రేణు సలూజా
రేణు సలూజా (1952, జూలై 5 - 2000, ఆగస్టు 16) హిందీ సినిమా ఎడిటర్. 1980లు, 1990లలో గోవింద్ నిహలానీ, విధు వినోద్ చోప్రా, సుధీర్ మిశ్రా, శేఖర్ కపూర్, మహేష్ భట్, విజయ్ సింగ్ వంటి సినిమాలకు పనిచేసింది. సినిమాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లు, టెలివిజన్ ధారావాహికలకు కూడా ఎడిటింగ్ చేసింది.[2]
రేణు సలూజా | |
---|---|
జననం | |
మరణం | 2000 ఆగస్టు 16 | (వయసు 48)
వృత్తి | సినిమా ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1980-2000 |
జీవిత భాగస్వామి | విధు వినోద్ చోప్రా
(m. 1976; div. 1983)సుధీర్ మిశ్రా (m. 1988–2000) |
బంధువులు | రాధా సలూజా (సాదరి) |
పరిందా (1989), ధారవి (1993), సర్దార్ (1993), గాడ్ మదర్ (1999) సినిమాలకు నాలుగుసార్లు ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నది. పరిందా (1989), 1942: ఎ లవ్ స్టోరీ (1994) సినిమాలకు ఉత్తమ ఎడిటర్ గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నది.[3]
జననం, విద్య
మార్చురేణు 1952, జూలై 5న పంజాబీ కుటుంబంలో జన్మించింది. 1974లో పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో దర్శకత్వ విభాగానికి దరఖాస్తు చేసింది, కానీ అందులో సీటు లభించకపోవడంతో ఎడిటింగ్ విభాగంలో చేరింది. 1976లో పట్టభద్రురాలైన తరువాత సినిమా ఎడిటర్‌గా వృత్తిని ప్రారంభించింది. ఆ సమయంలో ఎడిటింగ్ విభాగంలో పురుషుల ఆధిపత్యం ఉండేది.[4][5]
సినిమారంగం
మార్చు1976లో విధు వినోద్ చోప్రా తీసిన మర్డర్ ఎట్ మంకీ హిల్ అనే డిప్లొమా సినిమాకు తొలిసారిగా రేణు ఎడిటర్ గా పనిచేసింది. దీనికోసం అసోసియేట్ డైరెక్టర్ క్రెడిట్ ఇవ్వబడింది.[6] ఈ సినిమా 1977-78లో ఉత్తమ ప్రయోగాత్మక చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[7] ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి బయటకు వచ్చిన తర్వాత, రేణు తన క్లాస్‌మేట్ సయీద్ అక్తర్ మీర్జా తీసిన ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యోన్ అతా హై (1980), తర్వాత విధు వినోద్ చోప్రా తీసిన సజాయే మౌత్ (1981), ఆ తర్వాత మరో క్లాస్‌మేట్ కుందన్ షా తీసిన జానే భీ దో యారో (1983) సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. [8] ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మిత్రులు విధు వినోద్ చోప్రా, సయీద్ మీర్జా, కుందన్ షా, అశోక్ అహూజాలతో కలిసి సమాంతర సినిమాల్లో పనిచేసింది.
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్యాచ్ సినిమాలు కాకుండా 1983లో గోవింద్ నిహ్లానీ తీసిన అర్ధ సత్య సినిమాకు ఎడిటింగ్ చేసింది. దీని తర్వాత దూరదర్శన్ కార్యక్రమాలకు ఎడిటింగ్ చేయడం ప్రారంభమైంది. చోప్రా తీసిన పరిందా సినిమాకు ఎడిటింగ్ చేసింది, దర్శకత్వశాఖలో పనిచేసింది.
జానే భీ దో యారోన్ (1983), కభీ హాన్ కభీ నా (1993), బాండిట్ క్వీన్ (1995), జయ గంగా (1996), పర్దేస్ (1997), రాక్‌ఫోర్డ్ (1999), హే రామ్ (2000) వంటి సినిమాలకు ఎడిటింగ్ చేసింది. నగేష్ కుకునూర్ తీసిన బాలీవుడ్ కాలింగ్ (2001) తరువాత 2003లో విడుదలైన కలకత్తా మెయిల్ అనే సినిమాకు చివరిసారిగా ఎడిటింగ్ చేసింది.[9]
వ్యక్తిగత జీవితం
మార్చురేణు అక్క రాధా సలూజా కూడా సినిమా నటి. ఆమె అనేక హిందీ, పంజాబీ, ఇతర భాషల సినిమాలలో నటించింది. చెల్లెలు డాక్టర్ కుంకుమ్ ఖడాలియా ప్లాస్టిక్ సర్జన్. రేణు 1976లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తరువాత దర్శకుడు విధు వినోద్ చోప్రాను వివాహం చేసుకున్నది. తరువాత వారు జానే భీ దో యారోన్ (1983)లో కలిసి పనిచేశారు, అక్కడ వినోద్ ప్రొడక్షన్ మేనేజర్ గా, ఎడిటర్ గా చేసింది. తర్వాత విడిపోయినప్పటికీ రేణు అతని అన్ని చిత్రాలకు ఎడిటర్ గా కొనసాగింది, సహాయ దర్శకురాలిగా కూడా చేసింది. తరువాత జీవితంలో దర్శకుడు సుధీర్ మిశ్రాతో రేణు సన్నిహితంగా ఉండేది. ధారావి, ఇస్ రాత్ కి సుబహ్ నహిన్ (1996)తోసహా అనేక సినిమాలకు ఆమె పనిచేసింది.[10][11]
వారసత్వం
మార్చు2006లో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్థుల సంఘం ఆమెపై 'ఇన్విజిబుల్ - ది ఆర్ట్ ఆఫ్ రేణు సలూజా' అనే పుస్తకాన్ని విడుదల చేసింది.[12] తరువాత 2006లో, ఆమె పేరు మీద ఎడిటింగ్ అవార్డు పొందిన మొదటి ఎడిటర్.[13]
సినిమాలు
మార్చుసినిమా | సంవత్సరం |
---|---|
మర్డర్ ఎట్ మంకీ హిల్ | 1976 |
ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యోం అతా హై | 1980 |
సజాయే మౌత్ | 1981 |
జానే భీ దో యారో | 1983 |
అర్ధ్ సత్య | 1983 |
మోహన్ జోషి హజీర్ హో! | 1984 |
పార్టీ | 1984 |
జనం | 1985 |
న్యూ ఢిల్లీ టైమ్స్ | 1986 |
యే వో మంజిల్ తో నహిన్ | 1987 |
మిల్ గయీ మంజిల్ ముఝే | 1988 |
పెస్టోంజీ | 1988 |
మెయిన్ జిందా హూన్ | 1988 |
పరిందా | 1989 |
ధారవి | 1991 |
మిస్ బీటీ పిల్లలు | 1992 |
కభీ హాఁ కభీ నా | 1993 |
సర్దార్ | 1993 |
1942: ఎ లవ్ స్టోరీ | 1994 |
తర్పన్ | 1994 |
పాపా కెహతే హై | 1995 |
బాండిట్ క్వీన్ | 1995 |
ఈజ్ రాత్ కి సుబహ్ నహీన్ | 1996 |
దో రహైన్ | 1997 |
పర్దేస్ | 1997 |
కరీబ్ | 1998 |
జబ్ ప్యార్ కిసీసే హోతా హై | 1998 |
హైదరాబాద్ బ్లూస్ | 1998 |
జయ గంగ | 1998 |
గాడ్ మదర్ | 1999 |
సెన్సో యునిక్వో | 1999 |
స్ప్లిట్ వైడ్ ఓపెన్ | 1999 |
రాక్‌ఫోర్డ్ | 1999 |
హే రామ్ | 2000 |
బాలీవుడ్ కాలింగ్ | 2001 |
కలకత్తా మెయిల్ | 2003 |
అవార్డులు
మార్చు- జాతీయ చలనచిత్ర అవార్డు
- 1990: ఉత్తమ ఎడిటింగ్: పరిందా
- 1992: ఉత్తమ ఎడిటింగ్: ధారవి
- 1994: ఉత్తమ ఎడిటింగ్: సర్దార్
- 1999: ఉత్తమ ఎడిటింగ్: గాడ్ మదర్
- ఫిల్మ్‌ఫేర్ అవార్డు
- 1989: ఉత్తమ ఎడిటింగ్: పరిందా
- 1995: ఉత్తమ ఎడిటింగ్: 1942: ఎ లవ్ స్టోరీ
- స్టార్ స్క్రీన్ అవార్డు
- 1996: ఉత్తమ ఎడిటింగ్ : ఇస్ రాత్ కి సుబహ్ నహిన్
మరణం
మార్చుచాలాకాలంపాటు కడుపులో క్యాన్సర్‌తో బాధపడిన రేణు 2000, ఆగస్టు 16న ముంబైలో మరణించింది.[14]
మూలాలు
మార్చు- ↑ Encyclopaedia Of Hindi Cinema, p. 620
- ↑ Prolific Editor: Renu Saluja[permanent dead link] Screen (magazine), 30 June 2006.
- ↑ Cut to perfection-Invisible: The Art of Renu Saluja deconstructs the late film editor Indian Express, 31 August 2006.
- ↑ Women break into another male bastion in Bollywood Sify.com, 2009-03-12.
- ↑ Invisible: the art of Renu Saluja Archived 2007-01-07 at the Wayback Machine GraFTII.
- ↑ Murder At Monkey Hill (35mm / B&W / 35 min)
- ↑ Vidhu Vinod Chopra’s diploma film was Murder at Monkey Hill (1976),... The Tribune, 5 August 2007.
- ↑ Film editor Renu Saluja dead The Tribune, 17 August 2000.
- ↑ Nasseruddin Shah releases book on Renu Saluja Businessofcinema. 1 September 2006.
- ↑ 'Editing for her was like cooking' Rediff.com Movies, 17 August 2000.
- ↑ Straight Answers: Sudhir Mishra, Filmmaker on Indian cinema TNN, The Times of India, 24 April 2006.
- ↑ Nasseruddin Shah releases book on Renu Saluja Businessofcinema. 1 September 2006.
- ↑ Jethu Mundul reveals why the late Renu Saluja is the first film editor to have an editing award named after her[permanent dead link] Screen (magazine), 7 July 2006.
- ↑ Film editor Renu Saluja dead The Tribune, 17 August 2000.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రేణు సలూజా పేజీ
- Shekhar Kapur on Renu Saluja in his blog Archived 2006-08-05 at the Wayback Machine
- The nimble tightrope walker (Excerpts from GRAFTII Book, Invisible: the art of Renu Saluja)[permanent dead link] at Screen (magazine)
- GRAFTII Book, Invisible: the art of Renu Saluja Archived 2007-01-07 at the Wayback Machine