మచిలీపట్నం

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలం లోని పట్టణం
(మచిలీపట్టణము నుండి దారిమార్పు చెందింది)

మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ముఖ్య తీర నగరం. దీనిని బందరు అని కూడా పిలుస్తారు.మసూలిపట్నం లేదా మసూల అని పూర్వం పిలిచెవారు. ఈ పట్టణానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రత్యేక పురపాలక సంఘ స్థాయి కల్పించబడింది. ఈ పట్టణం చరిత్ర 3 వ శతాబ్దం శాతవాహనుల కాలములో నుండి ఉన్నదని దానిని మైసలోస్ (టోలిమి) మసిలా (పెరిప్లస్) అని పిలిచేవారని తెలుస్తున్నది. తీరపట్టణం అవడం చేత 17 వ శతాబ్దములో బ్రిటీష్ వారు, ఫ్రెంచ్ వారు డచ్ వారు ఇక్కడ నుండి వర్తకం జరిపేవారు. 350 పడవలు పట్టే సన్నకారు చేపల రేవు ఉంది. ఈ పట్టణం కలంకారీ అద్దకం పనికి (కూరగాయల నుండి తీసిన రంగుల), తివాచీలకు, బందరు లడ్డు లకి ప్రసిద్ధి.[1][2][3]బందర్ మసాలాకు మచిలిపట్నం ప్రసిద్ధి చెందింది

మచిలీపట్నం

మాసులిపట్టణం, మాసుల, బందర్
కోనెరు సెంటర్, మచిలీపట్నం
కోనెరు సెంటర్, మచిలీపట్నం
దేశంభారత దేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
స్థాపన14th century
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంమేయర్
 • నిర్వహణమచిలీపట్నం నగరపాలక సంస్థ
 • శాసనసభ సభ్యుడుకొల్లు రవీంద్ర (తెలుగుదేశం పార్టీ )
 • మునిసిపల్‌ కమీషనర్‌ఎ.ఎస్.ఎన్.వి.మారుతి దివాకర్
విస్తీర్ణం
 • మొత్తం26.67 కి.మీ2 (10.30 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
14 మీ (46 అ.)
జనాభా
(2011)
 • మొత్తం1,69,892
 • సాంద్రత6,875/కి.మీ2 (17,810/చ. మై.)
భాష
 • అధికారతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
521 xxx
ప్రాంతీయ ఫోన్‌కోడ్91-8672
వాహనాల నమోదు కోడ్AP-16
జాలస్థలిmmc.ind.in

మరియు బందర్ బాధమ్ మిల్క్,బందర్ హల్వా ప్రసిద్ధి చెందింది. ఒంగోలు, మచిలీపట్నం మధ్య నున్న తీర ప్రాంతం తరచు తుఫాను, వరదల బారిన పడుతుంటుంది. బియ్యము, నూనె గింజలు, బంగారపు పూత నగలు(Gold Plating or Rold Gold), వైజ్ఞానిక పరికరాలు ఇక్కడి ఇతర ఉత్పత్తులు.

Bel Company (భారత్ ఎలక్ట్రానిక్స్)

కేంద్ర ప్రభుత్వ భారత్ ఎలక్ట్రానిక్స్ (బెల్) సంస్థ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఉంది.

Industrialists (పారిశ్రామికవేత్తలు)

Chalamalasetty Anil, MD And Owner Of Greenko Energies Private Limited.

Divi Murali, Founder Divi's Laboratories Pvt Ltd.

Movie Halls (సినిమా థియేటర్లు)

Minerva Talkies (Permanently Closed)

Brundhavan Talkies (Permanently Closed)

Sri Rama Raju AC Theatre

Vinayak Theatre (Permanently Closed)

Lakshmi Talkies (Permanently Closed)

Sri DurgaMahal (

Permanently Closed)

Nataraj Picture Palace

Sri Venkateshwara Theater (Permanently Closed)

Urvashi Theater (Permanently Closed)

Radhika Picture Palace (Permanently Closed)

Revathi Picture Palace Ac Dolby Atmos

Mini Revathi Ac Dolby Atmos

Sri Ramshanti Talkies(Permanently Closed)

G3 Siri Krishna Ac Theatre

G3 Siri Venkat Ac Theatre

Railway Stations

Machilipatnam Have Two Railway Stations

One Is Machilipatnam Railway station

It has four platforms

It was opened on 4 Feb 1908

Another One Is Chilakalapudi Railway Station

It has two platforms.

Public Places

Manginapudi Beach,

Sri M Venkata Swamy Naidu Muncipal Park.

3-Star Hotels

RK Family Restaurant

Rk Paradaise

Vani

Teja's RS Family Restaurant

Kalyana Mandirs (కళ్యాణ మందిరాలు)

Suvarna Kalyana Mandhir

TTD Kalyana Mandapam

Rice Millers Association Function Hall A/c

Maha Siri Kalyana Mandapam A/c

Siri Kalyana Mandapam A/c

Suma Convention Hall A/c

Revenue Kalyana Mandapam A/c

Veduka Function Hall A/c

Gayatri Function Hall A/c

S Convention Hall A/c

SreePada Function Hall A/c

Sri Vasavi Function Hall A/c

Police Welfare Function Hall

Tiffin Hotels

Ganesh Bhavan

Lakshmi Talkies Canteen

Satyam Hotel And Cool Drinks

Sip N Sip Hotel

Rch Hotel

Rch Tiffin Center

RK Good Times

Main Road Centers (ప్రధాన రహదారి కేంద్రాలు)

Moodu Sthambala Center

Chalarastha Center

Koneru Center

Nagapotharao Center

Chinthachetu Center

Inugudurupeta

Khalekhanpeta

Raja vari Center

Five Roads Center

Revathi Center

Ramanaidupeta

Bus Stand Center

Zilla Court Center

Lakshmi Talkies Center

Zilla Parishad Center

Chilakalapudi Center

Moodu Gudulu Center

Parasupet Center

Dimmala center

చరిత్రసవరించు

బందరుకి మచిలీపట్నం అన్న పేరు రావటానికి వెనుక కథ ఒకటి ఉంది. సముద్రపుటొడ్డున ఉన్న కోట ద్వారం దగ్గర ఒక చేప విగ్రహం ఉండేది. అందుకని ఈ ఊరికి మచిలీపట్నం అన్న పేరొచ్చిందంటారు. 'మచిలీ' అంటే హిందీ భాషలో చేప, పట్నం అంటే పెద్ద ఊరు. తెలుగు దేశంలో పట్టణం అనేది సర్వసాధారణంగా సముద్రపు ఒడ్డున ఉన్న రేవులకే వాడతారు. ఉదాహరణకు చెన్నపట్నం, విశాఖపట్టణం, భీమునిపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం మొదలైనవి. పట్నంతో ముగిసే పేర్లు కల ఊళ్ళు అన్ని తూర్పుకోస్తాలో ఉన్నాయి. నర్సీపట్నం మినహాయించి..

1659 లో బ్రిటిషు వారు ఫ్రెంచివారిని మసూలిపటం ముట్టడిలో ఓడించి, వారి స్థావరాన్ని ఆక్రమించారు.

1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీవారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో విశాఖపట్టణం కూడా ఒకటిగా ఉండేది.[4] ఈ పట్టణానికి మచిలీపట్నం, అనీ బందరు అనీ మాత్రమే కాక పూర్వం మచిలీ బందరనే పేరు కూడా వ్యవహారంలో ఉండేది.

గ్రామ భౌగోళికంసవరించు

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తులో ఇంది. సమయ మండలం :భారత ప్రామాణిక కాలమానం (యుటిసి+5:30) [5]

సమీప గ్రామాలుసవరించు

పెడన, గుడివాడ, రేపల్లె.

సమీప మండలాలుసవరించు

పెడన, గూడూరు, ఘంటసాల, గుడ్లవల్లేరు

పట్టణంలో విద్యా సౌకర్యాలుసవరించు

 • నోబుల్ కాలేజి
 • హిందూ కాలేజి
 • నేషనల్ కాలేజి
 • లేడీ యాంప్తెల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల.
 • సరస్వతీ ప్రాథమికోన్నత పాఠశాల:- విద్యను ఉచితంగా అందించవలెనను ఉద్దేశంతో, సర్కిల్‌పేటలోని ఈ పాఠశాలను, శ్రీ వేదాంతం యోగానందనరసింహాచార్యులు, 1928లో, ఏర్పాటుచేసారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలయిన చిన ఉల్లంగిపాలెం,పెద ఉల్లంగిపాలెం, ఎస్.సి.వాడ, రెల్లికాలనీ, ఫతులాబాద్, జలాల్‌పేట, తదితర ప్రాంతాలకు చెందిన 150 మంది విద్యార్థులు, ప్రస్తుతం ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. [23]
 • Daita Madhusudhana sastry Svh Engineering College (Estd 1981),Machilipatnam
 • Krishna University

రవాణా సౌకర్యాలుసవరించు

మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 73 కి.మీ

మచిలీపట్టణం నుండి దగ్గర, దూర అన్నిప్రాంతాల‌కు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యములు ఉన్నాయి.

మచిలీపట్నం నుండి భీమవరం, రాజొలు, నర్సాపురం, విశాఖపట్నం, రాజ‌మండ్రి, బెజవాడ, తిరుపతి, బెంగుళూరు, హైదరాబాదు, మచిలీపట్నంతోపాటు తెలుగు రాష్ట్రాల‌లో దాదాపు అన్ని ప్రాంతాల‌కు బ‌స్సు, రైల్వే స‌దుపాయం ఉంది.

ఈ పట్టణం నుండి దాదాపుగా 60-65 కి.మీ. దగ్గరలో గన్నవరం విమానాశ్రయము ఉంది.

Machilipatnam To Pune National Highway

ప్రముఖ వ్యక్తులుసవరించు

Thota Narsayya Naidu(Freedom Fighter)

మచిలీపట్నాన్ని మసుల అనీ మససోలియ అని గ్రీకు రచయితలు రాసారు. థీని అసలు పేరు మహాసాలిపట్నమ్. అథే మహాసలిపట్నమ్,మసిలిపట్నమ్ , మచిలిపట్నమ్ గాను కాలక్రమంలో మార్పు చెందింది. ఇక్కడినుండి రోము నగరానికి సన్ననేత వస్త్రాలు ఎగుమతి అయ్యేవి. ఇది సాలీలు నివాసం. ఆదే దాని అసలుపేరు.

కలంకారి అద్దకం , ఇతర కళలుసవరించు

మచిలీపట్నపు కలంకారీ వస్తువులు ప్రసిద్ధి చెందినవి. దుస్తులు, తివాచీలు, గోడకు వేలాడతీసే వస్తువులు (వాల్ హేంగింగ్స్) మొదలైనవి కలంకారీ చేసే వస్తువులలో ముఖ్యమైనవి. కలంకారీ అనేది ఒక విధమైన అద్దకము పని. కలంకారీ అనే పేరు కలం అనే పర్షియన్ పదం నుండి వచ్చింది. కలం అంటే ఒక రకమైన పెన్ను. వెదురు బొంగుకి చివర ఖద్దరు గుడ్డ చుట్టి దానితో దుస్తుల మీద కాని తివాచీల మీద కాని రంగులు పులుముతారు. ఈ రంగులు నూనెగింజల నుండి లేదా కూరగాయల నుండి తయారు చేస్తారు. ఈ కలంకారీ పనిలో ఉతకడం, పిండడం, నానబెట్టడం, చలువ చేయడం (బ్లీచింగ్), కొన్ని మోడరెంట్లు, రంగులు కలపడం చేస్తారు.

నీలం రంగుకు నీలిమందు, ఎరుపు కొరకు మంజిష్ఠ, పసుపుపచ్చ కోసం మామిడి చెక్క, ఎండు కరక్కాయ, నలుపురంగు కోసం తాటిబెల్లం, తుప్పుపట్టిన ఇనుములను ఉపయోగిస్తారు. ఈ అద్దకము అనేక రోజులపాటు సాగే పెద్ద ప్రక్రియ. కొన్ని చిన్న భాగాలు చేత్తో గీసినా, విస్తారమైన పెద్ద వస్తువులను అచ్చుతో అద్దుతారు. పౌరాణిక కథలు, పాత్రలు చిత్రించబడి గోడకు వేళ్ళాడదీసుకొనే వస్తువుల తయారీకి కాళహస్తి పేరుపొందినది. అదే విధంగా మచిలీపట్నం, చీరలలో ఉపయోగించే అచ్చుతో అద్దిన పెద్ద వస్తువులకు పెట్టింది పేరు. మచిలీపట్నంలో అచ్చులతోనూ, చేతితోనూ వేసే అద్దకం పనిలో పూలూ, మొక్కల డిజైన్లతో ఎంతో అందంగా ఉంటాయి. ఈ అద్దకం పనులు స్థానిక పాలకుల ఆదరం పొందడమే కాక, బాగా ఎగుమతి కూడా అయ్యేవి. ఈ ఎగుమతులు మచిలీపట్నంపై ఐరోపా వర్తకులకు మోజు కలిగించాయి.

బందరు లడ్డుసవరించు

బందరులో 150 సంవత్సరాల క్రితం స్ధిరపడిన సింగుల కుటుంబాలు బందరు లడ్డుల సష్టికర్తలుగా చెపుతారు. బొందిలీలు అని కూడా పిలచే సింగుల కుటుం బాలు బందరులో ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. వీరిలో ఎవరు ఇప్పుడు ఈ లడ్డుల తయారీలో కానీ, ఈ వ్యాపారంలో కానీ లేరు. ఆ కుటుం బాల వద్ద పనిచేసి లడ్డు తయారీ నేర్చు కున్న ఒకటి రెండు కుటుంబాలలో ఒక కుటుంబం ఇప్పటికీ ఆ వ్యాపారాన్ని విడచిపెట్టలేదు. అందుకే బందరు లడ్డు అనగానే బందరులో ఠక్కున శిర్విశెట్టి సత్యనారాయణ కేరాఫ్‌ తాతారావు పేరు చెపుతారు. తాతారావును ఇప్పటికీ మిఠాయి కొట్టు తాతారావుగా పిలుస్తుంటారు. గత 50 ఏళ్లుగా ఆయన ఈ వ్యాపారంలో ఉన్నారు.బందరు లడ్డును తొక్కుడు లడ్డూ అని కూడా అంటారు. స్వచ్ఛమైన శనగపిండి నుండి ముందు పూస తీస్తారు. దాని నాణ్యతలో ఎక్కడా రాజీలేకుండా ఘుమఘు మలాడే అతి స్వచ్ఛమైన నేతితో వేయించి ఆ తరువాత దంచుతారు. దాన్నలా ఉంచి సరైనపాళ్లలో బెల్లం పాకం తయారు చేస్తారు. ఆ పాకాన్ని దంచుతున్న పొడిలో పోస్తూ తొక్కుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి సుమారు 9 గంటలు పడుతుంది. సరైన పక్వానికి వచ్చిన దశలో యాల కులు, పటికబెల్లం చిన్నచిన్న ముక్కలుగా చేసి కలిపి ఆ తరువాత లడ్డూలుగా చుడతారు. ఆ విధంగా తయారైన లడ్డూ 20 రోజులపాటు నిల్వ ఉంటుం ది. ఈ లడ్డులో ఎటువంటి రంగు, రసాయనాలు కలుపరు.

సాహిత్య సంస్థలుసవరించు

"సాహితీమిత్రులు" పేరుతో మినీకవిత పితామహుడు రావి రంగారావు వ్యవస్థాపకాధ్యక్షుడిగా గత 30 సంవత్సరాలనుండి ఈ సంస్థలో కృషిచేస్తున్నాడు. ఇప్పటివరకు సంస్థ పక్షాన 62 పుస్తకాలు ప్రచురించబడ్డాయి.. 2000లో శతావధానం, 2001లో ద్విశతావధానం, కవిత్వశిక్షణ వర్కుషాపులు అనేకం నిర్వహించబడ్డాయి.. ఎందరొ కళాకారులకు, సంగీత విద్వాంసులకి పుట్టినిల్లు బందరు.

శాసనసభ నియోజకవర్గంసవరించు

బ్యాంకులుసవరించు

ఇక్కడ ఆంధ్రా బ్యాంకు, వైశ్యాబ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంకులు ఉన్నాయి

పంజాబ్ నేషనల్ బ్యాం,క్ ్ బ్యకృషవ్ బ్యాంక్కో ఆపరేటివ్ బ్యాంక్కృష్కకృషణ కో ఆపరేటివ్ బ్యాంక్ృష్ణ కో ఆపరేటివ్ బ్యాంక్ణ కో ఆపరేటివ్ బ్యాంక్కృష్ణ కో ఆపరేటివ్ బ్యాంక్ కులు ఉన్నాయి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

 
మచిలీపట్నం సాయిబాబా మందిరం
 
మచిలీపట్నం బీచ్ వద్ద సూర్యోదయం
 • మంగినపూడి బీచ్ మచిలీపట్నానికి 11 కి.మీ. దూరంలో ఉంది. బెస్తవారు ఉండే చిన్న గ్రామమిది. ఇక్కడి బీచ్ లో ఇసుకకి బదులుగా నల్లటి మన్ను ఉంటుంది. విదేశీయులకు తూర్పు తీరానికి చేరడానికి ఇది ముఖ ద్వారముగా ఉండేది. ఇక్కడి బీచ్ లో సముద్రము లోతు తక్కువగా ఉంటుంది. ఈ బీచ్ లో ఉన్న నాట్య పాఠశాలలో నృత్య విద్యార్థులకు కూచిపూడి నృత్యము నేర్పిస్తున్నారు. ఇక్కడ తీరములో ఉన్న దత్తాశ్రమము ఒక పుణ్యక్షేత్రము, తీర్థ స్థలము. దీనిని దత్తరామేశ్వరము అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న శివాలయం చాలా పురాతనమైనది. రామేశ్వరములో ఉన్నట్లుగా ఇక్కడ మంగినపూడిలో పన్నెండు బావులు నక్షత్ర  ఆకారం లో ఉంటాయి. అంతే కాదు ఒక్కొక్క బావిలో నీరు ఒక్కొక్క రుచిలో ఉంటాయంటారు.[6] అందువలన దీనిని దత్తరామేశ్వరము అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమికి ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్నానము చేస్తారు.
 • శ్రీ పాండురంగస్వామి దేవాలయం:- మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న చిలకలపూడి లో ఈ పాండురంగస్వామి దేవాలయం ఉంది. ఇది మంగినపూడి బీచ్కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడి దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు. పండరీపురములో ఉన్న దేవాలయము వలే ఇక్కడ దేవాలయము ఉంటుంది. ఈ దేవాలయ ప్రాకారం చాలా విశాలంగా ఉంటుంది. అంతరాలయములోనున్న పాండురంగడి నల్లరాతి విగ్రహం, గర్భగుడి బయటవున్న పాలరాతి అమ్మవార్ల విగ్రహలు చూపరులను భక్తిభావముతో కట్టిపడెస్తాయి. భక్తులు పాండురంగడిని అరాధించి, పటికబెల్లం నైవేద్యముగా సమర్పిస్తారు.
 • శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం. పరసుపేట లో ఉన్న ఈ దేవాలయం చాల పురాతనమైనది . దేవాలయం లో అనేక మంది భక్తులు విచ్చేసి తమ ఉన్నతి ని పొందుతున్నారు
 • శ్రీ భద్రాద్రి రామాలయం. రేవతి సెంటర్ లో ఉన్న ఈ దేవాలయం చాల పురాతనమైనది . దేవాలయం లో అనేక కార్యక్రమాలు జరుగును
 • శ్రీ దత్త ఆశ్రమం : మైసూర్ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చ్చిదానంద స్వామిజి వారిచే ప్రతిష్టించబడిన దత్తాత్రేయ అవతారములైన శ్రీ నరసింహ సరస్వతి  పాదుకలను ఈ ఆశ్రమం నందు ప్రతిష్టించారు . ఆశ్రమoలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ షోడశ రూపములైన ఒకరు శ్రీ అనఘా దేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు.  బందరు బస్టాండు నుంచి 1 km లోపలే నే చేరుకోవచ్చును .
 • శ్రీ జగన్నాధస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, 2015,మే-31వ తేదీ ఆదివారం నుండి ప్రారంభమైనవి. తొలిరోజున స్వామి, అమ్మవారలను వధూవరులుగా అలంకరించి, సహస్రనామార్చన, తదితర పూజలు నిర్వహించారు. [10]
 • బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయం, మచిలీపట్టణం పరిధిలోని నిజాంపేటలో ఉంది.
 • శ్రీ సంతానవేణుగోపాలస్వామివారి ఆలయం:- మచిలీపట్టణం పరిధిలోని సర్కిల్ పేటలో కొలువైయున్న ఈ ఆలయానికి 150 సంవత్సరాల చరిత్ర ఉంది. సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేసినచో సంతానం కలుగుతుందని ప్రతీతి. పట్టణ ప్రజలతోపాటు, పలు ప్రాంతాలకు చెందిన భక్తులు గూడా ఇక్కడ పూజలు నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం జరిపే ఉత్సవాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించెదరు. ఇటీవల ఈ ఆలయ ప్రాంగణంలో పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం నిర్మించారు. సర్కిల్‌పేటలో ఉన్న ఆలయాలలో ఇది ప్రత్యేకమైనది. [22]
 • శ్రీ కోదండ రామాలయం :- స్థానిక జగన్నాధపురంలోని ఈ ఆలయంలో 2015,నవంబరు-29వ తేదీ ఆదివారంనాడు, శ్రీ సీతా,హనుమ,లక్ష్మణ సమేత శ్రీరాముని పాలరాతి విగ్రహాలను, పలువురు వేదపండితుల ఆధ్వర్యంలో, వేద మంత్రాల నడుమ, వైభవంగా ప్రతిష్ఠించారు. ప్రత్యేక హోమాలు, విశేషపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొనడానికి భక్తులు పోటెత్తినారు. రామనామ జపంతో ఆ ప్రాంతం అంతా హోరెత్తిపోయునది. వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. [11]
 • శ్రీ కోదండ రామాలయం కాలేఖాన్ పేట.
 • శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం",రాబర్ట్ సన్ పేట.
 • శ్రీ పర్వతవర్ధనీ, రాజరాజేశ్వరీ సమేత 'శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం', రాబర్ట్ సన్ పేట
 • శివాలయం ఈ ఆలయం స్థానిక చెమ్మనగిరిపేట గాంధీ బొమ్మ వద్ద ఉంది.
 • శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం స్థానిక చమ్మనగిరిపేటలోని గాంధీబొమ్మ వద్ద గల శివాలయంలో ఉపాలయంగా ఉన్న ఈ అలయంలో 2016,మే-13వ తేదీ శుక్రవారంనాడు, ఈ ఆలయ 25వ వార్షికోత్సవాలు వైభవొపేతంగా ప్రారంభించారు. [17]
 • ఘంటసాల:- మచిలీపట్నానికి 21 కి.మీ. దూరములో ఉన్న ఈ గ్రామంలో పురాతన భౌద్ధ స్థూపాలు ఉన్నాయి. ఘంటసాల గ్రామంలో జలదీశ్వరుడి దేవాలయము ఉంది.
 • శ్రీ అగస్త్యేశ్వర దేవాలయము:- మచిలీపట్నానికి 36 కి.మీ. దూరములో ఉంది. శివాలయం. ఇక్కడ ప్రధాన దైవము ఏకరాత్రి మల్లికార్జున స్వామి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు విశేషముగా జరుగుతాయి.[7]
 • శ్రీ బాలత్రిపురసుందరీ సమేత శ్రీ నాగేశ్వరస్వామివారి ఆలయం ఖొజ్జిల్లిపేట.
 • శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయం, బ్రహ్మపురి.
 • కుసుమహరకోటి మందిరం స్థానిక సర్కిల్ పేటలోని ఈ మందిర నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా, 2015,డిసెంబరు-1వ తేదీ నాడు, రాధా భిన్నస్వరూపులైన కుసుమ హరనాథ్ లీలా కళ్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [12]
 • శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం స్థానిక బచ్చుపేటలో ఉన్న ఈ ఆలయ గాలి గోపురం, 2016,మే-29వ తేదీ ఆదివారం తెల్లవారుఝామున, పెద్ద శబ్దంతో కూడిన పిడుగు తాకిడికి, పాక్షికంగా ధ్వంసమైనది. [18]
 • త్రిశక్తి పీఠం, భాస్కరపురం.
 • శ్రీ ముత్యాలమ్మ తల్లి అలయం
 • శ్రీ దొంతులమ్మ తల్లి ఆలయం :- ఈ ఆలయ 85వ వార్షికోత్సవంలో భాగంగా, 2017,ఫిబ్రవరి-12వ తేదీ ఆదివారంనాడు, అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ గ్రామోత్సవంలో ఏర్పాటుచేసిన వివిధ కాళాకారుల ప్రదర్శనలు, పురజనులను ఆకట్టుకున్నవి. ఈ ఉత్సవాలు 19వతేదీ ఆదివారంతో వైభవంగా ముగిసినవి. [19]&[20]
 • శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం మచిలీపట్టణం పరిధిలో, జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళు దారిలో ఉన్న ఈ ఆలయం జీర్ణావస్థకు చేరడంతో, ఈ ఆలయాన్ని భక్తులు పునరుద్ధరించారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా, 2016,ఫిబ్రవరి-26వ తేదీ శుక్రవారంనాడు, పలువురు వేదపండితుల ఆధ్వర్యంలో హోమాలు నిర్వహించారు. 2016,మార్చ్-3వ తేదీ గురువారంనాడు వేద పండితుల ఆధ్వర్యంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. విగ్రహాలతోపాటు ఘటాలు, శిఖర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అనేకప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారికి వేడి, చలి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధనలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. [15]&[16]
 • శ్రీ నూతి వనలమ్మ తల్లి ఆలయం నిజాంపేటలో కొలువైయున్న ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-12వతేదీ ఆదివారంనాడు, అమ్మవారి నెలసంబరాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తమ తమ మొక్కులు తీర్చుకున్నారు. పలువురు భక్తులు కనకతప్పెటల కళాకారుల విన్యాసాలతో కూడిన ఊరేగింపులతో ఆలయానికి విచ్చేసారు. ఆలయం భక్తులతో క్రిక్కిరిసి పోయింది. [19]
 • శ్రీ శక్తి ఆలయం :- ఈడేపల్లి లోని ఈ ఆలయంలో, 2017,ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు ఆలయ 15వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కాళీమాత అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పట్టణం నుండియేగాక చుట్టుప్రక్కల గ్రామాల నుండి గూడా అధికసంఖ్యలో విచ్చేసారు. [21]

ఇతర విశేషాలుసవరించు

ఇక్కడి హిందూ కళాశాల , ఎందరో ప్రముఖులకు విద్యాదానం చేసింది.

బందరులో ఉన్న మరొక కళాశాల పేరు ఆంధ్ర జాతీయ కళాశాల. కోపల్లె హనుమంతరావు ఈ కళాశాల 1910 లో స్థాపించారు. ఈ కళాశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ రెండు సార్లు విడిది చేశారు. దీనిని నేషనల్ కాలేజి అని కూడా అంటారు. ఈ కాలేజికి అడవి బాపిరాజు మొదలైన మహానుభావు లెందరో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు.

ప్రముఖులుసవరించు

రవాణా సౌకర్యాలుసవరించు

రైలు వసతిసవరించు

 • గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77211
 • గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77235
 • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
 • గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77219
 • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
 • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
 • విశాఖపట్నం - మచిలీపట్నంpast ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57230

మూలాలుసవరించు

 1. "Preparation of Bandar Laddu". Archived from the original on 2007-09-29. Retrieved 2007-08-23.
 2. "Heralding spring". Archived from the original on 2006-05-13. Retrieved 2007-08-23.
 3. "Catering for the Sweet tooth". Archived from the original on 2006-06-26. Retrieved 2007-08-23.
 4. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
 5. "Machilipatnam Town". web.archive.org. 2017-06-08. Retrieved 2021-01-07.
 6. http://www.dattapeetham.com/india/festivals/birthday99/history.html దత్తపీఠం
 7. http://www.indianetzone.com/3/temples_krishna_district.htm

వెలుపలి లంకెలుసవరించు