మత్తేభ విక్రీడితము
(మత్తేభము నుండి దారిమార్పు చెందింది)
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.
మత్తేభము
మార్చునలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా
స భ ర న మ య వ
లక్షణములు
మార్చుస | భ | ర | న | మ | య | వ |
I I U | U I I | U I U | I I I | U U U | I U U | I U |
సి రి కిం | జె ప్ప డు | శం ఖ చ | క్ర యు గ | ముం జే దో | యి సం ధిం | ప డే |
- పాదాలు: నాలుగు
- ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య = 20
- ప్రతిపాదంలోని గణాలు: స, భ, ర, న, మ, య, వ
- యతి : ప్రతిపాదంలోనూ 14 వ అక్షరము
- ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
ఉదాహరణలు
మార్చుసవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా
నవలీలం దునుమాడె రాము డదయుండై బాలుడై కుంతల
చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్
జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకన్ దాటకన్.
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై