024 (UTC)Reply