మహిళావరణం
"మహిళావరణం: Womanscape" అన్నది ఓల్గా, వసంత కణ్ణబీరన్, కల్పన కణ్ణబీరన్ ల సంపాదకత్వంలో 2001 లో వెలువడిన ఒక తెలుగు-ఆంగ్ల ద్విభాషా పుస్తకం. గత శతాబ్దంలో జీవించిన, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో వివిధ రంగాలలో కృషి చేసిన, స్త్రీల చరిత్ర చిత్రణల సంకలనం. దీనిని "అస్మిత రిసోర్స్ సెంటర్ వర్ వుమెన్" అన్న సంస్థ వారు ప్రచురించారు[1].
ఇందులో ఈ క్రింద పేర్కొనబడిన వారి గురించి తెలుగు-ఆంగ్లం రెండు భాషలలోనూ పరిచయ వ్యాసాలు ఉన్నాయి.
- కందుకూరి రాజ్యలక్ష్మి (1851-1910): స్త్రీ విద్య, వితంతు వివాహం, సంఘసంస్కరణ కోసం కృషి చేశారు. ఈమె కందుకూరి వీరేశలింగం పంతులు భార్య.
- సరోజినీ నాయుడు (1873-1949): "భారతకోకిల"గా పిలవబడే ఈమె ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు,కవయిత్రి.
- భండారు అచ్చమాంబ (1874-1905): తెలుగులో తొలి కథా రచయిత్రి.
- బెంగుళూరు నాగరత్నము (1878-1952): కర్ణాటక సంగీతంలో పేరెన్నిక గన్న గాయని.
- మార్గరెట్ కజిన్స్ (1878-1954): ఈమె ఐర్లండు నుండి భారతదేశం వచ్చి స్వాతంత్ర్యోద్యమంలో, మహిళోద్యమంలో పాల్గొంది. రచయిత్రి.
- దువ్వూరి సుబ్బమ్మ (1880-1964): స్వాతంత్ర్య సమరయోధురాలు.
- ఉన్నవ లక్ష్మీబాయి. (1882-1956): సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు.
- సుఘ్రా హుమాయున్ మిర్జా (1882-1958): కవయిత్రి, రచయిత్రి, పత్రికా సంపాదకురాలు.
- వింజమూరి వెంకటరత్నమ్మ (1888-1951): రచయిత్రి, పత్రికా సంపాదకురాలు.
- ఆచంట రుక్మిణి (1891-1951): జాతీయోద్యమంలోనూ, పరిపాలన రంగంలోనూ, దేశీ వైద్య విద్యను అభివృద్ధి చేయడంలోనూ కృషి చేసిందిర్ర.
- కనుపర్తి వరలక్ష్మమ్మ (1896-1960): రచయిత్రి.
- డాక్టర్ రంగనాయకమ్మ (1898-1940): వైద్యురాలు. సంఘసేవకురాలిగా, జాతీయోద్యమ కార్యకర్తగా పనిచేసింది. స్త్రీల సమస్యల గురించి కృషి చేసి, “రక్షణ మందిరం” స్థాపించి ఎందరో స్త్రీలకి బ్రతుకు తెరువు చూపించింది.
- మెల్లీ సోలింగర్ (1898-1965): స్విట్జర్లాండుకు చెందిన సామాజిక కార్యకర్త. భారతదేశపు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనింది. ఉప్పల లక్ష్మణరావుని వివాహమాడింది.
- మార్సెలిన్ లిమా (1899-1984): సికిందరాబాదు ప్రాంతపు తొలితరం మహిళా వైద్యురాలు.
- కాన్స్టన్స్ గిబ్స్ (1900-1984): ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.
- పద్మజా నాయుడు (1900-1975): రాజకీయ నాయకురాలు. హైదరాబాదులో భారతీయ జాతీయ కాంగ్రెసు శాఖ స్థాపకుల్లో ఒకరు. సరోజినీ నాయుడు కుమార్తె.
- శాంతాబాయి కిర్లోస్కర్ (1901-1986): హైదరాబాదు ప్రాంతంలోని తొలితరం మహిళా డాక్టర్లలో ఒకరు. ఈ ప్రాంతంలో తొలి ప్రసూతి ఆస్పత్రి నిర్మించింది.
- మాసుమా బేగం (1901-1990): సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్టంలో తొలి మహిళా మంత్రి.
- దాసరి రామతిలకం (1905-1952): సంగీత, నృత్య కళాకారిణి. రంగస్థల నటి.
- కొమర్రాజు అచ్చమాంబ (1906-1964): వైద్యురాలు, రాజకీయ నాయకురాలు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు కుమార్తె.
- దామెర్ల సత్యవాణి (1907-1992): చిత్రకారిణి. దామెర్ల రామారావు భార్య.
- సురభి కమలాబాయి (1908-1971): రంగస్థల, సినిమా నటి.
- కొమ్మూరి పద్మావతీదేవి (1908-1970): ప్రముఖ నాటకరంగ కళాకారిణి.
- దుర్గాబాయి దేశ్‌ముఖ్ (1909-1981): జాతీయ నాయకురాలు, సంఘ సేవకురాలు.
- ప్రేమ మాసిలామణి నాయుడు (1909-1995): వృత్తిరీత్యా వైద్యురాలు. హైదరబాదు విక్టోరియా జెనానా ఆసుపత్రి అభివృద్ధికి విశేష కృషి చేసింది.
- సరిదె మాణిక్యమ్మ (1910-200?): సంగీత నాట్య కళాకారిణి. 1990లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
- సంగం లక్ష్మీబాయి (1910-1979): స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు, సాంఘిక కార్యకర్త. స్వతంత్రానంతరం హైదరాబాదు శాసన సభ్యురాలిగా, విద్యా శాఖా మంత్రిగా పనిచేసింది. “ఇందిరా సేవాసదనం” స్థాపించింది.
- జానంపల్లి కుముదినీ దేవి (1911 – 2009): రాజకీయ నాయకురాలు, సంఘసేవకురాలు, హైదరాబాదు మొదటి మహిళా మేయరు.
- పసుపులేటి కన్నాంబ (1912-1964): ప్రముఖ నటి, గాయని. రాజరాజేశ్వరీ నాట్య మండలి, రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపకురాలు.
- సరస్వతి గోరా (1912-2006): సామాజిక ఉద్యమకారిణి, నాస్తిక కేంద్రం నాయకురాలు.
- జమాలున్నిసా బాజి (1913-2012): విప్లవ నాయకురాలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త.
- సూర్యదేవర రాజ్యలక్ష్మి (1914-2010): సామాజిక ఉద్యమకారిణి. ఆంధ్ర రాష్ట్రోద్యమం సమయంలో “తెలుగుదేశం” అన్న పత్రిక కూడా నడిపింది.
- జె. ఈశ్వరీబాయి (1918-1991): సామాజిక ఉద్యమకారిణి.
- జ్ఞాన కుమారీ హెడా (1918-2008): రాజకీయ నాయకురాలు, సాంఘిక కార్యకర్త.
- కొమురం సోంబాయి (1918-1994): గిరిజన హక్కుల కార్యకర్త. కొమురం భీమ్ సతీమణి.
- కంచర్ల సుగుణమణి (1919 –2017): దుర్గాభాయి దేశ్‌ముఖ్ సహచరురాలిగా, సంఘ సేవికగా ప్రసిద్ధురాలు.
- చిట్యాల ఐలమ్మ (1919-1985): తెలాంగాణ పోరాట యోధురాలు.
- వింజమూరి అనసూయ (1920-2019): ప్రముఖ జానపద కళాకారిణి. గాయని. సంగీతజ్ఞురాలు. వింజమూరి వెంకటరత్నమ్మ కుమార్తె.
- బ్రిజ్‌రాణి గౌడ్ (1920 –? ): కమ్యూనిస్టు నాయకురాలు.
- కొండపల్లి కోటేశ్వరమ్మ: కమ్యూనిస్టు నాయకురాలు, రచయిత్రి. ఈమె భర్త కొండపల్లి సీతారామయ్య.
- గ్లాడిస్ లోబో (1921-2009): బర్మా నుండి ఇండియా వలస వచ్చి ఆంధ్రదేశంలో స్థిరపడిన వైద్యురాలు. న
- చిత్తజల్లు కాంచనమాల (1921-1981): తెలుగు సినిమాల్లో తొలి గ్లామర్ హీరోయిన్.
- శ్రీరాజ్యం సిన్హా (1923 –? ): సోషలిస్టు నాయకురాలు, రచయిత్రి, సంపాదకురాలు.
- వింజమూరి సీతాదేవి (1924-2016): జానపద గాయని. వింజమూరి వెంకటరత్నమ్మ కుమార్తె. వింజమూరి అనసూయ సోదరి.
- మల్లాది సుబ్బమ్మ (1924-2014): సామాజిక ఉద్యమకారిణి. రచయిత్రి.
- జీనత్ సాజిదా (1924 -?): ఉర్దూ రచయిత్రి. తెలుగు సాహిత్య చరిత్రను ఉర్దూలో రాసింది. తెలుగు నవలలను ఉర్దూలోకి అనువదించింది. ఇవి కాక కథలు, ఇతర రచనలు చేసింది.ది
- మోటూరి ఉదయం (1924-2002): సామాజిక ఉద్యమకారిణి. రచయిత్రి.
- బానో తాహెరా సయీద్ (1924-2001): ఉర్దూ, పర్షియన్, ఆంగ్ల భాషల్లో రచనలు చేసిన కవయిత్రి.
- సూర్యకాంతం (1924-1996): ప్రముఖ సినీనటి.
- భానుమతీ రామకృష్ణ (1925-2005): బహుముఖ ప్రజ్ఞాశాలి - సినీనటి, దర్శకురాలు, నిర్మాత,, రచయిత్రి.
- శాంత రామేశ్వరరావు (1925-?): హైదరాబాదుకు చెందిన విద్యావేత్త, రచయిత్రి. విద్యారణ్య పాఠశాల స్థాపకురాలు.
- అబ్బూరి కమలాదేవి (1925): నాటకరంగ కళాకారిణి. పురుష పాత్రలకి ప్రసిద్ధి.
- వనజా అయ్యంగార్ (1926-1999): గణిత శాస్త్రంలో ప్రొఫెసర్. కోఠీ మహిళా కళాశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసింది.
- అంజలీదేవి (1927-2014): సినీనటి, "అంజలీ పిక్చర్స్" సంస్థ సహ-అధిపతి. నిర్మాత.
- సరోజిని రేగాని (1927-2001): చరిత్రకారిణి, రచయిత్రి. “ఉస్మానియా జర్నల్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్”కు వ్యవస్థాపక సంపాదకురాలు.
- యెరువ ఇగ్నేషియస్ (1928-):గుంటూరు జిల్లాకు చెందిన విద్యావేత్త.
- టి.ఎన్.సదాలక్ష్మి (1928-2004): బలహీన వర్గాల అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేసిన రాజకీయ నాయకురాలు.
- స్నేహలత భూపాల్ (1928 -?): సామాజిక కార్యకర్త. వ్యవసాయ రంగంలో డైరీ నిర్వహణ, ద్రాక్ష తోటల నిర్వహణ ఇలాగ పాడిపరిశ్రమలో విశేష కృషి చేసింది.
- రావు బాలసరస్వతీ దేవి (1929-): ప్రముఖ గాయని.
- కె. అమరేశ్వరి (1929-2009): ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా న్యాయమూర్తి.
- మాలతీ చందూర్ (1930-2013): ప్రముఖ రచయిత్రి.
- మల్లు స్వరాజ్యం (1930 – ): కమ్యూనిస్టు నాయకురాలు.
- తెన్నేటి హేమలత (1931-1997): ప్రముఖ రచయిత్రి.
- మాలతి పద్మనాభరావు (1932-?): సంగీత విద్వాంసురాలు.
- వాసిరెడ్డి సీతాదేవి (1932-2007): తెలుగు రచయిత్రి.
- అబ్బూరి ఛాయాదేవి (1933-2019): రచయిత్రి, పత్రికా సంపాదకురాలు.
- చిందు ఎల్లమ్మ (1933-2005): “చిందు భాగవతం” జానపదరీతికి చెందిన కళాకారిణి.
- వినోదిని రెడ్డి (1934-): వైద్య శాస్త్రవేత్త. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు మొదటి మహిళా డైరెక్టర్.
- వి. ఎస్. రమాదేవి (1934-2013): భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు. రచయిత్రి.
- మెహతాబ్ ఎస్. బామ్జీ (1934-): న్యుట్రిషనల్ బయోకెమిస్ట్రీ శాస్త్రవేత్త.
- శారదా శ్రీనివాసన్ (1935 – ): రేడియో కళాకారిణి.
- ద్వారం మంగతాయారు (1935 – ): ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు. సంగీత విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు కుమార్తె.
- పి.సుశీల (1936-): ప్రముఖ సినీ గాయని.
- తురగా జానకీరాణి (1936-2014): తెలుగు రచయిత్రి. రేడియో కళాకారిణి.
- జిలానీ బానో (1936-): ఉర్దూ కథా, నవలా రచయిత్రి. ఆమె కథలు పధ్నాలుగు భారతీయ భాషల్లోకి అనువదితమయ్యాయి.
- హేమలతా లవణం (1937 -2008): సాంఘికోద్యమ నాయకురాలు. రచయిత్రి. జాషువా కుమార్తె.
- సావిత్రి (నటి) (1937-1981): తెలుగు సినీ నటి.
- ఎస్. జానకి (1938-): సినీ గాయని.
- శ్రీరంగం గోపాలరత్నం (1939-1993): ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు.
- రమా మెల్కోటే (1940): రచయిత్రి, అధ్యాపకురాలు.
- డఫ్ని ఎం. డి రెబెల్లో (1941-): ఐ.ఎ.ఎస్ అధికారిణి.
- మాలినీ రాజూర్కర్ (1941): హిందుస్తానీ గాయని.
- ఉజ్రా బిల్‌గ్రామి (1943): “దస్తకార్ ఆంధ్ర”ను ప్రారంభించారు.
- కొలకలూరి స్వరూపరాణి (1943): రచయిత్రి. భారతీయ కవి సంప్రదాయానికి విరుద్ధంగా చంద్రుణ్ణి స్త్రీగా, రాహువుని చంద్రుని భర్తగా చేసి “చంద్రగ్రహణం” అన్న పద్య కావ్యం రాసింది.
- సుజీ తారు (1943): ఉగాండాకు చెందిన సుజీ తారు ఉద్యోగరిత్యా హైదరాబాదులోని సీఫిల్ (CIEFL) లో స్థిరపడి, స్త్రీ సమస్యల గురించి, హైదరాబాదులో సోషలిస్టు ఫెమినిస్టు దృక్పథం పరిచయం చేయడంలోనూ కృషి చేశారు. పరిశోధకురాలు, రచయిత్రి.
- శారద (1945): ప్రముఖ సినీ నటి. తన నటనకు గాను “ఊర్వశి” అవార్డు మూడుసార్లు అందుకున్నారు.
- పంచాది నిర్మల (1947-1969): శ్రీకాకుళోద్యమంలో ప్రధాన భూమిక వహించిన నాయకురాలు.
- చౌదరి సంపూర్ణమ్మ (1948): శ్రీకాకుళ గిరిజనోద్యమంలో పనిచేసిన ప్రముఖ నాయకుల్లో ఒకరు.
- లంక అన్నపూర్ణదేవి (1950): తనపాట తనే పాడుకుంటూ కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చే నర్తకి, గాయని. నాట్యశాస్త్రంలో పరిశోధన చేసి, అతి చిన్నవయసులో సిద్ధేంద్ర కళాక్షేత్రం గుడివాడ శాఖకు ప్రిన్సిపాల్ గా పనిచేసింది.
- ఐ. రోశమ్మ (1950): 1992లో నెల్లూరులో జరిగిన సారా వ్యతిరేకోద్యమంలో నాయకురాలు.
- శాంతా సిన్హా (1951): రామన్ మెగసెసే అవార్డు గ్రహీత.
- పావలా శ్యామల (1951): “పావలా” నాటకం ద్వారా పేరు తెచ్చుకున్న సినీ, టీవీ నటి.
- కామేశ్వరి జంధ్యాల (1951): శ్త్రీ శక్తి సమాఖ్యలోనూ, మహిళా సమాఖ్యలోనూ పనిచేశారు.
- జస్బీర్ కౌర్ (1952): గాయని, బహుభాషా ప్రవీణురాలు.
- కె. లలిత (1953): రచయిత్రి, పరిశోధకురాలు. “విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా” పుస్తకాల సంపాదకులలో ఒకరు.రు
- గీతా రామస్వామి (1953): హైదరాబాదు బుక్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.
- ఉమాదేవి (1953): మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ, బాలికల అభ్యున్నతి కోసం కృషి చేసారు.
- వేమన వసంతలక్ష్మి (1953): రచయిత్రి, పాత్రికేయురాలు.
- కొండవీటి సత్యవతి (1954): భూమిక పత్రిక సంపాదకురాలు.
- శోభానాయుడు: ప్రముఖ నర్తకి. “కూచిపూడి ఆర్ట్స్ అకాడెమీ ఆఫ్ హైదరాబాదు” స్థాపకురాలు.
- యు. వింధ్య (1955): పౌరహక్కుల కార్యకర్త.
- జమీలా నిషాత్ (1935): ఉర్దూ స్త్రీవాద రచయిత్రి.
- ప్రతిభా భారతి (1956): రాజకీయ నాయకురాలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాసనసభకు మొదటి మహిళా స్పీకర్.
- గొర్రె సత్యవతి (1956): మహిళా సంక్షేమ నాయకురాలు.
- అరుణ ఎం.బహుగుణ (1957): ఆంధ్రప్రదేశ్ లో మొదటి మహిళా ఐ.పీ.యస్ అధికారిణి.
- సి.పుణ్యవతి (1957): వామపక్ష నాయకురాలు.
- కొండేపూడి నిర్మల (1958): ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. వృత్తిరిత్యా జర్నలిస్టు.
- శోభాలత (1958): సినీరంగంలో మేకప్ కళాకారిణి.
- రంగవల్లి (1959-1999): సి.పి.ఐ (ఎం.ఎల్) నాయకురాలు.
- ఫాతిమా బీ (1960): “కాల్వ” (కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం) సర్పంచిగా పనిచేసి, గ్రామాభివృద్ధికి చేసిన కృషికిగాను 1998లో యూ.ఎన్.డీ.పీ. వారి నుండి అవార్డు అందుకున్నారు.
- విమల (1960): రచయిత్రి. రాజకీయ సాంఘిక ఉద్యమకర్త.
- భాగ్యలక్ష్మి (1962-1992): విప్లవ నాయకురాలు. పోలీసుల ఎన్‌కౌంటర్ లో మరణించింది.
- మున్నంగి సువార్త (1963):
- బొర్లం స్వరూప (1966-1992): పీపుల్స్ వార్ నాయకురాలు. జ్యోతక్కగా ప్రసిద్ధి చెందినది.
- పాటిబండ్ల రజని (1966): ప్రముఖ స్త్రీవాద కవయిత్రి.
- పూర్ణిమా రావు (1967): ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి.
- కరణం మల్లీశ్వరి (1975): ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఒలింపిక్ పతకం, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత.
- కోనేరు హంపి (1987): ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.
మూలాలు
మార్చు- ↑ "Books – Kalpana Kannabiran". Retrieved 2021-04-01.
- ↑ "Mahilavaranam – sowmyawrites …". sowmyawrites .... Retrieved 2021-04-01.