బాల సాహిత్యం

(బాలల సాహిత్యం నుండి దారిమార్పు చెందింది)

బాలల సాహిత్యాన్ని నిర్వచించడం చాల క్లిష్టమైన పని. ఎందుకంటే 2 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వారినందరినీ బాలల కిందే పరిగణిస్తారు. భిన్న వయస్సు కల బాలలు భిన్న రకాలైన పుస్తకాలను చదువుతారు. ఉదాహరణకి 2 సంవత్సరాల పిల్లలు చిత్రపటాలు చూస్తూ భాషను నేర్చుకోవదానికి ప్రయత్నం చేస్తారు. కానీ టీనేజి పిల్లలు కాల్పనిక సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడతారు. సాధారణంగా బాలల కోసం వ్రాయబడిన, ప్రచురితమైన సాహిత్యాన్ని బాల సాహిత్యంగా నిర్వచించవచ్చు.

చందమామ పత్రిక
బాల భారతి
బాలమిత్ర

తెలుగు భాషలో బాలసాహిత్యం

మార్చు

పాల్కురికి సోమనాథుని బసవపురాణంలోని బాల్యం వర్ణనను బాలసాహిత్యంగా చెప్పవచ్చు. నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, మొదలైన కవులు కూడా తమ రచనల్లో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. సుమతి శతకం, వేమన శతకం తదితర శతకాలలో కూడా బాల సాహిత్య ఛాయలు కన్పిస్తాయి.

మహాభారతం, రామాయణం, బసవపురాణం, కేయూర బాహు చరిత్ర. పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు మనకు కనిపిస్తాయి. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నది. బాలసాహిత్యం పురోగతి సాధించినది. గేయ, పద్య, గద్య, రూపాలలో బాల సాహిత్యం కన్పిస్తున్నది. చిన్నయ సూరి నీతిచంద్రికలో కథలుగా వ్రాశాడు. కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారు. నీతి దీపిక, నీతి కథ మంజిరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయి. ఆధునికంగా మర్యాదరామన్న కథలు అక్బర్ బీర్బల్ కథలు మొదలైన కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.

కొందరు ప్రముఖ బాల సాహిత్యకారులు

మార్చు
  1. గురజాడ అప్పారావు
  2. గిడుగు వెంకట సీతాపతి
  3. చింతా దీక్షితులు
  4. దాశరథి
  5. సినారె
  6. వేముగంటి నరసింహాచార్యులు
  7. వెలగా వెంకటప్పయ్య
  8. అబ్దుల్ హకీం జాని షేక్
  9. ఉత్పల సత్యనారాయణాచార్య
  10. ముళ్ళపూడి వెంకటరమణ
  11. కె.రామలక్ష్మి
  12. పాయల సత్యనారాయణ,
  13. పెండెం జగదీశ్వర్
  14. మలయశ్రీ,
  15. బెహరా ఉమామహేశ్వరరావు,
  16. ఐతా చంద్రయ్య,
  17. ఎన్నవెళ్లి రాజమౌళి,
  18. శివ్వాల ప్రభాకర్,
  19. బెలగాం భీమేశ్వరరావు,
  20. పెందోట వెంకటేశ్వర్లు,
  21. ఉండ్రాళ్ల రాజేశం,
  22. అమ్మన చంద్రారెడ్డి,
  23. వేజేండ్ల సాంబశివరావు,
  24. అలపర్తి వెంకటసుబ్బారావు,
  25. బీవీ నర్సింహారావు,
  26. పెమ్మరాజు సావిత్రి,
  27. అవధాని రమేశ్,
  28. నీలకంఠ పాండురంగం,
  29. నార్ల చిరంజీవి,
  30. మిరియాల రామకృష్ణ,
  31. నాసరయ్య, సుధానిది,
  32. మహీదర నళినీమోహన్,
  33. కె.సభా,
  34. న్యాయపతి రాఘవరావు,
  35. రెడ్డి రాఘవయ్య,
  36. దాసరి వెంకటరమణ,
  37. ఎం. హరికిషన్,
  38. చొక్కపు వెంకటరమణ,
  39. నారంశెట్టి ఉమామహేశ్వరరావు,
  40. బెల్లంకొండ నాగేశ్వరరావు,
  41. పైడిమర్రి రామకృష్ణ,
  42. వేదాంత సూరి,
  43. భూపాల్,
  44. వాసాల నర్సయ్య,
  45. అమ్మిన శ్రీనివాసరాజు
  46. ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి
  47. కాశీవిశ్వనాధం పట్రాయుడు
  48. జాని తక్కెడశిల
  49. ఏడుకొండలు కళ్ళేపల్లి,
  50. కళ్ళేపల్లి తిరుమలరావు
  51. వేంపల్లె షరీఫ్ (తియ్యని చదువు కథలు)
  52. కూచిమంచి నాగేంద్ర (అసలే కోతి (బాలల కధలు) చుక్కల లోకం ( బాల గేయాలు )

మొదలైన వారు గేయాలు, కథలు, వ్యాసాలు, నాటికలు మొదలైన ప్రక్రియలలో బాలసాహిత్యాన్ని రచించారు. దాదాపు అన్ని పత్రికలలు బాలలకోసం ప్రత్యేకమైన శీర్షికలను నడుపుతున్నాయి. బాల, బాలమిత్ర, చందమామ, జాబిల్లి, బుజ్జాయి, బాలభారతి, బాబు మొదలైన పత్రికలు ప్రత్యేకంగా పిల్లలకోసం వెలువడ్డాయి.

ఇవీచూడండి

మార్చు

అంతర్జాలంలో

మార్చు

స్టోరీవీవర్ జాలస్ఖలిలో చాలా భాషలలో పిల్లల పుస్తకాలు చదువుకోవటానికి, అనువాదం చేయటానికి, కొత్తవి తయారుచేయటానికి [1] అందుబాటులో ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "స్టోరీవీవర్". ప్రథమ్ ఫౌండేషన్. Retrieved 26 February 2016.

వెలుపలి లంకెలు

మార్చు

కాశీ విశ్వనాధం పట్రాయుడు (2020-03-02). "బాలసాహిత్యంలో కాల్పనిక కథ పాత్ర". ఆంధ్రభూమి దినపత్రిక సాహిత్యం.

కాశీ విశ్వనాధం పట్రాయుడు (2020-05-03). "బాలసాహిత్యంలో బాలగేయాల పాత్ర". ప్రజాకాంక్ష దినపత్రిక మిణుగురు.