సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015 సినిమా)

భారతీయ సినిమా

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా, సాయి ధరమ్ తేజ్, రెజీనా, అదా శర్మ, బ్రహ్మానందం, సుమన్ తదితరులు నటించారు. సంగీతం మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం సి.రాంప్రసాద్ అందిచాడు.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
దర్శకత్వంహరీష్ శంకర్
రచనహరీష్ శంకర్ (మాటలు)
స్క్రీన్ ప్లేరమేష్ రెడ్డి
సతీష్ వేఘ్నేష
కథహరీష్ శంకర్
నిర్మాతదిల్ రాజు
తారాగణంసాయి ధరమ్ తేజ్
రెజీనా
ఛాయాగ్రహణంసి. రాంప్రసాద్
కూర్పుగౌతమ్ రాజు
సంగీతంమిక్కీ జె. మేయర్
రాజ్-కోటి (రీమిక్స్)
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2015 సెప్టెంబరు 24 (2015-09-24)
సినిమా నిడివి
152 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

తారాగణం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. ఈ చిత్రానికై రాజ్-కోటి స్వరకల్పనలో విడుదలైన ఖైదీ నెం.786 చిత్రంలోని గువ్వా గోరింక పాటని రీమిక్స్ చేశారు. పాటలని శిల్పకళా వేదికలో మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఆదిత్యా మ్యూజిక్ ద్వారా 2015 ఆగస్టు 23న విడుదల చేశారు.[2][3]

పాటల పట్టిక
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సుబ్రహ్మణ్యం ఫర్ సేల్"వనమాలిరాహుల్ నంబియార్3:57
2."అయామ్ ఇన్ లవ్"వనమాలిఐశ్వర్య మజ్ముదార్, ఆదిత్య3:54
3."ఆకాషం తస్సదియ్య"భాస్కరభట్ల రవికుమార్కృష్ణ చైతన్య, రమ్య బెహరా3:47
4."గువ్వా గోరింక (రీమిక్స్)"భువనచంద్రమనో, రమ్య బెహరా4:21
5."తెలుగంటే"చంద్రబోస్శంకర్ మహదేవన్4:05
Total length:20:51

మూలాలు మార్చు